Sunday, 17 March 2019

తెలుసుకుందాము




1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం
చేసుకోరాదు. 
2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి
 క్షవరం చేసుకోరాదు.
3) అన్నదమ్ములు,  తండ్రీకొడుకులు ఒకేరోజు  క్షవరం  చేసుకోరాదు. 
4) భోజనం తిన్న పళ్లెం లో చేయి కడగకూడదు. 
5) నూనె,  ఉప్పు,  చేతికి ఇవ్వరాదు.
6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.  7) సాయంత్రం 5 తర్వాత ఇల్లు  ఊడ్చ కూడదు. 
8) మంచం మీద కూర్చుని తినకూడదు. 
9) తలుపుల మీద బట్టలు వేయకూడదు. 
10) సాయంత్రం చీకటి పడగానే ఇంటి వెనకాల అన్ని తలుపులు వేసి ముందు వాకిలి తెరచి ఇంట్లో
దీపాలు వెలిగించాలి
11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి. 
12) మంగళ -శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు
13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు. వినాయకుడు హనుమంతుడి పటం మంచిది.
14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి. 
15) తెల్లవారి లేవగానే దేవుని పటములు ముందు చూడాలి.  అద్దం లో మీ ముఖం చూసుకోరాదు. 
16) అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి. 
17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు. 
18) ప్రతినెలా కొత్త  రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద శ్రీనివాసుడికి నైవేద్యం గా పెట్టండి.

ఇవి మనం కొన్న యినా పాటిస్తే మన జీవితాలు, మన కుటుంబాలు పిల్లల జీవితాలు బాగుంటాయి.

No comments:

Post a Comment