Tuesday 12 February 2019

రధసప్తమి వ్రతము


గణపతిపూజ
ఓం శ్రిగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్,
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి! సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు| అయంముహూర్త సుముహూర్తోఅస్తూ|| యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః| తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే| పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః| ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం| లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం|| సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే| శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||
శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః| ఉమా మహేశ్వరాభ్యాం నమః| వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః| అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః| సర్వేభ్యోమహాజనేభ్యో నమః|
ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
ప్రాణాయామము:
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.
ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
కలశారాధన:
(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).
శ్లో: కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః
మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం
శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)
ప్రాణప్రతిష్ఠ:
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
ధ్యానం:
మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
శుద్దోదక స్నానం:
మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |
వస్త్రం:
మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం:
మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం:
మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |
అక్షతాన్:
మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |
అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.
ధూపం:
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం |
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.
దీపం:
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం |
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||
నైవేద్యం:
మం: ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి ||
తాంబూలం:
ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం |
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం:
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి
మాధవ్యోసనీతి ఏకదా బ్రహ్మణ ముపహరతి
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||
మంత్రపుష్పం:
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షణ నమస్కారం:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.
రధసప్తమి వ్రత పూజాప్రారంభం:
ధ్యానం:
శ్లో: ధ్యేయ స్సదా సవిత్రుమండల మధ్యవర్తీ
నారాయణ స్సర సిజాసన సన్నివిష్టమ్
కేయూర వాన్మకర కుండల వాన్కిరీ టీ
హరీ హిరణ్మయ పుర్ధ్రత శ్మంఖ చక్రః
శ్లో: నమస్సవిత్రే జగదేక చక్షుషే
జగత్ప్రసూతి స్థితినాశ హేతవే
త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే, ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాత్
ఓం రవివారాది దైవత్యం భాస్కరం విశ్వరూపిణమ్,
ఓం హ్రాం మిత్రాయ నమః ధ్యాయామి.
ఓం శ్రీసూర్యాయ నమః ధ్యాయామి - ధ్యానం సర్పయామి.
ఆవాహనం :
శ్లో: రక్తాబ్జ యుగ్మాష భయదానహస్తం కేయూర హారాన్గద కుండలాడ్యం
మాణిక్య మౌళీందిననాడామేడే బంధూక కాంతిం విలసత్రినేత్రం.
ఓం శ్రీసూర్యాయ నమః ఆవాహయామి. ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి.
ఆసనం :
శ్లో || దివాకర నమస్తుభ్యం సర్వలోకైక నాయక,
దివ్య సింహాసనం దేవ స్వీకురుష్వ రవి ప్రభో.
ఓం శ్రీసూర్యాయ నమః నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి||
పాద్యం:
శ్లో || గ్రహరాజ నమస్తుభ్యం పాద్యంగంధాది భిర్యుతం,
స్వచ్చం పాద్యం మయాదత్తం సంగృహాణ దివాకర.
ఓం సూర్యాయ నమః పాదయో పాద్యం సమర్పయామి||
అర్ఘ్యం :
శ్లో: గంగాజలం సమానీతం రక్త పుష్యాది భిర్యుతం,
అర్ఘ్యం గృహాణ భగవన్ మార్తాండాయ నమోనమః.
ఓం సూర్యాయ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనీయం :
శ్లో: పద్మపత్ర జగచ్చక్షుః పద్మాసన సమప్రభ,
ప్రద్యోతన పవిత్రంచ దదామ్యాచ మనం కురు.
ఓం సూర్యాయ నమః ఆచమనీయం సమర్పయామి.
అర్ఘ్యం:
శ్లో; ఏహిసూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే,
అనుకంప్య మయాభక్త్యా గ్రుహార్ఘ్యం నమోస్తుతే.
ఓం శ్రీసూర్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
మధుపర్కం :
శ్లో: మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరాక్షీ ర సంయుతం,
మధుపర్కం గృహాణేదం మయాతుభ్యం సమర్పిత మ్.
ఓం శ్రీ సూర్యాయ నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృత స్నానం :
శ్లో: పంచామృతేన స్నపనం భాస్కర స్య కరో మ్య హ మ్,
నశ్యంతు పంచపాపాని సూర్యదేవ ప్రసాదత.
ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమవ్రుష్ణ్య మ్భ, భవా వాజస్య సంగథే. (పాలు)
ఓం దధి క్రావ్ణో అకారి షం జిష్ణోర శ్వ స్య వాజినః సురభి నో ముఖా కరత్ప్ర ణ ఆయోగ్గ్ షి తారి షత్. (పెరుగు)
ఓం శుక్రమసి, జ్యోతిరసి, తెజోసి దేవోవస్వితాత్పునః, త్వచ్చిద్రేనా పవిత్రేనా వసో సూర్యస్య రశ్మిభి. (నెయ్యి)
ఓం మధువాతా ఋతాయతే మధుక్ష రన్తి సివ్దవః మాద్వీర్న స్సన్త్వో షధీః,
మధునక్త ముతో మధుమత్పార్థి వగ్గ్ రజః మధుద్యౌ రన్తు నః పితా
మధుమాన్నో వన స్పతిర్మధుమాం అస్తు సూర్యః మాధ్వి ర్గావో భవస్తు వః. (తేనే)
ఓం స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే,
స్వాదుమిత్రాయ వరునాయ వాయవే, బృహస్పతయే మధుమాగుం అదాభ్యః (పంచదార)
ఓం శ్రీ సూర్యాయ నమః పంచామృత స్నానం సమర్పయామి.
శుద్దోదక స్నానం :
శ్లో: గంగాజలం సమానీతం గంధ కర్పూర సంయుతం
స్నాపయామిత్రి లోకేశ గృహ్యతాం వైదివాకర
ఓం శ్రీ సూర్యాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం:
శ్లో: దివాకర నమస్తుభ్యం పాపం నాశయ భాస్కర
రక్త వస్త్ర మిదం దేవ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
ఓం సూర్యాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం :
శ్లో: అహః పతే నమస్తుభ్యం తీ క్ ష్ణాం శు పతయే నమః
ఉపవీతం మయాదత్తం సంగృహాణ దివాకర.
ఓం శ్రీసూర్యాయ నమః ఉపవీతం సమర్పయామి.
గంధం:
శ్లో: గోరోచన సమాయుక్తం క స్తూర్యాది సమన్వితం,
గంధం దాస్యామి దేవేశ సంగృహాణ దివాకర.
ఓం శ్రీసూర్యాయ నమః గంధాన్ సమర్పయామి.
అక్షతాన్:
శ్లో: అక్షతాన్ దేవదేవేశ రక్త గంధ సమన్వితా న్
గృహాణ సర్వలోకేశ మయాదత్తాన్ సురేశ్వర.
ఓం శ్రీసూర్యాయ నమః అక్షతాన్ సమర్పయామి.
సర్వాభరణాని :
శ్లో: రక్త మాణిక్య సంయుక్తం భూషణాని విశేషతః
మాయాదత్తాని గృహ్ణీ ష్వ పద్మ గర్భ సముద్యతే.
శ్రీ సూర్యాయ నమః సర్వాభరణం సమర్పయామి.
పుష్ప సమర్పణ :
శ్లో: రక్త వర్ణాని పుష్పాణి పద్మాని వివిధాని చ,
మల్లికాదీని పుష్పాణి గృహాణ సుర పూజిత.
ఓం శ్రీ సూర్యాయ నమః పుష్పాణి సమర్పయామి.
అథాంగ పూజ:
ఓం శ్రీ సూర్యాయ నమః పాదౌ పూజయామి
ఓం శ్రీ దివాకరాయ నమః జంఘే పూజయామి
ఓం శ్రీ ప్రభాకరాయ నమః జానుయుగ్మం పూజయామి
ఓం శ్రీ భాస్కరాయ నమః ఊరూ పూజయామి
ఓం శ్రీ జగన్నాథాయ నమః కటిం పూజయామి
ఓం శ్రీ త్రయీమయాయ నమః నాభిం పూజయామి
ఓం శ్రీ ఆదిత్యాయ నమః కుక్షిం పూజయామి
ఓం శ్రీ ద్యమణయే నమః వక్ష స్థలం పూజయామి
ఓం శ్రీ సుబాహవే నమః బాహూ పూజయామి
ఓం శ్రీ రవయే నమః పార్స్వౌ పూజయామి
ఓం శ్రీ జ్యోతిషాంపతయే నమః భుజా పూజయామి
ఓం శ్రీ త్ర్యైలోక్యాయ నమః కంటం పూజయామి
ఓం శ్రీ తిమిరాపహరాయ నమః ముఖం పూజయామి
ఓం శ్రీ దివ్య చక్షుషే నమః నేత్రే పూజయామి
ఓం శ్రీ మణికుండలాయ నమః కర్ణౌ పూజయామి
ఓం శ్రీ పద్మాక్షాయ నమః లలాటం పూజయామి
ఓం శ్రీ భానవే నమః శిరః పూజయామి
ఓం శ్రీ సర్వాత్మనే నమః సర్వాంగణ్యాని పూజయామి.
శ్రీ సూర్యా ష్టోత్తర శత నామావళి :
ఓం అరుణాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం కరుణారససిన్ధవే నమః
ఓం అసమాన బలాయ నమః
ఓం ఆర్తరక్షకాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం ఆదిభూతాయ నమః
ఓం అఖిలాగమవేదినే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అఖిలజ్ఞాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం ఇవాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం ఇజ్యాయ నమః
ఓం ఇన్ద్రాయ నమః
ఓం భానవే నమః
ఓం ఇన్ది రామన్దిర స్థాయ నమః
ఓం వన్దనాయాయ నమః
ఓం ఈశాయ నమః
ఓం సుప్రసననాయ నమః
ఓం సుశీలాయ నమః
ఓం సువర్చసే నమః
ఓం వసుప్రదాయ నమః
ఓం వసవే నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ఉజ్జ్వలాయ నమః
ఓం ఉగ్రరూపాయ నమః
ఓం ఊర్ధ్వగాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం ఉద్యత్కిరణ జాలాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం ఊర్జస్వలాయ నమః
ఓం వీర్యాయ నమః
ఓం నిర్జయాయ నమః
ఓం జయాయ నమః
ఓం ఊరుద్వయాభారూప నమః
యుక్తసారథయే నమః
ఓం ఋషిచక్ర చరాయ నమః
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః
ఓం నిత్య స్తుత్యాయ నమః
ఓం ఋకారా మాత్రుకావర్ణ రూపాయ నమః
ఓం ఉజ్వలతేజసే నమః
ఓం ఋక్ష్యాదినాధ మిత్రాయ నమః
ఓం పుష్కరాక్షాయ నమః
ఓం లుప్తదన్తాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం కాన్తిదాయ నమః
ఓం ఘనాయ నమః
ఓం కనత్కనక భూషాయ నమః
ఓం ఖద్యోతాయ నమః
ఓం లునితాఖిలదేత్యా నమః
ఓం సత్యానన్ద స్వరూపిణే నమః
ఓం అపవర్గ ప్రదాయ నమః
ఓం ఆర్త శరణ్యాయ నమః
ఓం ఏకాకినే నమః
ఓం భగవతే నమః
ఓం సృష్టి స్థిత్యంత కారిణే నమః
ఓం గుణాత్మనే నమః
ఓం ఘ్రుణి భ్రుతే నమః
ఓం బృహతే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం ఐశ్వర్య దాయ నమః
ఓం శ ర్వాయ నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం శౌరయే నమః
ఓం దసదిక్స ప్రకాశాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం ఓజస్కరాయ నమః
ఓం జయినే నమః
ఓం జగదానన్ద హేతవే నమః
ఓం జన్మ మృత్యు జరావ్యాధి నమః
ఓం వర్జితాయ నమః
ఓం ఉచ్ఛస్థాన సమారూఢ రథస్థాయ నమః
ఓం అసురారయే నమః
ఓం కమనీయకరాయ నమః
ఓం ఆజ్జ వల్లభాయ నమః
ఓం అన్తర్బహిః ప్రకాశాయ నమః
ఓం అచిన్త్యాయ నమః
ఓం ఆత్మరూపిణే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అమరేశాయ నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం ఆహాస్కరాయ నమః
ఓం రవయే నమః
ఓం హరయే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం తరుణాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం గ్రహణాం పతయే నమః
ఓం భాస్కరాయ నమః
ఓం ఆదిమధ్యాన్త రహితాయ నమః
ఓం సౌఖ్య ప్రదాయ నమః
ఓం సకలజగాతాం పతయే నమః
ఓం సూర్యాయ నమః
ఓం కవయే నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం తేజోరూపాయ నమః
ఓం శ్రీం హిరణ్య గర్భాయ నమః
ఓం హ్రీం సంపత్కరాయ నమః
ఓం ఐం ఇష్టార్దదాయ నమః
ఓం సుప్రసన్నాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం శ్రేయసే నమః
ఓం భక్తకోటి సౌఖ్య ప్రదాయినే నమః
ఓం నిఖిలాగమనే నమః
ఓం నిత్యానన్దాయ నమః
ఓం ఉషాఛాయాదేవి సమేత శ్రీ సూర్యనారాయణస్వామినే నమః
శ్రీ సూర్యనారాయణస్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.
