Saturday 2 April 2022

రామాయణం పారాయణం వలన కలుగు ఫలితాలు

 





రామాయణ పారాయణం భారతీయులకు నిత్యకృత్యం. ఎక్కడైతే రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ ఎల్లప్పుడు సుఖ సంతోషాలు వేల్లువిరుస్తాయి. లోకములోని సమస్త ఉత్తమ గుణాలకు ,ధర్మాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు. భారత జాతి ఆత్మారాముడు అందుకీ ఈ జగమంతా రామమయంగా బావిస్తోంది. రామాయణం వ్యక్తి ధర్మం, కుటుంభ ధర్మం, సంఘ ధర్మం అను త్రివేణి ధర్మ సంఘమంగా చెప్పుతారు. నేటి సమాజం లో అంతకంతకు అంతరించిపోతున్న నైతిక విలువల బలం పుంజుకోవాలంటే రామాయణ పటనం అనివార్యం. రామాయణం భారతీయ సంస్కృతికి పుట్టినిల్లు.

సంతానం కోసం అనేక రకాలు అయిన వ్రతాలు, నోములు, మంత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి రామాయణ పారాయణం. సంతానం కలగటం కోసం రామాయణం పారాయణం చేయవచ్చు. రామాయణం - బాలకాండ లోని 15 & 16 సర్గ భార్య భర్తలు ఇద్దరు నియమ నిష్టలతో పారాయణం చేయాలి . వచనం చదవటం కాదు , శ్లోకాలు మాత్రమే చదవాలి . అప్పుడే అది పారాయణం కిందకి వస్తుంది . ఈ సర్గలో ఏముంది ? దశరధ మహారాజుకి పిల్లలు కలగకపోవటం తో తన భార్యలు అయిన కౌసల్య , సుమిత్ర , కైకేయి , పుత్రకామేష్టి యాగం చేస్తాడు.

యాగ గుండం నుంచి అగ్ని దేవుడు ప్రత్యక్షమయి పాయస పాత్ర ఇచ్చి దీనిని తన భార్యలకి ఇమ్మని చెప్పి అంతర్ధానమయ్యాడు . యాగం సఫలం అవటం తో ఋషులు , రాజు అందరు సంతోషించారు. తరువాత పాయస పాత్రలోని సగ భాగాన్ని కౌసల్యకి ఇచ్చాడు , మిగిలిన సగం లో సగాన్ని సుమిత్ర కి ఇచ్చాడు . మిగిలిన పావు లో సగ భాగం కైక కి ఇచ్చాడు . ఈ ప్రకారంగా ముగ్గురు భార్యలకి పాయసం పంచటం తో ముగ్గురు అత్యంత భక్తి శ్రద్ధలతో దానిని సేవించారు గర్బం దాల్చారు . ఒక శుభ ముహూర్తంలో కౌసల్యకి - శ్రీరాముడు , కైక - భరతుడు , సుమిత్రకి, లక్ష్మణ , భరత , శత్రుగ్నులు జన్మించారు . సంతానం కోరుకునే వారు ఈ 15 & 16 సర్గలు, దశరధ మహారాజు కి సంతానం కలగలేదు కాబట్టి పుత్రా కామేష్టి యాగం తలపెట్టి నపట్టినుంచిపారాయణం చేయాలి.

రామ నవరాత్రులో చదువుకుంటే మంచిదే . కానీ ఇప్పుడే పారాయణ చేయాలి అని నియమ ఏమి లేదు . ఎవరికీ వీలయితే అప్పుడు ఒక శుభ ముహూర్తం చూసుకుని లేదా జన్మ నక్షత్రం రోజున , ప్రారంబించాలి. ప్రాతఃకాలం లో శుచిగా చేయాలి . పిల్లలు కావాలి అనుకుంటే అది ఇద్దరికీ సంబంధించి విషయం . ఇద్దరు అర్ధం చేసుకుని ఒకరి కోసం ఒకరు అర్ధం చేసుకుని సహకరించుకుంటూ చదువుకోవలి. భర్త చదివితే భార్య వినటం , భార్య చదివితే భర్త వినటం లేదా ఎవరికీ వారు పారాయణం చేసుకోవచ్చు . ఇందులో ఎ ఒక్కరు చేసిన సరిపోతుంది . అయితే చేసే ముందుసీతా రామ, లక్ష్మణ, హనుమ కలసిన విగ్రహం గాని, పటాన్ని గాని, ముగ్గురు రాణులు నలుగురు పిల్లల్ని ఉయ్యాలలో వేసిన పటాన్ని గాని ఉంచి దీపారాధన చేసి, రామాయణ గ్రంధానికి కూడా పూజ చేసి చదువుకోవాలి .

మహా నైవేద్యం : క్షీరాన్నం పెట్టాలి . ఆవు పాలతో , అన్నం బెల్లం , నేయి వేసి చేసిన క్షీరాన్నం నివేదన చేసి హారతి ఇవ్వాలి . ఈ ప్రసాదం భార్య భర్త ఇద్దరు తినాలి . ఇలా ఒక 20 రోజులు చేయాలి అని ఉమా సంహిత చెప్తుంది . ఇద్దరు నియమ నిష్టలతో ఉండాలి . రామ నామ సంకీర్తన చేయాలి.




ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/...
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
whatsapp group
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371















No comments:

Post a Comment