Monday, 4 April 2022

2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు




మూల 1,2,3,4 పాదములు లేదా పుర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి
ఆదాయం- 02, వ్యయం - 08, రాజ పూజ్యం - 06, అవమానం - 01

ధనుర్ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన తల్లి తండ్రుల వలన, భూమి లేదా గనుల సంబంధ పెట్టుబడుల వలన మిక్కిలి లాభములు ఏర్పడతాయి. విద్యార్ధులు చక్కగా విద్యను అభ్యసించి జీవితంలో వికసిస్తారు. స్త్రీల పేరుపై నూతనంగా గృహ సంపదలు ఏర్పడుతాయి. కోరుకున్న విధంగా వాహన సౌఖ్యం ఏర్పరుచుకుంటారు. సన్మానాలు పొందుతారు లేదా సమాజంలో చక్కటి గుర్తింపు పొందుతారు. మీ కష్టార్జితంతో కుటుంబసభ్యులకు సౌఖర్యవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేస్తారు. వైవాహిక మరియు సంతాన సంబంధ విషయాలలో సంతోషకరమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగ జీవనంలో నూతన అధికారాలు ప్రాప్తిస్తాయి. బంధు వర్గంలో మీ పరపతి పెరుగుతుంది. ముఖ్యంగా తల్లి వలన లేదా మాతృ వర్గీయుల వలన అధికంగా లాభ పడతారు. వ్యవసాయదారులకు సంపూర్ణ పంట దిగుబడి లభిస్తుంది. నూతన భూములు కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం అంతా అనుకూలమైన కాలం.

ధనుర్ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని వలన 17-జనవరి-2023 వరకూ అంత మంచి ఫలితాలు ఏర్పడవు. సొంత మనుష్యులను విడిచి పెట్టి దూరంగా ధనార్జన చేయుట మానసికంగా కృంగదీస్తుంది. నేత్రాలకు సంబందించిన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేయు వారికి విఘ్నాలు ఎదురై , వాటిని అధిగమించుట ద్వారా ఈ సంవత్సరం తప్పక వైవాహిక జీవనం తిరిగి ప్రారంభం అవుతుంది. వాహన ప్రమాదంలో ముఖ భాగానికి గాయాలు తగులుతాయి. శనైచ్చరుడు ధనుర్ రాశికి చెందిని వృద్ధులకు మాత్రం ఈ సంవత్సరం అనేక ధన సంపత్తులు ప్రాప్తించునట్లు చేస్తారు. 18-జనవరి-2023 నుంచి ధనుర్ రాశి వారికి గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న ఏలినాటి శని దశ ముగుస్తుంది. కుటుంబ పరమైన చికాకులు తొలగిపోతాయి. నూతన ఆదాయ మార్గాలకు అవకాశాలు లభిస్తాయి. అన్ని విధాల జీవన సంతోషాలు ఏర్పడి చక్కటి మానసిక ప్రశాంతత అనుభవిస్తారు.
ధనుర్ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన ఆర్ధికంగా చెడు ఫలితాలు ఏర్పడవు. కాని సంతాన ప్రయత్నాలను కొద్దిగా నష్టపరచును లేదా స్త్రీ సంతానం లభించునట్లు చేయును. అయితే మగ బిడ్డను దత్తత తీసుకోదలచిన దంపతుల ప్రయత్నాలను మాత్రం విజయవంతం చేయును. తల్లిగారిని ఆనారోగ్య సమస్యలకు గురిచేయును. మీరు ధరించు దుస్తుల పట్ల ఆసక్తి సన్నగిల్లి మలిన వస్త్రాలు తరచుగా ధరించు పరిస్టితులు ఏర్పరచును. ప్రపంచ పర్యాటనలు లేదా దూర ప్రాంత విహారయాత్రలు ఏర్పరచును. విద్యార్ధులకు విద్యాసక్తి పెరుగునట్లు చేయును. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగము లేదా తత్సమాన స్థాయి కలిగిన ప్రైవేట్ ఉద్యోగం లభింప చేయును.

ధనుర్ రాశి వార్కి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన సులువైన ధన సంపదలు లభించును. ధనార్జన పట్ల మిక్కిలి ఆసక్తి ఏర్పడును. ధనం కూడబెట్టుటలో నైపుణ్యం లభిస్తుంది. మీ మాటకు ఇతరులు విలువ ఇస్తారు. మీ సలహాలు తప్పకుండ అమలుచేస్తారు. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం తీవ్ర వ్యతిరేకంగా ఉన్నచో ఏలినాటి శని దశ పూర్తగు వరకూ పైన పేర్కొన్న మంచి ఫలితాలు ఏర్పడవు.

ఏప్రిల్ 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసం అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. గౌరవ ప్రధమైన జీవనం కొనసాగిస్తారు. నూతన ఆదాయ మార్గాల కొరకు ప్రయత్నాలు చేయుటకు ఈ మాసం అనువైనది. ద్వితీయ వారంలో కుటుంబ పరమైన కారణముల వలన ఆఖస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయనములందు చికాకులు ఎదురవుతాయి. తృతీయ వారంలో ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మానసిక శ్రమ తగ్గుతుంది. ఈ మాసం చివరి వారంలో అనగా 22 నుండి 29 తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవన సంతోషాలు సంపూర్ణంగా లభిస్తాయి.

మే 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో తలపెట్టిన పనులలో వేగం తగ్గుతుంది. ఆర్ధికంగా కొంత అభద్రతా భావం ఏర్పడి వృధా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపార వ్యవహారములు సామాన్యంగా కొనసాగుతాయి. విదేశీ పర్యటనలకై ప్రణాళికలు సిద్ధం చేసుకొంటారు. లేదా దూర విహార క్షేత్ర సందర్శన వినోదం ఏర్పడుతుంది. ఈ మాసంలో 17 వ తేదీ తదుపరి నూతన భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించుట లాభించును. కొత్త ఆలోచనలు గుర్తింపునిచ్చును. సృజనాత్మకత మేరుగుపరచుకుంటారు. ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలు మాత్రం కొద్దిపాటి ఆందోళన కలిగించును. సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించుట మిమ్మల్ని ఇబ్బంది పెట్టును.

జూన్ 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రధమ వారం ఆహ్లాదకరంగా ఉండును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం అనుభవిస్తారు. ద్వితీయ వారం ఉద్యోగస్తులకు చేతినిండా పని లభిస్తుంది. అవిశ్రాంతంగా పని చేయవలసిన పరిస్టితులు ఏర్పడతాయి. కుటుంబ విషయాలపై శ్రద్ధాసక్తులు లోపించును. స్త్రీలకూ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ద్వితీయ వారం వరకూ రాబడి బాగుంటుంది. తృతీయ వారం నుండి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ జీవనం నుండి వ్యాపార రంగంలోనికి మార్పిడి ప్రయత్నాలు విఫలం అవుతాయి. కార్యాలయాల్లో సహోద్యోగుల వలన సహకారం లభించదు. మీ ఆలోచనా విధానం ఇతరులకు అర్ధం కాదు. మీ ప్రణాళికలు ఇతరులను మెప్పించలేవు. ఈ మాసంలో 28,29,30 తేదీలు అనుకూలమైనవి కావు.

జూలై 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో పెద్ద వయస్సు వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు చేపట్టిన కార్యములు విజయవంతం అగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. కోరుకున్న వాహనాలు లేదా ఇష్టత కలిగిన ఆభరణాలు కొనుగోలు చేయుటకు ఈ మాసం మంచి కాలం. అన్ని వర్గముల వారికి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపార వర్గములకు ఆశించిన ధన ఆదాయం లభిస్తుంది. ఈ మాసంలో ద్వితీయ వారం అనగా 7 నుండి 14 వ తేదీల మధ్య అనుకోని వివాదాల వలన ధనం ఖర్చవుతుంది. 19 నుండి 25 వరకూ ఉన్న కాలం అన్ని విధములా విజయవంతమైన ఫలితాలు ఏర్పరచును.