ధూపం:
శ్లో: ధూపం గృహాణదే వేశ సర్వసౌభాగ్యదాయక
మయానివేదితం తుభ్యం గ్రహరాజ నమోస్తుతే
ఓం శ్రీసూర్యాయ నమః దూపమాగ్రాపయామి.
దీపం:
శ్లో: అజ్ఞాన నాశనం దేవ సర్వసిద్ద ప్రదోభవ,
సకర్పూ రాజ్యదీ పంచ సంగృహాణ దివాకర.
ఓం శ్రీసూర్యాయ నమః దీపం దర్శయామి
నైవేద్యం:
శ్లో: పరమాన్నంచ నైవేద్యం సఫలంచ సశర్కరం,
గృహాణ సర్వలోకేశ మయాదత్తం సురేశ్వర.
ఓం శ్రీ సూర్యాయ నమః నైవేద్యం సమర్పయామి.
తాంబూలం :
శ్లో: సపూగీ ఫల కర్పూరం నాగవల్లీ దళై ర్యుతం,
ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్.
ఓం శ్రీసూర్యాయ నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
శ్లో: నీరాజనం సుమంగళ్యం నమస్తే దివ్య తేజసే,
ఇదం గృహాణ దేవేశ మంగళం కురుభాస్కర.
ఓం శ్రీసూర్యాయ నమః కర్పూర నీరాజనం దర్శయామి.
మంత్రపుష్పం :
శ్లో: భాస్కరాయ విద్మహే మహాద్ద్యుతిక రాయ ధీమహి,
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.
శ్లో: ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి,
తన్నః స్సూర్యః ప్రచోదయాత్.
ఓం శ్రీసూర్యాయ నమః మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణం :
శ్లో: ప్రదక్షిణం కరిష్యామి సర్వపాప ప్రణాశన,
సర్వాభీష్ట ఫలందేహి నమస్తే లోకభాంధవ.
శ్లో: చ్చాయా సంజ్ఞా సమేతాయ రవయేలోక సాక్షిణే,
హరయే నూరు సూతాయ సప్తాశ్వాయ నామోనమః.
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ ప్రభాకర.
ఓం శ్రీసూర్యాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
పునఃపూజ:
ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి,నృత్యం దర్శయామి,గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార,శక్త్యోపచార,భక్త్యోపచార పూజాం సమర్పయామి
శ్లో: యస్య స్మ్రు త్యాచ నామోక్త్యా త పం పూజా క్రియాది షు
యానం సంపూర తాంయాతి సద్యో వందే మహేశ్వరం
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే.
అనేనా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః, సర్వం శ్రీ సూర్యనారాయణ దేవతార్పనమస్తూ.
రథ సప్తమీ వ్రతకథ
యుధిష్టిరుడు శ్రీ కృష్ణుని ఈ విధంగా అడిగెను.
"ఓ కృష్ణా! రథసప్తమినాడు చేయవలసిన విధివిధానము నాకు తెలియజేయుము అనగా .........
శ్రీ కృష్ణుడిలా జవాబిచ్చెను.
శ్లో|| అత్ర వ్రతే షష్ట్యామేక భుక్త్వం కృత్వా సప్తమ్యామరుణో దయ వేళాయాం -
శిష్టాచారాత్ సప్తార్క పర్ణాని సప్తబదరీ పత్రాణి వాశిర సినిధాయ ||
మాఘ శుద్ధ షష్టి రోజున స్నానం చేసికొని,దేవపూజ నిర్వర్తించి సూర్యాలయానికి వెళ్లి భగవానుణ్ణి ఆరాధించాలి.రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి.తరువాత సప్తమినాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి, మంటపం మధ్యనుంచి కుంకుమ గంధాక్షతలతో పూజించి, పూలహారాలతో అలంకరించి,సంపూర్ణ లక్షణమైన సూర్యవిగ్రహాన్ని రథంలో ఉంచి అర్పించాలి.నివేదన చేయాలి.రాత్రి జాగారం చేసి (నిదుర పోకుండా మేలుకొని) అష్టమినాడు ఉదయాన్నే స్నానంచేసి బ్రాహ్మణులకు కోరిన దానాలివ్వాలి.ఆ రథాన్ని, రెండు రక్త వస్త్రాలను (ఎర్రని వస్త్రాలను), రక్త వర్ణపు (ఎర్రని) ఆవునూ గురువుకు దానమివ్వాలి.ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదంవల్ల నీ కుమారుడు మహాతేజస్వి అవుతాడు. అపూర్వ బలపరాక్రమవంతుడై సమస్త భోగాలను అనుభవించి, నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది,అక్కడ ఒక కల్ప పర్యంతం ఉండి,తరువాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకనూ ఈరోజున (రథసప్తమి రోజున) సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన (నైవేద్యం) చెయ్యాలి. ఈ ప్రసాదాన్నే ఎందుకు నివేదన చెయ్యాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్ష యజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామమీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు.వీరభద్రుడి వీరవిహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భములోనే సూర్యుడికి పళ్లన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే సూర్య దేవుడికి అమూల్యమైన ప్రసాదం క్షీరాన్నం అని చెబుతారు. ఈ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు.అని ఈ విధంగా చెప్పిన కృష్ణునితో యుధిష్ఠిరుడు ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పియుంటివి. ఇంతకుముందు భూలోకములో ఎవరు ఈ వ్రతమును ఆచరించి అట్లు ఆ వ్రతఫలము యెవ్వరి కైననూ ప్రాప్తించినదా? అని పలుకగా కృష్ణుడు ఈ వ్రతమును గురించిన కథను ఈ విధముగా చెప్పసాగెను.
రథసప్తమీవ్రతం ఆచరిస్తే చక్రవర్తి పదవివస్తుందని నిరూపించే కథ భవిష్య పురాణంలో ఉన్నది. దీన్ని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు తెలియజేసెను. కాంభోజ దేశమున యశోవర్తి యను చక్రవర్తి యుండెను. ఆయన వ్రుద్ధాప్యమున పరిపాకము (చేసిన పాపములయొక్క ఫలము) ఎందువలన కల్గెనో తెలుపవలసినదిఅని ఒక్కనొక బ్రాహ్మణశ్రేష్టుని అడిగెను.అట్లడిగిన రాజుతో 'ఓ రాజా! వీరువీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులై (పిసినారులై) యుండిరి.అందుచేత వీరిట్టి రోగములకు గురికావలసిన వారైరి. వారి రోగనివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆవిధముగా వారావ్రతము చూచినంత మాత్రమున దాని మహాత్యముచే వారి పాపములు పోవును.గాన, వ్యాధితో భాదపడువారిని గొనివచ్చి ఆవ్రత వైభవము వారికి చూపవలెను.'అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు 'అయ్యా! ఆ వ్రాత మెట్లు చేయవలెనో దాని విధి విధాన మేమో తెలుపుడని ప్రార్దించెన.' అందులకా బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరుగల వ్రతము సర్వులూ ఆచరించదగినది. ఆవ్రత ప్రభావమున సకల పాపములూ హరించి, చక్రవర్తిత్వము గల్గును. ఆవ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము.
మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్టి దినమున గృహస్తు (యజమాని) యీ వ్రాతమాచరింతునని తలవవలెను.పవిత్ర జలములుగల నదులలోగాని, చెరువునందు గాని,నూతియందుగాని తెల్లనినువ్వులతో విధివిధానముగా స్నాన మాచరించవలెను లేదా ఇలవేలుపులకు,కులవేలుపులకు,ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి,పుష్పములు,ధూపములు,దీపములు, అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను.పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి,అతిథులతో సేవకులతో,బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారంగతులగు విప్రులను పిలిపించి,సూర్యభగవానుని విగ్రహాన్ని నియమము ప్రకారము పూజించి,సప్తమితిథి రోజున నిరాహారుడై, భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము 'ఓ జగన్నాథుడా! నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయించవలసినదిగా వేడుచున్నాను.అని వుచ్చరించుచూ,తన చేతిలో గల జలమును, నీటిలో విడువవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి, బ్రాహ్మణులు,తానూ గృహమున నేలపై నారాత్రి శయనించి జితేంద్రియుడై యుండి,ఉదయమున లేచి,నిత్యకృత్యము లాచరించి శుచియై యుండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దీపమాలికలతోను, చిరుగంటలతోను, సర్వోపచారాలతోను తయారుచేసి,సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని,వెండితో గాని గుర్రాలను,రథ సారధినీ, రథమునూ తయారుచేసి మధ్యాహ్నవేళ స్నానాదికములను నిర్వర్తించుకొనవలెను. వదరుబోతులను, పాషండులను, దుష్టులను,విడిచిపెట్టి ప్రాజ్ఞులు, సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను.
పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మాణావాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను.కుంకుమతోను,సుగంధ ద్రవ్యములతోను,పుష్పములతోను పూజించి, రథమున నున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు.లోభియై ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించనిచో వ్రతము వైఫల్యమును,దానివలన మనస్సు వికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని,రథసారధిని అందుగల సూర్యభగవానునీ, పుష్ప,ధూప,గంధ,వస్త్ర,అలంకార,భూషనాదులు నానావిధ ఫల భక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను.
ఓ భాస్కరా! దివాకరా! ఆదిత్యా! మార్తాండ! గ్రహదిపా! అపాంనిథే! జగద్రక్షకా! భూతభావనా! భూతేశ! భాస్కరా! ఆర్త త్రాణ పరాయణా! హరా! ఆచింత్యా! విశ్వసంచారా! విభో ! హే విష్ణో ! ఆదిభూతేశా ! ఆది మధ్యాన్త రహితా! భాస్కరా! ఓ జగత్పతే! భక్తిలేకున్నను, క్రియాశున్యమయినను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము " పైవిధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్ధించవలెను.
ధనహీనుడయినను, విధిప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధరకాల రంగులతో లిఖించిన బొమ్మలు,ఏడు అయిన జిల్లేడు పత్రములతో సూర్యభగవానుని శక్తికొలదీ పూర్వము చెప్పినట్లు విధివిధానముగా పూజించవలెను. పురాణ, శ్రవణ, మంగళ గీతాలతో మంగళ వాద్యాలతో ఆరాత్రి జాగరణ చేసి, పుణ్య కథలను వినవలెను.పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానము చేయుచు ప్రాతః కాలమున లేచి స్నానకృత్యమును నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి,వివిధ రత్నభూషణములతో, ధ్యానాదులతో, వస్త్రాలతో,తృప్తి పరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును. అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యధాశక్తి దానము నీయవలెను. ఈ రథమును తమ పురోహితులయిన గురుదేవులకు రక్త(ఎర్ర రంగు) వస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆవిధంగా చేసినచో యెందుకు జగత్పతి గాకుండును?కాన, సర్వయత్నములచేతనూ రథసప్తమి వ్రాత మాచరించవలెను. దానివలన భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు,బలపరాక్రమవంతులు అయి విపుల భోగములననుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసికొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రులను బడసి చివరగా సూర్యలోకము చేరుదురు. అక్కడ ఒక కల్పకాలముండి చక్రవర్తిగా జన్మించి ఆ పదవిననుభవించును.
శ్రీ కృష్ణుడు చెప్పుచున్నాడు:
ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తనదారిని తాను పోయెను.రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్టుడుపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములన నుభవించెను. ఈవిధముగా ఆరాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి.ఈ కథను భక్తితో యెవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథీ గుర్రాలతో గూడుకోనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమిరోజున యెవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు.
*ఇతి రథసప్తమీ వ్రత కథా సంపూర్ణం.*



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment