Monday 4 April 2022

2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు




మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభరాశి.

2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి
ఆదాయం - 08 వ్యయం - 08, రాజ పూజ్యం - 06, అవమానం - 06

వృషభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం అతి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. కుటుంబంలో మీ పలుకుబడి పెరుగుతుంది. న్యాయవంతంగా విశేషమైన ధన - భూ సంపదలు ఏర్పరచు కొనగలరు. మిత్ర వర్గం వలన ఉద్యోగ లాభాలు పొంది నిరుద్యోగ కష్టాల నుంచి బయట పడతారు. ఆధ్యాత్మిక స్వభావం అలవడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కని పుత్ర సంతాన సౌఖ్యం లభిస్తుంది. ( పుత్ర సంతానం పొందు విషయంలో జీవిత భాగస్వామికి కూడా వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం ఉండాలి). వ్యాపార రంగంలోని వారికి ఆర్ధిక లాభాలు పుష్కలంగా ఉన్నవి. కళా రంగంలోని వారికి ముఖ్యంగా సంగీత సాధకులకు ఈ శుభకృత్ నామ సంవత్సరం అఖండ విజయాలను ఏర్పరుస్తుంది. వృషభ రాశి వార్కి ఈ సంవత్సరం అన్ని పౌర్ణమి రోజులు విశేషంగా కలసి వస్తాయి.
అదేవిధంగా రాజకీయ నాయకులకు, వైద్యులకు ఈ సంవత్సరం అత్యంత లాభకరంగా ఉండును.
వృషభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని గ్రహం మిశ్రమ ఫలితాలు ఏర్పరచును.

17-జనవరి-2023 వరకూ ఇబ్బందులను కలుగ చేయును. న్యాయస్థానములందు అపజయం, శత్రువుల వలన మానసిక అశాంతి, అదృష్ట హీనత వలన చిన్న విషయాలకు కూడా అధికంగా కష్ట పడవలసిన పరిస్టితులు ఎదురగును. పితృ వర్గీయులకు ఈ కాలం మంచిది కాదు. పక్షవాత సంబంధ ఆరోగ్య సమస్యలు ఎదురగు సూచనలు అధికంగా ఉన్నవి. వారసత్వ సంపద విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఖర్చులను అదుపులో పెట్టుకోనుట నేర్చుకోవాలి. మంత్ర శాస్త్రాన్ని అవహేళన చేయకూడదు. 18-జనవరి-2023 నుంచి శనైచ్చరుడు చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరుస్తారు. ముఖ్యంగా ఉద్యోగ జీవులకు మంచి చేయును. ఉద్యోగ ఉన్నతి లేదా జీతంలో పెరుగుదల ఆశించవచ్చు. కోరుకున్న ప్రదేశానికి స్థాన చలనం లభిస్తుంది. వ్యవసాయ ఆధారిత జీవనం చేయువారికి కూడా ఆకస్మిక ధన లాభములు లభించును. సన్యాస ఆశ్రమం తీసుకొనవలెను అని అనుకొనేవారికి, ఆద్యాత్మిక జీవనంలో గురు పరిచయ భాగ్యం కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. అయితే నూతన వ్యాపార ప్రారంభాలకు ఈ సంవత్సరం అంత అనుకూల కాలం కాదు. నూతన వ్యాపారాలు అనుకున్న విధంగా లాభించవు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృషభరాశి వార్కి ఏలినాటి శని దశ లేదు.

వృషభ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా చెడు ఫలితాలు ఎదురగును. వృషభ రాశి వారి చేతిపై వృధాగా విశేష ధనం వ్యయం అగును. నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యల వలన శస్త్ర చికిత్స అవసరం అగు సూచన ఉన్నది. చోరుల వలన ఆర్ధికంగా నష్టం ఎదుర్కొందురు. వ్యక్త్రిగత జాతకంలో రాహువు నీచ క్షేత్రంలో కలిగిన వారికి ఆకస్మిక ఉద్యోగ నష్టము లేదా రహస్యముగా చేస్తున్న పాపపు కార్యముల వలన మిక్కిలి దుఃఖము సంభవించును. ఈ జాతకులు జీవితంలో ఉన్నత స్థానం నుంచి ఒక్కసారిగా పతనం చెందును. మొత్తం మీద వృషభ రాశి వారికి రాహువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇవ్వరు.
వృషభ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతువు మంచి ఫలితాలు ఏర్పరచును. మానసిక చాంచల్యత తగ్గునట్లు చేయును. మానసిక రుగ్మతలు తగ్గించును. బాగా ఎదిగిన స్త్రీ సంతానం వలన వారి తల్లితండ్రులు చక్కటి సౌఖ్యం అనుభవించుదురు.

ఏప్రిల్ 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో తగాదాల వలన లేదా కోర్టుకేసులు లేదా పోలిసుల జోక్యం వలన చికాకులు ఎదురగును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. అవసరాలకు సరిపడు ధనాదాయం మాత్రం పొందగలుగుతారు. ఉద్యోగ జీవనంలో మిత్రుల తోడ్పాటు లభించి అభివృద్ధికర ఫలితాలు ఏర్పడతాయి. 18 వ తేది తదుపరి దూర ప్రాంత ప్రయానమూలు చేయుట వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడుట లేదా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల వలన ధనం వ్యయం అగుట జరుగును. స్త్రీలు అతిగా ఆలోచించడం వలన చక్కటి అవకాశములను నష్టపోవుదురు. చివరి వారంలో వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం, సంతాన ప్రయత్నాలు ఫలప్రదం అగుట, స్వతంత్ర విద్య వలన ధనం ఆర్జించువారికి సన్మానములు వంటి మంచి ఫలితాలు ఏర్పడును.

మే 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వైవాహిక జీవనంలో అననుకూల సంఘటనలు బాధిస్తాయి. ఉద్యోగ జీవితం మాత్రం చక్కగా కొనసాగుతుంది. భాత్రు వర్గం వలన లాభపడతారు. ద్వితీయ తృతీయ వారాలలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయువారికి నష్టములు, శత్రు బాధ బాధించును. భవిష్యత్ ప్రణాళికలు రచించుటకు లేదా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనుటకు 19 వ తేదీ వరకూ అనుకూలత ఉండదు. 20 వ తేదీ తదుపరి చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగ ప్రయత్నాలకు మంచి అనుకూల కాలం. భూ సంబంధ క్రయ విక్రయాలకు కుడా అనుకూల కాలం. మాతృ వర్గీయుల వలన లాభములు పొందుతారు. ఈ మాసంలో 1,2, 6, 20, 22, 29 తేదీలు అనుకూలమైనవి.

జూన్ 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా ఆశించిన విధంగా శుభ ఫలితాలు కలుగచేయును. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో విజయం పొందుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు మరియు పై అధికారుల మన్ననలు లభిస్తాయి. గృహ నిర్మాణ సంబంధ రుణ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకుందురు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉండును. మీ మనోభావాలు కుటుంబ సభ్యుల ముందు వ్యక్తీకరించడానికి ఇది చక్కటి అనుకూల మాసం. కుటుంబ పరమైన ఖర్చులు కొంత వరకూ తగ్గించగలుగుతారు. సంఘ సంస్కర్తలతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల ద్వారా జీవిత అనుభవాలు పెంపొందించుకుంటారు. చివరి వారంలో ఆప్తుల నుండి బహుమతులు పొందుతారు.

జూలై 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రధమ వారంలో ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవయరాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెద్ద వయస్సు వారికి చేయించే శస్త్ర చికిత్సలు విజయవంతం అవుతాయి. ప్రధమ మరియు ద్వితీయ వారాలలో చేపట్టిన నూతన పనులు వేగంగా పూర్తి అవుతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలకు, భవిష్యత్ గురించిన ఆలోచనలు గావించడానికి, వృత్తి రహస్యాలు తెలుసుకోవడానికి ఈ మాస ప్రధమ భాగం మంచి అనుకూల కాలం. తృతీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. చివరి వారంలో ఒక చిన్న ప్రమాదం వలన ధననష్టనికి అవకాశం ఉన్నది. మరియు పనిచేసే కార్యాలయంలో తోటి ఉద్యోగుల వద్ద ఇతరుల గురించి మాట జారకుండా ఉండుట మంచిది.
ఆగష్టు 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసం అంత అనుకూల మాసం కాదు. ముఖ్యంగా సంతాన సంబందిత విషయాలు అనుకూలంగా ఉండవు. ధనాదాయం కొంత తగ్గుతుంది. హృదయ సంబంధ సమస్యలు కలిగిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్థి విషయాలకై బంధు వర్గం సహకారం అర్దిస్తారు. ఈ మాసంలో 14 వ తేదీ నుండి 17 వ తేదీ వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సులువుగా సమస్యలలో చిక్కుకుంటారు. రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్టలు తగ్గును. చివరి వారంలో ఆర్ధికంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది. కానీ కుటుంబ గౌరవ విషయంలో మీకు నచ్చని ఫలితాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఆశాభంగం కలుగచేస్తాయి.

సెప్టెంబర్ 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసం కొంత అనుకూలమైన ఫలితాలు ఏర్పాటు చేస్తుంది. నూతన ఆదాయ మార్గముల పరంగా అనుకూల ఫలితాలు ఏర్పడును. ఆశించిన విధంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన పనులు విజయవంతం అగును. గృహస్తులకు ఆశించిన భాగ్యం చేతికి వచ్చును. విద్యార్ధులకు చక్కటి విజయలు ఏర్పడతాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కోరుకున్న పనులన్నీ జరుగుతాయి. దూర దేశ ప్రయత్నాలు చేయువారికి, కళాకారులకు అదృష్టం కలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లభించిన నూతన బాధ్యతల వలన గౌరవం, హోదా పెరుగుతుంది. ఈ మాసంలో కర్తవ్య నిర్వహణలో చక్కటి క్రమశిక్షణ ప్రదర్శిస్తారు. కొంత మందితో మిత్రుత్వం కొనసాగించుట పట్ల సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మొత్తం మీద ఈ మాసం అనుకూల ఫలితాలను ఏర్పరుస్తుంది.

అక్టోబర్ 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా తృతీయ వారం వరకూ లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. పుణ్యక్షేత్ర సందర్శన కోరిక తీరుతుంది. బంధు వర్గం తో విందు వినోదాలలో పాల్గొంటారు. మనోవాంచ్చా ఫలసిద్ధి లభిస్తుంది. జీవన మార్గంలో ఆశించిన చక్కటి అభివృద్ధి ప్రాప్తిస్తుంది. స్త్రీలకు ఆత్మవిశ్వాసం పెంపొందించే సంఘటనలు ఎదురవుతాయి. తృతీయ వారం నుండి కొద్దిగా పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. ముఖ్యంగా దురాశ వలన సమస్యలు ఎదుర్కొంటారు, జీవిత భాగస్వామి సంబంధిత వ్యవహారాలలో గొడవలు, సంతాన సంబంధ వ్యయం, ఉద్యోగులకు పని సంబంధ ఒత్తిడులు ఎదురగును. ఈ మాసం వ్యాపార రంగంలోని వారికి మాత్రం అంతగా లాభములు ఏర్పరచదు. ముఖ్యంగా 22 నుండి 25 వ తేదీలలో జాగ్రత్తగా ఉండవలెను.

నవంబర్ 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. జీవన మార్గంలో సమస్యలు, ఊహించని విధంగా నష్టములు, అధిక ధన వ్యయం వంటి చికాకులు తరచుగా బాధించు సూచన. కుటుంబ జీవనం ప్రశాంతంగా ఉండదు. వ్యాపార, వృత్తి వ్యవహారాలు సామాన్యగా కొనసాగును. వ్యసన సంబంధ అలవాట్ల వలన ఒక చెడు ఫలితం లేదా ప్రమాదం. రహస్య కార్యాచరణలు అపవాదులను ఏర్పరుస్తాయి. కుటుంబ సభ్యుల ముందు తలవంపులు ఎదుర్కొనవలసి వస్తుంది. అతి నమ్మకంతో భారీగా ఆర్ధిక నష్టాలు కొనితెచ్చుకుంటారు. ఈ మాసంలో 13,14,20 తేదీలు ఎంత మాత్రం అనుకూలమైనవి కాదు. ఈ మాసంలో అదృష్టాన్ని నమ్ముకొని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనుట మంచిది కాదు.
డిసెంబర్ 2022 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మొదటి ద్వితీయ వారాలలో గృహంలో అనారోగ్య సమస్యల వలన చికాకులు ఏర్పడును. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో ప్రారంభ చిక్కులు ఎదురైనా చివరికి విజయవంతం అవుతాయి. విద్యార్ధులకు లక్ష్య సాధనలో ఆటంకాలతో కూడిన విజయం లభిస్తుంది. నమ్మక ద్రోహనికి గురి అవ్వడం వలన అశాంతికి లోనవుతారు. 15 వ తేదీ తదుపరి కొంత అనుకూలత ప్రారంభం అవుతుంది. ధనాదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తీ అవుతాయి. అడ్డంకులు తొలగి ఉద్యోగ పరంగా ఆశించిన శుభవార్త వింటారు. మీ పేరుపై భూ లేదా గృహ సంబంధ సంపద ఏర్పరచుకోవడానికి ఈ మాసం చివరి వారం అనుకూలమైన కాలం. మాసాంతంలో మనసుకు నచ్చిన వారితో విందు-వినోదాలలో పాల్గొంటారు.

జనవరి 2023 వృషభరాశిరాశిఫలాలు:
ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఏర్పడును. ఆశించిన విధంగా ధనం చేతికి వచ్చును. నూతన కార్యములను ఉత్తరాయణ కాలం ప్రారంభం తదుపరి మొదలుపెట్టండి. ఆటంకములు తొలగిపోతాయి. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవనంలో ఒత్తిడులు తొలగుతాయి. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మాసాంతానికి కుటుంబ పరమైన ఖర్చులు అదుపు తప్పుతాయి. వివాహ ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొనుట వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మధ్యవర్తుల మాటలను గుడ్డిగా నమ్మకుండా స్వయంగా పరిస్టితులను పరిశీలించండి. ఈ మాసంలో 25 నుండి 30 వ తేదీ మధ్యకాలం సంతాన ప్రయత్నాలు చేయువారికి అనుకూల కాలం. జీవిత భాగస్వామి సంబంధ భూమి కుటుంబానికి లభిస్తుంది.

ఫెబ్రవరి 2023 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు కొనసాగుతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు తిరిగి మొదలు పెట్టడానికి ఈ మాసం మంచి కాలం. కుటుంబంలో సమస్యలు తగ్గి పరిస్థితులు చక్కబడును. ద్వితీయ తృతీయ వారములలో వినోదం కొరకు అధికంగా ధన వ్యయం చేస్తారు. ఈ మాసంలో ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని వర్గముల వారికి ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. .ఈ మాసంలో 20 వ తేదీ తదుపరి రుణాలను తీర్చివేయు అవకాశములు లభిస్తాయి. మనోవిచారం తొలగుతుంది. వారసత్వ పరంగా ఒక శుభ వార్త వింటారు. ధర్మ బద్దంగా అధిక ధనార్జన చేయగలుగుతారు. ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వడం వలన మీ పనులు సకాలంలో పూర్తీ చేయగలుగుతారు.

మార్చ్ 2023 వృషభరాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలనే కలుగచేయును. వృధా ధన వ్యయం మరియు వైవాహిక జీవనంలో సమస్యలు తగ్గుతాయి. మిత్ర వర్గంతో పట్టుదలకు పోవుట వలన సమస్యలు ఎదుర్కొంటారు. తృతీయ వారం ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలకు అనుకూల కాలం. మాసాంతానికి ఆర్ధిక పరిస్థితులలో చక్కటి అనుకూలత సాధిస్తారు. ఈ మాసంలో,8,19,25,26,27 తేదీలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. ఈ తేదీలు వృషభ రాశి కి చెందిన అన్ని నక్షత్రముల వారికి మంచి చేస్తాయి.
...........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను

" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి

సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............

No comments:

Post a Comment