Tuesday, 29 November 2016

శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి?



ఈలోకంలో ఉన్న దేవుళ్ళలో ఎవరికీ లింగరూపం లేదు…………..
ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి……….?

శివ లింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.
సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది.
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు
(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).
వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,
నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట.
శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే.
ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు.
శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని.
లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.
శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి.
బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా ఉంటుంది.

శివ లింగములు – రకములు
 స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
 దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
 రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలు.
 మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
 బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).

పoచభూతలింగాలు
పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు
ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.
 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు – అన్నామలై
 2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం
 3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం
 4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి
 5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు – శ్రీకాళహస్తి

పంచారామాలు
 1. అమారారామము:
అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
 2. ద్రాక్షారామము:
ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
 3. కుమారారామము:
సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
 4 భీమారామము:
భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
 5. క్షీరారామము:
పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి.

కొన్ని విశేషాలు:
 శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు.
కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
 కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం)
కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.





వేదవ్యాస కృత మహాభారతాంతర్గత శతరుద్రీయం



 శ్లో . ప్రజాపతీనాం ప్రథమం తేజసాం పురుషం ప్రభుమ్!
భువనం భూర్భువం దేవం సర్వలోకేశ్వరం ప్రభుమ్!!
ఈశానాం వరదం పార్థ దృష్టవానసి శంకరమ్!
తంగచ్ఛ శరణం దేవం వరదం భువనేశ్వరమ్!!
మహాదేవం మహాత్మాన మీశానం జటిలం శివమ్!
త్ర్యక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాసనమ్!!
మహాదేవం హరం స్థాణుం వరదం భువనేశ్వరమ్!
జగత్ప్రధానమధికం జగత్ప్రీతమధీశ్వరమ్!!
జగద్యోనిం జగద్ద్వీపం జయినం జగతో గతిమ్!
విశ్వాత్మానం విశ్వసృజం విశ్వమూర్తిం యశస్వినమ్!!
విశ్వేశ్వరం విశ్వవరం కర్మాణామీశ్వరం ప్రభుమ్!
శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్యభవోద్భవమ్!!
యోగం యోగేశ్వరం శర్వం సర్వలోకేశ్వరేశ్వరమ్!
సర్వశ్రేష్ఠం జగచ్ఛ్రేష్ఠం పరిష్ఠం పరమేష్ఠినమ్!!
లోకత్రయవిధాతారమేకం లోకత్రయాశ్రయమ్!
సుదుర్జయం జగన్నాథం జన్మమృత్యుజరాతిగమ్!!
జ్ఞానాత్మానం జ్ఞానగమ్యం జ్ఞానశ్రేష్ఠం సుదుర్విదమ్!
దాతారం చైవ భక్తానాం ప్రసాదవిహితాన్ వరాన్!!
తస్య పారిషదా దివ్యా రూపై ర్నానావిధైర్విభోః!
వామనా జటిలా ముండా హ్రస్వగ్రీవా మహోదరాః!!
మహాకాయా మహోత్సాహా మహాకర్ణాస్తథా పరే
ఆననైర్వికృతైః పాదైః పార్థవేషైశ్చ వైకృతైః!!
ఈదృశైస్స మహాదేవః పూజ్యమానో మహేశ్వరః!
సశివస్తాత తేజస్వీ ప్రసాదాద్యాతి తేగ్రతః!!
తస్మిన్ ఘోరే సదా పార్థ సంగ్రామే రోమహర్షణే!
ద్రౌణికర్ణకృపైర్గుప్తాం మహేష్వాసైః ప్రహారిభిః!!
కస్తాం సేనాం తదా పార్థ మనసాపి ప్రధర్షయేత్!
ఋతే దేవాన్మహేష్వాసాద్బహురూపాన్మహేశ్వరాత్!!
ప్థాతుముత్సహతే కశ్చిన్నతస్మిన్నగ్రతః స్థితే!
న హి భూతం సమం తేన త్రిషు లోకేషు విద్యతే!!
గంధేనాపి హి సంగ్రామే తస్య క్రుద్ధస్య శత్రవః!
విసంజ్ఞా హతభూయిష్ఠా వేపంతి చ పతంతి చ!!
తస్మై నమస్తు కుర్వంతో దేవాస్తిష్ఠంతి వై దివి!
యే చాన్యే మానవా లోకే యేచ స్వర్గజితో నరాః!!
యే భక్తా వరదం దేవం శివం రుద్రముమాపతిమ్!
ఇహలోకే సుఖం ప్రాప్యతే యాంతి పరమాం గతిమ్!!
నమస్కురుష్వ కౌంతేయ తస్మై శాంతాయ వై సదా!
రుద్రాయ శితికంఠాయ కనిష్ఠాయ సువర్చసే!!
కపర్దినే కరాళాయ హర్యక్షవరదాయ చ!
యామ్యాయారక్తకేశాయ సద్వృత్తే శంకరాయ చ!!
కామ్యాయ హరినేత్రాయ స్థాణవే పురుషాయ చ!
హరికేశాయ ముండాయ కనిష్ఠాయ సువర్చసే!!
భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే!
బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే!!
ఉష్ణీషిణే సువక్త్రాయ సహస్రాక్షాయ మీఢుషే!
గిరీశాయ సుశాంతాయ పతయే చీరవాససే!!
హిరణ్యబాహవే రాజన్నుగ్రాయ పతయే దిశామ్!
పర్జన్యపతయేచైవ భూతానాం పతయే నమః!!
వృక్షాణాం పతయే చైవ గవాం చ పతయే తథా!
వృక్షైరావృత్తకాయాయ సేనాన్యే మధ్యమాయ చ!!
స్రువహస్తాయ దేవాయ ధన్వినే భార్గవాయ చ!
బహురూపాయ విశ్వస్య పతయే ముంజవాససే!!
సహస్రశిరసే చైవ సహస్రనయనాయచ!
సహస్రబాహవేచైవ సహస్ర చరణాయ చ!!
శరణం గచ్ఛ కౌంతాయ వరదం భువనేశ్వరమ్!
ఉమాపతిం విరూపాక్షం దక్షం యజ్ఞనిబర్హణమ్!!
ప్రజానాం ప్రతిమవ్యగ్రం భూతానాం పతిమవ్యయమ్!
కపర్దినం వృషావర్తం వృషనాభం వృషధ్వజమ్!!
వృషదర్పం వృషపతిం వృషశృంగం వృషర్షభమ్!
వృషాంకం వృషభోదారం వృషభం వృషభేక్షణమ్!!
వృషాయుధం వృషశరం వృషభూతం మహేశ్వరమ్!
మహోదరం మహాకాయం ద్వీపిచర్మనివాసినమ్!!
లోకేశం వరదం ముండం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్!
త్రిశూలపాణిం వరదం ఖడ్గచర్మధరం శుభమ్!!
పినాకినం ఖడ్గధరం లోకానాం పతిమీశ్వరమ్!
ప్రపద్యే శరణం దేవం శరణ్యం చీరవాసనమ్!!
నమస్తస్మై సురేశాయ యస్య వైశ్రవణస్సఖా!
సువాసనే నమో నిత్యం సువ్రతాయ సుధన్వినే!!
ధనుర్ధరాయ దేవాయ ప్రియధన్వాయ ధన్వినే!
ధన్వంతరాయ ధనుషే ధన్వాచార్యాయ తే నమః!!
ఉగ్రాయుధాయ దేవాయ నమస్సురవరాయ చ!
నమోస్తు బహురూపాయ నమస్తే బహుధన్వినే!!
నమోస్తు స్థాణవే నిత్యం నమస్తస్మై సుధన్వినే!
నమోస్తు త్రిపురఘ్నాయ భవఘ్నాయ చ వై నమః!!
వనస్పతీనాం పతయే నరాణాం పతయే నమః!
మాతౄణాం పతయే చైవ గణానాం పతయే నమః!!
గవాం చ పతయే నిత్యం యజ్ఞానాం పతయే నమః!
అపాం చ పతయే నిత్యం దేవానాం పతయే నమః!!
పూష్ణో దంతవినాశాయ త్ర్యక్షాయ వరదాయ చ!
హరాయ నీలకంఠాయ స్వర్ణకేశాయ వైనమః!!


శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం


కదా వా విరక్తిః కదా వా సుభక్తిఃకదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః |
హృదాకాశమధ్యే సదా సంవసన్తం
సదానందరూపం శివం సాంబమీడే || ౧ ||
సుధీరాజహంసైస్సుపుణ్యావతంసైః
సురశ్రీ సమేతైస్సదాచారపూతైః |
అదోషైస్సురుద్రాక్ష భూషావిశేషై-రదీనైర్విభూత్యంగరాగోజ్జ్వలాంగైః || ౨ ||
శివధ్యానసంసక్త శుద్ధాంతరంగైః
మహాశైవపంచాక్షరీ మంత్రసిద్ధైః |
తమో మోచకై రేచకైః పూరకాద్యైః
సముద్దీపితాధార ముఖ్యాబ్జషట్కైః || ౩ ||
హఠల్లంబికా రాజయోగ ప్రభావా-
ల్లుఠత్కుండలీ వ్యక్త ముక్తావకాశామ్ |సహస్రారపద్మస్థితాం పారవారాం
సుధామాధురీం సాధురీత్యా పిబద్భిః || ౪ ||
సదానంద కందైర్మహాయోగిబృందైః
సదాసేవ్యమానం సముజ్జృంభమాణమ్ |మహాపుణ్యపాకే పునఃపుండరీకే
సదా సంవసన్తం చిదానందరూపమ్ || ౫ ||
తటిత్పుంజ చంచజ్జటాజూట వాటీ
నటజ్జహ్నుకన్యా తటిన్యా సమేతమ్ |
మహానర్ఘ మాణిక్య కోటీరహీర
ప్రభాపూరితార్ధేందురేఖావతంసమ్ || ౬ ||
ఫణాభృన్మణీ కుండలాలోలకర్ణ
ద్వయీ చారుతా దర్పణాద్గండభాగమ్ |సునేత్రాళికం సాదర భ్రూవిలాసం
సమన్దస్మితాఽఽస్యారవిన్దం శ్రయంతమ్ || ౭ ||
లసత్పీవరాఽంసద్వయం నీలకంఠం
మహోరస్స్థలం సూక్ష్మ మధ్యప్రదేశమ్ |వళిద్యోతమానోదరం దివ్యనాభిం
కుఠారైణ శాబాఽంచితాభ్యాం కరాభ్యామ్ || ౮ ||
ముఖాబ్జైస్స్తువన్తం కరాబ్జైర్నమన్తం
విధిం మానయన్తం మునీన్లాలయన్తమ్ |గణాన్పోషయన్తం మృదూక్తీర్వదన్తం
గుహం చైకదన్తం కరేణ స్పృశంతమ్ || ౯ ||
మహాదేవమన్తర్భజేఽహం భజేఽహం
సదా పార్వతీశం భజేఽహం భజేఽహమ్ |సదానందరూపం భజేఽహం భజేఽహం
చిదానందరూపం భజేఽహం భజేఽహమ్ || ౧౦ ||
భుజంగప్రయాతస్తవం సాంబమూర్తే-
రిమం ధ్యానగమ్యం తదేకాగ్రచిత్తః
పఠేద్యస్సుభక్తస్సమర్థః కృతార్థః
సదా తస్య సాక్షాత్ప్రసన్నశ్శివస్స్యాత్ || ౧౧ ||
ఇతి శ్రీ శంకరభగవత్పాద విరచితం శ్రీ సాంబసదాశివభుజంగప్రయాత స్తోత్రం ||

