ఎక్కడికెళ్లినా సమస్యలే… ఇంట్లో, బయటా ఎక్కడైనా కష్టాలే ఎదురవుతున్నాయ్… నిత్యం ఇబ్బందులే. ఆర్థికంగా, మానసికంగా అన్నీ ఒకేసారి వచ్చి పడుతున్నాయ్… వాటి నుంచి ఎంత బయట పడదామన్నా వీలవడం లేదు, మరింత లోతుకు వెళ్లాల్సి వస్తోంది. అని వాపోతున్నారా..? అయితే అది మీ తప్పు కాకపోవచ్చు. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ, వాస్తు దోషం అయి ఉండవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో నిత్యం మీరే ఉన్నా అప్పుడప్పుడు వచ్చే అతిథులు, స్నేహితులు, ఇంకా ఇతర తెలిసిన వారి వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. అంతేకాదు దీనికి వాస్తు దోషం తోడైతే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారికి అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఈ క్రమంలో అలాంటి సమస్యలు తప్పించేందుకు, వాస్తు దోషం పోగొట్టేందుకు పలు రకాల నివారణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి పలువురు పండితులు విశ్లేషించి మరీ చెబుతున్నారు కూడా. ఈ క్రమంలో సదరు నివారణా మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేప ఆకులు…
వేప ఆకుల్లో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. సూక్ష్మ క్రిముల పట్ల వేప అద్భుతంగా పని చేస్తుంది. ఈ క్రమంలో వేప ఆకును ఇంట్లో కాల్చి పొగ వేస్తే దాంతో ఇంట్లో ఉండే బాక్టీరియా, వైరస్‌లు నాశనమవుతాయి. అంతే కాదు వేప ఆకులను ఇంట్లో మండించడం వల్ల వాస్తు దోషం కూడా పోతుందట.
అగర్‌బత్తీలు…
హిందువులు ఎవరైనా దేవుడికి పూజ చేసినప్పుడు మాత్రమే అగర్ బత్తీలను వెలిగిస్తారు. లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారిని ఖననం చేసేందుకు తీసుకెళ్లినప్పుడు కూడా వీటిని వెలిగిస్తారు. అయితే అగర్ బత్తీలను మామూలు సమయంలో కూడా వెలిగించవచ్చు. దాంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మాయమవుతుంది. అయితే అగర్‌బత్తీలను ఎప్పుడు వెలిగించినా బేసి సంఖ్యలో స్టిక్స్‌ను వెలిగించాలి.
ఫర్నిచర్…
కుర్చీలు, టేబుల్స్, సోఫాలు, మంచాలు… ఇలా ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌ను అప్పుడప్పుడు తీసి వేరే దిశలో పెట్టి మళ్లీ యథావిధిగా అమర్చుకోవాలట. దీంతో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. దీన్ని గురించి ఫెంగ్ షుయ్ వాస్తులో వివరించారు.
ఉప్పు…
రెండు చిన్నపాటి గిన్నెలను తీసుకుని వాటిలో కొంత ఉప్పు వేయాలి. అనంతరం ఆ రెండు గిన్నెలను ఇంట్లో ఈశాన్య, నైరుతి దిశల్లో ఉంచాలి. ఇలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ మాయమవుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
కిటికీలు…
కిటికీలను ఎల్లప్పుడూ తెరచి ఉంచాలి. వాటి వద్ద కుండీల్లో ఏవైనా మొక్కలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్లి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాంతో ఇంట్లోని అందరికీ మంచే జరుగుతుంది.
కర్పూరం, లవంగాలు…
ఉదయం, సాయంత్రం వేళ్లలో కొద్దిగా కర్పూరం తీసుకుని వెలిగించి దాంట్లో కొన్ని లవంగాలను కూడా వేయాలి. ఇలా రెండింటినీ మండించడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషం పోతుంది. అందరికీ అదృష్టం కలసివస్తుంది. ఆర్థిక సమస్యలు ఉంటే పోతాయి.
పసుపు ఆవాలు, గుగ్గుళ్లు…
నలుపు రంగువి కాక, పసుపు రంగులో ఉండే ఆవాలు, గుగ్గుళ్లను కలిపి ఇంట్లో రోజూ మండిస్తున్నట్టయితే నెగెటివ్ ఎనర్జీ మాయమవుతుంది.
గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్…
వారానికి ఓ సారి ఇంట్లో గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్‌ను మండించాలి. దీని వల్ల ఇంట్లోని వారి సమస్యలు తొలగిపోతాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయి. నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
No comments:
Post a Comment