2021 జూన్ 10న ఈ గ్రహణం సంభవించనుంది. భారత్ లో పాక్షికంగానే కనిపించే ఈ గ్రహణం ఈ సంవత్సరం రానున్న మొదటి సూర్యగ్రహణం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది మొత్తం రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉంటాయి. మొదటి సూర్యగ్రహణం జ్యేష్ఠ మాస అమవాస్య రోజున జరుగుతోంది. అంతేకాకుండా ఈ రోజు శని జయంతి కూడా ఉండటం వల్ల అధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 10న రానున్న సూర్యగ్రహణం గురించి మరిన్ని విషయాలు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం..
పంచాంగం ప్రకారం ఈ సారి సూర్యగ్రహణం జూన్ 10 అమవాస్య రోజున సంభవించనుంది. అంతేకాకుండా ఈ రోజు శని జయంతి కూడా ప్రారంభమవుతుంది. వట సావిత్రం వ్రతం చేస్తారు. గ్రహణం రోజున సూతక కాలం నుంచి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని నిషేధించడమైంది. దీంతో ఆరాధనలు కూడా జరగవు. ఈ సారి సూర్యగ్రహణం వృషభం రాశి, మృగశిర నక్షత్ర లగ్నంలో సంభవించనుంది. అందుకే దీన్ని వలయాకార సూర్యగ్రహణం అంటారు.
భారత్ లో ఎక్కడ కనిపిస్తుంది.
ఈ ఏడాది సంభవించే మొదటి సూర్యగ్రహణం భారత్ లో పాక్షికంగానే కనిపిస్తుంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లాంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఇవి కాకుండా కొంత సమయం జమ్మూ, కశ్మీర్ లో కనిపిస్తుంది. ఇక్కడ పీఓకేలో కనిపించే అవకాశముంది. ఈ సూర్యగ్రహణం ప్రభావం భారత్ లో అంతగా ఉండకపోవచ్చు. గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే సూతకకాలం చెల్లుబాటు అవుతుంది.
గ్రహణం సూతకకాలం..
ఈ గ్రహణం భారతదేశంలో చాలా తక్కువ ప్రదేశాల్లోనే కనిపిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం స్పర్శకాలం, మోక్షకాలం గురించి సాధారణ ప్రజలు తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఇలాంటి గ్రహణం సూతక కాలం కూడా చెల్లుబాటు అవ్వదు. ఫలితంగా భారతదేశంలో ఈ సూర్యగ్రహణం వల్ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
భారత్ లో కాకుండా ఏయే దేశాల్లో కనిపిస్తుంది..
భారత్ లో కాకుండా ఈ సూర్యగ్రహణం ఈశాన్య అమెరికా, ఐరోపా, ఆసియా, అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర భాగంలో పాక్షికంగా కనిపిస్తుంది. గ్రీన్ లాండ్, ఉత్తర కెనడా, రష్యా లాంటి ప్రదేశాల్లో సంపూర్ణంగా గ్రహణం కనిపిస్తుంది. ఈ దేశాల్లో సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది. సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాల్లో సూర్యగ్రహణం చెల్లుబాటు అవుతుంది.
గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment