Sunday, 30 December 2018

అభిజిత్ లగ్నం


అహస్సు 60 ఘటికలులేక 24 గంటలున్నప్పుడు 30 ముహుర్తముల వ్యవస్థ ఏర్పడును అంటే ఒకొక్క ముహుర్తము రెండు ఘటికలు అనగా నలుభది ఎనిమిది నిమిషాల ప్రమాణము.పగలు ఎనిమిదవ ముుర్తము "అభిజిత్ ముహుర్తము"అని దీనినే "విజయ ముహుర్తము"అని కొందరి అభిప్రాయము.
"అష్టమే దివస స్వార్దేత్వభిజిత్ సంజ్ఞకఃక్షణం"
మధ్యాహ్నము గం!! 11:45 ని!! నుండి గం!!12:30ని!! వరకు అభిజిత్ ముహుర్తము అని అంటారు. 
నారద పురాణం ప్రకారం మధ్యాహ్నం గం!!12:00లకు పూర్వము ఒక ఘడియ తరువాత ఒక ఘడియ అనగా ఉదయం గం!!11:36 ని!! నుండి మధ్యాహ్నం గం!!12:24 ని!! వరకు అభిజిన్ముహుర్తము.ప్రకారాంతముగ సూర్యోదయం నుండి నాల్గవ లగ్నం అభిజిత్ లగ్నము అభిజిత్ కాలము సుదర్శన చక్రము వలె సర్వ దోషములను నశింపజేస్తుందని చెప్పబడినది.

"దిన మధ్య గతే సూర్యే ముహుర్తే హ్యాభిజిత్ ప్రభు! చక్రమాదాయ గోవిందః సర్వాన్ దోషాన్ నికృన్తతి" !!

కాని బుధవారము అభిజిత్ నింద్యము కాని దక్షిణ దిశకు ప్రయాణం చేయరాదు.

"అభిజిన్ని బుధే శస్తం యామ్యంతం గమనే తథా"

నారద సంహిత
తొమ్మిదవ అద్యాయం దివారాత్రి ముహుర్త విచారణ అందలి ఆరవ శ్లోకము #

శ్లో!!పౌరాణికా రౌద్ర సిత మైత్ర వారభవాఃక్షణాః

సావిత్రవైరాజికాఖ్యో గంధర్వాశ్చష్టమోభిజిత్!!

తాత్పర్యము


 పౌరాణికుల మతము నందు దివా ముహుర్తములు ఈ విధముగా చెప్పిరి.రౌద్ర,సిత,మైత్ర,సూర్య,సావిత్ర,వైరాజిక, గంధర్వ,అభిజిత్ అని ఎనిమిదవ ముహుర్తమే కాంతపకాలమని చెప్పిరి.


తరువాత పదవ శ్లోకము నందు నక్షత్రాధిపతులు ముహుర్తములలో శుభకాములు చేయవచ్చని చెప్పుచున్నారు.


శ్లో!!అభిజిద్భలయుక్తాస్తే సర్వ కార్యేషు సిద్ధిదాః!

ఏషు చుక్షేషు యత్కర్మ కథితం నిఖిలం చయత్!!
తదైవత్యే తన్ముహుర్తే కార్యే యాత్రాధికం సదా!!




తాత్పర్యము

దినమందు ఎనిదవ ముహుర్తమగు అభిజిత్ ముహుర్తము మిక్కిలి బలమైనది మరియు సకల కార్యములను చేయునది అగుచున్నది.అని చెప్పిరి ఆయా నక్షత్రములయందు విధింపబడిన ఆయా కార్యములు చేయుట కుదరక పోయినచో ఆ నక్షత్రమునకు తగిన ముహుర్తమున ఆ కార్యమును చేయవచ్చని చెప్పిరి.

వశిష్ఠ సంహిత

వివాహాధ్యాయంలో రెండు వందల ఇరవై ఆరవ శ్లోకము
శ్లో!!మధ్యం దినగతే భానౌ ముహుర్తో2భిజిదాహ్వయః!
యో2అష్టమః సర్వదోషఘ్నస్త్వం
థకారంయథా రవిః!!



తాత్పర్యము

సూర్యుడు
ఆకాశ మధ్య భాగములో వచ్చినప్పుడు అభిజిత్ ముహుర్తమంటారు.ఇది రోజులో ఎనిమిదవ ముహుర్తము,సూర్యుడు ఏ విధముగా నైతే చీకటిని నశింపచేయునో అలాగే అభిత్ ముహురేతం సర్వ దోషములను నశింపజేయును.

శ్లో!!సూర్యచ్ఛతుర్థం యల్లగ్నమభిజిత్సంజ్ఞకం యతత్!
సర్వ దోషం నిహంత్యాశు,పినాకే త్రిపురం యథా!!



తాత్పర్యము

సూర్యోదయమునుండి నాల్గవ ముహుర్తము అభిజిత్ ముహుర్తము అందురు.పినాకపాణి త్రిపురాసురున్ని నశింపజేసినట్టు ఈ లగ్నము కూడ సర్వ దోషములను నశింజేయును.
శ్లో!!సర్వదేశేష్విదం ముఖ్యం సర్వ వర్ణేషు సర్వదా!
సర్వ దోష హరః యద్వద్ధరిత్యక్షర ద్వయమ్!!



తాత్పర్యము

శ్రీ హరి నామ స్మరణ ఏ విధముగా దోషములను తొలగించునో అదేవిధముగా ఈ అభిజిత్ ముహుర్తము సర్వ దోషములు తొలగించును ఇది సమస్త దేశీయులకు,సమస్త వర్ణములవారికి ప్రశస్తమైనది.

ముహుర్త రత్నావళి

యాత్రా ప్రకరణము నందు
యాత్రాభిజిత్ర్సాశన్త్యము అను అంశము నందు

శ్లో!!అష్టయోహ్యభిజి దాహ్వాయక్షజో!దక్షిణాభిముఖ యనమమతరా!!
కీర్తతో2వరక కుప్సు సూరిభి!ర్యాయినామభిమతర్ష సాధనే!!



తాత్పర్యము

యాత్రా సమయము నందు దక్షిణ దిక్కుకు తప్ప చక్కిన దిక్కులకు పగలు పదనాలుగు ఘడియల పిదప పదహారు ఘడియల వరకు అభిజిన్ముహుర్తము మిక్కిలి ప్రశస్తమైనదని ఇష్ట సిద్ధిని ఇచ్చునని శ్రీ పతి వచనము.

నారద సంహిత

యాత్రా ప్రకరణ మందు
శ్లో!!అభిజిక్షణ యోగో2యమ చేష్ఠా ఫల సిద్ధిదః!
పంచాంగ శుద్ధ రహితే దివసే2పి ఫలప్రదః!!


తాత్పర్యము

యాత్రాకాలము నందు అభిజిత్ కాల మైనచో పంచాంగ శుధ్ధి లేనిదైనా శుభకరమే అగును.
శ్లో!!అభిజిత్ సర్వ కార్యేషు శస్తం నాత్రోపనయనమ్!!


తాత్పర్యము

అభిజిత్ ముహుర్తమందు అన్ని కార్యములకు ప్రశస్త్యం కాని ఉపనయనమునకు పనికిరాదు.

ముహుర్త వల్లరి

అనే సంకలనము గ్రంధ మందు ఈ విధముగా కలదు
"అభిజిత్ సర్వ దోషఘ్నం" అనే వచనము ప్రయాణమునకు మాత్రమే వర్తించును.మిగిలిన అన్ని శుభకార్యములకు దానిని వర్తిప జేయుట తగదు.

ఈ అభిజిత్ లగ్నము సర్వ దోషములను నశింపజేయును కాని వివాహం,ఉపనయనం,గర్భాధానము తప్ప మిగిలిన సర్వ శుభకార్యముల యందు ప్రశస్తమైనది అని మహర్షుల వాక్యము.ఈ అభిజిత్ లగ్నము "అశేష దోష పహరు" అని ఋషి వాక్యం.ఈ లగ్నం సుమారుగా మిట్ట మధ్యహ్నము ఉండును ఈ లగ్నములో వివాహము చేసినచో నష్టము వాటిల్లునని బ్రహ్మ శపించునట్లు నారద సంహిత నందు గలదని వ్రాసినారు.

నారద సంహిత వివాహ ప్రకరణము నందు

శ్లో!!చతుర్థ అభిజిల్లగ్నముదయరాక్షత్తు ఏప్తియమ్!
గోధూలికం తదుభయం వివాహేపుత్ర పౌత్ర దమ్!!


తాత్పర్యము

సూర్యోదయము నుండి నాల్గవ లగ్నం అభిజిత్ ఏడవ లగ్నం గో ధూలి లగ్నం వీని యందు వివాహం చేసిన దంపతులు పుత్ర పౌత్రాభివృద్ధిగా నుండును.

శ్లో!!ప్రాచ్యానాంచ కలింగానాం ముఖ్యం గోధూలికం స్మృతమ్!
అభిజిత్ సర్వదేశేషు ముఖ్యం దోష వినాశకృత్!!


తాత్పర్యము

తూర్పు దేశీయులకు,కళింగ దేశీయులకు గోధూలి సమయం ప్రశస్తయము మిగిలిన దేశాలవారికి అభిజిత్ లగ్నము ప్రశస్త్యము.

శ్లో!!మధ్యం దినగితేభానౌ ముహుర్తో2భిజిదాహ్వయః!
నాశయత్యఖిలాన్దోషాన్పినాకీత్రిపురం యథా!!


తాత్పర్యము
:

సూర్యని మధ్యాహ్న కాలసమయమే అభిజిల్లగ్న కాలము.ఇది పినాకపాణి త్రిపురాసురున్ని ఏ విధముగా నాశనం చేశాడో అదేవిధముగా అభిజిత్ లగ్నము సమస్త దోషములను నాశనము చేయును.

శ్లో!!మధ్యందినే భానౌ సకలం దోషనమచయమ్!
కరోతి మభిజిత్తూలరాశిమివానలః!!


తాత్పర్యము
:

మధ్యాహ్నకాలమందలి అభిజిత్ లగ్నము దూదిరాశి యందు నిప్పుకణం వలె సర్వ దోషాలను దహింపజేయును.

జ్యోతిష్య రత్నమాల యందు ప్రయాణమునకు అభిజిత్ ప్రశంస.

శ్లో!!అష్టమోహ్యాభిజిదాహ్వాయఃదక్షిణాభిముఖ
యాన మంతరా కీర్తితో పరకకువ్సు సూరిభిర్యాయినా మభమతర్ష సిధ్ధిదః!!
ఉత్పత విష్టి వ్యతిపాత పూర్వాన్ నిహమతి
దోషానభిజిన్ముహుర్తః కరోతి యమోయపహయ కాష్టాం దిగంతరాణి ప్రజతోర్ష సిద్ధం!!


తాత్పర్యము

ఎనిమదవ ముహుర్తమయిన అభిజిత్ ప్రయాణానికి సిద్ధినిచ్చునది అని,వ్యతీపాత, విష్ఠి కరణ,ఉత్పాతములయందు సర్వ దోషములను పోగొట్టునని మరియు అభిజిత్ దక్షిణదిక్ప్రయాణమునకు నిషేధించబడినది. 

వాస్తు దుందుభి

ఈ గ్రంధము నందు అభిజిత్ లగ్నము గూర్చి ప్రస్తావన
శ్లో!!ఉత్పాత విష్ఠి వ్యతిపాత పూర్వాన్నిహంతే దోషానభిజిన్ముహుర్తేః!
వ్రతంచ యమ్యామపహాయ కార్యకర్తుఃప్రయాతర్దిశతి స్వహృదయమ్!!


తాత్పర్యము
:

ఈ అభిజిన్ముహుర్తము ఉత్పాతాదులు,విష్ఠి కరణాలు,వ్యతిపాత యోగాలుమొదలుగా గల దోషములు అన్నింటిని హరించును.ఈ అభిజిల్లగ్నమున ఉపనయనము,దక్షిణ దిక్కు ప్రయాణము,వ్రతము గాక ఏ కార్యమును గావించినను ఏ దిక్కునకు ప్రయాణించినను కార్య కర్తకును,ప్రయాణికునకు ను మనస్సునందు యేయే కోరికలు కలవో ఆ కోరికలన్ని వెరవేరును.

 జ్యోతిర్విదా భరణము 

వివాహ ప్రకరణోత్తరార్దము నందలి పదవ శ్లోకము.

శ్లో!!భగోడు వాల్మీకిరిహాహసౌమ్యం సీతా నిషేవేన దుఃఖం తదూడ!
భైమే తథైవాభిజిధృక్ష మత్రిస్తచ్ఛాపమాపోడుతదేయమస్మాత్!!


తాత్పర్యము

వాల్మీకి మహర్షి సీతా వివాహము ఫల్గునీ నక్షత్రమున జరుగుటచే వైవాహిక సౌఖ్యము అబ్బలేదని.అదేవిధముగా అత్రి మహర్షి అభిజిత్ మంచిది కాదని తెలిపిరి ఎందుకనగా ఆ నక్షత్రమున నలునికి దమయంతితో వివాహము జరిగెను అందుచే ఆమెకు కూడ వైవాహిక జీవితము సుఖము కలుగలేదు.అందువలన పూర్వఫల్గుణి,అభిజిత్ నక్షత్రాలను ప్రజల వివాహమునకు వాడకుండ త్యజించినారు.ఆ మహాత్మురాండ్ర శాపమానక్షత్రములకు తగిలిందట అని వ్యాఖ్యానమలో నున్నది.

కాలామృతము

పంచమ బిందు 177 వ శ్లోకము

శ్లో!!స్యాధ్భంగో2భిజిదాహ్వయేచనిలయేధిష్ష్యే ముహుర్తే తథా!
రోగస్స్యాధ్వనుభన్యచోత్తర దళా దృక్షేషు పంచన్వివి,
ధుఖం దక్షిణ దిక్పయాతురథవా నాన్యత్ర యాతు స్త్వయం మిానేచేదథ సర్వ దిక్షు గమనం యాతుశ్చ వక్రిం భవేత్!!


తాత్పర్యము

అభిలగ్నము నందు,అభిజిన్నక్షత్రము నందు,అభిజిన్ముహుర్తమందు ప్రయాణము చేయు వారికి శుభకరంబనియు,దక్షిణ దిక్కు ప్రయాణము చేయు వారలకు రోగకరమనియు అని ఉన్నది.

వాల్మీకి రామాయణము

వాల్మీకి రామాయణము నందు యుధ్ధ కాండ నాలుగవ సర్గ మూడవ శ్లోకము నందు గోవింద రాజు వ్యాఖ్యానం నందు

శ్లో!! అస్మిన్ ముహుర్తే సుగ్రీవ ప్రయాణ మభిరోచయే!
యుక్తో ముహుర్తో విజయః ప్రాప్తో మధ్యం దివాకరః!!

వ్యాఖ్యానంః-

సుగ్రీవుడా ఈ ముహుర్తము నందే (దండయాత్ర)
ప్రయాణమునకు ఇష్టపడుచున్నాను,ఈ ముహుర్తము ప్రయాణమునకు తగినది,విజయం కలిగించునది,సూర్యుడు దినమున నడి భాగము పొందినాడు,దండయాత్రకు విజయము కలుగు కారణము చెప్పు చున్నారు,దినమందు రవి నడిమి భాగమున ఆకాశ మధ్య భాగమున పొందినాడు,దినమందు!రాత్రికి పదునైదు ముహుర్తములు పగటికి పదునైదు ముహుర్తములు కలిసి ముప్పై ముహుర్తములు రెమడు ఘడియలకొక ముహుర్తము ఇరువది నాలుగు నిమిషములకొక ఘడియ! 

అర్ద్రో,రోగ,మిత్ర,వసు,జల,విశ్వ,భిజిద్వెరించేంద్రాఃఐంద్రాగ్నిమూలం వరుణార్యయ భగతారా దివా 
ముహుర్తాస్స్యుః!!

ఆరుద్ర,అశ్రేష,అనూరాధ,మఖ,ధనిష్ఠ,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ,అభిజిత్ రోహిణి,జ్యేష్ఠా,విశాఖ,మూల,శతభిషము,ఉత్తర ఫాల్గణి,పూర్వఫాల్గుని అను నక్షత్రములకు చెందినవి పగటి పదునైదు ముహుర్తములు అని "విద్యా మాధవీయం"అనే జ్యోతిష్య గ్రంధమందు చెప్పబడినవి,వీనిలో దినము నడిభాగము నున్న ముహుర్తము అభిజిన్ముహుర్తము అగును ఇది విజయావహము.

అభిజిన్ముహుర్తములు దక్షిణయాత్రలందు విశిష్ఠములని"జ్యోతిష్య రత్నాకరము" నందు "భుక్తా దక్షిణ యాత్రాయాం ప్రతిష్ఠాయాం ద్విజన్మని!అథానేచ ధ్వజారోహే మృత్యుదస్స్యాత్సదా2భిజిత్.
(భుక్తి,దక్షిణ యాత్రా,దేవతా ప్రతిష్ఠా,ఉపనయనము,అథానము,ధ్వజారోహణము అను కర్మలయందు ఎల్లప్పుడు మృత్యువు కలిగించును.)అని చెప్ప బడినది మరి అభిజిత్ ముహుర్తము దక్షిణ యాత్రకు ఎట్లు పనికి వచ్చును అని ఆక్షేపణ రాగా లంకా నగరము కిష్కిదకు దక్షిణ పూర్వము గలదు అనగా ఆగ్నేయదిశయందున్నది దక్షిణ దిశ కాదు కావున చెెప్పబడిన దోషము లేదు.

విశేషముః సర్వ సాదారణముగా ప్రయాణమందు యోగ్యమైన కాలమని ఆయా ఋషుల మతమిట్లున్నవి.
"గార్గ్య సిధ్ధాంత ముషః కాలకలన శకుటముానుటయది బృహస్పతి మతంబు!విప్రజన వాక్యమరయంగా విష్ణు మతము సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతంబు"
(ప్రాతః కాలమున ప్రయాణము మంచిదని గార్గముని మతం,శకునము చూచి ప్రయాణము చేయుట మంచిదని బృహస్పతి మతము,(బ్రాహ్మణ వాక్యమును బట్టి ప్రయాణము చేయుట మంచిదని విష్ణు మతము) అభజిన్ముహుర్త ప్రయాణము చేయుట అందరికి సమ్మతమైన మతము.

ముహుర్త చంద్రిక

ముహుర్త చంద్రిక యందు అభిజిత్ విశేషము

శ్లో!!ఉత్పాత విష్ఠి వ్యతిపాపూర్వం నిహంతి దోషానభిజిన్ముహుర్త!
కరోతి యమ్యమసహాయ కాష్టాదిగంత చాణి వ్రజతోర్థసిద్దిం!!


తాత్పర్యము

అభిజిన్ముహుర్తము ఉత్పాత దోషము విష్ఠి దోషము వ్యతిపాత ప్రముఖ దోషము ఇత్యాది దోషములు పరిహారింప జేయును ప్రయాణములందు దక్షిణ దిక్కుకు తప్ప తదితర దిక్కులకు అర్ష లాభము చేయునని అర్థము.

ముహుర్త మార్తండము

అభిజిత్ లక్షణం తత్ఫలం

శ్లో!!మిశ్రాఖైరువభైర్దనాదిమలవే తేక్ష్టేర్ది తే యన్తి మేక్షిప్రైర్నక్రమశో మృదూగ్ర చరభై రాత్రి త్రిభాగేష్వియాత్!
శ్రుత్యర్కేజ్యమృగేష్వయంపనియోవైశస్త్వపాదశ్ర
ఏస్తిథ్యక శన్త్విధిజిద్గ మేసఫలదో యామిం వినావీక్షణః!!


తాత్పర్యము

అభిజిన్ముహుర్తమందు దక్షిణ దిక్కు తప్ప మిగిలిన దిక్కులకు పోవటం వలన సకల విధములకు శుభకరము విశేషఫలం అభిజిల్లక్షణ కాల సమాప్తం

ముహుర్త దర్పణము

అభిజిత్ మరియు గోధూళి సమయాలు

శ్లో!!మధ్యందిన గతే భానో ముహుర్తో2భితదహ్వయః!
సర్వదోషన్నిహంత్సాశు పినాకీ త్రిపురం యథా!!

శ్లో!!సూర్యచ్ఛతుర్థం యల్లగ్ననుభిజిత్సంజ్ఞకం చతత్!
సర్వ దేశేత్వదం ముఖ్యం సర్వ వర్ణేషు సర్వదా!!

శ్లో!!అశేషదోషపహారం శుభప్రదం జగుర్మనీంద్రా అభిజిన్ముహుర్తం తధైవ గోధూళికనామధేయం వివాహ యాత్రాద్యాఖిలోత్సవేషు!!


తాత్పర్యము

అభిజిన్ముహుర్తం విష్ఠి,వ్యతిపాత,దోషాలు అపహరించును వివాహము ప్రయాణము గృహప్రవేశము,వాస్తు కర్మ మొదలయిన శుభ కార్యాలయందు శ్రేష్ఠమైనది అని చెప్పబడినది.

శ్లో!!అభిజిత్సర్వ కార్యేషు శస్తం నాత్రోపనాయనం!
సూర్యాత్సప్తలగ్నం మేద్గోధూళిక మితి స్మృతమ్!!


తాత్పర్యము

అభిజిత్ ముహుర్తము ఉపనయనమునకు త్ప్ప మిగిలిన అన్న శుభకార్యములకు ప్రసిద్దము,విశేషమైనది ప్రాశస్త్యమైనది.

రత్నమాలా

శ్లో!!యస్మిన్ ధిష్ణ్వే యఛ్ఛ కర్మోపధిష్టం తద్దైవత్యే తన్ముహుర్తేపి కార్యమ్!!


తాత్పర్యము

ఏ నక్షత్రమున ఏకర్మ చేయుట చేయుట శ్రేష్ఠమని చెప్పబడినదో ఆ నక్షత్రాధి దేవత యొక్క ముహుర్త మందు ఆ శుభ కర్మ చేయుట మంచిది.
*సర్వ దేశములయందును సర్వ వర్ణములమదును ఉపనయనము తప్ప సర్వ శుభకర్మలయందును,సర్వ శుభ కార్యములయందును ప్రశస్తమైనది అని మహర్షులు చెప్పుచున్నారు.
*దైవజ్ఞులు నిశ్చయించెడి సుముహుర్తములు లగ్న బల సమపదచే స్వల్పదోషములు నశించును మహా దోషములు తొలుగుట గూర్చి చెప్పుట లేదు.ఈ అభిజిల్లగ్నము గూర్చి శాస్త్రము "అశేష దోషాపహంగ"అని చెప్పు చన్నది.
*కావున దైవజ్ఞ భారము వహిపలేని వారు ఈ అభిజిల్గ్నమును సర్వ కార్యములయందు ఆశ్రయించుట మంచిది.
ఎక్కువగా యాత్రలకు శుభప్రదమని ప్రమాణాలున్నవి

No comments:

Post a Comment