Sunday 10 February 2019

వసంత పంచమి


అక్షరాల అధి దేవత, సకల విద్యల రాణి, జ్ఞానప్రదాయిని సరస్వతీ దేవి. ఈ రోజును‌ *సరస్వతీ* *జయంతి* అనీ మదన పంచమి అనీ వ్యవహరిస్తారు.‌ ఈ దేవి శుంభ, నిశుంభులను సంహరించింది. తెల్లటి వస్త్రాలు, తెల్లని పుష్పాలు, తెల్లటి ముత్యాల సరాలు, తెల్లటి వీణ సరస్వతికి ఇష్టమైనవి. అవి *శాంతికి* , *స్వచ్చతకూ* సంకేతాలు. *యాకుందేందు తుషారహార ధవళా..* *తల్లీ నిన్ను దలంచి..*
*సరస్వతీ నమస్తుభ్యం..* *క్షోణి తలంబు నెన్నెదురు ...* అంటూ ఎన్నో విధాలుగా మనము ఆ దేవిని ప్రార్థిస్తాము. ఈ రోజు *శుభప్రదము* కనుక పిల్లలకు అక్షరాభ్యాసాలను చేయిస్తారు. మన తెలుగు ప్రాంతాలలో *బాసర* (నిజామాబాదుకు 35 kms), *వర్గల్* (హైదరాబాదుకు 48 kms), మెడక్ జిల్లాలోని అనంతసాగరము, కర్నూలు జిల్లాలోని కొలనుభారతి లలో సరస్వతీ దేవాలయాలున్నాయి.
ఈ దేవికి వాగేశ్వరి, వాగ్వాదిని, మహాసరస్వతి, సిద్ద సరస్వతి, నీలసరస్వతి, వీణాపాణి అని ఎన్నో పేర్లున్నాయి. నాభి, హృత్, కంఠం, జిహ్వ వీటికి సరస్వతీ రూపమే మూలమైన నాదము. ఆమె కృపతోనే బ్రహ్మ సృష్టి చేయగలిగినాడు. ఈ దేవిని ఉపాసించి *వాల్మీకి* మహర్షి *రామాయణ* రచన మొదలు పెట్టినాడు. *వ్యాసమహర్షి* సరస్వతీదేవి కటాక్షముతోనే భారత, భాగవతాది అష్టాదశ పురాణాలను రచించి ఈ మానవాళికి అందించినాడు.‌
*అంచితమే నదీతమే దేవీతమే సరస్వతీ* అని శ్రీవాణిని శృతి కీర్తించింది.
*వసంత* *పంచమినే* విద్యా రంభ దినము గా బ్రహ్మవైవర్త పురాణము అభివర్ణించింది.
ఈ దేవి *హంసవాహిని.* హంస ఎలా నీటిని విసర్జించి‌ పాలను మాత్రమే స్వీకరిస్తుందో, మనము కూడా *చెడును* *త్యజించి* *మంచిని* *మాత్రమే* *తీసుకోవాలని* *బోధిస్తుంది.* మనమేదైనా మంచి‌మాట పలుకుతున్నామంటే అది ఆ తల్లి చలువే.
మాఘ శుక్ల పంచమి నాటి *వసంత* *పంచమి*, శరన్నవరాత్రులలోని *మూలా* నక్షత్రము నాడు ఈ రెండూ *సరస్వతీదేవి* ఉపాసనకు సర్వశ్రేష్టమైనవి.
*సరః* అంటే కాంతి మన జీవితాలను *జ్ఙానకాంతిమయము* చేసే *మాతృశక్తి* *సరస్వతీదేవి.* మత్స్య, మార్కండేయ, స్కంద పురాణాలు, ధర్మసింధు, మానసారాది లాక్షణిక శిల్పశాస్త్రాలలోనూ వాణీ వైభవాన్ని వివరించినారు.
*సంగీత* *సాహిత్యాలనే* అమృత కళశాలు మానవ జాతికి అందించిన సకల కళా రూపిణి సరస్వతీ దేవి. ఆ దేవి *కృపాకటాక్షాన్నికి* వాక్సుద్దితో *స్వరార్చనచేసి* ధన్యులమవుదాము.
*శరదిందు వికాస మందహసం స్పురదిందీవర లోచనాభిరామమ్ అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ముపాసే*
*పద్మ పత్ర విశాలాక్షీ పద్మ కేసర వర్ణినీ నిత్యం పద్మాలయా దేవీ సామాంపాతు సరస్వతీ.*

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment