Tuesday, 12 February 2019

భీష్మాష్టమి



*ఓం నమో భగవతే వాసుదేవాయ..!!🙏*
రధ సప్తమి తరువాత వచ్చే రోజునే..
భీష్మ అష్టమిగా పిలుస్తారు
ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక,
ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణగా విడువమని చెప్పింది శాస్త్రం
తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యమ్.
నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున (భీష్మాష్టమి) తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు.
సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు.
కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు.
అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది.
అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే (ఐదు గంటలకు) లేచి పూజామందిరం,
ఇంటిని శుభ్రం చేయాలి.
గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి,
తెలుపు రంగు దుస్తులను ధరించాలి.
ఆ రోజంతా ఉపవాసం వుండి,
రాత్రి జాగారం చేయాలి
*భీష్మ తత్వం.💐*
భీష్మ పితామహుడికి సంతానం లేకపొయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి.
అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారతకథలో నిలిచిపోయిన మహొన్నతుడు భీష్మపితా మహుడు.
ఈయనకు ఇంతమహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధానకారణం.
మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి,
ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి,
శౌర్యసంపదకు ఓ గొప్ప ఉదాహరణ.
అంతేకాదు ఈయన అపారమైన..
శాస్తవ్రిజ్ఞానాన్ని,
ధర్మతత్వాన్ని,
పరమాత్మతత్వాన్ని
కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు.
భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు.
అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే
అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు.
వర్ణాశ్రమ ధర్మాలు,
రాజ ధర్మాలు,
ఆపద్ధర్మాలు,
మోక్ష ధర్మాలు,
శ్రాద్ధ ధర్మాలు,
స్ర్తీ ధర్మాలు,
దాన ధర్మాలు,
ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు
ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు.
చక్కటి కథల రూపం లో...
వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ
మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో
నిక్షిప్తమై ఉన్నాయి.
ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు.
కృష్ణతత్వాన్నీ బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు.
రాజసూయయాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్నవారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిర్ద్వంద్వంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు.
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్నా ఆయనను ఎదిరించక ఆయన చెతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు.
అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికీ ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నయి.
ఆది శంకరాచార్యులు భగవద్గీత, ఉపనిష త్తులు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే
ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహత్తరమైన భగవత్శక్తి దాగి ఉన్న
విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడి మహత్యాన్ని గురించి తెలుసుకోవటానికి.
భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికీ అందరికీ ఆయన మార్గ దర్సకుడుగా నిలిస్తున్నాడు.
*సంతానం లేకపోయినా.💐*
అన్నిటికంటే మించిన విశేషమేమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు.
పిల్లలూ లేరు.
కానీ ఇలా అపుత్రకుడి గా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితరులకు పితృ తర్పణాలను ఇచ్చేటప్పుడు భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు.
అందరికీ అలా ఆయన పితామహుడు (తాతా) లాంటి వాడయ్యాడు.
ఇంతటి గొప్పతనం కేవలం ఆయన ప్రతిజ్ఞా పాలన,
పితృ భక్తి, సశ్ఛీల సంపద వలనే లభించాయి.
భీష్మాచార్యుడు అందరికీ ఆదర్శ ప్రాయుడిగా, మార్గదర్సకుడిగా నిలు స్తున్నాడు.
భీష్మాష్టమి నాడు తర్పణము చేసినట్లైతే సంవత్సరకాలములో చేసిన పాపములన్నీ నాశనమౌతాయని చెప్పబడినది.
*తర్పణము ఈ క్రింది మంత్రముతో ఇవ్వవలెను.💐*
వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే
అపుత్రాయ జలం దద్మి నమో భీష్మాయ వర్మణే
భీష్మశ్శాంత నవో వీర స్సత్యవాదీ జితేంద్రియః
అభిరర్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్.
అపసవ్యముగా తర్పణమిచ్చి ఆచమనముచేసి సవ్యముగా అర్ఘ్యమీయవలెను.
వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే
ఈ తర్పణం జీవపితృకులుకూడా చేయవచ్చును. (అయితే అపసవ్యం మాత్రం బ్రహ్మయజ్ఞములో పితృతర్పణము వలె చెయవలెనని తోస్తోంది)

మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు.
ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినము.
భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు.
సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు.
అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది...
తలంటుస్నానము చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి.
పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళములు, జాజిమాలతో అలంకరించుకోవాలి.
నైవేద్యమునకు పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణకవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా "ఓం నమోనారాయణాయ"
అనే మంత్రమును 108 సార్లు జపించాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు.
ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము, సత్యనారాయణ వ్రతము, బ్రహ్మోత్సవ దర్శనం, లక్షతులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
ఈ రోజున విష్ణుసహస్రనామస్తోత్రమ్, విష్ణుపురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకములను సన్నిహితులకు ఇవ్వడం మంచిది.
భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా:
ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద పొందు పరచిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అందురు.
ఇక్కడ అందరికి ఒక సంశయం వచ్చును. తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని.
కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మతర్పణం, యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం.
రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది.
*సంకల్పం:*
మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః శ్వేతవరాహ కల్పే... వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే, భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణే దిగ్భాగే స్వగృహే శకాబ్దే అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం ,
మధ్యే మన్మథ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘ మాసే శుక్ల పక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసరస్తూ సౌమ్యవాసర యుక్తాయాం కృత్తికా నక్షత్ర యుక్త సాధ్య యోగ భద్ర కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం అష్టమి శుభ థితౌ!!
భీష్మాష్టమి తర్పనార్ఘ్యం అస్య కరిష్యే - అపపౌ స్పృశ్య
౧. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!
౨. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!
౩. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!


సర్వేజనా సుఖినోభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371




No comments:

Post a Comment