Saturday 23 April 2022

అత్యంత మహిమగల సూళ్ళూరుపేట చెంగాలమ్మ .

 




మన శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువ ఆరాధించేది శక్తిప్రదాయిని. ముగ్గరమ్మల మూలపుటమ్మ, ముమ్మూర్తలమ్మ సృష్టికి మూలం దేవీ సర్వ శక్తి ప్రదాయని, జీవకోటిని రక్షించే ఆది శక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ..ఆరాదిస్తున్నారు.


గ్రామగ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరుతో పిలిపించుకుంటూ, సహస్ర నామదారిని ప్రజలను కన్న బిడ్డల వలే కాపాడుతుంది. జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే! కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి.అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసముంటున్నది అనే భావన, అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూళ్లూరు పేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకొంటున్నది శ్రీచెంగాలమ్మ. మరి ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..


పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు ‘‘శుభ గిరి''. ఒక గొల్లపల్లె. రోజూ మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్ళారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేముందు సమీపంలోని పవిత్ర కళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకునిపోతూ, ఒక శిలను పట్టుకుని, ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు.


నీటీ ఉదృతి తగ్గిన తర్వాత చూస్తే అష్ట భుజాలతో వివిధ ఆయుధాలు ధరించ పాదాల క్రింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామా పెద్దలకు విన్నవించగా.. గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకునివచ్చి ఒక రావి వృక్షం క్రింద తూర్పుముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖముగా నీటారుగా నిలబడి మహిసాసుర మర్ధిని స్వయంభుగా వెలసి ఉండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.


అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనబడిన అమ్మవారు కనబడి, తాను అక్కడే ఉండదలచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిని అయినా శాంతి మూర్తిగా కొలువుతీరడం వల్ల "తెన్ కాశీ" ( దక్షిణ కాశి ) అని పిలిచేవారు.


ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా

కాల క్రమంలో అదే "చెంగాలి" గా "చెంగాలి పేట"గా పిలవబడి, చివరకి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరు పేటగా మారిందంటారు. ఊరి పేరు వెనక మరో కారణం కూడా చెబుతారు. ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద "సుడి మాను" తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. అదే సూళ్ళూరు పేటగా రూపాంతరం చెందినదని అంటారు.ఆలయ విశేషాలు :


సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది.

తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజ గోపురం నిర్మించారు.

ఉప ఆలయాలలో గణపతి, లింగ రూప కైలాసనాధుడు, నాగ దేవతలు కొలువుతీరి దర్శనమిస్తారు.


నూతనంగా నిర్మించబడిన ప్రధానాలయం ముఖ మండపంలో నవ దుర్గా రూపాలను సుందరంగా మలచి, నిలిపారు.


గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు.

ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్థులె పూజాదికాలు నిర్వర్తిస్తున్నారు.

రోజంతా భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయం లోనికి ప్రవేశించి భంగపడ్డాడట.

అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. కానీ అమ్మవారు స్వప్నంలో " నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు" అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట.

ఎండిపోయి, చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చును.


ఈ వృక్షం దగ్గర నాగ లింగం, నవ గ్రహ మండపం ఉంటాయి. సంతానాన్ని కోరుకొనే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయలలు కడతారు. నియమంగా ప్రదక్షిణలు చేస్తారు.


పూజలు ఉత్సవాలు :

ప్రతి నిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి.

ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు.

వివాహము, ఉపనయనం,పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు అందుబాటులో ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవ రాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు.

దసరా నవ రాత్రులలో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది.

మన రాష్ట్రం నుండే కాక తమిళ నాడు నుండి కూడా భక్తులు తరలి వస్తారు.





.........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............







No comments:

Post a Comment