Sunday, 30 December 2018

మానవ జీవిత లక్ష్యం



పిల్లి తన కూనలను కళ్ళు తెరిచేలోపల తట్టలలో, బుట్టలలో, గాదెలలో, గంపలలో మారుస్తుందట. అలా ఏడుచోట్ల మారుస్తుందంటారు.
అలాగే *'మాయ'* అనే పెద్ద పిల్లి ఈ జీవుళ్ళను కళ్ళు తెరిచేలోపల ఎన్ని చోట్ల మార్చింది? 83 లక్షల 99వేల 999గాదెలలో, గంపలలో - వివిధ గర్భకోశాలలో చేర్చింది. మార్చింది. అలా మార్చిన తర్వాత వచ్చిన అపురూపమైన జన్మే ఈ *మానవజన్మ*. కళ్ళు తెరుచుకోవలసిన జన్మ. పశువులాగా, పక్షిలాగా, పురుగులాగా ఇప్పుడూ కళ్ళు మూసుకుంటే *'పునరపి జననం పునరపిమరణం పునరపి జననీ జఠరేశయనం'* తప్పదు. చావు పుట్టుకలతో కూడిన ఈ సంసార చక్ర బంధంలో ఇరుక్కొని బయటపడలేక బాధలు పడాలి. ఆహారం సంపాదించు కోవటం, భోగాలనుభవించటం, పిల్లల్ని కనటం, పెంచటం, నిద్రపోవటం, పశువులకు పక్షులకు జీవితలక్ష్యాలు. కాని *మానవుడి అసలు లక్ష్యం అది కాదు. మోక్ష్యాన్ని అందుకోవటమే మానవ జీవిత పరమలక్ష్యం*.

No comments:

Post a Comment