విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశికి చెందును.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి
ఆదాయం - 14, వ్యయం - 14, రాజ పూజ్యం - 03, అవమానం
వృచ్చికరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంతాన సంబంధ విషయాలలో అత్యంత అనుకూల ఫలితాలు ఏర్పడును. దీర్ఘకాలంగా సంతానం కొరకు ప్రయత్నిస్తున్న దంపతులకు ఈ సంవత్సరం తప్పక సంతాన సౌఖ్యం లభిస్తుంది. బాగా ఎదిగిన పుత్ర సంతానం చక్కటి స్థితిలో స్థిరపడుట వలన మిక్కిలి ఆనందం అనుభవిస్తారు. అవివాహితులకు అతి చక్కటి వివాహ సంబంధాలు లభిస్తాయి. ప్రేమ వివాహాలకు పెద్దల అనుమతి లభిస్తుంది. విడిపోయిన స్నేహ బంధాలను తిరిగి ప్రారంభిస్తారు. మిత్రుల వలన లాభ పడతారు. మీ ప్రమేయంతో అందరికి ఇష్టమైన భారీ కార్యక్రమలు కుటుంబంలో నిర్వహిస్తారు. భవిష్యత్ గురించిన దూరాలోచన మంచి చేస్తుంది. వాహన సౌఖ్యం ఏర్పాటు చేసుకొంటారు. వ్యాపారములు ఆశించిన విధంగా లాభకరంగా కొనసాగుతాయి.
నాయకులకు ఉన్నత రాజకీయ అధికారము లభిస్తుంది. వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురు గ్రహం వలన సంపూర్ణంగా మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి శని వలన 17-జనవరి-2023 వరకూ మానసిక ధైర్యం కొంచం తగ్గుతుంది. పూర్వపు రోజుల లో ఉన్న సాహస స్వభావం లేదా ఉద్రేక స్వభావం ఉండదు. మీ వలన మీ సోదర సోదరిలకు బాగా కలసి వస్తుంది. వారిని కూడా మీతో పాటు ఆర్ధికంగా ఎదుగునట్లు చేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు పరదేశాలలో లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సులువైన ధన సంపాదన అధికంగా లభిస్తుంది. 18-జనవరి-2023 నుంచి మనశ్శాంతి ఉండదు. గౌరవ ప్రదం కాని పనులు చేయవలసి వస్తుంది. అధిక వ్యయం ఏర్పడుతుంది. కళత్ర జీవనంలో సౌఖ్యం ఉండదు. క్రమ క్రమంగా బంధు వర్గానికి దూరం అవుతారు. వారసత్వ సంపద మీరు చేసిన కొన్ని తప్పిదాల వలన కొంత వ్యయం అవుతుంది. విద్యార్ధులకు విద్యా విఘ్నాలు ఎదురవుతాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృచ్చికరాశి వారికి ఏలినాటి శని దశ లేదు.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి రాహువు వలన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైద్య లేదా శస్త్ర చికిత్సలు విజయవంతం అవుతాయి. మీ వెంటే ఉంటూ మీపై కుట్రలు పన్ను వారిని గుర్తించ గలుగుతారు. నూతన శత్రువులు ఎవరూ ఈ సంవత్సరంలో తయారు అవ్వరు. ప్రత్యర్ధుల ఎత్తుగడలను నశింప చేయగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం రాహువు వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి కేతువు వలన తలపెట్టిన పనులు ప్రారంభంలో విఘ్నములు పొంది ఆ తదుపరి విజయవంతం అవుతాయి. మీ చేతిపై కర్మ కార్యములు చేయవలసి వస్తుంది. మరణానంతర మోక్షము అనే విషయం పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. దైవ చింత పెరుగుతుంది. మనస్సులో ఆలోచనలు కాంతి వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. మానసికంగా అనవసర చాంచల్యత అనుభవిస్తారు. అయితే వృచ్చిక రాశి వారిని కేతువు ఆర్ధికంగా నష్ట పరచరు.
ఏప్రిల్ 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సంతాన సంబంద ఆనందం లభిస్తుంది. వ్యక్తిగత జీవనంలో చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది. సజ్జన సాంగత్యం వలన విషయ పరిజ్ఞానం పెంచుకొంటారు. పుత్రికా సంతతి కలిగిన వారికి నూతన బాధ్యతలు ఏర్పడతాయి. చివరి వారంలో అధిక శారీరక శ్రమ ఎదురవుతుంది. పేర్కొనదగిన ఇతర ప్రధాన ఫలితాలు ఏమియూ ఈ మాసంలో లేవు. సాధారణ యోగంతో జీవనం కొనసాగుతుంది.
మే 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో 13వ తేదీ వరకూ వ్యాపారస్థులకు అనుకూల కాలం. ఆశించిన విధంగా వ్యాపార లాభాలు పొందగలుగుతారు. వినోద రంగంలోని వారికి కూడా బాగా కలసివచ్చును. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందుటకు తగిన గ్రహ బలాలు ఈ మాసంలో కలవు. కోర్టు వ్యవహారాలలో తీర్పులు మీకు అనుకూలంగా ఇవ్వబడతాయి. 14వ తేదీ నుండి మిశ్రమ ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగును. అజాగ్రత్త వలన విలువైన వస్తువులు పోగొట్టుకొను సూచనలు ఉన్నవి. వృధా వ్యయం ఏర్పడుతుంది. కెరీర్ పరంగా ఆశించిన ఫలితాలు లభించవు. రక్షణ రంగంలో సేవ చేయువారికి ఈ మాసంలో 19 నుండి 26 వరకూ అంత మంచి సమయం కాదు. ఈ మాసంలో 03 నుండి 12 వరకూ వివాహ మరియు నూతన కార్యముల ప్రారంభ విషయాలకు అనుకూలమైన రోజులు.
జూన్ 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా ఫలితాలు మిశ్రమంగా ఉండును. విద్యార్ధులకు ఈ మాసం బాగా కలసివచ్చును. ఆశించిన ఉన్నత విద్యనందు ప్రవేశం లభించును. ప్రేమవ్యవహరములలో లేదా వ్యక్తిగత జీవితంలో స్పష్టత లభించును. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్ధిక విషయాలలో అత్యాశ వలన చేతిలో ఉన్న అవకాశములు చేజారు సూచన ఉన్నది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. నూతన వస్త్ర సౌఖ్యం ఏర్పడుతుంది. గృహ అలంకరణ విషయాలపై దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం లభిస్తుంది. బంధువర్గం వలన ఎదుర్కొంటున్న నరఘోష ఈ మాసంలో తగ్గుతుంది.
జూలై 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నములు మాత్రం కేతు గ్రహం వలన విఫలం అగును. జీర్ణ సంబంధ లేదా నరముల సంబంధ ఆరోగ్య సమస్యలు బాధించు సూచన ఉన్నది. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ఈ మాసంలో 8 నుండి 15 వ తేదీల మధ్యకాలంలో వాహన చోదన విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా అనురాధా నక్షత్ర జాతకులు జాగ్రత్త వహించాలి. వ్యాపారములందు శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు మరియు మూలధనాన్ని సమీకరించుకొంటారు. ధన సమీకరణలో జీవిత భాగస్వామి వలన లాభ పడతారు. 22 వ తేదీ తదుపరి ఉద్యోగస్తులకు చక్కటి ప్రశంసలు లేదా ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. రాజకీయ రంగంలోని వారు కీర్తిని ఆర్జించ గలుగుతారు.
ఆగష్టు 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసం ఆరోగ్య పరంగా అంత మంచిది కాదు. ముఖ్యంగా 10వ తేదీ నుండి 16వ తేదీ మధ్య ఆరోగ్య పరంగా జాగ్రత్త పడాలి. పెద్ద వయస్సు స్త్రీలకు మూత్ర సంబంధ సమస్యల వలన ఇబ్బందులు ఎదురగును. ఈ మాసంలో ధనాదాయం కూడా కొంత తగ్గును. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గును. లక్ష్యాలను సకాలంలో పూర్తీ చేయలేరు. మానసిక ఏకాగ్రత కోరవడును. ఒంటరిగా, ధైర్యంగా ఉండవలసిన పరిస్థితులు ఎదురగు సూచన ఉన్నది. నూతన వ్యక్తులతో మాటలడునప్పుడు లేదా వ్యవహరించుటలో జాగ్రత్త అవసరం. 23 వ తేదీ తదుపరి దూర ప్రయాణాలు లాభించును. సామాన్య జీవన యోగములు సిద్దించును.
సెప్టెంబర్ 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ప్రారంభించిన ప్రయత్నములు అన్ని ఫలవంతం అగుటకు చక్కటి గ్రహ స్థితులు కలవు. ఆరోగ్య సమస్యలు ఉపసమించును. వ్యాపారములు లాభకరంగా నడుచును. ఉద్యోగ జీవనంలో మార్పులు చేయుటకు కూడా ఈ మాసం మంచిది. ఉద్యోగ జీవనంలో పదోన్నతి పొందు అవకాశములు ఉన్నవి. ఆర్ధికంగా వ్యయం తగ్గును. నిల్వ ధనం ఏర్పరచుకోనగలరు. అవివాహితులకు చక్కటి సంబంధం లభించును. పూర్వకాలపు ఋణ భారం వదిలించుకుంటారు. సన్నిహితుల తోడ్పాటు సకాలంలో లభిస్తుంది. మొత్తం మీద ఈ మాసం చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును.
అక్టోబర్ 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా అనుకూల ఫలితాలు కొనసాగును. చట్టపరమైన సమస్యలు తగ్గును. వ్యాపార వ్యవహారాలు బాగుండును. ఉద్యోగంలో మాత్రు స్థానానికి స్థానచలనం కోరుకొనే వారికి ఈ మాసంలో కోరిక ఫలించును. నిరుద్యోగులకు శుభవార్త. ఆశించిన విధంగా ఉద్యోగ జీవితం ఆరంభం అవుతుంది. వీసా సంబంధిత ప్రయత్నాలకు కూడా ఇది మంచి కాలం. తలపెట్టిన పనులు అన్ని చక్కగా పూర్తి అగును. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందగలరు. స్నేహబంధాలు బలపడును. మిత్ర వర్గంతో వినోద్ కార్యక్రమాలలో పాల్గొంటారు. 26 వ తేదీ తదుపరి చిన్న అనారోగ్యం లేదా పని ఒత్తిడిలో పెరుగుదల ఎదుర్కొంటారు.
నవంబర్ 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. ఉద్యోగ వ్యాపారములలో ఆకస్మిక సమస్యలు, అకారణంగా మాటపడుట, నిందలకు గురిఅగుట వంటి సంఘటనలు ఎదురగును. ధన ఆదాయం సామాన్యం. చేపట్టిన పనులు అతివిశ్వాసం వలన ఆలస్యమగును. కార్య దక్షత, స్వీయ నిగ్రహం అవసరం. ఆశ్రద్ధతో కూడిన ధోరణి వలన ఆర్ధిక నష్టాలు ఎదుర్కొంటారు. ఈ మాసంలో అతి ధైర్యం పనికిరాదు. భాత్రు వర్గమునకు మీ సహకారం అవసరమగును. ఈ మాసంలో 2,13,14,20 మరియు 29 తేదీలు కలసిరావు.
