
హిందూ పురాణాల ప్రకారం
కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు
యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని
వుండటం వల్ల అనేక అనారోగ్యాలను ఎదుర్కొన్న
మానవాళికి మార్గశిర మాసంలోని పౌర్ణమి నాటికి అనేక రకాలైన వ్యాధులు,
అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
దానికి కృతజ్ఞతగా
ఈ మార్గశిర పౌర్ణమి రోజున
యమధర్మరాజును ఆరాదించుకోవాలి.
ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు.
కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది.
కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి.
మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు
తన చెల్లెలి ఇంటికి వస్తాడు.
అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో
చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన
విందును ఏర్పాటు చేస్తుంది.
చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ
మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను
పూజిస్తారో వారికీ నరక బాధలు ,
అపమృత్యు భయం ఉండదని
కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు.
చిత్రగుప్తుడిపై గల అభిమానంతో
ఆయన మాట నెరవేరేలా తాను కూడా
సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు.
అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున
కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది.
కోరలమ్మకు మినప రొట్టెలను
నైవేద్యంగా సమర్పించాలి.
మార్గశిర పౌర్ణమి సాయంత్రం
మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి
కుక్కలకు వేయాలి.
కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి.
చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి.
మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే
ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు,
అపమృత్యు భయాలు తొలగిపోతాయి.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:
Post a Comment