Tuesday 22 December 2020

సుదర్శన హోమం

 



ఒక చేతిలో చక్రం, మరొక చేతిలో శంఖంతో తేజస్సుతో వెలుగు తున్న శ్రీమహావిష్ణువును మదిలో నిలుపుకోండి. మొన తేలిన అంచులు కలిగిన ఈ చక్రం మరొక పేరు సుదర్శన చక్రం.
సుదర్శనం అనే పదం రెండు పదాల కలయిక. 'సు' అంటే పవిత్రం, 'దర్శనం' అంటే చూడటం. ఈ పదాల కలయికకు అర్థం పవిత్ర దర్శనం.
సుదర్శన చక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రాన్ని వేదాల కాలం నుండి పవిత్ర ఆయు ధంగా భావి స్తారు. శ్రీవైష్ణవ మత సంప్రదాయం ప్రకారం శ్రీమహా విష్ణువు చేతిలో ఉండే చక్రం చెడును నాశనం చేసి, ఆపదలో ఉన్న వారికి రక్షణనిచ్చే ఆయుధం.
సుదర్శన చక్రం ఎప్పుడూ శ్రీమ న్నారాయణుడి అదుపులోనే ఉంటుంది.
పురాణాల ప్రకారం శివుడు ఈ ఆయు ధాన్ని శ్రీమహావిష్ణువుకు ఇచ్చాడు. మరొక కథనం ప్రకారం దేవ తలకు చెందిన విశ్వకర్మ అనే శిల్పి సూర్యుని నుంచి తీసిన ఒకంత భాగాన్ని (1/8వ భాగం) ఉపయోగించి ఈ చక్రాన్ని తయారు చేసినట్లు చెబుతారు.
సుదర్శన చక్రం మంచిని రక్షించడానికి, చెడును అంత మొందించడానికి ఉద్భవించిందని తెలిపే సంఘటనలు కొన్ని ఉటంకించబడ్డాయి.
మహాభారతంలో శిశుపాలుని వంద తప్పుల వరకూ క్షమిసా ్తనని అతడి తల్లికి భగవంతుడు శ్రీకృష్ణుడు మాట ఇస్తాడు. ఆ హద్దు దాటిన తరువాత చక్రంతో శిశుపాలుని తల వధించబడుతుంది.
క్షీర సముద్రాన్ని మథించడానికి ఒక కవ్వం అవసరమైన ప్పుడు మేరు పర్వతంపైభాగాన్ని ఖండించే బాధ్యత సుదర్శన చక్రానికి ఇవ్వబడింది.
సుదర్శన చక్రాన్ని తమిళంలో చక్రతల్వాన్‌ అంటారు. ప్రజలు తమ సుఖ సంతోషాల కోసం ఇంటిలో కాని, గుడిలోకాని సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారు. ఈ హోమంలో భాగంగా సుదర్శనుని, అతడి భార్య విజయవల్లిని పవిత్ర జలం ఉన్న కుండలోకి ఆహ్వానిస్తూ పూజ చేస్తారు. సుదర్శనుని స్తుతిస్తూ మంత్రాలు పఠి స్తారు. ఈ హోమం పూర్తయ్యే సరికి హోమకర్త సుఖ సంతోషాలతో, ఆరోగ్యం తో తుల తూగుతాడని విశ్వాసం.
శ్రీమహావిష్ణువుకు మంచి రోజు లైన బుధవారం, శనివారం వచ్చిన ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులు ఈ హోమం చేయడానికి అను కూలం. నియమ నిష్టలతో ఈ హోమాన్ని చేయాలి. మంత్రాలు చక్కని ఉచ్ఛారణతో పల కాలి. శరీరం, మనసు, మనం చేసే పనులు శుద్ధంగా ఉండాలి.
హోమం ఫలితాలు - చెడును నాశనం చేయడం, పాపాలను నిర్మూలించడం, ఆరోగ్యాన్ని పెంపొందించడం, మానసిక స్థయిర్యాన్ని ఇవ్వడం.
మంచి దీక్షాదక్షతలున్న గురువుతో ఈ సుదర్శన మూల మంత్రానికి బీజం పడాలి. ఎవరైతే సుదర్శన మంత్రాన్ని కోటిసార్లు పఠిస్తారో, వారికి ఈ దీక్షాదక్షతలు కలుగు తాయంటారు.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment