Saturday 13 January 2018

సంక్రమణ కాలంలో ఈ రోజు చెయ్యాల్సిన విధులు



రవి సంక్రమణే ప్రాప్తే న స్నాయాద్యస్తూ మానవ
సప్త జన్మ సురోగాస్యాత్ నిర్ధనస్తైవ జాయతే

ఈ రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభమగును.మకర రాశిలోకి సూర్యుడు పగలు రెండు గంటలకి ప్రవేశించును.మద్యాహ్నం 2.27 నుండిసాయంత్రం 5.57 వరకు పుణ్యకాలం .అందులోను మొదరి 24 నిమిషాలు అత్యంత పుణ్యకాలం.ఈ  సమయం లో చేసే పిత్రు తర్పనాల వలన వారికి ఉత్తమగతులు ప్రాప్తిన్చడంతోపాటు వంశాభివృద్ది జరుగుతుంది.ఈ కాలంలో చేసే దాన,జప,ద్యాన,పారాయణాలు అత్యంత పుణ్య ఫలితాలనిస్తాయి. 
సంక్రమణ కాలంలో తప్పనిసరిగా స్నానం చెయ్యాలని శాస్రం చెపుతోంది.ఈరోజు విసనకర్ర,నువ్వులు,ధాన్యాలు,పండ్లు,బట్టలు,గోవు,బంగారం,కాయగూరలు లాంటివి దానం చెయ్యాలి.తప్పనిసరిగా ఈ రోజు నువ్వులు తినాలి.నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యడం ,శివున్ని నువ్వులు కలిపినా బియ్యంతో అర్చించడం,ఈ రోజు వచ్చినవారందరికి నువ్వులు చక్కర తినిపించడం మంచిది.


 

No comments:

Post a Comment