మార్గశిర మాసం




“మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గాశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని సుష్టు పరచారు. సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝామున నిద్రలేచి స్నానం చేయడం ఆచారమైంది. నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునిలో అద్వైత స్థితిని పొందగోరి మార్గశిర మాసంలో వ్రతం ఆచరించారు.
ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, పోలిని జ్ఞాపకం తెచ్చుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టాలి.
ఈ మాసంలో విష్ణువును 'కేశవ' నామంతో అర్చిస్తాం.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

'పోలి స్వర్గం నోము'



స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో 'పోలి స్వర్గం నోము'ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ... ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది.
ఒక వివాహిత దేవునిపై అతి భక్తిగా ఉండేది గానీ అత్తవారింట పనులు చెప్పి సాధిస్తూ పూజ చేయనిచ్చేవారు కాదు. కార్తిక అమావాస్య నాడు ఉదయాన్నే తనని పనులు చేయమని పురమాయించి ఇంట్లో అందరూ దీపాలు పెట్టడానికి వెళ్తారు. అప్పుడామె పెరట్లోనున్న అరటిదవ్వను వలచి, వస్త్రానితో వత్తులు చేసి దీపాలుగా వెలిగించి నూతినీళ్ళలో భగవత్ప్రీతిగా అర్పిస్తుంది. దానితో భగవంతుడు సంతోషించి, అత్తవారందరూ తిరిగి వచ్చి చూస్తూ ఉండగా దివ్య విమానములో దేవాంగనలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు.

అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

కార్తీక పురాణం 30 / త్రింశోధ్యాయ:



ఋషులడిగిరి. ఓ సూతమహర్షీ! మాకు పుణ్యమైనా హరి మహాత్మ్యమును జెప్పిటివి. ఇంకా కార్తికమహాత్మ్యమును వినగోరితిమి చెప్పవలసినది. కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించెడిది యేది? ధర్మములలో ఎక్కువ ధర్మమేది? దేనివలన మోక్షము సిద్ధించును? దేవతలలోపల ఎక్కువ దేవుడెవ్వడు? ఏ కర్మచేత మోహము నశించును? కలియుగమున మానవులు మందమతులు జడులు, మృత్యుపీడితులును అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును జెప్పుము. ఇంకా ఇతరమైన హరికథను జెప్పుము.
సూతుడు పల్కెను. మునీశ్వరులారా! మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది. కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు. మీరు అల్పబుద్దులయిన జనులకు మోక్షోపాయమును జెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్నలో కోపకారము కొరకయినదగుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు, అనేక పుణ్య తీర్థములందు స్నానాదికమాచరించియు ఏ ఫలమును బొందెదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటలచేత లభ్యమగును. మునీశ్వరులారా! వినుడు. కార్తిక ఫలము వేదోక్తమైనది. అనగా కార్తికమందు వేదోక్త ఫలమును బొందెదరాణి భావము. కార్తిక వ్రతము హరికి ఆనందకారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను గాను. కాలము చాలదు. కాబట్టి శాస్త్ర సారములలో సారమును జెప్పెడను వినుడు. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను వినుడు. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రమునుండి తరింతురు. కార్తికమందు హరిణి పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను జేయువారు అనేక పాపములనుండి శీఘ్రముగా ముక్తులగుదురు. సందేహము లేదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తిక వ్రతమును జేయవలెను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమా! బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని కార్తిక వ్రతమును జేయని యెడల తమ పూర్వులతో కూడా అంధతామిస్రమను పేరుగల నరకమును, (చీకట్లతో గ్రుడ్డిడగు నరకము) బొందుదురు. సంశయము లేదు. కార్తికమాసమున కావేరి జలమందు స్నానమాచరించు వారు దేవతలచేత కొనియాడబడి హరిలోకమును బొందుదురు. కార్తిమ మాసమందు స్నానము చేసి హరిణి పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును జేరును. మునీశ్వరులారా! కార్తిక వ్రతమును జేయని వారు వేయి జన్మములందు చండాలురై పుట్టుదురు.
కార్తిక మాసము పుణ్యకరము. సమస్త మాసములందు శ్రేష్ఠము. కార్తిక వ్రతము హరి ప్రీతి దాయకము. సమస్త పాపహారము. దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవియుండగా కార్తిక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను జేయువాడు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమొందెదరు. కార్తిక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధానము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడు గాని, దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తిక మాసమందు కథను విన్నయెడల వినిపింపజేసినా యెడల అనంత ఫలమునొందును. కార్తిక మహాత్మ్యము సర్వ పాపములను నశింపజేయును. సమస్త సంపత్తులను గలుగజేయును. అన్ని పుణ్యముల కంటెను అధికము. ఎవరు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. తిరిగి జనన మరణ ప్రవాహమున పడకుండ జేయునదియే పరసుఖము లేక నిత్య సుఖము.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తిక మహాత్మ్యే ఫలశ్రుతిర్నామత్రింశోధ్యాయస్సమాప్తః!!


