తెలుగువారి పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే అంశం తరచుగా వివాదాస్పదమవుతుంది. ఇప్పుడు భోగి పండుగ వంతు వచ్చింది. ఏటా జరుపుకొనే బోగి పండుగ.. 27 ఏళ్లకోసారి వివాదాస్పదం అవుతూనే ఉంది. దీనిపై ఒక సిద్ధాంతి ఒకలా చెబుతుంటే.. మరో సిద్ధాంతి మరొక రకంగా చెబుతున్నారు.. అసలు బోగి ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో సిద్దాంత కర్తల మధ్య భిన్న మైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఒక్కో పంచాగాలల్లోను ఒక్కోవిధంగా ఉంది.
తెలుగువారు ఘనంగా వైభవంగా మూడురోజులు పాటు చేసుకునే సంక్రాంతి .. ఇలా తేదీల విషయంలో గందరగోళం ఏర్పడటం ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది.. ఈనెల 14వ తేదీ మంగళవారం సాయంత్రం 6.14 గంటలకు మకర సంక్రమణం జరుగుతుంది. దీంతో భోగి పండుగను 13న జరుపుకోవాలని కొందరు.. కాదు 14న అని మరికొందరు పంచాంగకర్తలు చెప్తున్నారు. ఇప్పుడీ అంశమే చర్చనీయాంశమైంది.
ప్రతీ సంవత్సరం సిద్ధాంత కర్తలు మకర సంక్రమణ పుణ్యకాలానికి ముందురోజు భోగి పండుగను నిర్ణయిస్తారు. ఈ ఏడాది మకర సంక్రమణం జనవరి 14 మంగళవారం సాయంత్రం 6.14 గంటలకు జరుగుతుంది.. అంటే.. సూర్యాస్తమయం తర్వాత మకర సంక్రమణం జరిగింది. ప్రతి 27 ఏళ్లకోకసారి ఈ విధంగా జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా జరిగితే ఏం చేయాలనే అంశంపై పంచాంగ సరళి, ధర్మసింధు, వ్రతనిర్ణయ కల్పవల్లి తదితర గ్రంధాలు కచ్చితమైన నిర్ణయం తెలిపాయి. సూర్యాస్తమయం తర్వాత మూడు ఘడియలు అంటే 72 నిమిషాలు వరకు సాయం సంధ్య అంటారు. ఈ సంధ్యలో సంక్రమణం అయితే ఆ రోజే పుణ్యకాలం. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యకాలం నడుస్తుంది. అయితే పంచాంగ కర్తల్లో కొందరు పూర్వ గణితాన్ని, మరికొందరు ధృక్ గణితాన్ని ఉపయోగించడం వల్ల..భోగి నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని పంచాంగాల్లో ఈనెల 14న భోగి పండుగను జరుపుకోవాలని రాస్తే.. 13నే భోగి పండుగను మరికొన్ని పంచాగాలు రాశాయి.
సిద్ధాంత కర్తలు మాత్రం ఈనెల 14వ తేదీ సాయం సంధ్యలోనే మకర సంక్రమణం అయినందున అదే రోజున సంక్రాంతి జరుపుకోవాలి. ముందురోజు 13న భోగి పండుగ జరుపుకోవడం శాస్త్ర సమ్మతమంటున్నారు.. ప్రస్తుతం 2050 వరకు పూర్వ, ధృక్ గణితాలు రెండింటిలోనూ శతాబ్ధి పంచాంగాలు అందుబాటులో ఉన్నాయి. ఇరువర్గాలు కలిసి తేడాలు వచ్చిన పండుగలను కలిపి.. పండుగ తేదీల జాబితాను తయారు చేస్తే ప్రజల్లో అయోమయం తొలగించినట్లవుతోంది.
మనమంతా సంక్రమణం 14 న జరుగుతోంది కాబట్టి ముందు రోజైన 13 న భోగి పర్వాన్ని ,14న సంక్రాంతిని ,15న కనుమని జరుపుకుందాం.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment