అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును.
2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 14 , రాజ పూజ్యం - 03, అవమానం - 06.
మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-ఏప్రిల్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం లో గురు గ్రహం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. గురు గ్రహం వలన వృధా గా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వచ్చును. కుటుంభ సభ్యుల కొరకు, వారికి సంబందించిన శుభ కార్యముల కొరకు అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. దైవ సంబంధ కార్యముల కోసం, అనాధల కోసం శారీరకంగా శ్రమ పడుదురు. మీ ఉదార గుణం, సేవా స్వభావం వలన సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఆర్జించేదరు. మేషరాశి కి చెందిన చిన్న పిల్లలు ఈ సంవత్సరం అంతా తరచుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనును. రాజకీయ నాయకులు డాంభికంగా ప్రవర్తించేదురు. ప్రజా వ్యతిరేకత వలన బాధ పడుదురు. సంతాన ప్రయత్నాలు చేయు వారికి నిరాశ ఎదురగును. వంశ పెద్దల ఆశీస్సులు , దైవ అనుగ్రహం అవసరం. మీ మిత్ర వర్గం నుండి మీరు విడిపోవు సూచనలు ఉన్నవి. భాగస్వామ్య వ్యాపారాలు చేయు వారు ఆర్ధిక - యాజమాన్య విషయాలలో జాగ్రత్త వహించుట మంచిది. మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో గురు గ్రహం అనుకూల ఫలితాలు ఇవ్వరు.
మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. సొంత ఇంటి కొరకు ఆలోచిస్తున్నవారికి అతి చక్కటి గృహ సౌఖ్యం ఈ సంవత్సరం ఏర్పడుతుంది. లోహ సంబంధ వ్యాపారములు, నల్లని భూములు, నల్లని ధాన్యాలతో వ్యాపారం చేయువారికి మిక్కిలి లాభములు లభించును. విదెశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి, ఇతర దేశ పౌరసత్వ ప్రయత్నాలు చేయు మేషరాశి వారికి ఈ సంవత్సరం శని వలన అనుకూల ఫలితాలు ఏర్పడును. (వ్యక్తీ గత జాతకం లో శని బలం లేని వారికి ఇది వర్తించదు). ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించిన ప్రమోషన్లు లభిస్తాయి. అయితే మేషరాశి వారికి శ్రీ శనైచ్చరుడు ఈ సంవత్సరం మాత్రు వర్గ విషయాలలో దుఃఖం ఏర్పరచడానికి సూచనలు అధికంగా ఉన్నవి. మాత్రు వర్గీయుల ఆరోగ్య విషయాలలో ఈ సంవత్సరం అంతా సదా జాగ్రత్త వహించవలెను. వ్యక్త్రిగత ఆరోగ్య విషయాలలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి 18-జనవరి-2023 నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. శారీరక బాధల నుంచి బయట పడతారు. వైద్య విద్య అభ్యసించాలి అని ప్రయత్నిస్తున్న విద్యార్ధులకు 18-జనవరి-2023 తదుపరి అతి చక్కటి అనుకూల కాలం లభిస్తుంది. నూతన వాహన కొనుగోలుకు కుడా ఈ కాలం అనుకూలత ఏర్పరచును. రాజ్యాంగ పదవులలో ఉన్న వారికి ప్రభుత్వం వలన మిక్కిలి లాభములు ఏర్పడును. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని దశ లేదు.
మేషరాశి వారికి శుభకృత్ నామ సంవత్సరంలో రాహు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఏర్పరచును. మేష రాశి వారు నూతన ఆదాయ మార్గముల కోసం ఆలోచించెదరు. సంపాదన బాగున్నా లభించిన ధనార్జనలో మాత్రం మానసిక సంతృప్తి లభించదు. ఎంతో కాలంగా పూర్తీ చేయాలనీ భావిస్తున్న సాహస కార్యక్రమాలు ఈ సంవత్సరం పూర్తీ చేయగలుగుతారు. శరీర వర్ణం కొంత నల్ల బడుతుంది. వ్యక్త్రి గత జాతకంలో రాహు గ్రహ బలం లేని లేదా తీవ్ర స్థాయి సర్ప దోషం కలిగి సంతానం కోసం ప్రయత్నిస్తున్న స్త్రీలు గర్భ సంబంధ సమస్యలు ఎదుర్కోను సూచనలు అధికంగా ఉన్నవి కావునా గర్భవతులు మిక్కిలి జాగ్రత్తలు పాటించవలెను.
మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన అనేక సమస్యలు ఏర్పడును. ముఖ్యంగా వైవాహిక జీవనం తీవ్ర ఓడిడుకులు ఎదుర్కొనును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు అంత త్వరగా విజయవంతం అవ్వవు. విడాకుల కోసం ఎదురుచుస్తున్న వ్యక్తులకు ఈ సంవత్సరం తప్పక కళత్ర నష్టం ఏర్పడును. యువతను ఈ సంవత్సరం కేతువు పాపపు పనులు చేయుటకు మరియు వ్యసనముల పట్ల ఆకర్షితులు అగుటకు ప్రేరేపించు అవకాశములు అధికంగా ఉన్నవి. కావునా యువత ఇంద్రియ నిగ్రహం పాటించుట అలవర్చుకోనవలెను. దేవుడు ప్రసాదించిన చక్కటి ఆరోగ్యమును వ్యసనముల వలన , సుఖ వాంఛ వలన పాడుచేసుకోకుండా కాపాడుకోనవలెను.
ఏప్రిల్ 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వ్యాపార ధన సంబంధ వ్యవహారాలు సామాన్యం. చేపట్టిన పనులలో బాధిస్తున్న స్తబ్ధత కొంత తొలగును. ఈ మాసంలో మాతృ సంబంధ బంధు వర్గంలో ఒకరికి మంచిది కాదు. ద్వితీయ వారం ప్రారంభంలో భూ సంబంధ లేదా గృహ సంబంధ స్తిరాస్థి విషయాలలో లాభం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలోని వారికి మంచి అనుకూల స్థితి. ఈ మాసంలో మీ జీతంలో పెరుగుదల కొరకు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నాలు చేయవచ్చు. మాస ద్వితియార్ధంలో వ్యాపార వర్గం వారికి ఆశించిన లాభాలు. ఈ మాసంలో 6,12,19 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో ఆర్ధిక పరమైన విషయాలలో కన్నా కీర్తి ప్రతిష్టల విషయంలో అధిక అనుకూలత ఉన్నది. కొంత శత్రు వృద్ధి కి అవకాశం ఉన్నది.
మే 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసం వ్యక్తిగత జీవనంలో సంతోషాలను, సౌఖ్యమును కలుగచేయును. అన్ని వర్గముల వారికి ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. జన్మించిన స్థానం నుండి ఉత్తర దిశలో వివాహ సంబంధాలు కుదురుతాయి. ఈ మాసంలో రెండవ మరియు మూడవ వారంలో ఒక చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవలసిన సూచన ఉన్నది లేదా శరీరానికి చిన్న అనారోగ్యం ఏర్పడును. చివరి వారం మేషరాశి వారు నూతన బాధ్యతలు చేపట్టినచో అతి చక్కటి ఫలితాలు కలుగచేయును. భూ సంబంధ లేదా వాహన సంబంధ క్రయ విక్రయాల వలన లాభ పడుదురు. సంతాన సంబంధ ప్రయత్నాలకు కూడా చివరి వారం అనుకూలం.
జూన్ 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాస ప్రారంభం నుండి 21 వ తేదీ వరకూ అంతగా కలసి రాదు. ఈ మాసంలో ఆఖస్మిక వివాదాలు, తగవుల వలన చికాకులు ఎదురగును. వైవాహిక జీవనంలో సమస్యల వలన విచారత ఎదుర్కొందురు. మిత్ర - బంధు బలం ఉన్నా అవసరానికి ఉపయోగపడదు. స్వజన విరోధాల వలన నష్టములు ఎదురగును. 22 వ తేదీ నుండి ప్రయత్న పూర్వక విజయాలు లభిస్తాయి. ఇతరులకు ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతారు. భారీ పనులు పూర్తీ చేయడానికి ఆరోగ్యం సహకరిస్తుంది. మొత్తం మీద ఈ మాసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోడుండా ఉండడం మంచిది.
జూలై 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. భయపడిన విధంగా తీవ్ర ఆటంకములు ఎదురవ్వవు. జీవిత భాగస్వామి నుండి సహకారం లభించడం వలన సమస్యల నుండి బయట పడతారు. సకాలంలో కుటుంబ సభ్యులకు వైద్య సహాయం అందించగలుగుతారు. ఉద్యోగ, వివాహ మరియు బ్యాంకు రుణ ప్రయత్నాలు చేయుటకు ప్రధమ ద్వితీయ వారాలు అనుకూలమైనవి.అయితే గృహ నిర్మాణం ప్రారంభించుటకు లేదా కొనుగోలు సంబంద ప్రయత్నాలు చేయుటకు ఈ మాసం కలసిరాదు. ఉద్యోగులకు, వ్యాపార, వృత్తి జీవనం వారికి ధనార్జన పరంగా సాధారణ ఫలితాలు. ఈ మాసంలో 16, 17, 20, 29 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు.
