ఉత్తరాషాడ 2,3,4 పాదములు లేదా శ్రవణం 1,2,3,4 పాదములు లేదా ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి
ఆదాయం- 09, వ్యయం- 02, రాజ పూజ్యం- 02, అవమానం- 04
మకరరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన మీ వద్ద ధనం ఉన్నా ఆ ధనం వలన సౌఖ్యం లేని జీవనం ఏర్పడును. సోదర సోదరి వర్గం వారి వలన మీరు ఆర్ధికంగా చికాకులు ఎదుర్కొందురు. వారి కొరకు ధనం అధికంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది.
జీవిత భాగస్వామి తరపు బంధువర్గం వలన అవమానములు పొందేదురు. జీర్ణశక్తి కి సంబందించిన ఆరోగ్య సమస్యలు బాధించును. తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఖర్చులు పెరిగినా అవసరానికి తగిన ధనం సకాలంలో లభిస్తుంది. కుత్సిత స్వభావం తో శ్రేయోభిలాషులను దూరం చేసుకుంటారు. మీ కుటుంబ ప్రీతిని సొంత మనుష్యులకు తెలిసేవిధంగా ప్రవర్తించాలి. విద్యార్ధులకు అతి చక్కటి విద్యాభ్యాసం ఏర్పడుతుంది మరియు కెరీర్ పరంగా ఆశించిన విజయాలు పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం అంత కలసి రాదు.
ఖచ్చితంగా లభిస్తుంది అనుకున్న అవకాశం చివరి నిమిషంలో చేజారిపోవును. రచనా రంగం లోని వారికి ఈ సంవత్సరం గురు గ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉన్నది. మీ రచనలు అత్యంత ఆదరణ పొందుతాయి. వ్యవసాయ దారులు ఒక పంట నష్టపోవుదురు.
మకరరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని వలన చిన్న పిల్లలను తరచుగా అనారోగ్య సమస్యలు బాధించును. అధికారులతో, పెద్దలతో మాట్లాడునపుడు అనవసర సంభాషణల వలన కోరి కష్టాలు తెచ్చుకుంటారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఏమాత్రం కలసి రాదు. నిత్య దురదృష్టం వెంటాడుతుంది. (వ్యక్తిగత జాతకంలో నీచ భంగం జరిగిన శని ఉన్న జాతకులకు మాత్రం రాజతుల్య జీవనం లభిస్తుంది.) పరదేశ అలవాట్ల పట్ల ఆకర్షితులు అవ్వడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్ర విరోధాలు మిమ్మల్ని ఒంటరిని చేస్తాయి. నల్లని వస్తువులు, నల్లని వాహనాల విషయంలో సదా జాగ్రత్తగా ఉండవలెను. మకర రాశి వారు తరచుగా శనైచ్చరుడిని ఆరాధించుట, శాంతి జపములు జరిపించుకోనుట మంచిది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కుడా మకర రాశి వారికి ఏలినాటి శని దశ జరుగుచున్నది. కావునా ఈ సంవత్సరం కూడా మీరు సాహసోపేతమైన , అదృష్టం పై ఆధారపడు నిర్ణయాలు తీసుకొనుట మంచిది కాదు. అతినమ్మకం పనికిరాదు. షేర్ మార్కెట్ లేదా సినిమా రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టుట కలసిరాదు. విదేశీ ఉద్యోగ లేదా నివాశ ప్రయత్నాలు విజయవంతం అవ్వవు. విదేశ విశ్వవిద్యాలయములందు చదువు కోవాలనే వారికి మాత్రం మంచి అనుకూలత ఉంది.
మకర రాశి వారికీ శ్రీ శుభకృత్ నామ సంవతసరంలో రాహువు వలన పెద్ద వయస్సు వారికి మతిభ్రమణ సమస్యలు ఏర్పడతాయి. సంతాన ప్రవర్తన మీకు ఆందోళన కలుగ చేస్తుంది. సంతానం వలన ధన నష్టములు ఎదుర్కొంటారు. మీకు సహజ గుణమైన వాగ్ధాటిని కోల్పోతారు. బంధువులతో తాత్కాలిక ద్వేషాలు ఏర్పడుతాయి.
మకర రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన మాత్రం శుభ ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలోని వారికి (క్రయ విక్రయాలు చేయు వారికి ) కలసి వస్తుంది. పురాణ జ్ఞానం లభిస్తుంది. ఆధ్యాత్మిక భావాలు కలిగిన సాధకులకు తప్పక ఆత్మా జ్ఞానం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మకర రాశి వారికి గురువు మరియు కేతు గ్రహాలు మాత్రమే అనుకూల ఫలితాలు ప్రసాదిస్తున్నారు.
