Friday 28 December 2018

ఏలినాటి శని( 71/2 సం ||)


సూర్య భగవానునికి, విశ్వ కర్మ పుత్రిక సంధ్యా దేవికి భార్య , వీరికి వైవస్వత మనువు, యమధర్మ రాజు ఇద్దరు పుత్రులు. ఈ సంధ్యా దేవి సూర్యుని తాపానికి తట్టుకోలేక తన నీడకి ప్రాణం పోసి, సూర్యుని వద్ద వుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ చాయదేవికి, సూర్య భగవానునికి పుట్టిన మొదటి కొడుకు సావర్ణి మనువు, రెండవ కొడుకు శనైస్చరుడు ( శని దేముడు ). శని దేముడు మెల్లగా నడిచేవాడు. ఎవరైతే ఎక్కువ నడుస్తారో వారిని శని బాధించాడు. అష్టమ శని నాడు సూర్య భగవానుడు, తన భార్య సంధ్యా దేవికాది ఆమే ఛాయా అయినటువంటి చాయాదేవి అని అందుకే. అష్టమ శని అనేది ఏర్పడినది.
"ఓం శం శనైశ్చరాయ నమః " జపము చేసిన మంచిది..
( పరాసర సంహిత , నారాయణ పురాణమ్ అనుసరించి )
*శనిత్రయోదశి వ్రతాచరణ 13 సార్లు జీవితములో ఆచరించిన ఏలినాటి శని దోషం నుండి 95% తప్పించు కోవచ్చు.
*హనుమంతుడిని ప్రతి శనివారం, అష్టోత్తర శతనామావళి తోకాని, ఎర్రటి గంగ శిన్ధూరముతో, తమలపాకులతో , పూజచేసిన, భగవంతుని కి అర్పించిన ,శని దోషం నుండి 95% తప్పించు కోవచ్చు.
* మందపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామివారికి శని దోష పరిహారార్దము,శనిత్రయోదశి రోజున, తైలాభిషేకములు చేసుకొనినచో శని వలన కలుగు సమస్త దొషములు నివారించబడునని స్కంధపురాణములో చెప్పబడినది. కావున భక్తులు "శని" వలన కలుగు సమస్త దొషములు నివారణ నిమిత్తం తైలాభిషేకములు చేయించుకొని ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లగోరుచున్నాము.

No comments:

Post a Comment