Friday, 30 September 2016

నవరాత్రులు – పూజావిధి (Navaratrulu - Poojavidhi)




మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్రపాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం)గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః

పూజాస్థలం

దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకుని, అక్కడ కడిగి పసుపునీళ్ళతో శుద్ధిచేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం పదహారు హస్తాల మానము, ఏడు హస్తాల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడుగు వుండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు, నాలుగు హస్తాలు పొడుగు వుండేలా వేదికనమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి.

దేవి విగ్రహ ప్రతిష్ట

అమావాస్య రాత్రి ఉపవాసం వుండి మరునాడు (పాడ్యమి తిథి) వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్టించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు. సింహవాహనారూడురాలైన దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది.

ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముందాయై విచ్చే’ అనేది రాగి రేకుమీద లిఖించబడినది వుంచి యంత్రాన్ని పూజించవచ్చును.

‘వాగ్భావం (ఐం) శంభువనితా (హ్రీం) కామబీజం (క్లీం) తతః పరం!

చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షర ద్వయం’

దేవీమాతలోనుండి వాగ్దేవి (ఐం), శంభువనిత పార్వతి (హ్రీం) కామబీజం.. లక్ష్మీదేవి (క్లీం) ముగ్గురు దేవేరులు ప్రకటితమై త్రిమూర్తులకు శక్తిప్రదానం చేస్తూ సృష్టిస్థితి లయకారిణులై విలసిల్లుతున్నారు. అందుకే దేవి నవరాత్రోత్సవాలలో అమ్మవారిని రోజుకొక దేవి అలంకరణలో ఉత్సవమూర్తిని పూజించడం జరుగుతుంది దేవీమందిరాలలో, ప్రతిరోజూ దీక్ష గైకొన్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. మూలా నక్షత్రంతో కూడిన ఆరోజు సరస్వతీదేవి అలంకారంలో శ్వేతాంబర ధారిణిగా, వీణాపాణియై నేత్రపర్వం గావిస్తుంది. దేవీమాత, ఆరోజు సరస్వతీ పూజ చేసి ఐం బీజోపాసన గావించడం వాళ్ళ సర్వవిద్యలు కరతలామలకమౌతాయి.

పూజా విధానం

పాడ్యమినాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం, అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే!

పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి.

పశుబలి నిషిద్దం, బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం.

అసుర నాశనానికై ఆవిర్భవించిన కాళీమాత (చండముండులు, శంభనిశుంభ మర్థిని) ఉగ్రమూర్తిని శాంతపరచడానికి పశుబలి కావించడం సముచితమే నన్న అభిప్రాయం కొందరిదైనా సాత్విక యజ్ఞమే భుక్తిముక్తి ప్రదమైనది, సర్వులూ ఆచరించదగినది. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో బాగమే. ఇక నవరాత్రుల దీక్షాకాలంలో భూమిమీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి. విజయదశమి నవరాత్రుల్లో దేవిని విద్యుక్తంగా పూజించాలి. దశమినాడు శ్రీరాముడు రావణవధ కావించడం వల్ల ఆరోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ధిచెందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన రామలీలగా రావణ, కుంభకర్ణ, మేఘనాధుల విగ్రహాలను దహనం చేసి, బాణాసంచా వేడుకల మధ్య ఆనందోత్సవాలతో తిలకించడం పరిపాటి.

ఇక ద్వాపరయుగంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా జమీవృక్షం మీద దాచిన దివ్యాస్త్రాలను పూజించి వాటితో కౌరవులను పరాజితులను చేస్తాడు అర్జునుడు. ఆ విజయాన్ని పురస్కరించుకుని దశమిరోజు జమీవృక్షాన్ని పూజించడం, ఆ చెట్టు ఆకులు బంధుమిత్రులను కలుసుకుని పంచడం ఆనవాయితీగా మారాయి.

ఆయుధ పూజ

దేవీమాత వివిధ హస్తాలతో దివ్యాయుధాలు ధరించి దుష్టసంహారం కావించింది. ఆయుధాలను పూజించడం వల్ల విజయం ప్రాప్తిస్తుందన్న విశ్వాసం అనాదినుండి వస్తున్నదే. అందుకే అష్టమి నవమి దశమిలలో ఒకరోజు వృత్తిపరంగా వాడే ఆయుధాలను, వాహనాలను పూజించడం జరుగుతున్నది.

మహిమాన్వితమైన దేవీ నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో కావించే పూజావిధులే గాక దశమి విజయదశమిగానూ, దసరాగానూనూ పిలువబడుతూ పండగ ఉత్సాహం అంతటా వెల్లివిరుస్తుంది. అంతటా భక్త్యావేశమే కానవస్తుంది.

మహిషాసురమర్దిని

‘యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!

నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః

ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, నారదాది మునులు, ఊర్ద్యలోకవాసులు తమ ప్రార్థనలకు ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించిన దేవీమాతకు ప్రణామాలు అర్పించారు.

దేవీమాత మణిద్వీపవాసిని వాళ్ళవైపు ప్రసన్నంగా చూసింది.

‘హే జగన్మాతా! రంభాసురుని పుత్రుడు మహిషాసురుడు బ్రహ్మవల్ల స్త్రీచేత తప్ప ఇతరులెవరివల్లా మరణం రాకుండా వరంపొంది, ఆ వరప్రభావంతో మూడు లోకాలను తన వశం చేసుకుని నిరంకుశంగా సాధుహింస చేస్తూ పాలన సాగిస్తున్నాడు. అతడిని వధించి లోకాలకు శాంతి చేకూర్చు మాతా!’ అంటూ ప్రార్ధించారు.

‘దేవతలారా! విచారించకండి. ఆ మహిషాసురుని దురాత్ములైన అతని అనుచరులను హతమార్చి, అధర్మం అంతరించేలా చేస్తాను’ అంటూ కరునార్ద్ర్హ వీక్షణాలతో వాళ్ళకు ధైర్యం చెప్పి అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా అష్టాదశ భుజాలతో (పదునెనిమిది) సంహవాహనరూఢురాలై గగనతలాన నిలిచింది. దేవి దివ్య శక్తులు, తేజం విలీనమైనాయి.

శంకరుని తేజం దేవి ముఖ పంకజాన్ని చేరింది. శ్వేత పద్మంలా ప్రకాశించింది. ముఖమండలం, నల్లనైన కేశపాశంలో యముని తేజం నిక్షిప్తమై యమపాశంలా గోచరించింది. ఆమె మూడు నేత్రాలు అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్నాయి. అగ్ని తేజంతో, వాయువు తేజం శ్రవణాలలో, సంధ్యా తేజం కనుబొమలలో ఒదిగాయి. నాసికలో కుబేరుని తేజం విలసిల్లగా, సూర్యుని తేజంతో అధరం విప్పారింది. ప్రజాపతి తేజం దంతపంక్తిలో, మహావిష్ణువు తేజం బాహువులలో, పశువుల తేజం అంగుళంలో కేంద్రీకృతమయ్యాయి. చంద్రుని తేజం వక్షస్థలంలో, ఇంద్రుని తేజం నడుములో, పృద్వితేజం నితంబాలలో నిక్షిప్తమయ్యయి.

ఆయా దివ్య తేజస్సులు దేవీమాత అవయవాలను చేరడంతో కోటి విద్యుల్లతల కాంతితో ఆమె దేహం ప్రకాశించింది.

సర్వాభరణ భూషితయై నిలిచిన ఆమె బాహువులలో వరుసగా మహావిష్ణువు చక్రం, శంకరుని త్రిశూలం, వరుణుని శంఖం, అగ్ని శతఘ్ని సంకాశమనే శక్తి వాయుదేవుని అక్షయ తూణీరాలు, ధనువు ఇంద్రుని వజ్రాయుధం, యముని దండం, విశ్వకర్మ పరశువు, ఖడ్గం, ముసలం, గద, పరిఘ, భుశుండి, శిరము, పాశం, చాపం,అంకుశం మొదలైన ఆయుధాలు ధరించి, సింహ వాహినియై మహిషాసురుని మహిప్యతీపుర బాహ్యంలో నిలిచి భయంకరంగా శంఖం పూరించింది. ఆ నాదానికి దిక్కులు పిక్కటిల్లాయి, భూమి కంపించింది. కుల పర్వతాలు గడగడలాడాయి, సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున ఎగిరిపడసాగాయి. ప్రళయ వాయువులు భీకరంగా వీచసాగాయి.

దేవీమాత శంఖం నాదానికి అదిరిపడి ఆశ్చర్యంతో కారణం తెలుసుకురమ్మని పంపాడు మహిషాసురుడు తన అనుచరులను, వాళ్ళు తెచ్చిన వార్త మరింత ఆశ్చర్య చకితుడిని చేసిందతడిని.

‘ఎవరో దివ్యాంగన, అష్టాదశభుజాలలో వివిధాయుధాలు ధరించి సింహంపై ఆసీనురాలై తనతో యుద్ధభిక్ష కొరుతున్నదట. ఈ మహిషాసురుడు మాయా యుద్ధ ప్రవీణుడని, త్రిమూర్తులు, దేవతలు కూడా తన ధాటికి తాళలేకపోయారని తెలియక అంతటి సాహసం చేసి వుంటుంది. ఆమె బలశౌర్యాలేపాటివో తెలుసుకోవలసిందే’ అనుకుంటూ ముందుగా తన సేనాధిపతులైన బష్కల దుర్ముఖులను ఆమెను జయించి తీసుకురావసిందిగా ఆజ్ఞ ఇచ్చి పంపాడు మహిషాసురుడు.

బాష్కల దుర్ముఖులు, ఆపైన అసిలోమ బిడాలాఖ్యులు, చిక్షుతతామ్రాక్షుల వంటి ఉగ్రదానవులందరూ ఆమెను జయించవచ్చి ఆమె చేతుల్లో చిత్తుగా ఓడి మరణించారు. ఆఖరుకు మహిషాసురుడు కదనానికి కదలక తప్పలేదు.

దేవీమాత విశ్వమోహన రూపంతో కానవచ్చింది అతని కన్నులకు. ఆ సౌందర్యాన్ని చూస్తూ వివశుడై తనను వివాహం చేసుకుని, అసుర సామ్రాజ్యరాణివై సుఖించమని వేడుకుంటాడు.

