Tuesday 5 April 2022

2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర కుంభరాశి రాశీ ఫలాలు



ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశి కి చెందును.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి
ఆదాయం - 09, వ్యయం - 02, రాజ పూజ్యం - 09, అవమానం - 04
కుంభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన వ్యయం అధికంగా ఉన్నా రెట్టింపు ధనార్జన ఏర్పడుతుంది. మీ ఉదార స్వభావం మీకు మరియు మీ కుటుంబానికి పుణ్య ఫలితాన్ని ఆర్జిస్తుంది. విద్యార్ధులకు సంపూర్ణ విద్యాభ్యాసం లభిస్తుంది. ఏ రంగంలో ఆసక్తి ఉంటె ఆ రంగంలో తప్పక ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. విద్యాభ్యాసానికి కావలసిన ధనం సకాలంలో సమకూరుతుంది. అవివాహితులకు తమ కన్నా ఉన్నత విలువలు కలిగన కుటుంబం నుంచి జీవిత భాగస్వామి లభిస్తారు. సంతానం కొరకు వేచి ఉన్న వారికి చక్కటి పుత్ర సంతాన సౌఖ్యం లభిస్తుంది. మొత్తం మీద గురు గ్రహం ఆర్ధికంగా ఈ సంవత్సరం నిల్వ ధన్నాన్ని ప్రసాదిస్తారు. ఋణాల నుంచి విముక్తి లభింపచేస్తారు.
కుంభ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని వలన 17-జనవరి-2023 వరకూ అధికంగా వృధా ధన వ్యయం ఏర్పడుతుంది. దుర్మార్గులతో సహవాసం చేయుట వలన మీరు శ్రమపడి ఆర్జించిన ధనం ఖర్చు అవుతుంది. వాహనాలు నడుపునపుడు జాగ్రత్త అవసరం, తాత్కాలిక అంగ వైకల్యం బాధించు సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, పెద్ద వయస్సు వారు నిత్యం మృత్యుంజయ మంత్ర స్మరణ చేయుట మంచిది. కోర్టు కేసులలో, పోలీసులతో చికాకులు ఉన్నవి. అసత్యవాది అని, స్వజనులను మోసగించే గుణం కలిగిన వారు అని అపవాదులు ఏర్పడును. 18-జనవరి-2023 తదుపరి మీ రుపశీల సద్గుణాలు అందరిలో గుర్తింపు పొందుతాయి. అపవాదులు తొలగిపోతాయి. మీకు ఎదురగు వివాదాలు వెనువెంటనే తొలగిపోతాయి. శారీరక శ్రమ మాత్రం అధికం అవుతుంది. కుంభ రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఏలినాటి శని దశ జరుగుతున్నది. కావునా సదా అలోచించి జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. అతి విశ్వాసం పనికిరాదు.
కుంభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన జాతకులు కొద్దిగా క్రోధ స్వభావం ప్రదర్శిస్తారు. అధిక పట్టుదల కలిగి ఉండి పనులు పూర్తి చేస్తారు. మీ మనో నిచ్చయత ఇతరులను అబ్బుర పరుస్తుంది. వ్యాపార వర్గం లోని వారికి చక్కటి వ్యాపార దక్షత వలన ధన లాభాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కొద్దిగా నెమ్మదిస్తుంది. సోదర వర్గం మీ పట్ల కొంత అశ్రద్ధ ప్రదర్శిస్తారు.
కుంభ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవతసరంలో కేతు గ్రహ వలన వారసత్వ పరంగా ఆర్ధిక లాభాలు ఏర్పడతాయి. తండ్రి గారికి ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతాయి. తగవులలో కోప స్వభావం ప్రదర్శించినా విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించి నష్ట పరిమాణాన్ని తగ్గించుకుంటారు. తెలివితేటలు ప్రదర్శించి అధికారుల మెప్పు పొందుతారు. సమయ పాలన పాటించలేరు. దైవ చింతనకు, నిత్య దీపారాధనకు కూడా సరిపడు సమయం ఉండదు.