ఏప్రిల్ 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో చక్కటి ఫలితాలు ఏర్పడును. నూతన వ్యాపార వ్యవహార ప్రారంభాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఈ మాసంలో ఎత్తైన ప్రాంతాలు లేదా కొండ మార్గాలలో సంచరించునపుడు జాగ్రత్తగా ఉండవలెను. విదేశే ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు ఎదురగును. ప్రభుత్వ ఉన్నత అధికారులకు చక్కటి కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి జీవనంలో నూతన మార్పులు సంభవిస్తాయి. ఆధునిక పరికరాలను సమకుర్చుకుంటారు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆశించిన సహకారం పొందగలుగుతారు. మీ కృతజ్ఞతా భావమును అనేక రకాలుగా తెలియచేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మాసంలో చివరి వారంలో 23 నుండి 26 వ తేదీ వరకు తలపెట్టిన పనులు ఆటంకాలు ఎదుర్కొంటాయి.
మే 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసం పితృ వర్గీయులకు ఆరోగ్య విషయంగా మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు, వ్యాపార వర్గం వారికి నష్టములు ఎదురగు సూచన. ఉద్యోగ జీవనంలో నైపుణ్యాన్ని పెంచుకోనవలెను. ధన ఆదాయం తగ్గును. వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడానికి కృషి చేస్తారు. కుటుంబ ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. తలపెట్టిన ప్రయాణాలు శ్రమతో కుడి ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కలిగిన వారికి ఈ మాసంలో వ్యాధి తీవ్రత అధికం అగు సూచనలు ఉన్నవి. వ్యక్తిగత జీవనం బాగుండదు. ఈ మాసంలో 5,6,12,13,19,29 తేదీలు అనుకూలమైనవి కావు.
జూన్ 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో స్తంభించిన కార్యములు పునః ప్రారంభం అగును. పట్టుదలతో వ్యవహారాలలో విజయం సొంతం చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేయువారు కొన్ని విషయాలను దాచి పెట్టడం మంచిది. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. కుటుంబ శ్రేయస్సుకై శ్రమించెదరు. గృహ లేదా వాహన కొనుగోలుకు ఈ మాసం అనుకూలమైనది. అవకాశములను సద్వినియోగం చేసుకోగలుగుతారు. కుటుంబ సంపద వ్రుద్ధి చెందును. నూతన ఆలోచనలు కార్య రూపంలో పెట్టుటకు కాలం అనుకూలంగా ఉండును. మాస ద్వితియార్ధంలో అన్ని విధమైన విఘ్నాలు తొలగును.
జూలై 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఉద్యోగ, వ్యాపార వృత్తి జీవనం వారికి సామాన్య ఫలితాలు ఎదురగును. విద్యా సంబంధ వ్యాపారములు చేయు వారికి అతి చక్కటి లాభములు లభించును. నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ఫలించును. నూతన వ్యాపార ప్రారంభాలకు లేదా నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు ధనం సకాలంలో అందుతుంది. తృతీయ వారం నుండి నిరంతరం కష్టించి పనులు సకాలంలో పూర్తి చేయుదురు. పదోన్నతి పొందుటకు కార్యాలయంలో వాతావరణం ఉత్సాహపూరితంగా ఉండును. నూతన వస్తువులు గృహంలో సమకుర్చుకుంటారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలకు పరిష్కారం లభించును. మాసాంతంలో విందు వినోదాలు, కుటుంబ మిత్రులతో కలయికలు. ఆహ్లాదకరమైన సమయం ఎదురగును.
ఆగష్టు 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వివాహ సంబంధ ప్రయత్నాలకు తగిన గ్రహ బలాలు లేవు. జీవిత భాగస్వామికి కూడా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురగు సూచనలు ఉన్నవి. భాత్రు వర్గంతో సఖ్యత పెరుగుతుంది. ప్రధమ వారం సంతాన ప్రయత్నాలు చేయువారికి కలసివస్తుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ధనాదాయం సామాన్యం. ద్వితీయ లేదా తృతీయ వారాలు గృహంలో ఒక శుభ కార్యం వలన సందడి నెలకొంటుంది. అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. 20,21,22 తేదీలలో నూతన పరిచయాలు లేదా పెద్దల సహచర్యం లభిస్తుంది. నూతన పదవులు ఆశిస్తున్న వారికి ఈ మాసం మనోవంచ ఫలసిద్ధి లభింపచేస్తుంది.
సెప్టెంబర్ 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు ఎదురగును. ఉద్యోగ, వ్యాపార వృత్తి జీవనం వారికి అనుకూలమైన మిక్కిలి లాభపుర్తితమైన కాలం. మీపై విమర్శలు చేయువారికి గట్టిగ సమాధానం చెప్పగలుగుతారు. 14 నుండి 18 వ తేదీ మధ్యకాలం నూతన ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండును. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. తెలివితేటలు ప్రదర్శించి పనులు పూర్తీ చేయించుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్త లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పెద్దవయస్సు వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయనములు ధన లాభాలను చేకుర్చును.
అక్టోబర్ 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. వ్యాపారస్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయంగా ప్రాధాన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులు నూతన భవిష్యత్ ప్రణాళికలు రుపొందిన్చుకొంటారు. ఉద్యోగ ఉన్నతి లేదా స్థాన మార్పిడి ప్రయత్నాలు ఫలవంతం అగును. విద్యార్ధులకు సంకల్ప సిద్ధి లభించును. చిత్ర రంగ పరిశ్రమ వారికి అతి చక్కటి కాలం. స్త్రీలకు సువర్ణ సంబంధ కోరికలు నెరవేరతాయి. తల్లితండ్రుల కు చక్కటి ప్రయాణ సౌఖర్యమును ఏర్పాటు చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చూపే ఆప్తులు లభిస్తారు.
నవంబర్ 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆదాయ - వ్యయములు సమానంగా ఉండును. గృహ సంబందిత విషయాల వలన శ్రమ అధికం అవుతుంది. ఉద్యోగ జీవనంలో ద్వితీయ వారం అంతగా కలసిరాదు. పై అధికారుల వలన సమస్యలు, పనులు పూర్తీ చేయుటలో వైఫల్యం వలన మాటపడు సంఘటనలు ఎదురగును. శ్రవణా నక్షత్రం వారికి ఈ మాసంలో 10,11,12,13 తేదీలలో జాగ్రత్త అవసరం. కొద్దిగా ప్రమదపూరిత సంఘటనలు ఎదురగు సూచన ఉన్నది. తృతీయ వారంలో స్నేహవర్గం తోడ్పాటు వలన ప్రయోజనం పొందుతారు. ఆర్ధికంగా ధనం సర్దుబాటు చేసుకుంటారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వలన, పనులు కావాలని వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. 24వ తేదీ తదుపరి అనుకూల పరిస్టితులు లభిస్తాయి. విధేయతతో కూడిన ప్రవర్తన వలన మంచి జరుగుతుంది.
డిసెంబర్ 2022 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో అన్ని వర్గముల వారికి ఆదాయం ఆశించిన స్థాయిలో వ్రుద్ధి చెందును. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. వ్యాపార వ్యవహారాలు బాగుండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ద్వితీయ తృతీయ వారములు అనుకూలమైనవి. పనులు వేగవంతంగా పూర్తీ అవుతాయి. ఈ మాసంలో కుడా అధికారులతో జాగ్రత్తగా మేలగవలెను. కుటుంబ వ్యక్తులతో చర్చించి ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలకు కుటుంబ అంగీకారం లభిస్తుంది. మాసాంతంలో విలాసాల పట్ల ఆకర్షితులు అవుతారు. విలాసాల కోసం ధనం ఖర్చు చేస్తారు.
జనవరి 2023 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో శత్రువులు కూడా మీ మిత్రులుగా మారుటకు సహాయపడు గ్రహ బలములు కలవు. గృహ నిర్మాణం చేయువారికి లేదా గృహ సంబంధ ఋణములు పొందుటకు ఈ మాసం అనుకూల కాలం. ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కలసివచ్చును. తృతీయ వారంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల వలన సమస్యల నుండి బయటపడతారు. చివరి వారంలో సామాన్య ఫలితాలు ఎదురగును.
ఫెబ్రవరి 2023 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసంలో చేపట్టిన పనులు క్రమంగా సఫలమగును. ఆర్ధికంగా కలసివచ్చును. ముఖ్యంగా భూ సంబంధ క్రయ విక్రయాలు కలసివచ్చును. ప్రధమ వారంలో వ్యక్తిగత జీవితం గురించిన శుభవార్త. చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం. వైవాహిక జీవనంలో సమస్యలు తగ్గును. ఆదాయ పెరుగుదల కోసం చేయు ప్రయత్నాలు ఫలవంతం అగును. ఈ మాసంలో ప్రధమ మరియు ద్వితీయ వారాలు బాగా కలసి వచ్చును. తృతీయ మరియు చతుర్ధ వారాలు సామాన్య ఫలితాలు ఏర్పరచును. ఈ మాసంలో 6,7,10,11 తేదీలు అనుకూలమైనవి.
మార్చ్ 2023 మకర రాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రారంభంలో ధనాదాయం సామాన్యం. విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత నివాశ ప్రయత్నాలు చేయటకు అనుకూల కాలం. గౌరవం పెరుగుతుంది. అారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన పెట్టుబడులు కలసివస్తాయి. బాగా ఎదిగిన సంతానంతో కొద్దిపాటి తగవులు ఏర్పడతాయి. కోర్టు తీర్పులు ప్రతికూలంగా ఉండును. తృతీయ వారాలలో చేపట్టిన పనులలో సులువుగా కార్య జయం ఏర్పడుతుంది. రచనా వ్యాసంగాలలో రాణింపు ఉంది. మాసాంతంలో నూతన వస్తు లాభాలు పొందుతారు. .
..........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............
No comments:
Post a Comment