మేషం... పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో అకారణంగా విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
వృషభం... రాబడి కంటే ఖర్చులు అథికం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం.. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
సింహం.. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.
కన్య.. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో స్వల్ప విభేదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
తుల.. పరిచయాలు పెరుగుతాయి.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి పిలుపు.ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు.వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం.. దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి లాభం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
ధనుస్సు.. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మకరం.. వ్యూహాలు తప్పుతాయి. అనుకోని ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. మిత్రుల నుంచి సమస్యలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం.. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
మీనం.. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. నూతన ఉద్యోగలాభం. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment