Saturday, 8 December 2018

మాస రాశిఫ‌లాలు



మార్గశిరము అన‌గా డిసెంబ‌ర్ 8 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు గ‌ల‌ మాస ఫ‌లిత‌ములు ఇప్పుడు తెలుసుకుందాము.
మేషం
మీ తప్పలు లేకయే ఎదుటివారు మిమ్మలను నిందించుట, ధనవ్యయము, లాభము మందగించుట, మనోవిచారము కలుగుట. ఈ సమయమందు గురువార నియమం పాటించుట శుభము.
వృషభం
వ్యవహారజయము, కార్యసాఫల్యత. దూరదేశ ప్రయాణం, కార్యజయం. సౌఖ్యం. సౌఖ్యం.
మిధునం
నూతన వస్తసేకరణ. ఇంటిలోనికివారికి ఆరోగ్యభంగములు. బంధువర్గమువారి ఇంట విందువినోదములలో పాల్గొనుట. అతిశ్రమ వల్ల ధనాదాయము. నూతన వ్యాపారవిషయములను ప్రారంభించుటకు ప్రయత్న ములు ఉండగలవు.
కర్కాటకం
పెద్దల ఆదరాభిమానములు లభించగలవు. మధ్యమధ్య ప్రతికూల సమస్యలు కూడా మీరు అనుకూలంగా మార్చుకొందురు. వివాహాలు, శుభకార్యక్రమాలు. కొద్దిపాటి జాప్యముతో ముందుకు సాగుతాయి. సంతానపర శుభసూచికలు కనిపించుచున్నవి.
సింహం
శ్రమ. సంతాపము. జాప్యము. చరస్థిరాస్తి విషయములలో అనుకోని సమస్యలు. భూమిపర వ్యవహారములలో కొన్ని ఇబ్బందులు రాజకీయంగా ఊహించని సమస్యలు. మానసికఒత్తిడి అధికంగా ఉండును.
కన్య
ఊహించని విధంగా ఆశయసిద్ది నూతన స్నేహలాభములు. శుభకార్యక్రమములో బంధుమిత్రుల కలయిక. శ్రమకు తగిన ఫలితము. శత్రువులు కూడా మిత్రులుగా ప్రవర్తించెదరు. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఇబ్బంది కాల
ము.
తుల
కుటుంబ శుభకార్యక్రమములు నిర్వహించుట. విందువినోదాలలో పాల్గొనుట. మాతృవర్గ సమస్యలు. విద్య సారస్వతకృషి, వ్యాపారముల యందు అభివృద్ధ‌ఙ‌. శ్రమ అధికమయినా ధనలాభము ఉండగలదు.
వృశ్చికం
అధికశ్రమచే కొన్ని పనులు పూర్తి అయినప్పటికి బంధు విరోధముచే మనోవిచారము పెరుగును. వ్యాపారరంగములో కొద్దిగా మంచి కనబడును. వివాహాది, గృహ కార్యక్రమములు ముందుకు సాగుతాయి. ప్రయాణ విషయములో తగు జాగ్రత్త వహించుట మంచిది.
ధనస్సు
బంధువిరోధము. మనవిచారము. వ్యాపార రంగములలో మందకొడి మిత్రులతో విభేదము. దూరపు బంధువులతో సమాగమనము. ధనవ్యయము. వివాహము కాని వారికి అనుకూల సమయము.
మకరం
శ్రమ అధికమైనప్పటికి ఆదాయము వృద్ధి చెందును. శుభ కార్యక్రమ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఋణ ప్రయత్నము సిద్ధించుతుంది. బంధుమిత్రుల సమాగమం వండగలదు. నిరుద్యోగులకు కొంత ఊరట.
కుంభం
చర, స్థిరాస్తి విషయంలో విభేదాలు సమసిపోతాయి. తీర్థ యాత్రలకు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మాస చివరలో కొంత జాగ్రత్త అవసరం.
మీనం
సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్థులు శ్రద్ధ వహించిన విజయావకాశాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు సామాన్య లాభములు ఉండగలవు. సమయానికి ధనం చేకూరుతుంది.
మార్గశిరము అన‌గా డిసెంబ‌ర్ 8 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు గ‌ల‌ మాస ఫ‌లిత‌ములు

స‌ర్వేజ‌న సుఖినోభ‌వంతు.

No comments:

Post a Comment