Saturday, 2 February 2019

చేతితో తినడం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ........?


చేతిస్పర్శ శరీరానికి చాలా బలాన్ని చేకూరుస్తుంది. చేతివేళ్లతో ఆహారాన్ని ముట్టుకోవడం వల్ల మిలియన్ల కొద్దీ నరాలు బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తాయి. మనం ఆహారం తినబోతున్నామనే సంకేతం మెదడుకు చేరడం వల్ల అది పొట్టని అలర్ట్ చేస్తుంది. ఇలా పొట్టలో జీర్ణరసాలు, ఎంజైమ్స్ విడుదలవుతాయి. దీనివల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది
మనం ఎలాంటి ఆహారం తింటున్నాం.. ఎంత చక్కగా తింటున్నాం.. అనేదానిపై అటెన్షన్ క్రియేట్ చేస్తుంది చేయి. కాబట్టి.. చేతులతో తినడం వల్ల పరధ్యానాన్ని వదిలి.. పోషకాలు కావాల్సినంత పరిమాణంలో పొందేలా జాగ్రత్త పడతామని అధ్యయనాలు చెబుతున్నాయి. చేత్తో ఆహారం తినడం వల్ల మనం మరింత ఆరోగ్యవంతంగా ఉంటాం.
చేతులతో తినే ప్రక్రియ ముద్ర ప్రయోగం ద్వారా మొదలైంది. ముద్ర అనేది హిందూ సంప్రదాయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ధ్యానం చేసేటప్పుడు, శాస్ర్తీయ నృత్యం చేసేటప్పుడు, భరతనాట్యం చేసేటప్పుడు ముద్రను ఉపయోగిస్తారు. ఎప్పుడైతే మనం చేత్తో తింటామో అప్పుడు అన్ని వేళ్లకు కలుపుతాము. ఈ ప్రక్రియనే ముద్రగా పిలుస్తాం. అలాగే ఆయుర్వేదంలో ఒక్కో వేలికి ఒక్కో అర్థముంది. బొటనవేలు ఆకాశం, చూపుడువేలు గాలిని, మధ్యవేలు అగ్నిని, ఉంగరపు వేలు నీటిని, చివరి వేలు భూమిని సూచిస్తుంది. వీటిలో ఏ ఒక్కటి మన జీవితంలో కనుమరుగైనా.. మనం అనారోగ్యం పాలవుతామని అర్థం. ఇలా అన్ని వేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల మన జీవితం, ఆరోగ్యం బ్యాలెన్స్ గా ఉంటుందని అర్ధం. పూర్వీకులు ఏ పద్ధతి ఫాలో అయినా.. దానికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి.. ఇలాంటి అలవాట్లను తీసిపారేయకుండా.. అలవాటు చేసుకోవడం మంచిది.

No comments:

Post a Comment