అతని మాటలకు ఫక్కున నవ్వి ‘దానవుడా! రూపం లేని నేను నీకోసం ఈ రూపు దాల్చి రావడం దేవతలను రక్షించడానికే సుమా, నీకు ప్రాణాలమీద ఆశవుంటే దేవ, మర్త్యలోకాలను విడిచి పాతాళానికి వెళ్ళి సుఖించు. కాని పక్షంలో యుద్ధానికి సిద్ధపడు మూర్ఖప్రలాపాలు మాని’ అంటూ శంఖం పూరించింది దేవీమాత.

మహిషాసురుడు మాయను ఆశ్రయించి జంతు రూపాలు ధరిస్తూ యుద్ధం సాగించాడు కొంతసేపు లీలగా అతనితో పోరాడి సూటిగా త్రిశూలంతో వక్షస్థలాన్ని చీల్చి యమనదనానికి పంపివేసినది దేవీమాత.

మహిషాసురుడు మరణంతో లోకాలు శాంతించాయి. దేవతలు ఆనందంతో పుష్ప వృష్టి కురిపించి ‘మహిషాసురమర్ధినికి జయము జయము’ అంటూ జయ జయ ధ్వానాలు చేసారు.

వాళ్ళవైపు ప్రసన్నంగా చూస్తూ అంతర్ధానం చెందింది మహిషాసురమర్ధిని చరతం శరన్నవరాత్రులలో పఠించడంవల్ల దేవీమాత అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. రోజూ వీలుకాకపోయినా శరన్నవరాత్రుల పర్వదినాలలో దేవీ మహత్యాన్ని వివరించే దేవీ భాగవత పారాయణం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.

నవ అంటే నూతనమైన, రాత్రులంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి కనుక ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు దేవీమాతను విశేష పూజలతో అర్చించడంవల్ల ఒక్క సంవత్సరకాలంలో చేసే పూజాఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ తొమ్మిది రోజులలో అష్టమినాడు మహిషాసురుని వధించడమే గాక, శంభనిశంభులు, చందముండులు, రక్తభీజుడు, దుర్గమాసురుడు మొదలైన ఉగ్రదానవులెందరినో వధించి లోకాలలో శాంతిభద్రతలు, ధర్మం సుస్థిరం కావించింది దేవీమాత. అందుకే ఆ జగదంబ అనుగ్రహం సిద్ధించడానికి, ఈతిబాధలు, అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా వుండటానికి, యమదంష్ట్రికులైన (అంటే మరణాలు ముఖ్యంగా రోగాల వల్ల) శరధ్వంత ఋతువుల్లో ప్రజలు అకాలమృత్యువు వాతపడకుండా వుండటానికి భూలోకంలో అనాదికాలం కృతయుగం నుండి నేటివరకు దేవీనవరాత్రోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.


మల్లె, మాలతి, సంపెంగ, మందారము, కదంబం మొదలైన పువ్వులతో, మంచి గంధం, అగరు, కర్పూరము, మారేడు పత్రీ, అర్ఘ్యం, పాద్యం, మొదలైన షోడశోపచారములతో, కొబ్బరి, అరటి, నారింజ, దానిమ్మ, పనస, మొదలైన ఫలాలతో, భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాలతో, అన్నపాయసాలతో, ధూప దీపాలతో, స్తోత్రాలతో, అష్టోత్తరశతనామావళిలతో, లలితా సహస్ర నామావళితో, నమస్కృతులతో అమ్మను ఘన౦గా  పూజించి ఆనందపరచ వలెను. ఇలా తొమ్మిది రోజులు చేసిన వారు సాంసారిక జీవితమును సుఖ సంతోషములతో గడుపుతారు, ఎలాంటి బాధలకూ లోనుకారు.  పూజ యధావిధిగా చేసి యధాశక్తిగా అన్నదానం శ్రద్దా భక్తులతో చెయ్యాలి.

పూజ చేసే వ్యక్తి ఈ తొమ్మిది రోజులు నేలపై పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. క్రొత్త బట్టలు, నగలు ఇచ్చి కుమారీ పూజ చెయ్యాలి.

రెండు సంవత్సరాల వయసుది కుమారి, మూడేల్లది త్రిమూర్తి, నాల్గేల్లది కళ్యాణి, ఐదు సంవత్సరాలది రోహిణి, ఆరెండ్లది  కాళి, ఏడేండ్లది చండిక, అష్ట వర్ష శాంభవి, నవ వర్ష దుర్గ, దశాబ్ద సుభద్ర,  ఆపై వయసుగల కన్యకలు పూజార్హులు కారు. కుమారి పూజవల్ల దారిద్ర్య దు:ఖాలు పోతాయి. త్రిమూర్తి పూజ దీర్ఘాయువును, ధర్మార్ధ కామ ఫలమును ఇస్తుంది, కళ్యాణి పూజ వల్ల విద్య, రాజ భోగాలు కలుగుతాయి, కాళీ పూజ పగను మట్టి పెడుతుంది, చండికా పూజ సంపత్కరి, శాంభవి పూజ రాజ్య పూజమైన ధీశక్తిని సమకూర్చుతుంది. దుర్గ ఎలాటి క్లిష్టములైన కార్యాలను సాధిస్తుంది. సుభద్ర అభీష్ట ఫలదాయిని. రోహిణి పూజ రోగములను పారద్రోలుతుంది.


  కలశ స్థాపన చేయాలి.పూజా మందిరంలో కలశస్థాపన చేయుటకు వేదికను తయారుచేసుకోవాలి. గోమయంతో నలుచదరాలు అలికి, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు(ఐదు రకాల లేత చిగుళ్ళు కలిగిన చెట్టు కొమ్మలు), దూర్వాంకురములు(గరిక) తయారుగ ఉంచుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టె ఆచారం ఉంది.


పూజా విధానం:
ఆ రోజు తెల్లవారుజామునే లేచి అభ్యంగ స్నానం చేసి, నుదుట నామం ధరించి, పట్టువస్త్రం కట్టుకుని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనం పై తెల్లని లేక ఎర్రని పట్టువస్త్రం ఆసనంపై వేయాలి లేదా పీట మీద తూర్పు ముఖంగగాని, ఉత్తరముఖంగాగాని కూర్చోవాలి.

మూడు సార్లు ఆచమనము చేసి ఓంకారముతో గురువును, పరమాత్మను ప్రార్థించి, పది నిముషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత గృహస్తు సతీసమేతంగ మహాసంకల్పం చెప్పవలెను.

ముందుగా విఘ్నేశ్వరుని పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి తోమ్మిది రోజులు కాని,మూడు రోజులు కాని,ఒక్క రోజు కాని మన శక్త్యానుసారం దీక్ష చేయవలెను.దీక్ష సమయములో ఏక భుక్తం చేయవలెను.తొమ్మిది రొజులు పూజ అయ్యేవరకూ అఖండ దీపారాధన చేయవలెను.

ఆయుధ పూజ:
పూర్వము పాండవులు శమీ వృక్షముపైన తమ ఆయుధములను దాచి, అఘ్నాతవాసము చేసినారు. అర్జునుడు శమీవృక్షముపై తన గాండీవమును దింపి కౌరవులతో యుద్ధము చేయుటతో వారి అఘ్నాతవాసము ముగిసినది. అందువలన ఈరోజున ఆయుధములకు, వాహనములకు లేదా తాము ఉపయోగించు యంత్రములకు పూజ చేయవలెను. కనుక ఈ రోజున శమీ వృక్షానికి ఒక విశిష్టత ఏర్పడినది. ఈ రోజున సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం(జమ్మిచెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి, ఈ క్రింద శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. 

శ్లో.  శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ |
      అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

 

నవరాత్రి పూజ విధానం



తిథి
మొదటి రోజు పాడ్యమి
శ్రీ బాలా త్రిపుర సుందరి
రెండవ రోజు విదియ
శ్రీ గాయత్రి
మూడవ రోజు తదియ
శ్రీ మహాలక్ష్మి
నాలుగో రోజు చవితి శ్రీ అన్నపూర్ణ
ఐదవ రోజు పంచమి
శ్రీ లలితాదేవి
ఆరవ రోజు సప్తమి
శ్రీ సరస్వతి
ఏడవ రోజు అష్టమి
శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి)
ఎనిమిదవ రోజు నవమి
శ్రీ మహిషాసురమర్ధిని
తొమ్మిదవ రోజు దశమి శ్రీ రాజరాజేశ్వరి

దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. మరి అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలిగా. దుర్గాదేవీ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.

ప్రాణ ప్రతిష్ట చేయు విధానం 
అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, పళ్లు, ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.
మం ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణ మిహ నో ధేహి భోగమ్
జ్యోక్పశ్యేషు సూర్యముచ్చరంత మనుమతే మృడయా న స్స్వస్తి
అమృతంవై ప్రాణా అమృతమాపః
ప్రాణానేన యథాస్థాన ముపహ్వయతే
ఓం అం హ్రీం క్రీం హంస స్సోహం
స్వామిని శ్రీ జగన్నాథే యావత్పూజావసానకం
తాపత్వ్తం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధింకురు
రక్తాంభోదిస్థపోతోల్లస దరుణసరోజాధిరూఢా కరాభైః
పాశం కోదండ మిక్షూద్భవ మణిగుణ మప్యంకుశం పంచబాణాన్
భిభ్రామా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీనవక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవహాకాళీ
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ అవాహితాభవ
స్థాపితాభవ సుప్రసన్నాభవ వరదాభవ స్థరాసనం కురు ప్రసీద ప్రసీద
ధ్యానం 
లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం
విద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాం
విద్వేషి వర్గవిజయేతు తమాలనీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే
ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరః
శంఖం సందధతీంకరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాం
యాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీ
యాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరా
తాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః

అక్షతలు, పుష్పములను దేవి పాదాల వద్ద ఉంచవలెను.

ఆవాహనం
ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై  పుష్పాలను లేదా  అక్షింతలు   చల్లవలెను.
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ 


ఆసనం 

ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై  పుష్పాలను లేదా  అక్షింతలు   చల్లవలెను.


తాంమ ఆవాహ జాతదేవోలక్ష్మీ మనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వరి పురుషానహం

దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను.

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ 

అర్ఘ్యం
దేవి పాదములపై దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను. 
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్


ఆచమనీయం 
ఈ క్రింది మంత్రము చెబుతూ గ్లాసులోని నీటిని పుష్పముతో కొద్దిగా దేవిపై చల్లవలెను

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే 


పంచామృతాభిషేకం 

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

క్షీరం (పాలు)
ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషియం
భవావాజస్య సంగధే
దధి (పెరుగు)
దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషిత్
ఆజ్యం (నెయ్యి)
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దెవోవస్సవితోత్పువా
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః
మధు (తేనె)
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః
మాధ్వీర్నస్సన్త్వౌ షధీః
చక్కెర (పంచదార)
స్వాదుః పవస్య దివ్యాయజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునామ్నే 
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్
ఫలోదకం (కొబ్బరి నీరు)
యాఃఫలినీర్యా ఫలా పుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పచి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ హనః
శుద్ధోదకం (మంచినీరు) స్నానం
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

చివరగా అమ్మవారికి మంచినీటిలో స్నానం చేయించి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. తర్వాత పత్తితో చేసిన ఉపవీతం సమర్పించుకోవాలి. తర్వాత ఈ క్రింది మంత్రం చదువుతూ గంధం వేయవలెను
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ 

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః గంధాం ధారయామి
సుగంధ ద్రవ్యాణి 
ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం
జాయా హేతిం పరిబాధమానాః
హస్తేఘ్నో విశ్వావయునాని విద్వాన్
పుమాన్‌పుమాంసంపరిపాతువిశ్వతః
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరి గోరోజనాది సుగంధద్రవ్యాణి సమర్పయామి.
ఆభరణాణి (నగలు)
తర్వాత అమ్మవారికి ఈ క్రింది మంత్రం చెబుతూ నగలు సమర్పించుకోవాలి.

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః 


శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సర్వభరణాణి సమర్పయామి
పుష్పాణి (పూలమాలలు)
ఈ క్రింది మంత్రం చదువుతూ సుగంధ పూలమాలలను అలంకరించాలి. 
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ 


శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.

అధాంగ పూజ 
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి


ధూపం (అగరవత్తులు) 
ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే 


తర్వాత అమ్మవారికి అగరవత్తులను సమర్పించుకోవాలి. 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.

దీపం 
అమ్మవారి దీపం వెలిగించి క్రింది మంత్రమును చదవాలి. 
ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం  సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ 

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
అని చెబుతూ నీటిని పళ్లెములో విడువలెను

నైవేద్యం 
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తర్వాత నైవేద్యం సమర్పించాలి
తాంబూలం
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్ 

 శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి.
కర్పూరనీరాజనం
ఈ క్రింది మంత్రమును జపిస్తూ హారతి ఇవ్వవలెను.

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహమ్
శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ 


సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః 
కర్పూర నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పమ్ 
చేతిలో అక్షింతలు, పువ్వులను ఉంచుకుని మంత్రపుష్పమ్ చెప్పవలెను. ఇక్కడ పెద్ద మంత్రపుష్పమ్ లేదా చిన్న మంత్రపుష్పమ్ చెప్పవలెను లేదా శ్రీ సూక్త ఫలమును పఠించవలెను. 
శ్రీ సూక్త ఫలము
ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః
ఋషయస్తే త్రయః ప్రోక్తాస్వయాం శ్రీరేవ దేవతా
పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్
అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే
పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే
చంద్రాభాం లక్ష్మిమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం
చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే
వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా
వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరావర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా
వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే
సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్
ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్
ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపంక్షుదపమృత్యవః
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా
శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు
శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్
శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి
సంతతమృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః
య ఏవం వేద
ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయవలెను. అనంతరం తీర్థం పుచ్చుకుంటూ ఈ మంత్రాలను జపించవలెను.
మం అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్తపాపక్షయకరం
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గాపరాదేవీ పాదోదకం పావనం శుభమ్

ఉద్వాసన 
ఈ క్రింది మంత్రము జపించుచూ ఉద్వాసన పలుకవలెను
మం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యథాస్థాన ముద్వాసయామి.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371










దేవీ మంగళహారతి



శ్రీ చక్ర పుర మందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
బంగారు హారాలు సింగారమొలకించు అంబికా హృదయకు నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
శ్రీ గౌరి శ్రీమాత శ్రీమహారాఙ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కవకంబు కాసులతో నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
పాశాంకుశ పుష్ప బాణచాపధరికి పరమ పావనమైన నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసె కల్యాణ సూత్రమ్ము నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
చిరునవ్వు లొలికించు శ్రీదేవి అధరాన శతకో టి నక్షత్ర నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
ముదమార మోమున ముచ్చటగ దరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
చంద్రవంకనికిదె నీరాజనం
శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మి కిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
శృంగేరి పీఠాన సుందరాకారిణి సౌందర్యలహరికిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
సకల హృదయాలలో బుద్ధిప్రేరణ జేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
దాన నరసింహుని దయతోడ రక్షించు దయగల తల్లికిదె నీరాజనం
ఆత్మార్పణతో నిత్య నీరాజనం
శ్రీ చక్ర పుర మందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం
రచన: ఋషి మార్కండేయ

దేవీ మహత్మ్యమ్ కీలక స్తోత్రం


 

అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మన్త్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛన్దః | మహాసరస్వతీ దేవతా | మన్త్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మన్త్రశక్తి|శ్రీ సప్త శతీ మన్త్ర స్తత్వం స్రీ జగదమ్బా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాఙ్గత్వఏన జపే వినియోగః |
ఓం నమశ్చణ్డికాయై
మార్కణ్డేయ ఉవాచ
ఓం విశుద్ధ ఙ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే |
శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థ ధారిణే ||౧||
సర్వమేత ద్విజానీయాన్మన్త్రాణాపి కీలకమ్ |
సో‌உపి క్షేమమవాప్నోతి సతతం జాప్య తత్పరః ||౨||
సిద్ధ్యన్తుచ్చాటనాదీని కర్మాణి సకలాన్యపి |
ఏతేన స్తువతాం దేవీం స్తోత్రవృన్దేన భక్తితః ||౩||
న మన్త్రో నౌషధం తస్య న కిఞ్చి దపి విధ్యతే |
వినా జాప్యమ్ న సిద్ధ్యేత్తు సర్వ ముచ్చాటనాదికమ్ ||౪||
సమగ్రాణ్యపి సేత్స్యన్తి లోకశఙ్ఞ్కా మిమాం హరః |
కృత్వా నిమన్త్రయామాస సర్వ మేవ మిదం శుభమ్ ||౫||
స్తోత్రంవై చణ్డికాయాస్తు తచ్చ గుహ్యం చకార సః |
సమాప్నోతి సపుణ్యేన తాం యథావన్నిమన్త్రణాం ||౬||
సోపి‌உక్షేమ మవాప్నోతి సర్వ మేవ న సంశయః |
కృష్ణాయాం వా చతుర్దశ్యామ్ అష్టమ్యాం వా సమాహితః ||౬||
దదాతి ప్రతిగృహ్ణాతి నాన్య థైషా ప్రసీదతి |
ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్| ||౮||
యో నిష్కీలాం విధాయైనాం చణ్డీం జపతి నిత్య శః |
స సిద్ధః స గణః సో‌உథ గన్ధర్వో జాయతే ధ్రువమ్ ||౯||
న చైవా పాటవం తస్య భయం క్వాపి న జాయతే |
నాప మృత్యు వశం యాతి మృతేచ మోక్షమాప్నుయాత్ ||౧౦||
ఙ్ఞాత్వాప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినశ్యతి |
తతో ఙ్ఞాత్వైవ సమ్పూర్నమ్ ఇదం ప్రారభ్యతే బుధైః ||౧౧||
సౌభాగ్యాదిచ యత్కిఞ్చిద్ దృశ్యతే లలనాజనే |
తత్సర్వం తత్ప్రసాదేన తేన జప్యమిదం శుభం ||౧౨||
శనైస్తు జప్యమానే‌உస్మిన్ స్తోత్రే సమ్పత్తిరుచ్చకైః|
భవత్యేవ సమగ్రాపి తతః ప్రారభ్యమేవతత్ ||౧౩||
ఐశ్వర్యం తత్ప్రసాదేన సౌభాగ్యారోగ్యమేవచః |
శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సాన కిం జనై ||౧౪||
చణ్దికాం హృదయేనాపి యః స్మరేత్ సతతం నరః |
హృద్యం కామమవాప్నోతి హృది దేవీ సదా వసేత్ ||౧౫||
అగ్రతో‌உముం మహాదేవ కృతం కీలకవారణమ్ |
నిష్కీలఞ్చ తథా కృత్వా పఠితవ్యం సమాహితైః ||౧౬||
|| ఇతి శ్రీ భగవతీ కీలక స్తోత్రం సమాప్తమ్ ||
రచన: ఋషి మార్కణ్డేయ

 

దేవీ మహత్మ్యమ్ అర్గళ స్తోత్రం


 

అస్యశ్రీ అర్గళా స్తోత్ర మన్త్రస్య విష్ణుః ఋషిః| అనుష్టుప్ఛన్దః| శ్రీ మహాలక్షీర్దేవతా| మన్త్రోదితా దేవ్యోబీజం|
నవార్ణో మన్త్ర శక్తిః| శ్రీ సప్తశతీ మన్త్రస్తత్వం శ్రీ జగదన్దా ప్రీత్యర్థే సప్తశతీ పఠాం గత్వేన జపే వినియోగః||
ధ్యానం
ఓం బన్ధూక కుసుమాభాసాం పఞ్చముణ్డాధివాసినీం|
స్ఫురచ్చన్ద్రకలారత్న ముకుటాం ముణ్డమాలినీం||
త్రినేత్రాం రక్త వసనాం పీనోన్నత ఘటస్తనీం|
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్||
దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితాం|
అథవా
యా చణ్డీ మధుకైటభాది దైత్యదళనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షన చణ్డముణ్డమథనీ యా రక్త బీజాశనీ|
శక్తిః శుమ్భనిశుమ్భదైత్యదళనీ యా సిద్ధి దాత్రీ పరా
సా దేవీ నవ కోటి మూర్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ||
ఓం నమశ్చణ్డికాయై
మార్కణ్డేయ ఉవాచ
ఓం జయత్వం దేవి చాముణ్డే జయ భూతాపహారిణి|
జయ సర్వ గతే దేవి కాళ రాత్రి నమో‌உస్తుతే ||౧||
మధుకైఠభవిద్రావి విధాత్రు వరదే నమః
ఓం జయన్తీ మఙ్గళా కాళీ భద్రకాళీ కపాలినీ ||౨||
దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమో‌உస్తుతే
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౩||
మహిషాసుర నిర్నాశి భక్తానాం సుఖదే నమః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౪||
ధూమ్రనేత్ర వధే దేవి ధర్మ కామార్థ దాయిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౫||
రక్త బీజ వధే దేవి చణ్డ ముణ్డ వినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౬||
నిశుమ్భశుమ్భ నిర్నాశి త్రైలోక్య శుభదే నమః
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౭||
వన్ది తాఙ్ఘ్రియుగే దేవి సర్వసౌభాగ్య దాయిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౮||
అచిన్త్య రూప చరితే సర్వ శతృ వినాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౯||
నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౦||
స్తువద్భ్యోభక్తిపూర్వం త్వాం చణ్డికే వ్యాధి నాశిని
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౧||
చణ్డికే సతతం యుద్ధే జయన్తీ పాపనాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౨||
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవీ పరం సుఖం|
రూపం ధేహి జయం దేహి యశో ధేహి ద్విషో జహి ||౧౩||
విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౪||
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౫||
సురాసురశిరో రత్న నిఘృష్టచరణే‌உమ్బికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౬||
విధ్యావన్తం యశస్వన్తం లక్ష్మీవన్తఞ్చ మాం కురు|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౭||
దేవి ప్రచణ్డ దోర్దణ్డ దైత్య దర్ప నిషూదిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౮||
ప్రచణ్డ దైత్యదర్పఘ్నే చణ్డికే ప్రణతాయమే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౧౯||
చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౨౦||
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదామ్బికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౨౧||
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౨౨||
ఇన్ద్రాణీ పతిసద్భావ పూజితే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౨౩||
దేవి భక్తజనోద్దామ దత్తానన్దోదయే‌உమ్బికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౨౪||
భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౨౫||
తారిణీం దుర్గ సంసార సాగర స్యాచలోద్బవే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||౨౬||
ఇదంస్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః|
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభం ||౨౭||
|| ఇతి శ్రీ అర్గలా స్తోత్రం సమాప్తమ్ ||
రచన: ఋషి మార్కణ్డేయ

 

దుర్గా సుక్తము - యజుర్వేదము


 



|| అథ దుర్గా సూక్తమ్ ||

జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః |
స నః షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా ౭ త్యగ్నిః ||

తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం పైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ |
దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ||

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ థ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శం యోః ||

విశ్వాని నో దుర్గహా జాతవేదస్సింధుం న నావా దురితా౭తిపర్ షి |
అగ్నే అత్రివన్మనసా గృణానో౭స్మాకం బోధ్యవితా తనూనామ్ ||

పృతనాజిత సహమానముగ్రమగ్ని హువేమ పరమాథ్సధస్థాత్ |
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతిదురితా౭త్యగ్నిః ||

ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి |
సా్వం చాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ ||

గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక మాదయంతామ్ ||

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి థీమహి |
తన్నో దుర్గి ప్రచోదయాత్ ||

|| ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

|| ఇతి దుర్గాసుక్తమ్ ||
తైత్తిరీయారణ్యకమ్ ౪ ప్రపాటకః ౧౦ అనువాకః ౨

నవ దుర్గా స్తోత్రము



గణేశః
హరిద్రాభఞ్చతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాఙ్కుశధరం దైవంమోదకన్దన్తమేవ చ ||
దేవీ శైలపుత్రీ
వన్దే వాఞ్ఛితలాభాయ చన్ద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమణ్డలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దేవీ చన్ద్రఘణ్టేతి
పిణ్డజప్రవరారూఢా చన్దకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చన్ద్రఘణ్టేతి విశ్రుతా ||
దేవీ కూష్మాణ్డా
సురాసమ్పూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాణ్డా శుభదాస్తు మే ||
దేవీస్కన్దమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కన్దమాతా యశస్వినీ ||
దేవీకాత్యాయణీ
చన్ద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లమ్బోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయఙ్కరీ ||
దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతామ్బరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
దేవీసిద్ధిదాత్రి
సిద్ధగన్ధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
రచన: వాగ్దేవీ

దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రము




 





శ్రీగణేశాయ నమః |
శ్రీదేవ్యువాచ |
మమ నామసహస్రం చ శివపూర్వవినిర్మితమ్ |
తత్పఠ్యతాం విధానేన తదా సర్వం భవిష్యతి || ౧ ||
ఇత్యుక్త్వా పార్వతీ దేవీ శ్రావయామాస తచ్చతాన్ |
తదేవ నామ సాహస్రం దకారాది వరాననే || ౨ ||
రోగదారిద్ర్య దౌర్భాగ్యశోకదుఃఖవినాశకమ్ |
సర్వాసాం పూజితం నామ శ్రీదుర్గాదేవతా మతా || ౩ ||
నిజబీజం భవేద్ బీజం మన్త్రం కీలకముచ్యతే |
సర్వాశాపూరణే దేవి వినియోగః ప్రకీర్త్తితః || ౪ ||
ఓం అస్య శ్రీదకారాదిదుర్గాసహస్రనామస్తోత్రస్య |
శివ ఋషిః, అనుష్టుప్ ఛన్దః,
శ్రీదుర్గాదేవతా, దుం బీజం, దుం కీలకం,
దుఃఖదారిద్ర్యరోగశోకనివృత్తిపూర్వకం
చతుర్వర్గఫలప్రాప్త్యర్థే పాఠే వినియోగః |
ధ్యానమ్
ఓం విద్యుద్దామసమప్రభాం మృగపతిస్కన్ధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేటవిలసద్ధస్తాభిరాసేవితామ్ |
హస్తైశ్చక్రగదాసిఖేటవిశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||
దుం దుర్గా దుర్గతిహరా దుర్గాచలనివాసినీ |
దుర్గమార్గానుసఞ్చారా దుర్గమార్గనివాసినీ || ౧ ||
దుర్గమార్గప్రవిష్టా చ దుర్గమార్గప్రవేశినీ |
దుర్గమార్గకృతావాసా దుర్గమార్గజయప్రియా || ౨ ||
దుర్గమార్గగృహీతార్చా దుర్గమార్గస్థితాత్మికా |
దుర్గమార్గస్తుతిపరా దుర్గమార్గస్మృతిపరా || ౩ ||
ద్రుగమార్గసదాస్థాలీ దుర్గమార్గరతిప్రియా |
దుర్గమార్గస్థలస్థానా దుర్గమార్గవిలాసినీ || ౪ ||
దుర్గమార్గత్యక్తవస్త్రా దుర్గమార్గప్రవర్తినీ |
దుర్గాసురనిహన్త్రీ న దుర్గాసురనిషూదినీ|| ౫ ||
దుర్గాసరహర దూతీ దుర్గాసురవినాశినీ |
దుర్గాసురవధొన్మత్తా దుర్గాసురవధొత్సుకా || ౬ ||
దుర్గాసురవధొత్సాహా దుర్గాసురవధొద్యతా |
దుర్గాసురవధప్రేప్సుర్దుగాసురమఖాన్తకృత్ || ౭ ||
దుర్గాసురధ్వంసతొషా దుర్గదానవదారిణీ |
దుర్గవిద్రావణకరీ దుర్గవిద్రావణీ సదా || ౮ ||
దుర్గవిక్షొభణకరీ దుర్గశీర్షనికృన్తినీ |
దుర్గవిధ్వంసనకరి దుర్గదైత్యనికృన్తినీ || ౯ ||
దుర్గదైత్యప్రాణహరా దుర్గదైత్యాన్తకారిణీ |
దుర్గదైత్యహరత్రాత్రీ దుర్గదైత్యాసృగున్మదా || ౧ఓ ||
దుర్గదైత్యాశనకరీ దుర్గచర్మామ్బరావృతా |
దుర్గయుద్ధొత్సవకరీ దుర్గయుద్ధవిశారదా || ౧౧ ||
దుర్గయుద్ధాసవరతా దుర్గయుద్ధవిమర్దినీ |
దుర్గయుద్ధహాస్యరతా దుర్గయుద్ధాట్టహాసినీ || ౧౨ ||
దుర్గయుద్ధమహామత్తా దుర్గయుద్ధానుసారిణీ |
దుర్గయుద్ధొత్సవొత్సాహా దుర్గదేశనిషేవిణీ || ౧౩ ||
దుర్గదేశవాసరతా దుర్గదేశవిలాసినీ |
దుర్గదేశార్చనరతా దుర్గదేశజనప్రియా || ౧౪ ||
దుర్గమస్థానసంస్థానా దుర్గమధ్యానుసాధనా |
దుర్గమా దుర్గమధ్యానా దుర్గమాత్మస్వరూపిణీ || ౧౫ ||
దుర్గమాగమసన్ధానా దుర్గమాగమసంస్తుతా |
దుర్గమాగమదుర్ఙ్ఞేయా దుర్గమశ్రుతిసమ్మతా || ౧౬ ||
దుర్గమశ్రుతిమాన్యా చ దుర్గమశ్రుతిపూజితా |
దుర్గమశ్రుతిసుప్రీతా దుర్గమశ్రుతిహర్షదా || ౧౭ ||
దుర్గమశ్రుతిసంస్థానా దుర్గమశ్రుతిమానితా |
దుర్గమాచారసన్తుష్టా దుర్గమాచారతొషితా || ౧౮ ||
దుర్గమాచారనిర్వృత్తా దుర్గమాచారపూజితా |
దుర్గమాచారకలితా దుర్గమస్థానదాయినీ || ౧౯ ||
దుర్గమప్రేమనిరతా దుర్గమద్రవిణప్రదా |
దుర్గమామ్బుజమధ్యస్థా దుర్గమామ్బుజవాసినీ || ౨ఓ ||
దుర్గనాడీమార్గగతిర్దుర్గనాడీప్రచారిణీ |
దుర్గనాడీపద్మరతా దుర్గనాడ్యమ్బుజాస్థితా || ౨౧ ||
దుర్గనాడీగతాయాతా దుర్గనాడీకృతాస్పదా |
దుర్గనాడీరతరతా దుర్గనాడీశసంస్తుతా || ౨౨ ||
దుర్గనాడీశ్వరరతా దుర్గనాడీశచుమ్బితా |
దుర్గనాడీశక్రొడస్థా దుర్గనాడ్యుత్థితొత్సుకా || ౨౩ ||
దుర్గనాడ్యారొహణా చ దుర్గనాడీనిషేవితా |
దరిస్థానా దరిస్థానవాసినీ దనుజాన్తకృత్ || ౨౪ ||
దరీకృతతపస్యా చ దరీకృతహరార్చనా |
దరీజాపితదిష్టా చ దరీకృతరతిక్రియా || ౨౫ ||
దరీకృతహరార్హా చ దరీక్రీడితపుత్రికా |
దరీసన్దర్శనరతా దరీరొపితవృశ్చికా || ౨౬ ||
దరీగుప్తికౌతుకాఢ్యా దరీభ్రమణతత్పరా |
దనుజాన్తకరీ దీనా దనుసన్తానదారిణీ || ౨౭ ||
దనుజధ్వంసినీ దూనా దనుజేన్ద్రవినాశినీ |
దానవధ్వంసినీ దేవీ దానవానాం భయఙ్కరీ || ౨౮ ||
దానవీ దానవారాధ్యా దానవేన్ద్రవరప్రదా |
దానవేన్ద్రనిహన్త్రీ చ దానవద్వేషిణీ సతీ || ౨౯ ||
దానవారిప్రేమరతా దానవారిప్రపూజితా |
దానవరికృతార్చా చ దానవారివిభూతిదా || ౩ఓ ||
దానవారిమహానన్దా దానవారిరతిప్రియా |
దానవారిదానరతా దానవారికృతాస్పదా || ౩౧ ||
దానవారిస్తుతిరతా దానవారిస్మృతిప్రియా |
దానవార్యాహారరతా దానవారిప్రబొధినీ || ౩౨ ||
దానవారిధృతప్రేమా దుఃఖశొకవిమొచినీ |
దుఃఖహన్త్రీ దుఃఖదత్రీ దుఃఖనిర్మూలకారిణీ || ౩౩ ||
దుఃఖనిర్మూలనకరీ దుఃఖదార్యరినాశినీ |
దుఃఖహరా దుఃఖనాశా దుఃఖగ్రామా దురాసదా || ౩౪ ||
దుఃఖహీనా దుఃఖధారా ద్రవిణాచారదాయినీ |
ద్రవిణొత్సర్గసన్తుష్టా ద్రవిణత్యాగతొషికా || ౩౫ ||
ద్రవిణస్పర్శసన్తుష్టా ద్రవిణస్పర్శమానదా |
ద్రవిణస్పర్శహర్షాఢ్యా ద్రవిణస్పర్శతుష్టిదా || ౩౬ ||
ద్రవిణస్పర్శనకరీ ద్రవిణస్పర్శనాతురా |
ద్రవిణస్పర్శనొత్సాహా ద్రవిణస్పర్శసాధికా || ౩౭ ||
ద్రవిణస్పర్శనమతా ద్రవిణస్పర్శపుత్రికా |
ద్రవిణస్పర్శరక్షిణీ ద్రవిణస్తొమదాయినీ || ౩౮ ||
ద్రవిణకర్షణకరీ ద్రవిణౌఘవిసర్జినీ |
ద్రవిణాచలదానాఢ్యా ద్రవిణాచలవాసినీ || ౩౯ ||
దీనమాతా దినబన్ధుర్దీనవిఘ్నవినాశినీ |
దీనసేవ్యా దీనసిద్ధా దీనసాధ్యా దిగమ్బరీ || ౪ఓ ||
దీనగేహకృతానన్దా దీనగేహవిలాసినీ |
దీనభావప్రేమరతా దీనభావవినొదినీ || ౪౧ ||
దీనమానవచేతఃస్థా దీనమానవహర్షదా |
దీనదైన్యవిఘాతేచ్ఛుర్దీనద్రవిణదాయినీ || ౪౨ ||
దీనసాధనసన్తుష్టా దీనదర్శనదాయినీ |
దీనపుత్రాదిదాత్రీ చ దీనసమ్పద్విధాయినీ || ౪౩ ||
దత్తాత్రేయధ్యానరతా దత్తాత్రేయప్రపూజితా |
దత్తాత్రేయర్షిసంసిద్ధా దత్తాత్రేయవిభావితా || ౪౪ ||
దత్తాత్రేయకృతార్హా చ దత్తాత్రేయప్రసాధితా |
దత్తాత్రేయస్తుతా చైవ దత్తాత్రేయనుతా సదా || ౪౬ ||
దత్తాత్రేయప్రేమరతా దత్తాత్రేయానుమానితా |
దత్తాత్రేయసముద్గీతా దత్తాత్రేయకుటుమ్బినీ || ౪౬ ||
దత్తాత్రేయప్రాణతుల్యా దత్తాత్రేయశరీరిణీ |
దత్తాత్రేయకృతానన్దా దత్తాత్రేయాంశసమ్భవా || ౪౭ ||
దత్తాత్రేయవిభూతిస్థా దత్తాత్రేయానుసారిణీ |
దత్తాత్రేయగీతిరతా దత్తాత్రేయధనప్రదా || ౪౮ ||
దత్తాత్రేయదుఃఖహరా దత్తాత్రేయవరప్రదా |
దత్తాత్రేయఙ్ఞానదానీ దత్తాత్రేయభయాపహా || ౪౯ ||
దేవకన్యా దేవమాన్యా దేవదుఃఖవినాశినీ |
దేవసిద్ధా దేవపూజ్యా దేవేజ్యా దేవవన్దితా || ౫౦ ||
దేవమాన్యా దేవధన్యా దేవవిఘ్నవినాశినీ |
దేవరమ్యా దేవరతా దేవకౌతుకతత్పరా || ౫౧ ||
దేవక్రీడా దేవవ్రీడా దేవవైరివినాశినీ |
దేవకామా దేవరామా దేవద్విష్టవినశినీ || ౫౨ ||
దేవదేవప్రియా దేవీ దేవదానవవన్దితా |
దేవదేవరతానన్దా దేవదేవవరొత్సుకా || ౫౩ ||
దేవదేవప్రేమరతా దేవదేవప్రియంవదా |
దేవదేవప్రాణతుల్యా దేవదేవనితమ్బినీ || ౫౪ ||
దేవదేవరతమనా దేవదేవసుఖావహా |
దేవదేవక్రొడరత దేవదేవసుఖప్రదా || ౫౫ ||
దేవదేవమహానన్దా దేవదేవప్రచుమ్బితా |
దేవదేవొపభుక్తా చ దేవదేవానుసేవితా || ౫౬ ||
దేవదేవగతప్రాణా దేవదేవగతాత్మికా |
దేవదేవహర్షదాత్రీ దేవదేవసుఖప్రదా || ౫౮ ||
దేవదేవమహానన్దా దేవదేవవిలాసినీ |
దేవదేవధర్మపత్‍నీ దేవదేవమనొగతా || ౫౯ ||
దేవదేవవధూర్దేవీ దేవదేవార్చనప్రియా |
దేవదేవాఙ్గసుఖినీ దేవదేవాఙ్గవాసినీ || ౬ఓ ||
దేవదేవాఙ్గభూషా చ దేవదేవాఙ్గభూషణా |
దేవదేవప్రియకరీ దేవదేవాప్రియాన్తకృత్ || ౬౧ ||
దేవదేవప్రియప్రాణా దేవదేవప్రియాత్మికా |
దేవదేవార్చకప్రాణా దేవదేవార్చకప్రియా || ౬౨ ||
దేవదేవార్చకొత్సాహా దేవదేవార్చకాశ్రయా |
దేవదేవార్చకావిఘ్నా దేవదేవప్రసూరపి || ౬౩ ||
దేవదేవస్య జననీ దేవదేవవిధాయినీ |
దేవదేవస్య రమణీ దేవదేవహ్రదాశ్రయా || ౬౪ ||
దేవదేవేష్టదేవీ చ దేవతాపసపాలినీ |
దేవతాభావసన్తుష్టా దేవతాభావతొషితా || ౬౫ ||
దేవతాభావవరదా దేవతాభావసిద్ధిదా |
దేవతాభావసంసిద్ధా దేవతాభావసమ్భవా || ౬౬ ||
దేవతాభావసుఖినీ దేవతాభావవన్దితా |
దేవతాభావసుప్రీతా దేవతాభావహర్షదా || ౬౭ ||
దేవతవిఘ్నహన్త్రీ చ దేవతాద్విష్టనాశినీ |
దేవతాపూజితపదా దేవతాప్రేమతొషితా || ౬౮ ||
దేవతాగారనిలయా దేవతాసౌఖ్యదాయినీ |
దేవతానిజభావా చ దేవతాహ్రతమానసా || ౬౯ ||
దేవతాకృతపాదార్చా దేవతాహ్రతభక్తికా |
దేవతాగర్వమధ్యస్తా దేవతాదేవతాతనుః || ౭ఓ ||
దుం దుర్గాయై నమొ నామ్నీ దుం ఫణ్మన్త్రస్వరూపిణీ |
దూం నమొ మన్త్రరూపా చ దూం నమొ మూర్తికాత్మికా || ౭౧ ||
దూరదర్శిప్రియాదుష్టా దుష్టభూతనిషేవితా |
దూరదర్శిప్రేమరతా దూరదర్శిప్రియంవదా || ౭౨ ||
దూరదర్శైసిద్ధిదాత్రీ దూరదర్శిప్రతొషితా |
దూరదర్శికణ్ఠసంస్థా దూరదర్శిప్రహర్షితా || ౭౩ ||
దూరదర్శిగృహీతార్చా దురదర్హిప్రతర్షితా |
దూరదర్శిప్రాణతుల్యా దురదర్శిసుఖప్రదా || ౭౪ ||
దురదర్శిభ్రాన్తిహరా దూరదర్శిహ్రదాస్పదా |
దూరదర్శ్యరివిద్భావా దీర్ఘదర్శిప్రమొదినీ || ౭౫ ||
దీర్ఘదర్శిప్రాణతుల్యా దురదర్శివరప్రదా |
దీర్ఘదర్శిహర్షదాత్రీ దీర్ఘదర్శిప్రహర్షితా || ౭౬ ||
దీర్ఘదర్శిమహానన్దా దీర్ఘదర్శిగృహాలయా |
దీర్ఘదర్శిగృహీతార్చా దీర్ఘదర్శిహ్రతార్హణా || ౭౭ ||
దయా దానవతీ దాత్రీ దయాలుర్దీనవత్సలా |
దయార్ద్రా చ దయాశీలా దయాఢ్యా చ దయాత్మికా || ౭౮ ||
దయామ్బుధిర్దయాసారా దయాసాగరపారగా |
దయాసిన్ధుర్దయాభారా దయావత్కరుణాకరీ || ౭౯ ||
దయావద్వత్సలా దేవీ దయా దానరతా సదా |
దయావద్భక్తిసుఖినీ దయావత్పరితొషితా || ౮ఓ ||
దయావత్స్నేహనిరతా దయావత్ప్రతిపాదికా|
దయావత్ప్రాణకర్త్రీ చ దయావన్ముక్తిదాయినీ || ౮౧ ||
దయావద్భావసన్తుష్టా దయావత్పరితొషితా |
దయావత్తారణపరా దయావత్సిద్ధిదాయినీ || ౮౨ ||
దయావత్పుత్రవద్భావా దయావత్పుత్రరూపిణీ |
దయావదేహనిలయా దయాబన్ధుర్దయాశ్రయా || ౮౩ ||
దయాలువాత్సల్యకరీ దయాలుసిద్ధిదాయినీ |
దయాలుశరణాశక్తా దయాలుదేహమన్దిరా || ౮౪ ||
దయాలుభక్తిభావస్థా దయాలుప్రాణరూపిణీ |
దయాలుసుఖదా దమ్భా దయాలుప్రేమవర్షిణీ || ౮౫ ||
దయాలువశగా దీర్ఘా దిర్ఘాఙ్గీ దీర్ఘలొచనా |
దీర్ఘనేత్రా దీర్ఘచక్షుర్దీర్ఘబాహులతాత్మికా || ౮౬ ||
దీర్ఘకేశీ దీర్ఘముఖీ దీర్ఘఘొణా చ దారుణా |
దారుణాసురహన్త్రీ చ దారూణాసురదారిణీ || ౮౭ ||
దారుణాహవకర్త్రీ చ దారుణాహవహర్షితా |
దారుణాహవహొమాఢ్యా దారుణాచలనాశినీ || ౮౮ ||
దారుణాచారనిరతా దారుణొత్సవహర్షితా |
దారుణొద్యతరూపా చ దారుణారినివారిణీ || ౮౯ ||
దారుణేక్షణసంయుక్తా దొశ్చతుష్కవిరాజితా |
దశదొష్కా దశభుజా దశబాహువిరాజితా || ౯ఓ ||
దశాస్త్రధారిణీ దేవీ దశదిక్ఖ్యాతవిక్రమా |
దశరథార్చితపదా దాశరథిప్రియా సదా || ౯౧ ||
దాశరథిప్రేమతుష్టా దాశరథిరతిప్రియా |
దాశరథిప్రియకరీ దాశరథిప్రియంవదా || ౯౨ ||
దాశరథీష్టసన్దాత్రీ దాశరథీష్టదేవతా |
దాశరథిద్వేషినాశా దాశరథ్యానుకూల్యదా || ౯౩ ||
దాశరథిప్రియతమా దాశరథిప్రపూజితా |
దశాననారిసమ్పూజ్యా దశాననారిదేవతా || ౯౪ ||
దశాననారిప్రమదా దశాననారిజన్మభూః |
దశాననారిరతిదా దశాననారిసేవితా || ౯౫ ||
దశాననారిసుఖదా దశాననారివైరిహ్రత్‌ |
దశాననారిష్టదేవీ దశగ్రీవారివన్దితా || ౯౬ ||
దశగ్రీవారిజననీ దశగ్రీవారిభావినీ
దశగ్రీవారిసహితా దశగ్రీవసభాజితా || ౯౭ ||
దశగ్రీవారిరమణీ దశగ్రీవవధూరపి |
దశగ్రీవనాశకర్త్రీ దశగ్రీవవరప్రదా || ౯౮ ||
దశగ్రీవపురస్థా చ దశగ్రీవవధొత్సుకా |
దశగ్రీవప్రీతిదాత్రీ దశగ్రీవవినాశినీ || ౯౯ ||
దశగ్రీవాహవకరీ దశగ్రీవానపాయినీ |
దశగ్రీవప్రియా వన్ద్యా దశగ్రీవహ్రతా తథా || ౧ఓఓ ||
దశగ్రీవాహితకరీ దశగ్రీవేశ్వరప్రియా |
దశగ్రీవేశ్వరప్రాణా దశగ్రీవవరప్రదా || ౧ఓ౧ ||
దశగ్రీవేశ్వరరతా దశవర్షీయకన్యకా |
దశవర్షీయబాలా చ దశవర్షీయవాసినీ || ౧ఓ౨ ||
దశపాపహరా దమ్యా దశహస్తవిభూషితా |
దశశస్త్రలసద్దొష్కా దశదిక్పాలవన్దితా || ౧ఓ౩ ||
దశావతారరూపా చ దశావతారరూపిణీ |
దశవిద్యాభిన్నదేవీ దశప్రాణస్వరూపిణీ || ౧ఓ౪ ||
దశవిద్యాస్వరూపా చ దశవిద్యామయీ తథా |
దృక్స్వరూపా దృక్ప్రదాత్రీ దృగ్రూపా దృక్ప్రకాశినీ || ౧ఓ౫ ||
దిగన్తరా దిగన్తఃస్థా దిగమ్బరవిలాసినీ |
దిగమ్బరసమాజస్థా దిగమ్బరప్రపూజితా || ౧ఓ౬ ||
దిగమ్బరసహచరీ దిగమ్బరకృతాస్పదా |
దిగమ్బరహ్రతాచిత్తా దిగమ్బరకథాప్రియా || ౧ఓ౭ ||
దిగమ్బరగుణరతా దిగమ్బరస్వరూపిణీ |
దిగమ్బరశిరొధార్యా దిగమ్బరహ్రతాశ్రయా || ౧ఓ౮ ||
దిగమ్బరప్రేమరతా దిగమ్బరరతాతురా |
దిగమ్బరీస్వరూపా చ దిగమ్బరీగణార్చితా || ౧ఓ౯ ||
దిగమ్బరీగణప్రాణా దిగమ్బరీగణప్రియా |
దిగమ్బరీగణారాధ్యా దిగమ్బరగణేశ్వరా || ౧౧ఓ ||
దిగమ్బరగణస్పర్శమదిరాపానవిహ్వలా |
దిగమ్బరీకొటివృతా దిగమ్బరీగణావృతా || ౧౧౧ ||
దురన్తా దుష్కృతిహరా దుర్ధ్యేయా దురతిక్రమా |
దురన్తదానవద్వేష్ట్రీ దురన్తదనుజాన్తకృత్‌ || ౧౧౨ ||
దురన్తపాపహన్త్రీ చ దస్త్రనిస్తారకారిణీ |