డిసెంబర్ 2022 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆర్ధికంగా అనుకూల గ్రహ బలాలు ఉన్నవి. కానీ వ్యక్తిగత జీవనంలో తీవ్ర ఒడిదుడుకులు, జీవిత భాగస్వామి విముఖత, జీవిత భాగస్వామి తరపు కుటుంబం నుండి ఊహించని సంఘటనలు ఎదురగు సూచన. బంధువర్గంతో సామరస్యంగా , మర్యాదగా ప్రవర్తించుట మంచిది. కుటుంబ బాధ్యతలను విస్మరించడం వలన మాటపడుదురు. వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నవి. దూరదృష్టి అవసరం. ప్రత్యర్ధులను తక్కువగా అంచనా వేయుట వలన వ్యాపారంలో పోటీ పెరుగును. ఈ మాసంలో కేవలం చివరి వారం మాత్రమే కార్య సఫలతను ఏర్పరచును. 10 నుండి 13 వరకూ మానసిక ఆందోళన ఎదుర్కొందురు. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు కలసిరావు.
జనవరి 2023 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసం పిత్రు వర్గీయులకు ఆరోగ్య పరంగా అంత మంచిది కాదు. ప్రధమ వారంలో నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. అన్ని వర్గముల వారికి ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకోనుదురు. మొహమాటం వలన నష్టపోవుదురు. ద్వితీయ వారంలో స్నేహవర్గానికి సంబందించిన ఒక దుర్వార్త వినుటకు సూచన ఉన్నది. తృతీయ వారం బంధు వర్గ సమాగమం - తన్ములక కుటుంబ సౌఖ్యం లభించును. నూతన బంధుత్వాలు లభిస్తాయి. 20వ తేదీ నుండి 25 వ తేదీల మధ్య ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయుట మంచిది. 26 వ తేదీ తదుపరి కార్యానుకూలత లభిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధ సంపద వృద్ధికి చక్కటి అవకాశములు లభించును.
ఫెబ్రవరి 2023 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనవ్యయం కొంత పెరుగును. అవసరములకు తగిన ధనం అందుట కష్టం. శనైచ్చరుని ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. తన్మూలక చికాకులు ఎదురగును. ఆలోచనల్లో విశాల దృక్పధం, తార్కికతత్వం అవసరం. లేనిపోని అనుమానముల వలన వ్యక్తులను దూరం చేసుకొంటారు. తగవులలో ఓటమిపాలగుదురు. స్థిరాస్థి విక్రయాలకు ఇది మంచి మాసం కాదు. ఆశించినంతగా లాభం రాదు. ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు ఎదురగును. అహాన్ని విడిచిపెట్టాలి. సహోద్యోగుల వలన అశాంతి ఎదురగును.
మార్చ్ 2023 వృచ్చికరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సొంత గృహం లేదా భూమి కొరకు ప్రయత్నించుటకు అనుకూలమైన గ్రహ స్టితులు కలవు. వృత్తి వ్యాపారములు గత మాసంకంటే లాభదాయకంగా కొనసాగును. విదేశీ జీవన ప్రయత్నములకు, వివాహ ప్రయత్నాలు చేయుటకు ఈ మాసం అనుకూలమైనది. మాత్రు వర్గీయుల వలన లాభం ఏర్పడుతుంది. జ్యేష్టా నక్షత్ర జాతకులకు ఈ మాసంలో ద్వితీయ మరియు తృతీయ వారములు అదృష్టవంతమైన కాలం. ఆర్ధికంగా ఎదుగుదల లభించును. శత్రు విజయం మానసికంగా మిక్కిలి బలాన్ని ఏర్పరచును. కుటుంబ సభ్యులతో ఆనందకర సమయం గడపగలుగుతారు.
..........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
youtu.be/lI0KjOiN7Qg
twitter.com/VidhathaAstrolo
http://vidhaathaastronumerology.blogspot.com/.../blog...
facebook.com/vidhathaastornumerology/?ref=bookmarks
instagram.com/sreevidhathapeetam
http://vidhaathaastronumerology.blogspot.in/.../blog-post...
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............
No comments:
Post a Comment