Tuesday 29 December 2020

శ్రీ దత్త స్తవం

 


దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం | ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || ౧
భక్తుల యందు పుత్రప్రేమను కలిగి అపార ప్రేమతో వరములు ఇచ్చి, పరబ్రహ్మ స్వరూపం అయి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం | సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || ౨ ||
దీనుల,ఆర్తుల యందు బంధువు,కరుణా సముద్రుడు ,అందరినీ రక్షించే దయ తత్వం కలిగి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం | నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || ౩ ||
శరణాగతి చెందిన దీనులకు కల్పవృక్షం,సర్వ వ్యప్తుడు అయిన నారాయణుడు, ఆప్త పరాదీనుడు అయి తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు .
సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం | సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || ౪ ||
అన్ని జ్ఞాన సంభంద అనర్దాలు తొలగించి,శుభములు ప్రసాదించి ,కష్టాలు తొలగించి,ఐహిక కోసం ఉపాసన చేసినా,పారమార్ధిక ఫలం ప్రసాదించి తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం | భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || ౫ ||
బహ్మజ్ఞానం వృద్ది చేసేవాడు ,ధర్మ తత్వం,జ్ఞాన తత్వం,ధర్మ జ్ఞానం,తపస్సు వృద్ది చేసి భక్తుల కోరిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః | తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || ౬ ||
పాపములను శమింప చేసి జ్ఞాన తపస్సు అనే జ్యోతిని వెలిగించి ఆద్యాత్మిక,ఆది భౌతిక ,దైవిక తాపాలు జ్ఞాన దీప్తితో తొలగించి,తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం | విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || ౭ |
సుఖ ప్రాప్తి,దుఖ పరిహారం అనే సర్వ రోగములను నివారించి ,సర్వ ఆద్యాత్మిక,లోకిక పీడలు నివారించి,జన్మ,సంసార బంధములను తొలగించి,తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం | నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు || ౮ ||
సంసార బంధం నుంచి రక్షించి,జన్మ పరంపరలను హరించి,మనవ జీవిత అంతిమలక్ష్యoను అనుగ్రహించి ,తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యస్తవం | భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||౯ ||
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత దత్తాత్రేయ స్తవం పారాయణం చేసినవారికి , జయం,లాభము,సంపద,కోరికలు,భోగములు,మోక్షము,దత్తాత్రేయకృపతో శ్రిఘం గా లభిస్తాయి.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment