Sunday 10 March 2019

గృహ స్థలములో వృక్ష నియమాలు





ఒక్క వృక్షము పది మంది సుపుత్రులతో సమానము. అటువంటి పుత్ర సమానమైన వృక్షాలను గృహవరణలో ఏవిధంగా, ఏ దిక్కున పెంచవచ్చునో ఆ నియమాలను వాస్తు శాస్త్రంలో పేర్కొనియున్నరు.
భూమిపైన వివిధ రకాల వృక్ష సంపద ఉన్నది. ఆవృక్షాలన్నింటిని వాటి, వాటి మూల స్వభావాలను అనుసరించి కొన్ని గ్రహాల స్వభావాలను అనుసరించి కొన్ని గ్రహాల యొక్క సృష్టిగా.... ఈ క్రింది పేర్కొన్న విధంగా విశ్లేషించడం జరిగింది....
సూర్యుడు మహావృక్షాలు
చంద్రుడు పాలచెట్టు
కుజుడు కరముగల చెట్లు
గురువు ఫలమునిచ్చే చెట్లు
శుక్రుడు నీరస వృక్షములు
రాహుకేతువులు పుట్టలు మొదలైనవి.
అయితే ఈ చెట్లన్నింటిలోను కొన్ని మాత్రమే గృహావరణలో పెంచుకొవడం వలన మంచి ఫలితాలను పొందే వీలుంటుంది. తూర్పుదిశలో మఱ్రిచెట్టు, దక్షిణ దిశలో అత్తిచెట్టు, పడమర దిశలో జమ్మి చెట్టు, ఉత్తరదిశలో జువ్విచెట్టు, ఈశాన్యంలో రావి చెట్టు, ఆగ్నేయంలో మేడిచెట్టు, నైరుతిలో దుర్వాదుర్శనచెట్టు, వాయువ్యంలో మోదుగచెట్టు ఉన్నట్లైతే ఆ గృహ యజమానికి మేలు జరుగుతుంది. కొబ్బరిచెట్లు, పనసచెట్లు గృహావరణలో ఏ దిక్కున ఉన్నా శుభఫలితాలను ఇస్తాయని పేర్కొనబడినది. అలాగే తూర్పున రావి చెట్టు, దక్షిణా దిశలో దువ్వి చెట్టు, పడమరలో మఱ్రిచెట్టు, ఉత్తరములో అత్తిచెట్టూన్నట్లైతే గృహ యజమానికి కీడు కలుగుతుందని పేర్కొనబడినది. గృహావరణలో ఏ విధమయిన వృక్షాలు ఉండవచ్చునో లేదా ఏ విధమయిన వృక్షాలు వుండకూడదో తెలిపే విషయంలో వివిధ వాస్తు గ్రంథాలలోమతభేదాలున్నాయి.
చింతచెట్టు, మారేడు చెట్టు, తాటి చెట్టు, రేగు చెట్టు, కుంకుడు చెట్టు, కానుగ చెట్టు, మోదుగ చెట్టు, సంపెంగ చెట్టు, గౄహావరణలో ఎక్కడ వున్నా గౄహ యజమానికి కష్టాలు తప్పవంటారు. చెట్ల విషయం లో సాధారణ నియమాలు ఎన్ని ఉన్నప్పటికి మినహాయింపులుకూడా వర్తిస్తాయి.
గృహావరణలో పాలు కారు వృక్షములు (దుగ్ద వృక్షములు) ఉన్న యెడల ద్రవ్యనాశనము కలుగుతుంది.
గృహావరణలో ముళ్ళ చెట్లు ఉన్న యెడల శత్రువృద్ది, శత్రువులచే సంతాపము కలుగుతూ ఉంటుంది.
గృహావరణలో ఫిలే(పండ్ల వృక్షములు) వృక్షములున్న యెడల సంతానమునకు హాని కలుగుతూ ఉంటుంది.
గృహావరణలో గృహానికి దక్షిణ భగములో గానీ, గృహానికి సమీపములో దక్ష్ణ దిక్కునందు గానీ చెంపక వృక్షము, పాటల వృక్షము, కదళి వృక్షము, జాజి, కేతకి వృక్షములున్నట్లైతే ధనధాన్యములకు హాని కలుగుతూ ఉంటుంది. గృహావరణలో కానీ, గృహ సమీపంలో కానీ భూతన మశ్రితములగు వృక్షములున్నట్లైతే వాటిని ఛేదించివేయాలి.
గృహావరణలో ఆగ్నేయమున గాని, గృహ సమీపములో ఆగ్నేయమున గాని, క్షీర వృక్షములు, అశ్వ్త్థ వృక్షములు, రక్త పుష్ప, ద్రుమ, ఖంటక, క్షీర వృక్షములు, షాల్మలి వృక్షము, వుదంబర వృక్షము, జువ్వి చెట్టు.... వీటిలో ఏ వృక్షమున్నను మౄత్యు భయములు, పీడలూ కలుగుతూ ఉంటాయి.

No comments:

Post a Comment