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




శివపురాణం 30





 స్కందోత్పత్తి – కుమారసంభవం – 2
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. కాబట్టి వారి దివ్యమైన క్రీడా జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడా శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మొహితుడు కాలేదన్నమాట. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడిని కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకీ కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.
ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. అసలు కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇపుడు శివతేజస్సు కదలరాదు అన్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చినవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఇపుడు ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. అటువంటి వాడు బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. కాబట్టి ఈశ్వరా మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పదకుండు గాక! కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించదానికి భూమి అంగీకరించింది. అపుడు శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అంది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగామించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతెజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. కాబట్టి గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగాడు. అపుడు ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది.
ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. అపుడు ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వదానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.
ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనే ‘గుహా’ అనే పేరు ఉంది. కాబట్టి పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూస్తారు, స్కందలోకమును పొందుతారు.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



శివపురాణం 29



 స్కందోత్పత్తి – కుమారసంభవం
మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు 13మంది భార్యలు ఈ 13మంది దక్షప్రజాపతి కుమార్తెలు. కశ్యప ప్రజాపతి భార్యలలో ‘దితి, అదితి’కి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితియందు మార్పురాలేదు. కాబట్టి ఇపుడు తేడా క్షేత్రమునందే ఉంది. ఇప్పుడు మరల బిడ్డలు కావాలని కశ్యప ప్రజాపతిని అడిగింది. ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలి’ అని. అపుడు కశ్యప ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణీ అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా, నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించింది ఇక్కడ. ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది.
ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేల తల విరబోసుకుని కూర్చుని ఉంది. కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిందమును ముక్కలుగా నరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. ఇపుడు దితికి మరల భంగపాటు అయింది.
ఇలా కొన్నాళ్ళు అయిపొయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. అప్పుడు నీకు నీవు కోరుకునే కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. అటువంటి తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు అని అర్థం. వాడికి దేహమునందు బలం ఉంది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. యితడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. ఇప్పుడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. అపుడు బ్రహ్మ ‘నాయనా, నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. కానీ దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ఇలా అన్నాడు ‘మహానుభావా అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేనూ నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమయిన తత్త్వమో ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ఒక భార్యను ఇస్తున్నాను నేను. ఆమె పేరు ‘వరాంగి’. నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్ళిచేశారు.
వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? నీవు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగాడు. అపుడు వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. ఇప్పుడు వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది.
తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. అపుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకములనన్నిటిని కాల్చేస్తోంది. అపుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు. అపుడు బ్రహ్మ వెళ్ళాడు.
తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా ఏమిటి నీ కోరిక? అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దాహిస్తాడు. ఆయన కామారి. ఆయనకీ కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు. బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు.
తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. ఇపుడు వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగ మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.
ఇప్పుడు లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమారసంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడు. ఇంద్రుడు మన్మథుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మథుడు చేతిలో చెరకు విల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని దింపలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అపుడు అమ్మవారు ‘ధూర్త బ్రహ్మచారీ, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా? అని అదిలించింది. అప్పుడు శంకరుడు నిజరూపం చూపించాడు. తరువాత అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. ఇపుడు పార్వతీ పరమేశ్వరులిరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371