ఏప్రిల్ 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో అనుకూల పరిస్థితులు ఉన్నవి. ధనాదాయం బాగుండును. ధనార్జాన పెరగడం వలన ఆర్ధిక పరంగా ధైర్యం పెరుగుతుంది. తలపెట్టిన పనులు సజావుగా కొనసాగును. మానసిక అశాంతి తొలగును. కుటుంబంలో నూతన బంధుత్వాలు ఏర్పడి కుటుంబ బలాన్ని పెంచుతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. తగవుల రాజీ ప్రయత్నాలలో ప్రతిష్టంభన తొలగుతుంది. ఉద్యోగ జీవనంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ మాసంలో 21,22,23 తేదీలలో కాలం దుర్వినియోగం అవుతుంది. వృధా శ్రమ ఎదుర్కొంటారు.
మే 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ప్రత్యర్ధుల వలన చికాకులు ఎదుర్కొంటారు. వాహనాల విషయంగా సమస్యలు ఉన్నవి. నేత్ర సంబంధ అనారోగ్యం కలిగిన వారికి సమస్య తీవ్రమగును. శస్త్ర చికిత్సకు దారి తీయును. ప్రయాణాలు అనుకూల ఫలితాలు కలుగచేయును. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. సేవకుల కోసం అన్వేషిస్తారు. ధనాదాయం ఆశించిన విధంగానే ఉంటుంది. నూతనంగా ప్రారంభించిన వ్యవహారాలు మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. నిర్లక్ష్య స్వభావం వలన నష్టములు ఎదుర్కొందురు. ఉద్యోగ మార్పిడికి ఈ మాసంలో ప్రయత్నములు చేయకుండా వుండడం మంచిది. మొత్తం మీద ఈ మాసం సంతానం, వైవాహిక సౌఖ్యం వంటి వ్యక్తిగత విషయాల్లో అనుకూల ఫలితాలు ఏర్పరచదు.
జూన్ 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సొంత గృహ సంబంధ సంకల్పం నెరవేరును. స్థిరాస్తి కొనుగోలుకు కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంలో మీ పలుకుబడి పెరుగును. పుత్ర సంతతి వలన సౌఖ్యం అనుభవిస్తారు. తృతీయ వారంలో తలపెట్టు వివాహ ప్రయత్నాలు, మైత్రీ సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఫలితాలను ఇచ్చును. ఈ మాసంలో వాహనాలు, విదేశీ ప్రయాణాలు కలసిరావు. ఈ మాసంలో 8,10,12,25 తేదీలు అనుకూలమైనవి కావు.
జూలై 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసం లాభాపురితంగా ఉంటుంది. ధనాదాయం బాగుండును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు లాభించును. దూర ప్రాంత ఉద్యోగ లేదా విదేశీ నివాశ ప్రయత్నాలు కూడా ఫలించును. సంతాన ప్రాప్తి కోసం వైద్య పరంగా ధనం ఖర్చు అగును. ద్వితీయ తృతీయ వారములలో శుభవార్తలు వింటారు. చివరి వారం అంత అనుకూలంగా ఉండదు. జ్వరతత్వ ఆరోగ్య సమస్యలు బాధించును. ఆలోచనలు అదుపులో ఉండవు. నష్టపురిత ఆలోచనలు అధికంగా చేయుదురు.
ఆగష్టు 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు అనుకూలమైన గ్రహ బలాలు కలవు. వ్యాపార వ్యవహారాలు లాభాపురితంగా ఉండును. వైవాహిక జీవనంలో మాత్రం కొద్దిపాటి అసంతృప్తి ఎదురగును. నూతన దంపతుల మధ్య వివాదాలు ఏర్పడును. ఆరోగ్య పరంగా ఈ మాసం సమస్యలను తగ్గిస్తుంది. మాస ద్వితియార్ధంలో ప్రయాణాలు లాభపురితంగా ఉండును, విదేశీ సంబంద ఆదాయానికి, ఉద్యోగంలో అనుకూల మార్పునకు, నూతన యంత్రాల కొనుగోలుకు అనువైన కాలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.
సెప్టెంబర్ 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రధమ వారంలో వైవాహిక జీవనంలో చికాకులు తొలగును. కుల వృత్తి జీవనం చేయువారికి అధిక ధనాదాయం లభిస్తుంది. కుటుంబ సంతోషాలు లభించును. ద్వితీయ వారంలో యువ దంపతులకు చక్కటి సంతానం లభించును. గృహ నిర్మాణ లేదా విక్రయ పనులలో ఆటంకములు ఎదురగును. తృతీయ వారంలో తీసుకొను నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చును. జీవనం సంతృప్తికరంగా ఉండును. శత్రు విజయం ఏర్పడును.
అక్టోబర్ 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో స్థిరాస్తి సంబంధ విషయాలలో లాభాలు ఏర్పడును. వ్యాపారాలు సజావుగా సాగును. ధనాదాయం బాగుండును. బంధు వర్గంతో సంతోషకరమైన సమయం గడుపుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనుట వలన గౌరవ ప్రాప్తి లభిస్తుంది. సాంకేతిక విషయాలపై ఏకాగ్రత పెరుగుతుంది. వ్యక్తిగత జీవనం ప్రశాంతంగా ఉండును. ఈ మాసంలో 10,12,16,17,26,27 తేదీలు అనుకూలమైన ఫలితాలు ఏర్పరచును.
నవంబర్ 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనవ్యయం కొంచం అధికం అగును. జీవన మార్గంలో దీర్ఘకాలిక నష్టాలు ప్రారంభం అగును. క్రమ పద్ధతిలో జీవనం చేయని యువతకు ఈ మాసం మంచిది కాదు. ఆరోగ్య పతనం ప్రాప్తించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. అనాలోచిత నిర్ణయాల వలన నష్టములు ఎదుర్కొంటారు. పెద్దల జోక్యంతో వివాదాలు పరిష్కారం అగును. ఈ మాసంలో తలపెట్టిన ప్రయాణాలు లాభించవు. మానసిక చికాకులు ఎదురగును.
డిసెంబర్ 2022 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధన సమస్యలు పరిష్కారం పొందుట వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తీ చేస్తారు. నూతన పనులలో సానుకూలత ఉంది. సంతానం మంచి స్థితిలో స్థిరపడును. స్త్రీల ఆశలు నెరవేరును. తృతీయ వారం నుండి ఉద్యోగ పరమైన లాభాలు లేదా నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఈ మాసంలో 11,15,26,30 తేదీలు అంతగా అనుకూలమైనవి కావు.
జనవరి 2023 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. అధిక ధన వ్యయం ఏర్పడుతుంది. నడుస్తూ ఉన్న వ్యవహారాలు ఆకస్మికంగా ఆగిపోవును. మాట లేదా నిందలకు మానసికంగా సిద్ధం కావలెను. కష్ట కాలం. బంధు వర్గం లేదా స్నేహ వర్గం వలన సహకారం సమయానికి అందదు. ఉద్యోగులకు పై అధికారుల వలన చికాకులు ఎదురగును. వ్యాపారములు ఆశించిన విధంగా సాగవు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేయువారు జాగ్రత్త వహించవలెను.
ఫెబ్రవరి 2023 కుంభరాశి రాశిఫలాలు:
వ్యవహరపు చిక్కులు, సమస్యలు ఈ మాసంలో కూడా కొనసాగును. కుటుంబంలో సభ్యుల మధ్య వాతావరణం అంత సఖ్యంగా ఉండదు. ఉన్మాదంతో ప్రవర్తిన్చెదరు. ధనాదాయం సామాన్యం. బంధు కలహాలు, కోర్టు వివాదాలు చికాకులు ఏర్పరచును. విద్యార్ధులకు కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు ఉన్నవి. నూతన కార్యములు విఫలమగును. సమయ స్పూర్తి లోపించును. స్నేహితులతో జాగ్రత్త అవసరం. వ్యయంపై నియంత్రణ కోల్పోతారు. ఈ మాసంలో తృతీయ వారం నుండి వ్యాపార రంగంలోని వారికి మంచిది కాదు. ఈ మాసంలో 3,4,9,17,20,21,26 తేదీలు అనుకూలమైనవి కావు.
మార్చ్ 2023 కుంభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వ్యక్తిగత సంతోషాలు తక్కువగా ఉండును. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. వివాదాలు కొనసాగును. ధనవ్యయం కొద్దిగా అదుపులోకి వచ్చును. నూతన ఆలోచనలు కార్యరూపంలోకి పెట్టుటకు, పెద్దలను సంప్రదించుటకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. ఉద్యోగ జీవనంలో స్థిరత్వం గురించిన ఆందోళన ఏర్పడును. చివరి వారంలో ఆవేశపూరితంగా వ్యవహరించుట వలన సమస్యలు ఎదురగును. ఈ మాసంలో ఈశ్వర అభిషేకములు, గ్రహ శాంతి జపములు జరిపించు కోనుట మంచిది.
.........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............





No comments:

Post a Comment