Monday 4 April 2022

2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర కన్యారాశి రాశీ ఫలాలు

 




ఉత్తర 2,3,4 పాదములు లేదా హస్త 1,2,3,4 పాదములు లేదా చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యారాశి కి చెందును.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి
ఆదాయం 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 04, అవమానం - 09.

కన్యారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన అతి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. విద్యార్ధులకు చదువు లందు మిక్కిలి విజయములు ఏర్పరచును. నూతన శాస్త్రములు అభ్యసించి ఉన్నతమైన ఉద్యోగ జీవితాన్ని పొందునట్లు చేయును. ఇప్పటికే ఉద్యోగ జీవనంలో ఉన్న వారికి నూతన కోర్సులు చేయుట కూడా విశేషంగా కలసి వచ్చును. ఉద్యోగ జీవనంలో నూతన అధికారాలు లేదా ఆశించిన ప్రమోషన్లు ఈ సంవత్సరం లభిస్తాయి. అవివాహితులకు సద్గుణాలు కలిగిన, ఆకర్షణీయమగు వర్చస్సు కలిగిన జీవిత భాగస్వామి ని లభింప చేయును. వైవాహిక జీవనంలో సమస్యలు తగ్గును. మధ్యవర్తిత్వ సంబంధ వ్యాపారములు చేయువారికి అధిక లాభములు లభించును. కన్యరాశి పురుషులు ఈ సంవత్సరం స్త్రీ ములకంగా లాభాపడుదురు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

కన్యారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శనైచ్చరుని వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 17-జనవరి-2023 వరకూ అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారు. శ్రమించిన కార్యములలో విజయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గును. శత్రువులపై విజయం లభిస్తుంది. 18-జనవరి-2023 నుంచి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుట వలన నష్టములు ఎదుర్కొందురు. సంతాన సంబంధ అనారోగ్యత మానసికంగా భయం కలుగచేయును. డాంబికంగా ప్రవర్తించుట వలన వృధాగా ధనం వ్యయం అగును. ఈ కాలంలో ఇతరుల తప్పులు ఎత్తి చూపుట లేదా ఇతరులను విమర్శించుట వలన తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటారు. మాటను అదుపులో పెట్టుకొని ప్రవర్తించాలి. సంతాన ప్రయత్నాలు చేయువారు శనికి శాంతి జపములు జరిపించుకోనుట మంచిది. కన్యారాశి వారకి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
కన్యారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. అనేక చికాకులు ఎదుర్కొందురు. సర్పం, తేలు వంటి విష కీటకాల వలన ప్రమాదాలు ఎదురగు సూచనలు ఉన్నవి. అన్యాయంగా లేదా లంచముల ద్వారా ధనార్జన చేయు వారికి ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పవు. జూదంలో నష్టములు ఎదురగును. స్త్రీలకు గర్భ సంబంధ అనారోగ్యత వలన , పురుషులకు వృషణ సంబంధ సమస్యల వలన శస్త్ర చికిత్స జరుగు సూచన ఉన్నది. అల్ప బుద్ది కలిగిన మిత్రులను విడిచిపెట్టుట మంచిది.

కన్యారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన కూడా చెడు ఫలితాలు ఏర్పడును. బంధువులతో ధన విషయములలో విరోధములు, సంతానం జడ స్వభావం కలిగి ఉండుట వలన చికాకులు, వ్యాపార రంగంలో తరచుగా నష్టములు, ఆర్ధిక అంశాలలో ధనం కొరకు ఇతరులపై ఆధారపడుట వంటి ఇబ్బందులు ఏర్పరచును. ఆర్ధికంగా ఇతరులకు హామీలు ఇచ్చుట మంచిది కాదు. మొత్తం మీద కన్యారాశి వారికి రాహువు మరియు కేతువుల వలన ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఏర్పడవు. వ్యక్తిగత జాతకంలో సర్ప దోషం కలిగిన వారు, రాహు-కేతువులను నీచ క్షేత్రములలో కలిగి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండవలెను.

ఏప్రిల్ 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. నూతనంగా ప్రారంభించిన పనులలో అనవసర సమస్యలు ఎదురగును. మానసికంగా కూడా చికాకులు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో అధికమైన పని వలన ఒత్తిడులు. నిరుద్యోగ యువత ఆలోచనలలో అస్థిరిత - అభద్రతా భావం కొనసాగుతాయి. వేసుకున్న ప్రణాళికలలో ఆఖస్మిక మార్పులు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త మరియు సమయ పాలన అవసరం. కర్షక వర్గానికి శ్రమాధిక ఫలం లభించును. 22 వ తేదీ తదుపరి పరిస్థితులలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. పని ప్రదేశంలో మీ చురుకైన వ్యక్తిత్వం వలన చక్కటి గుర్తింపు పొందుతారు. ఈ మాసంలో 8,9,13,18 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

మే 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా అంత ప్రోత్సాహకరమైన కాలం కాదు. ఆరోగ్య పరంగా లేదా మానసిక ఆందోళన కలుగచేయు పరిస్టితులు కొనసాగుట వలన జీవన మార్గంలో స్తబ్ధత ఏర్పడును. కుటుంబ సభ్యుల వలన ఇరుగుపొరుగు వారితో తగాదాలు ఎదుర్కొందురు. ధన ఆదాయంలో కొంత తగ్గుదల ఉంది. ఊహించని మార్గాలలో ఆర్ధిక వ్యయం ఎదురగును. ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి విధి నిర్వహణలో సమస్యలు ఎదురౌతాయి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించి దాన్ని పూర్తీ చేయకుండానే విడిచిపెట్టవలసి వస్తుంటుంది. ఇతరుల అంతరంగం మిమ్మల్ని బాదిస్తుంది. మిత్రుల పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది.

జూన్ 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆర్ధిక భారం నుండి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులను ఆటంకాలను అధిగమించి సమయానికి పూర్తి చేయగలుగుతారు. విద్యార్ధులకు ఈ మాసం మంచి అనుకూల కాలం. వాహన సంబంధమైన విషయమై ఖర్చులు ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారికి ఆశాభంగం ఏర్పడుతుంది. తృతీయ వారంలో బంధు వర్గంతో ఒక ముఖ్యమైన విషయంగా చర్చలు జరుపుతారు. స్త్రీలకూ శ్రమ అధికం అగును. సన్నిహితులకు లేదా జీవిత భాగస్వామికి దూరంగా ఉండవలసి వస్తుంది. చెడు స్వప్నాలు కలవరపరుస్తాయి. ఈ మాసంలో 4,5,8,13 తేదీలు అనుకూలమైనవి కావు. ముఖ్యమైన వస్తువులు లేదా పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

జూలై 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సంతాన సంబంధ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. గృహంలో స్త్రీ సంతాన సంబంధ శుభకార్యములు నిర్వహిస్తారు. దూర దేశములందు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఆఖస్మిక ఉద్యోగ నష్టం. వ్యాపార రంగంలోని వారు ఆశించిన విధంగా లాభం పొందుతారు. తృతీయ వారం నుండి పనిలో ఉత్సాహకర సమయం ప్రారంభం అవుతుంది. చివరి వారంలో ఉద్యోగ నష్టం ఎదుర్కొన్న వారికి కెరీర్ పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చివరి వారం అవివాహితులకు కూడా వివాహ అనుకూలత కలుగచేయు సూచన ఉన్నది. అయితే ఈ మాసం అధికారులను కలువుటకు, కుటుంబ సమస్యల్లో మధ్యవర్తిత్వానికి అనుకూల కాలం కాదు.
ఆగష్టు 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసం కళాకారులకు మంచి ప్రోత్సాహవంతమైన కాలం. ధన వ్యయం కొంచెం అదుపు తప్పుతుంది. ప్రధమ మరియు ద్వితీయ వారములు సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నములకు అనుకూలమైనవి. గృహంలో ఒక ఆరోగ్య సంబంధ ఆందోళన ఏర్పడు సూచన ఉన్నది. ఎదురుచూస్తున్న ఉద్యోగ ఉన్నతి గురించిన సమాచారంలో నిరాశ. 10 నుండి 16 వ తేదీల మధ్య కాలం సొంత గృహ నిర్మాణ లేదా కొనుగోలు ప్రయత్నాలు లాభించును మరియు మైత్రీ సంబంధ వ్యవహారాలకు అనుకూలం. తృతీయ వారం తదుపరి విజ్ఞాన శస్త్ర పరంగా నూతన అంశాలు నేర్చుకుంటారు. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. మాసాంతం వరకు ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది.

సెప్టెంబర్ 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఒక ఆకస్మిక వివాదం లేదా తగవుల వలన ఆశాంతి ఎదురగును. తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు సమస్యలకు దారితీయును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. 14 వ తేదీ తదుపరి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి తగ్గును. కుటుంబ వాతావరణం సామాన్య సంతోషాలతో కొనసాగును. వ్యాపారులకు ఆర్ధిక లావాదేవీలకు ఆశాజనకంగా ఉండును. రుణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాజకీయ వర్గముల వారికి 28,29,30 తేదీలలో నష్టములు, అవమానములు ఎదురగును. అతిగా అజమాయిషీ చేయుట వలన నష్టములు ఎదుర్కొందురు. ఇతరులకు సంబంధించిన కార్యములందు పెద్దరికం వహించకుండా ఉండుట మంచిది.
అక్టోబర్ 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రధమ, ద్వితీయ వారాలలో మానసిక చికాకులు ఎదురగును. వ్యక్తిగత జీవితం కూడా అంతగా బాగోదు. వైవాహిక జీవనంలో ఊహించని సంఘటనలు లేదా చట్ట సంబంధ సమస్యలు ఎదురగును. వ్యాపార వ్యవహారాలు కొద్దిపాటి ఆటంకములతో కొనసాగును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. స్నేహితులతో అనవసర విషయాలపై వాదనలు - అభిప్రాయాభేదాలు ఏర్పడును. నూతన ఆలోచనలు అంతగా కలసిరావు. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. మొత్తం మీద ఈ మాసం కన్యారాశి వారికి అంత అనుకూల మాసం కాదు.

నవంబర్ 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో నూతన ఆదాయ ప్రయత్నాలు లేదా విదేశీ ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అగును. ముఖ్యంగా హస్తా నక్షత్ర జాతకులకు బాగా కలసివస్తుంది. చేపట్టిన వ్యవహారములందు సులువుగా విజయం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం సమస్యలు కొనసాగును. ఈ మాసంలో ధనాదాయం గత మాసం కన్నా బాగుండును. పితృ వర్గం వారి వలన లాభపడతారు. స్థాన చలన ప్రయత్నాలు ఫలించును. సొంత ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. ఆహార నియమాలు పాటించుట మంచిది. 26 వ తేదీ తదుపరి గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. శ్రీ వినాయక స్వామి వారి ప్రార్ధన మంచి చేస్తుంది. మాసాంతంలో కుటుంబం నుండి విడిపోయిన బంధువుల వలన అపఖ్యాతి లేదా వారిచే గౌరవ హాని సంఘటనలు ఎదురగును.
డిసెంబర్ 2022 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మనోవంచ్చా ఫలసిద్ధి ఏర్పడుతుంది. సంతాన సౌక్యం, సొంత వాహన యోగం ఏర్పడతాయి. ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవహారములందు ఆశించిన లాభములు లభిస్తాయి. వ్యాపార విస్తరణ లేదా నూతన వ్యాపార ప్రవేశ ప్రయత్నాలు లాభించును. బంధు వర్గం వలన కొద్దిపాటి సమస్యలు ఎదురైనా మిమ్మల్ని నష్టపరచవు. ఉద్యోగ జీవులకు 10 నుండి 15 వ తేదీ మధ్య పనిభారం అధికం అగును. అనవసర విషయాలకై సమయం వృధా అగును. తృతీయ వారంలో జీవితంలో ఒక ప్రధానమైన మార్పు ఏర్పడు గ్రహ సూచన ఉన్నది. ఈ మాసంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనవచ్చు.

జనవరి 2023 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉండును. వ్యక్తిగత జీవితంలో సంతోషభాగ్యములు ఉన్నవి. జీవిత అభివృద్దికి అవకాశములు లభించును. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వ్యాపారులకు చక్కటి లాభములు ప్రాప్తించును. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగును. కుటుంబ సభ్యుల సహకారం సమయానికి అందును. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆర్ధిక విషయాలలో ఎదురవుతున్న ఒడిదుడుకులు తొలగును. యువకులు గత కాలపు చేదు అనుభవాల వలన సమస్యల నుండి తప్పించుకొండురు. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వడ్డీ వ్యాపారం చేయువారికి మాసాంతంలో ఆదాయంలో పెరుగుదల లభిస్తుంది.

ఫెబ్రవరి 2023 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో దీర్ఘకాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. పట్టుదలతో వ్యవహర విజయాలను సొంతం చేసుకొంటారు. గృహ వాతావరణం సంతోషకరంగా ఉండును. ధనాదాయం బాగుండును. స్త్రీలకు వ్యక్తిగత జీవితంలో ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. శత్రువులపై విజయం పొందుతారు. ముఖ్యంగా స్త్రీలకు కోర్టు వ్యవహారాలు అనుకూల పరష్కారం లభిస్తుంది. వ్యాపారాలకు కూడా ఈ మాసం కలసివచ్చును. ఉద్యోగులకు సామాన్య ఫలితాలు ఎదురగును. విద్యార్ధులకు కార్య సిద్ధి లభిస్తుంది. గుత్తేదారులు నూతన కాంట్రాక్టులు పొందేదురు. ఈ మాసంలో ద్వితీయ వారం చాలా అనుకూలమైనది.

మార్చ్ 2023 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా ప్రారంభంలో చక్కటి ఫలితాలు ఏర్పరచును. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. వ్యవహారాలు ఆశించిన విధంగా విజయవంతము అగును. జీర్ణ సంబంధ సమస్య వలన కొద్దిగా ఇబ్బంది పడుదురు. స్నేహితుల వలన నూతన అవకాశములు లభించును. 19 వ తేదీ నుండి ధన వ్యయం కొద్దిగా అధికం అగును. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత సమస్యాత్మకంగా మారును. ప్రయాణాలు కలసిరావు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మీ తప్పు లేకుండానే విమర్శలు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనం కూడా కొద్దిపాటి ఒత్తిడితో కొనసాగును. అవిశ్రాంతంగా పనిచేయవలసి వచ్చును. శారీరక విశ్రాంతి లోపించును. ఈ మాసంలో 22,23,25 మరియు 26 తేదీలు అనుకూలమైనవి కావు.














..........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
youtu.be/lI0KjOiN7Qg
twitter.com/VidhathaAstrolo
http://vidhaathaastronumerology.blogspot.com/.../blog...
facebook.com/vidhathaastornumerology/?ref=bookmarks
instagram.com/sreevidhathapeetam
http://vidhaathaastronumerology.blogspot.in/.../blog-post...
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
........











No comments:

Post a Comment