ఆగష్టు 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసం ఆగిపోయిన పనులు పునః ప్రారంభం చేయడానికి అనుకూల కాలం. వ్యాపార విస్తరణకు, నూతన ప్రయత్నాలకు, పరదేశ వీసా సంబందిత ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు ఈ మాసం మంచి అనుకుల కాలం. అయితే మేషరాశికి చెందిన చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నవి. కనిష్ట సోదరుల విషయంలో ఒక సమస్య ఉన్నది. 11 నుండి 15 వ తేదీల మధ్య కాలం రాజీ ప్రయత్నాలు చేయుటకు అత్యంత అనుకూల కాలం. ఈ కాలంలో మిమ్మల్ని చిరాకు పరుస్తున్న విఘ్నాలు వాటంతట అవే తొలగిపోవును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో పై అధికారుల వలన ఒత్తిడులు లేదా అఖస్మిక ఉద్యోగ నష్టం. విలాస వస్తువులు కొనుటకు ఇది అంత అనుకూల మాసం కాదు. తీర్ధయతలు చేయడానికి కూడా ఈ మాసం అనుకూల కాలం కాదు.
సెప్టెంబర్ 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఉద్యోగ జీవితంలో ఒక గొప్ప విజయం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు సులువుగా మిక్కిలి ధనాన్ని ఆర్జించగలుగుతారు. ప్రారంభించిన నూతన కార్యములు వేగంగా ముందుకు సాగుతాయి. దైవ సంబంధ ధర్మకార్యములలో పాల్గొంటారు. అన్ని రకముల వ్యాపారములలో ఆదాయ పెరుగుదలకు సూచనలు ఉన్నవి. మేషరాశికి చెందిన స్త్రీలకూ ఈ మాసంలో శుభ ఫలితాలు కలవు. అన్ని రంగాల వారికి ఈ మాసం కలసివచ్చు గ్రహ స్థితులు కలవు.
అక్టోబర్ 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో చక్కటి ధనాదాయం కొనసాగును. కుటుంబ జీవనంలో మరియు వ్యక్తిగత జీవితంలో ఆశించిన సంతోషాలు పొందగలుగుతారు. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం లభిస్తుంది. క్రీడా రంగంలోని వారికి ఈ మాసం చక్కటి ప్రోత్సాహకరమైన కాలం. మీ శ్రమ ప్రభుత్వ ఉద్యోగాన్ని లభింప చేస్తుంది. ఉద్యోగ జీవనంలో ప్రశంసలు పొందుతారు. మాట నిలబెట్టుకోవడానికి పట్టుదల కనబరుస్తారు. తృతీయ వారంలో మాత్రం ఇతరులకు ఋణములు ఇచ్చుట వలన ధన నష్టములు ఉన్నవి. అలానే బంధు వర్గం గృహాలను సందర్సించుట వలన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందురు. బయటి ఆహార విషయాలలో జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 18, 23, 24 మరియు 26 తేదీలు అనుకూలమైనవి కావు.
నవంబర్ 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొందురు. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడుట మీ కార్యక్రమాలను ఆటంక పరుస్తుంది. ఈ మాసం ప్రధమ వారంలో అఖస్మిక అపజయాలు లేదా ధన నష్టములు ఎదురగును. న్యాయస్థాన సంబంధ విషయాలలో అనేక చికాకులు ఎదురగును. కార్యాలయాలలో మీ సహోద్యోగులకు మీ పట్ల ఉన్న భావాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయుట మంచిది. 22 వ తేదీ తదుపరి స్థిరాస్థి వ్యాపారులకు అనువైన కాలం. వ్యక్తిగత మరియు వ్రుత్తి జీవనంలో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ జీవనంలోని సమస్యల నుండి బయటపడతారు. సంతాన అననుకూలత కూడా ఉన్నది. ఈ మాసంలో 5,6,11,13 తేదీలు అనుకూలమైనవి కావు.
డిసెంబర్ 2022 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో అన్ని వర్గముల వారికి ధన ఆదాయం కొంత తగ్గును. యువతకు మానసిక అశాంతి అధికం అవుతుంది. స్త్రీ సంబంధ విషయాలు మానసికంగా కొంత ఆందోళన కలిగించును. పురుషుల ప్రతిష్టకు నష్టం ఎదురగుతుంది. ఈ మాసంలో 2 వ తేదీ నుండి 7వ తేదీ మధ్య కాలంలో నూతన ఒప్పందాలకు దూరంగా ఉండుట మంచిది. 13,14 తేదీలలో ప్రయాణాలు చేయుట మంచిది కాదు. తృతీయ వారంలో ధనాదాయం కొంత పెరుగును మరియు వ్యాపార ఉద్యోగ పరమైన ప్రయాణాలు చేయుట కలసి వచ్చును. ఆశించిన సహకారం ఇతరుల నుండి పొందేదురు. వివాహ ప్రయత్నాలకు ఈ మాసం అంత అనుకూల కాలం కాదు. 28,29,30 తేదీలు సంతాన పరంగా శుభ ఫలితాలు కలుగ చేస్తాయి.
జనవరి 2023 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. కుటుంబ సభ్యుల పట్ల అధిక ప్రేమానురాగాలు ప్రదర్శిస్తారు. జీవన అభివృద్ధికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్థి లేదా వారసత్వ సంబంధ సంపదల విషయంలో ఉన్న చికాకులు తొలగుతాయి. ఇతరులకు సంబందించిన అనవసర వివాదాలలో ప్రమేయం వద్దు. విద్యార్ధులకు శ్రద్ధ లోపిస్తుంది కానీ తమ శక్తిని మించిన పనులను నెత్తిన పెట్టుకుంటారు. కుటుంబంలోకి నూతన బంధువర్గం చేరికలు ఏర్పడతాయి. ద్వితీయ తృతీయ వారాలు సామాన్య ఫలితాలు. మంచి చెడులను నిశితంగా పరీక్షించ గలుగుతారు. ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలని భావిస్తారు. కుటుంబ సబ్యుల సుఖశాంతులను చూసి ఆనందిస్తారు. చివరి వారంలో ఇతరులు మీ సమానాన్ని విమర్శించుట బాధిస్తుంది. ఆధ్యాత్మిక యోగం ఉన్నది, ఇష్ట దేవతా దర్శనభాగ్యం లభిస్తుంది.
ఫెబ్రవరి 2023 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో భాత్రు వర్గంతో మీకున్న సమస్యలు తగ్గుతాయి. ధనదయం బాగుంటుంది. సంతాన సంబంధ శుభవార్త వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆత్మవిమర్శ చేసుకొనుట మీకు మంచి చేస్తుంది. నూతన పరిచయాలు లభిస్తాయి. వైవాహిక జీవనం సుఖప్రధంగా ఉండాలి అనే మీ కోరిక సర్దుకు పోయే స్వభావాన్ని ఏర్పరస్తుంది. ధన విషయాలపై మీ జీవిత భాగస్వామితో ముఖ్య చర్చలు జరుపుతారు. తృతీయ వారంలో విపరీత అనుభవాలు ఎదురవుతాయి. వృధాగా ఆశలు పెట్టుకొనుట వలన చికాకులు ఎదుర్కొంటారు. ఈ మాసంలో చివరి వారం వివాహ ప్రయత్నాలకు, ఉద్యోగ మార్పులకు, నూతన పెట్టుబడులకు అనుకూలమైనది. మొత్తం మీద ఈ మాసంలో మీ ఆత్మ విశ్వాసం మెరుగుపరచుకుంటారు. స్థిరమైన ఉద్యోగ జీవనానికి మార్గం లభిస్తుంది
మార్చ్ 2023 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆశించిన ధన లాభాలు పొందగలుగుతారు. వేదాంత ఉపాశనలందు అభివృద్ధి పొందుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆలోచనలు సరైన రీతిలో ప్రయాణిస్తాయి. పెద్దలతో చర్చలు ఫలించును. ఉన్నత వర్గీయులతో పరిచయాలు పెంచుకుంటారు. బహుమతులు ఇవ్వడం వలన అవరోధాలు అధిగమిస్తారు. మీ పరిశ్రమ, వాగ్ధాటి వలన గౌరవం పెంచుకోనగలుగుతారు. ధనార్జన పరంగా ఈ మాసం మొత్తం ఆర్ధికంగా సంతృప్తికర కాలం. రచయితలకు భావనాశక్తి పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణాలు చిన్నపాటి సమస్యలతో పూర్తవుతాయి. ఆర్ధిక లక్ష్యాలను నేరవేర్చగలుగుతారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఈ మాసంలో 2,5,9,14,18 తేదీలు అంతగా అనుకూలమైనవి కావు.
...........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............
No comments:
Post a Comment