ఆగష్టు 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా అనుకూల ఫలితాలు ఏర్పడును. ఆశించిన ధనం చేతికి వచ్చును. వివాదాలు తొలగును. వైద్యులకు ధనాదాయం చాలా బాగుండును. నూతన పెట్టుబడుల నుండి రాబడి పెరుగును. కుటుంబ శుభాకర్యములలో పాల్గొంటారు. మాస మధ్యమంలో నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం లభిస్తుంది. పని చేయు కార్యాలయంలో వృధా ప్రసంగాలు ఇబ్బందులను ఏర్పరచును. ఇతరుల పని భారం కూడా మీపై పడుతుంది. ఈ మాసంలో దురలవాట్ల నుండి బయట పడతారు. వ్యక్తిగత అలవాట్లలో మార్పులు ఏర్పడును. ఈ మాసంలో 5,6,7,8 తేదీలు సంతాన సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైనవి. వడ్డీ వ్యాపారాలు చేయు వారు భారీ ఋణాలు ఇచ్చు ఆర్ధిక సంబంధ విషయాలలో జాగ్రత్త పడుట మంచిది.

సెప్టెంబర్ 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. ఉద్యోగులకు, వ్యాపారస్థులకు సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మీ పై స్థాయి అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన బంధాలు ఆరంభం అవుతాయి. ఎంతో కాలం నుండి కోరుకుంటున్న గృహ నిర్మాణ సంబంధ మార్పులు ఈ మాసంలో చేయగలుగుతారు. విదేశీ నివాస సంబంధ ప్రయత్నాలు మాత్రం విఫలమగును. పట్టుదలతో మరోసారి ప్రయత్నించవలసి వస్తుంది. మాతృ వర్గం వారి ఆరోగ్యం ఆందోళన కలుగ చేస్తుంది. చివరి వారంలో కుటుంబంలో చిన్న తగాదా వలన ఇరుగుపొరుగు వారి ముందు అవమానం ఎదుర్కొంటారు.

అక్టోబర్ 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో చేయు ప్రయాణాలు కలసివచ్చును. తలపెట్టిన యాత్రలు ఆనందకరంగా ముగియును. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగును. కుటుంబ అవసరాలు పెరిగినా అవసరాలకు సరిపడు ధనం సమకూరును. పనులు సకాలంలో పూర్తి అగును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ద్వితీయ వారంలో కొద్దిపాటి వృధా శ్రమ ఎదుర్కొంటారు. 16 నుండి 23 వ తేదీ వరకూ కొంచం ప్రతికూల కాలం ఎదుర్కొంటారు. ఏ పనీ చేయకుండా కాలం వృధా చేసుకొంటారు. తిరిగి 24వ తేదీ తదుపరి ప్రోత్సాహవంతంగా ఉండును. వ్యక్తిగత జీవితానికి సంబందించిన ముఖ్య నిర్ణయాలు తీసుకొనుటకు అనువైన కాలం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. విద్యార్ధులకు ఉత్తమ విద్యాభ్యాసం లభిస్తుంది. పోటీ పరీక్షలలో తప్పక విజయం వరిస్తుంది
.
నవంబర్ 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆదాయం సామాన్యం. కుటుంబ సభ్యుల మధ్య పోయిన సఖ్యత - అనుబంధాలు తిరిగి స్థిరపడును. దాయాదుల మధ్య ఉన్న కుటుంబ తగాదాలు సమసిపోతాయి. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. వ్యాపార వర్గం వారికి చక్కటి లాభపూరిత కాలం. వ్యాపారములు వ్రుద్ధి చెందును. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన అవకాశములు లేదా ప్రాజెక్టులు లభించును. కుటుంబంలోని స్త్రీల పేరుపై స్థిరాస్థి ఏర్పడును. మాసాంతానికి నిర్దేసించుకున్న పరిధిని మించి ఖర్చులు అధికం అవుతాయి. వ్యక్తిగత జీవనలో సంతోషములు ఉన్నవి.

డిసెంబర్ 2022 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. వ్యాపారములందు ముఖ్యంగా విదేశే వ్యవహార సంబంధ వ్యాపారం చేయు వారికి తీవ్రమైన నష్టం ఎదురగును. పితృ వర్గం వారి ఆలోచనా విధానం మీకు నచ్చదు. కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. స్థిరాస్థి వ్యవహారాలలో అమ్మకాలు నష్టపరుచును. ఈ మాసం ఉదరకోశ వ్యాదులు ఉన్న వారికి ప్రమాదకర కాలం. 17 వ తేదీ తదుపరి ఆర్ధిక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. శుభకార్యములకు ఆహ్వానములు లభిస్తాయి. బహుమతులకు ధనం వ్యయం చేస్తారు. సంతానంతో అధిక సమయం గడపగలుగుతారు. సంతాన అభిమానాన్ని గెలుచుకుంటారు. మాసాంతంలో శ్లేష్మ సంబంధ ఆరోగ్య సమస్య బాధిస్తుంది.

జనవరి 2023 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ధనాదాయం సామాన్యం. పెరిగిన ఖర్చులకు తగినంతగా రాబడి వుండదు. ఉద్యోగులకు కెరీర్ పరంగా కొత్త అవకాశములు లభించును. గృహ సంబంధ విషయాలకై తరచుగా తిరగవలసి వచ్చును. నిర్మాణ వ్యయం అదుపు తప్పుతుంది. తక్కువ స్థాయి ఆలోచనా విధానం కలిగిన వారితో కలసి పనిచేయవలసి వస్తుంది. సమయ పాలన పాటించలేరు. మంచి అభివృద్ధికరమైన ఆలోచనలను కార్యాచరణలో పెట్టలేరు. అంటువ్యాధుల వలన సమస్యలు ఎదుర్కొనే సూచన ఉన్నది. ఈ మాసంలో 5,10,14,17,22, 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి పనికిరావు.

ఫెబ్రవరి 2023 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆర్ధికంగా బాగుండును. విలాస వంతమైన జీవన విధానాన్ని రుచి చూస్తారు. దీర్ఘకాలిక ఆర్ధిక ప్రణాళికలు రూపొందిస్తారు. పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పరచుకోగాలుగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అగుట, నూతన పనులు ప్రారంభించుట జరుగును. అల్ప సుఖములకై అలోచించేదరు. ప్రేమ సంబంధ వ్యవహారాల వలన అపఖ్యాతి లేదా బంధువుల అనాదరణ పొందుతారు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో విరోధాలు ఉన్నవి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్త్రీ సంతాన సౌఖ్యం లభిస్తుంది. మాసాంతానికి వ్యక్తిగత పరిస్థితులలో కొద్దిపాటి అనుకూలత లభిస్తుంది. మీ వ్యాపకాలకై సమయాన్ని కేటాయించగలుగుతారు. స్వార్ధాన్ని విడిచిపెట్టి కుటుంబ క్షేమం కోసం శ్రమిస్తారు.
మార్చ్ 2023 ధనుర్రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుంటుంది. బంధు వర్గంతో ఏర్పడిన చికాకులు క్రమంగా తొలగి పరిస్థితులు మెరుగు అగును. మీ వాగ్ధాటితో పెద్దలను ఆకర్షించగలుగుతారు. వారి ప్రమేయంతో వివాదాలు పరిష్కారం అగును. వ్యాపారాలు ఆశాజనకంగా నడుస్తాయి. పారిశ్రామిక వేత్తలకు చక్కటి వ్రుద్ధి ఏర్పడును. గృహ వాతావరణంలో సంతోషాలు ఉన్నాయి. పరిస్థితులు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ అవసరాల కొరకు శ్రమించి అందరి అభిమానాన్ని పొందుతారు. బహుమతులు గెలుచుకోనుటకు అవకాశం ఉన్నది. ఉద్యోగ జీవనంలో అదనపు బాధ్యతలు చేపడతారు. అపనిందలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహరాలలో ఉత్కంట ముగుస్తుంది. వ్యర్ధ ప్రయత్నాలు విరమించుకుంటారు.


..........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
youtu.be/lI0KjOiN7Qg
twitter.com/VidhathaAstrolo
http://vidhaathaastronumerology.blogspot.com/.../blog...
facebook.com/vidhathaastornumerology/?ref=bookmarks
instagram.com/sreevidhathapeetam
http://vidhaathaastronumerology.blogspot.in/.../blog-post...
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............

No comments:

Post a Comment