దస్త్రమానససంస్థానా దస్త్రఙ్ఞానవివర్ధినీ || ౧౧౩ ||
దస్త్రసమ్భొగజననీ దస్త్రసమ్భొగదాయినీ |
దస్త్రసమ్భొగభవనా దస్త్రవిద్యావిధాయినీ|| ౧౧౪ ||
దస్త్రొద్వేగహరా దస్త్రజననీ దస్త్రసున్దరీ |
ద్స్త్రభక్తివిధాఙ్ఞానా దస్త్రద్విష్టవినాశినీ || ౧౧౫ ||
దస్త్రాపకారదమనీ దస్త్రసిద్ధివిధాయినీ |
దస్త్రతారారాధికా చ దస్త్రమాతృప్రపూజితా || ౧౧౬ ||
దస్త్రదైన్యహరా చైవ దస్త్రతాతనిషేవితా |
దస్త్రపితృశతజ్యొతిర్దస్త్రకౌశలదాయినీ || ౧౧౭ ||
దశశీర్షారిసహితా దశశీర్షారికామినీ |
దశశీర్షపురీ దేవీ దశశీర్షసభాజితా || ౧౧౮ ||
దశశీర్షారిసుప్రీతా దశశీర్షవధుప్రియా |
దశశీర్షశిరశ్‍ఛేత్రీ దశశీర్షనితమ్బినీ || ౧౧౯ ||
దశశీర్షహరప్రాణా దశశిర్షహరాత్మికా |
దశశిర్షహరారాధ్యా దశశీర్షారివన్దితా || ౧౨ఓ ||
దశశీర్షారిసుఖదా దశశీర్షకపాలినీ |
దశశీర్షఙ్ఞానదాత్రీ దశశీర్షారిగేహినీ || ౧౨౧ ||
దశశీర్షవధొపాత్తశ్రీరామచన్ద్రరూపతా |
దశశీర్షరాష్ట్రదేవీ దశశీర్షారిసారిణీ || ౧౨౨ ||
దశశీర్షభ్రాతృతుష్టా దశశీర్షవధూప్రియా |
దశశీర్షవధూప్రాణా దశశీర్షవధూరతా || ౧౨౩ ||
దైత్యగురురతా సాధ్వీ దైత్యగురుప్రపూజితా |
దైత్యగురూపదేష్ట్రీ చ దైత్యగురునిషేవితా || ౧౨౪ ||
దైత్యగురుమతప్రాణా దైత్యగురుతాపనాశినీ |
దురన్తదుఃఖశమనీ దురన్తదమనీ తమీ || ౧౨౫ ||
దురన్తశొకశమనీ దురన్తరొగనాశినీ |
దురన్తవైరిదమనీ దురన్తదైత్యనాశినీ || ౧౨౬ ||
దురన్తకలుషఘ్నీ చ దుష్కృతిస్తొమనాశినీ |
దురాశయా దురాధారా దుర్జయా దుష్టకామినీ || ౧౨౭ ||
దర్శనీయా చ దృశ్యా చా‌உదృశ్యా చ దృష్టిగొచరా |
దూతీయాగప్రియా దుతీ దూతీయాగకరప్రియా || ౧౨౮ ||
దుతీయాగకరానన్దా దూతీయాగసుఖప్రదా |
దూతీయాగకరాయాతా దుతీయాగప్రమొదినీ || ౧౨౯ ||
దుర్వాసఃపూజితా చైవ దుర్వాసొమునిభావితా |
దుర్వాసొ‌உర్చితపాదా చ దుర్వాసొమౌనభావితా || ౧౩ఓ ||
దుర్వాసొమునివన్ద్యా చ దుర్వాసొమునిదేవతా |
దుర్వాసొమునిమాతా చ దుర్వాసొమునిసిద్ధిదా || ౧౩౧ ||
దుర్వాసొమునిభావస్థా దుర్వాసొమునిసేవితా |
దుర్వాసొమునిచిత్తస్థా దుర్వాసొమునిమణ్డితా || ౧౩౨ ||
దుర్వాసొమునిసఞ్చారా దుర్వాసొహ్రదయఙ్గమా |
దుర్వాసొహ్రదయారాధ్యా దుర్వాసొహ్రత్సరొజగా || ౧౩౩ ||
దుర్వాసస్తాపసారాధ్యా దుర్వాసస్తాపసాశ్రయా |
దుర్వాసస్తాపసరతా దుర్వాసస్తాపసేశ్వరీ || ౧౩౪ ||
దుర్వాసొమునికన్యా చ దుర్వాసొ‌உద్భుతసిద్ధిదా |
దరరాత్రీ దరహరా దరయుక్తా దరాపహా || ౧౩౫ ||
దరఘ్నీ దరహన్త్రీ చ దరయుక్తా దరాశ్రయా |
దరస్మేరా దరపాఙ్గీ దయాదాత్రీ దయాశ్రయా || ౧౩౬ ||
దస్త్రపూజ్యా దస్త్రమాతా దస్త్రదేవీ దరొన్మదా |
దస్త్రసిద్ధా దస్త్రసంస్థా దస్త్రతాపవిమొచినీ || ౧౩౭ ||
దస్త్రక్షొభహరా నిత్యా దస్త్రలొకగతాత్మికా |
దైత్యగుర్వఙ్గనావన్ద్యా దైత్యగుర్వఙ్గనాప్రియా || ౧౩౮ ||
దైత్యగుర్వఙ్గనావన్ద్యా దైత్యగుర్వఙ్గనొత్సుకా |
దైత్యగురుప్రియతమా దేవగురునిషేవితా || ౧౩౯ ||
దేవగురుప్రసూరూపా దేవగురుకృతార్హణా |
దేవగురుప్రేమయుతా దేవగుర్వనుమానితా || ౧౪ఓ ||
దేవగురుప్రభావఙ్ఞా దేవగురుసుఖప్రదా |
దేవగురుఙ్ఞానదాత్రీ దేవగురూప్రమొదినీ || ౧౪౧ ||
దైత్యస్త్రీగణసమ్పూజ్యా దైత్యస్త్రీగణపూజితా |
దైత్యస్త్రీగణరూపా చ దైత్యస్త్రీచిత్తహారిణీ || ౧౪౨ ||
దేవస్త్రీగణపూజ్యా చ దేవస్త్రీగణవన్దితా |
దేవస్త్రీగణచిత్తస్థా దేవస్త్రీగణభూషితా || ౧౪౩ ||
దేవస్త్రీగణసంసిద్ధా దేవస్త్రీగణతొషితా |
దేవస్త్రీగణహస్తస్థచారుచామరవీజితా || ౧౪౪ ||
దేవస్త్రీగణహస్తస్థచారుగన్ధవిలేపితా |
దేవాఙ్గనాధృతాదర్శదృష్ట్యర్థముఖచన్ద్రమా || ౧౪౫ ||
దేవాఙ్గనొత్సృష్టనాగవల్లీదలకృతొత్సుకా |
దేవస్త్రీగణహస్తస్థదిపమాలావిలొకనా || ౧౪౬ ||
దేవస్త్రీగణహస్తస్థధూపఘ్రాణవినొదినీ |
దేవనారీకరగతవాసకాసవపాయినీ || ౧౪౭ ||
దేవనారీకఙ్కతికాకృతకేశనిమార్జనా |
దేవనారీసేవ్యగాత్రా దేవనారీకృతొత్సుకా || ౧౪౮ ||
దేవనారివిరచితపుష్పమాలావిరాజితా |
దేవనారీవిచిత్రఙ్గీ దేవస్త్రీదత్తభొజనా |
దేవస్త్రీగణగీతా చ దేవస్త్రీగీతసొత్సుకా |
దేవస్త్రీనృత్యసుఖినీ దేవస్త్రీనృత్యదర్శినీ || ౧౫ఓ ||
దేవస్త్రీయొజితలసద్రత్నపాదపదామ్బుజా |
దేవస్త్రీగణవిస్తీర్ణచారుతల్పనిషేదుషీ || ౧౫౧ ||
దేవనారీచారుకరాకలితాఙ్ఘ్ర్యాదిదేహికా |
దేవనారీకరవ్యగ్రతాలవృన్దమరుత్సుకా || ౧౫౨ ||
దేవనారీవేణువీణానాదసొత్కణ్ఠమానసా |
దేవకొటిస్తుతినుతా దేవకొటికృతార్హణా || ౧౫౩ ||
దేవకొటిగీతగుణా దేవకొటికృతస్తుతిః |
దన్తదష్ట్యొద్వేగఫలా దేవకొలాహలాకులా || ౧౫౪ ||
ద్వేషరాగపరిత్యక్తా ద్వేషరాగవివర్జితా |
దామపూజ్యా దామభూషా దామొదరవిలాసినీ || ౧౫౫ ||
దామొదరప్రేమరతా దామొదరభగిన్యపి |
దామొదరప్రసూర్దామొదరపత్‍నీపతివ్రతా || ౧౫౬ ||
దామొదరా‌உభిన్నదేహా దామొదరరతిప్రియా |
దామొదరా‌உభిన్నతనుర్దామొదరకృతాస్పదా || ౧౫౭ ||
దామొదరకృతప్రాణా దామొదరగతాత్మికా |
దామొదరకౌతుకాఢ్యా దామొదరకలాకలా || ౧౫౮ ||
దామొదరాలిఙ్గితాఙ్గీ దామొదరకుతుహలా |
దామొదరకృతాహ్లాదా దామొదరసుచుమ్బితా || ౧౫౯ ||
దామొదరసుతాకృష్టా దామొదరసుఖప్రదా |
దామొదరసహాఢ్యా చ దామొదరసహాయినీ || ౧౬ఓ ||
దామొదరగుణఙ్ఞా చ దామొదరవరప్రదా |
దామొదరానుకూలా చ దామొదరనితమ్బినీ || ౧౬౧ ||
దామొదరబలక్రీడాకుశలా దర్శనప్రియా |
దామొదరజలక్రీడాత్యక్తస్వజనసౌహ్రదా || ౧౬౨ ||
దమొదరలసద్రాసకేలికౌతుకినీ తథా |
దామొదరభ్రాతృకా చ దామొదరపరాయణా || ౧౬౩ ||
దామొదరధరా దామొదరవైరవినాశినీ |
దామొదరొపజాయా చ దామొదరనిమన్త్రితా || ౧౬౪ ||
దామొదరపరాభూతా దామొదరపరాజితా |
దామొదరసమాక్రాన్తా దామొదరహతాశుభా || ౧౬౫ ||
దామొదరొత్సవరతా దామొదరొత్సవావహా |
దామొదరస్తన్యదాత్రీ దామొదరగవేషితా || ౧౬౬ ||
దమయన్తీసిద్ధిదాత్రీ దమయన్తీప్రసాధితా |
దయమన్తీష్టదేవీ చ దమయన్తీస్వరూపిణీ || ౧౬౭ ||
దమయన్తీకృతార్చా చ దమనర్షివిభావితా |
దమనర్షిప్రాణతుల్యా దమనర్షిస్వరూపిణీ || ౧౬౮ ||
దమనర్షిస్వరూపా చ దమ్భపూరితవిగ్రహా |
దమ్భహన్త్రీ దమ్భధాత్రీ దమ్భలొకవిమొహినీ || ౧౬౯ ||
దమ్భశీలా దమ్భహరా దమ్భవత్పరిమర్దినీ |
దమ్భరూపా దమ్భకరీ దమ్భసన్తానదారిణీ || ౧౭ఓ ||
దత్తమొక్షా దత్తధనా దత్తారొగ్యా చ దామ్భికా |
దత్తపుత్రా దత్తదారా దత్తహారా చ దారికా || ౧౭౧ ||
దత్తభొగా దత్తశొకా దత్తహస్త్యాదివాహనా |
దత్తమతిర్దత్తభార్యా దత్తశాస్త్రావబొధికా || ౧౭౨ ||
దత్తపానా దత్తదానా దత్తదారిద్ర్యనాశినీ |
దత్తసౌధావనీవాసా దత్తస్వర్గా చ దాసదా || ౧౭౩ ||
దాస్యతుష్ట దాస్యహరా దాసదాసీశతప్రదా |
దారరూపా దారవాస దారవాసిహ్రదాస్పదా || ౧౭౪ ||
దారవాసిజనారాధ్యా దారవాసిజనప్రియా |
దారవాసివినిర్నీతా దారవాసిసమర్చితా || ౧౭౫ ||
దారవాస్యాహ్రతప్రాణా దారవాస్యరినాశినీ |
దారవాసివిఘ్నహరా దారవాసివిముక్తిదా || ౧౭౬ ||
దారాగ్నిరూపిణీ దారా దారకార్యరినాశినీ |
దమ్పతీ దమ్పతీష్టా చ దమ్పతీప్రాణరూపికా || ౧౭౭ ||
దమ్పతీస్నేహనిరతా దామ్పత్యసాధనప్రియా |
దామ్పత్యసుఖసేనా చ దామ్పత్యసుఖదాయినీ || ౧౭౮ ||
దమ్పత్యాచారనిరతా దమ్పత్యామొదమొదితా |
దమ్పత్యామొదసుఖినీ దామ్పత్యాహ్లదకారిణీ || ౧౭౯ ||
దమ్పతీష్టపాదపద్మా దామ్పత్యప్రేమరూపిణీ |
దామ్పత్యభొగభవనా దాడిమీఫలభొజినీ || ౧౮ఓ ||
దాడిమీఫలసన్తుష్టా దాడిమీఫలమానసా |
దాడిమీవృక్షసంస్థానా దాడిమీవృక్షవాసినీ || ౧౮౧ ||
దాడిమీవృక్షరూపా చ దాడిమీవనవాసినీ |
దాడిమీఫలసామ్యొరుపయొధరసమన్వితా || ౧౮౨ ||
దక్షిణా దక్షిణారూపా దక్షిణారూపధారిణీ |
దక్షకన్యా దక్షపుత్రీ దక్షమాతా చ దక్షసూః || ౧౮౩ ||
దక్షగొత్రా దక్షసుతా దక్షయఙ్ఞవినాశినీ |
దక్షయఙ్ఞనాశకర్త్రీ దక్షయఙ్ఞాన్తకారిణీ || ౧౮౪ ||
దక్షప్రసూతిర్దక్షేజ్యా దక్షవంశైకపావనీ |
దక్షాత్మజ దక్షసూనూర్దక్షజా దక్షజాతికా || ౧౮౫ ||
దక్షజన్మా దక్షజనుర్దక్షదేహసముద్భవా |
దక్షజనిర్దక్షయాగధ్వంసినీ దక్షకన్యకా || ౧౮౬ ||
దక్షిణాచారనిరతా దక్షిణాచారతుష్టిదా |
దక్షిణాచారసంసిద్ధా దక్షిణాచారభావితా || ౧౮౭ ||
దక్షిణాచారసుఖినీ దక్షిణాచారసాధితా |
దక్షిణాచారమొక్షాప్తిర్దక్షిణాచారవన్దితా || ౧౮౮ ||
దక్షిణాచారశరణా దక్షిణాచారహర్షితా |
ద్వారపాలప్రియా ద్వారవాసినీ ద్వారసంస్థితా || ౧౮౯ ||
ద్వారరూపా ద్వారసంస్థా ద్వారదేశనివాసినీ |
ద్వారకరీ ద్వారధాత్రీ దొషమాత్రవివర్జితా || ౧౯ఓ ||
దొషాకరా దొషహరా దొషరాశివినాశినీ |
దొషాకరవిభూషాఢ్యా దొషాకరకపలినీ || ౧౯౧ ||
దొషాకరసహస్త్రాభా దొషాకరసమాననా |
దొషాకరముఖీ దివ్యా దొషాకరకరాగ్రజా || ౧౯౨ ||
దొషాకరసమజ్యొతిర్దొషాకరసుశీతలా |
దొషాకరశ్రేణీ దొషసదృశాపాఙ్గవీక్షణా || ౧౯౩ ||
దొషాకరేష్టదేవీ చ దొషాకరనిషేవితా |
దొషాకరప్రాణరూపా దొషాకరమరీచికా || ౧౯౪ ||
దొషాకరొల్లసద్భాలా దొషాకరసుహర్షిణీ |
దొషకరశిరొభూషా దొషకరవధూప్రియా || ౧౯౫ ||
దొషాకరవధూప్రాణా దొషాకరవధూమతా |
దొషాకరవధూప్రీతా దొషాకరవధూరపి || ౧౯౬ ||
దొషాపూజ్యా తథా దొషాపూజితా దొషహారిణీ |
దొషాజాపమహానన్దా దొషాజపపరాయణా || ౧౯౭ ||
దొషాపురశ్చారరతా దొషాపూజకపుత్రిణీ |
దొషాపూజకవాత్సల్యకరిణీ జగదమ్బికా || ౧౯౮ ||
దొషాపూజకవైరిఘ్నీ దొషాపూజకవిఘ్నహ్రత్ |
దొషాపూజకసన్తుష్టా దొషాపూజకముక్తిదా || ౧౯౯ ||
దమప్రసూనసమ్పూజ్యా దమపుష్పప్రియా సదా |
దుర్యొధనప్రపూజ్యా చ దుఃశసనసమర్చితా || ౨ఓఓ ||
దణ్డపాణిప్రియా దణ్డపాణిమాతా దయానిధిః |
దణ్డపాణిసమారాధ్యా దణ్డపాణిప్రపూజితా || ౨ఓ౧ ||
దణ్డపాణిగృహాసక్తా దణ్డపాణిప్రియంవదా |
దణ్డపాణిప్రియతమా దణ్డపాణిమనొహరా || ౨ఓ౨ ||
దణ్డపాణిహ్రతప్రాణా దణ్డపాణిసుసిద్ధిదా |
దణ్డపాణిపరామృష్టా దణ్డపాణిప్రహర్షితా || ౨ఓ౩ ||
దణ్డపాణివిఘ్నహరా దణ్డపాణిశిరొధృతా |
దణ్డపాణిప్రాప్తచర్యా దణ్డపాణ్యున్ముఖి సదా || ౨ఓ౪ ||
దణ్డపాణిప్రాప్తపదా దణ్డపాణివరొన్ముఖీ |
దణ్డహస్తా దణ్డపాణిర్ద్ణ్డబాహుర్దరాన్తకృత్ || ౨ఓ౫ ||
దణ్డదొష్కా దణ్డకరా దణ్డచిత్తకృతాస్పదా |
దణ్డివిద్యా దణ్డిమాతా దణ్డిఖణ్డకనాశినీ || ౨ఓ౬ ||
దణ్డిప్రియా దణ్డిపూజ్యా దణ్డిసన్తొషదాయినీ |
దస్యుపూజ్యా దస్యురతా దస్యుద్రవిణదాయినీ || ౨ఓ౭ ||
దస్యువర్గకృతార్హా చ దస్యువర్గవినాశినీ |
దస్యునిర్ణాశినీ దస్యుకులనిర్ణాశినీ తథా || ౨ఓ౮ ||
దస్యుప్రియకరీ దస్యునృత్యదర్శనతత్పరా |
దుష్టదణ్డకరీ దుష్టవర్గవిద్రావిణీ తథా || ౨ఓ౯ ||
దుష్టవర్గనిగ్రహార్హా దూశకప్రాణనాశినీ |
దూషకొత్తాపజననీ దూషకారిష్టకారిణీ || ౨౧ఓ ||
దూషకద్వేషణకరీ దాహికా దహనాత్మికా |
దారుకారినిహన్త్రీ చ దారుకేశ్వరపూజితా || ౨౧౧ ||
దారుకేశ్వరమాతా చ దారుకేశ్వరవన్దితా |
దర్భహస్తా దర్భయుతా దర్భకర్మవివర్జితా || ౨౧౨ ||
దర్భమయీ దర్భతనుర్దర్భసర్వస్వరూపిణీ |
దర్భకర్మాచారరతా దర్భహస్తకృతార్హణా || ౨౧౩ ||
దర్భానుకూలా దామ్భర్యా దర్వీపాత్రానుదామినీ |
దమఘొషప్రపూజ్యా చ దమఘొషవరప్రదా || ౨౧౪ ||
దమఘొషసమారాధ్యా దావాగ్నిరూపిణీ తథా |
దావాగ్నిరూపా దావాగ్నినిర్ణాశితమహాబలా || ౨౧౫ ||
దన్తదంష్ట్రాసురకలా దన్తచర్చితహస్తికా |
దన్తదంష్ట్రస్యన్దన చ దన్తనిర్ణాశితాసురా || ౨౧౬ ||
దధిపూజ్యా దధిప్రీతా దధీచివరదాయినీ |
దధీచీష్టదేవతా చ దధీచిమొక్షదాయినీ || ౨౧౭ ||
దధీచిదైన్యహన్త్రీ చ దధీచిదరదారిణీ |
దధీచిభక్తిసుఖినీ దధీచిమునిసేవితా || ౨౧౮ ||
దధీచిఙ్ఞానదాత్రీ చ దధీచిగుణదాయినీ |
దధీచికులసమ్భూషా దధీచిభుక్తిముక్తిదా || ౨౧౯ ||
దధీచికులదేవీ చ దధీచికులదేవతా |
దధీచికులగమ్యా చ దధీచికులపూజితా || ౨౨౦ ||
దధీచిసుఖదాత్రీ చ దధీచిదైన్యహారిణీ |
దధీచిదుఃఖహన్త్రీ చ దధీచికులసున్దరీ || ౨౨౧ ||
దధీచికులసమ్భూతా దధీచికులపాలినీ |
దధీచిదానగమ్యా చ దధీచిదానమానినీ || ౨౨౨ ||
దధీచిదానసన్తుష్టా దధీచిదానదేవతా |
దధీచిజయసమ్ప్రీతా దధీచిజపమానసా || ౨౨౩ ||
దధీచిజపపూజాఢ్యా దధీచిజపమాలికా |
దధీచిజపసన్తుష్టా దధీచిజపతొషిణీ || ౨౨౪ ||
దధీచితపసారాధ్యా దధీచిశుభదాయినీ |
దూర్వా దూర్వాదలశ్యామా దుర్వాదలసమద్యుతిః || ౨౨౫ ||
ఫలశ్రుతి
నామ్నాం సహస్త్రం దుర్గాయా దాదీనామితి కీర్తితమ్ |
యః పఠేత్ సాధకాధీశః సర్వసిద్ధిర్లభత్తు సః || ౨౨౬ ||
ప్రాతర్మధ్యాహ్నకాలే చ సన్ధ్యాయాం నియతః శుచిః |
తథా‌உర్ధరాత్రసమయే స మహేశ ఇవాపరః || ౨౨౭ ||
శక్తియుక్తొ మహారాత్రౌ మహావీరః ప్రపూజయేత్ |
మహాదేవీం మకారాద్యైః పఞ్చభిర్ద్రవ్యసత్తమైః || ౨౨౮ ||
యః సమ్పఠేత్ స్తుతిమిమాం స చ సిద్ధిస్వరూపధృక్ |
దేవాలయే శ్‍మశానే చ గఙ్గాతీరే నిజే గృహే || ౨౨౯ ||
వారాఙ్గనాగృహే చైవ శ్రీగురొః సంనిధావపి |
పర్వతే ప్రాన్తరే ఘొరే స్తొత్రమేతత్ సదా పఠేత్ || ౨౩౦ ||
దుర్గానామసహస్త్రం హి దుర్గాం పశ్యతి చక్షుషా |
శతావర్తనమేతస్య పురశ్చరణముచ్యతే || ౨౩౧ ||
|| ఇతి కులార్ణవతన్త్రొక్తం దకారాది శ్రీదుర్గాసహస్రనామస్తొత్రం సమ్పూర్ణమ్ ||