Monday 4 April 2022

2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు



మఘ 1,2,3,4 పాదములు లేదా పుబ్బ 1,2,3,4, పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి
ఆదాయం - 08, వ్యయం - 14, రాజ పూజ్యం - 01, అవమానం - 09.
సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన ఎక్కువగా ప్రతికూల ఫలితాలే ఎదురగును. కుటుంబ సంబంధ వ్యవహారముల వలన ఆర్ధిక వ్యయం అధికంగా ఉండును. పెద్దల పట్ల సదా వినయం కలిగి ప్రవర్తించవలెను. లేనిచో కుటుంబ పెద్దలతో తీవ్ర విభేదాలు ఎదురగును. వ్యాపారస్తులు ఈ సంవత్సరం నూతన భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండుట మంచిది. శారీరక శుభ్రత లోపించుట వలన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందురు. సరైన సమయానికి మందబుద్ది ఏర్పడుట వలన సంభాషణల్లో మీ మాట చెల్లదు. జీవన మార్గములో తరచుగా సుఖ హీనత ఎదుర్కొందురు. అయితే గురువు ఈ సంవత్సరం మీకు తరచుగా పుణ్య క్షేత్ర సందర్శనా భాగ్యం ఏర్పరచును. ఈ సంవత్సరం సింహరాశి నందు జన్మించిన వారికి పూర్ణాయువు లభించును. మొత్తం మీద ఈ సంవత్సరం సింహరాశి వారికి గోచార రిత్యా గురు గ్రహ బలం అంత అనుకూలంగా లేదు.
సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 17-జనవరి-2023 వరకూ శనైచ్చరుడు అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఆర్ధికంగా ఋణాలు తీర్చివేస్తారు. కోర్టు వ్యవహారాలలో స్థిరాస్తి లాభములు ఏర్పడును. సొంత మనుష్యుల వలన అధికంగా నరఘోష ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో సామాన్య ఫలితాలు పొందుదురు. 18-జనవరి-2023 నుంచి శని సింహరాశి వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు ఏర్పరుస్తారు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు విఘ్నాలు ఎదుర్కొనును. జీవిత భాగస్వామికి తరచుగా ఆరోగ్య సంబంధ సమస్యలు ఏర్పరచును. అన్య స్త్రీ సంబంధ వ్యవహారముల వలన అపఖ్యాతి - అవమానములు ఎదురగును. విదెశములలో నివసిస్తున్న వారికి అన్య జాతీయుల మైత్రి వలన మాత్రం లాభములు ఏర్పరచును.
పరదేశములందు స్థిర నివాసం లభింప చేయును. సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహువు ఆర్ధికంగా మంచి చేయును. భూ సంబంధ క్రయ విక్రయాలు ఆశించిన విధంగా జరుగును. సింహరాశి జాతకులకు కార్య నిర్వహణ దక్షతను, ఆటంకాలు ఎదురైనా చేపట్టిన కార్యములు పుర్తిచేయుటకు అవసరమగు పట్టుదలను ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో రాహువు బలమ్మైన స్థానంలో కలిగివున్న సింహరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత మంచి ఫలితాలు లభించును. ఇటువంటి జాతకులకు గురు గ్రహం మరియు శని గ్రహం వలన ఏర్పడవలసిన చెడు ఫలితాల ప్రభావం కూడా చాలా వరకూ తగ్గుతుంది.
సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతువు కూడా రాహువు వలనే మంచి ఫలితాలు ఏర్పరచును. తగాదలలో ఉన్న స్థిరాస్తి మీకు లభింపచేయుట ద్వారా ధన సంపదలను ఏర్పరచును. భాత్రు వర్గం ముఖ్యంగా సోదరులతో సమస్యలు తొలగుతాయి. సోదరులతో అనుబంధాలు తిరిగి బలపడును. సంతాన ప్రయత్నములు చేయు వారికి సుందరమైన స్త్రీ సంతాన సౌఖ్యం ఏర్పరచును. ఆధ్యాత్మిక సాధన చేయు వారికి మిక్కిలి సాధనా అనుకూలత ఏర్పరచును. ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా ఉచ్చ స్థితిని చేరగలుగుతారు. రాజకీయ నాయకులకు సామాన్య ప్రజానురాగం మాత్రమే లభించును. మొత్తం మీద శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో సింహరాశి వారికి రాహువు మరియు కేతువు వలన మాత్రమే మంచి ఫలితాలు ఏర్పడు సూచనలు ఉన్నవి. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగిన వారికి మాత్రం అంత అనుకూల ఫలితాలు ఏర్పడవు.
ఏప్రిల్ 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కుటుంబంలో మీ మాట మీద నమ్మకం పెరుగు సంఘటనలు జరుగును. కుటుంబ వ్యవహారములందు విజయం ప్రాప్తించును. ధనాదాయం బాగుండును. విద్యార్ధులకు కొద్దిపాటి నిరాశ ఎదురగును. పట్టుదల అవసరం. పెద్ద వయస్షు వారికి వెన్నుపూస లేదా మూత్ర సంబంధ సమస్యల వలన శస్త్ర చికిత్సకు దారి తీయవచ్చు. ఈ మాసం 11 వ తేదీ నుండి 20 వ తేదీ మధ్య కుటుంబ పరమైన వ్యయం అధికంగా ఏర్పడును. ప్రయాణాలు వ్యయప్రయాసలతో పూర్తీ చేయగలుగుతారు. తృతీయ వారం నుండి శ్రీ లలితా దేవిని ఆరాధన చేయుట ఆరోగ్య మరియు ఆర్ధిక విషయాలలో సమస్యలను తగ్గించును. నూతన వ్యాపార ఆరంభ విషయాలలో ఆటంకములు వున్నవి. చివరి వారంలో 24 నుండి 27 మధ్యకాలం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగచేయును.
మే 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో సౌఖ్యం లభిస్తుంది. అన్ని వర్గాముల వారు ఆశించిన ధనాదాయం పొందగలుగుతారు. ఉద్యోగ జీవనంలోని వారికి ప్రతివిమర్శల వలన నష్టం ఎదురగును. మఘా నక్షత్ర జాతకులకు ఈ మాసంలో భూ సంబంధ లేదా గృహసంబంధ యోగం ఉన్నది. విద్యార్ధులకు ఆశించిన విద్యా అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ మాసం సామాన్య యోగంతో కొనసాగుతుంది.
జూన్ 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిత్రుల వలన నూతన ఆదాయ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశములు పొందగలుగుతారు. ఆర్ధిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిల్వ ధనం ఏర్పరచుకోగలుగుతారు. భాత్రు వర్గం వారికి ఆరోగ్య పరంగా మంచిది కాదు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అగును. కుటుంబ జీవితంలో సామాన్య ఫలితాలు ఎదురగును. స్త్రీలకూ కుటుంబ బాధ్యతలు పెరుగును. వ్యాపారస్థులకు ఈ మాసం చక్కటి లాభాలను ఏర్పరచును. ఉద్యోగ జీవులకు మానసికంగా ఉత్సాహం అవసరం అగును. ఈ మాసంలో 16 వ తేదీ నుండి 20 వ తేదీ మధ్య కాలంలో దూర ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది. 3 వ తేదీ నుండి 8వ తేదీ మధ్యకాలం ఆర్ధిక సంబంధ ప్రయత్నాలకు మిక్కిలి అనుకూలమైన కాలం.
జూలై 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో రక్తసంభందీకుల వలన మీ ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గృహంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నములు కలసివచ్చును. ఉద్యోగ మార్పుప్రయత్నాలు విజయవంతం అగును. ప్రతీ విషయంలో తీవ్రంగా ఆలోచన చేయుట పనికిరాదు. మీపై అందరూ సానుభూతి ప్రదర్సించాలి అనే కొరిక సమస్యలకు దారితీయును. వృద్దులకు శ్వాస సంబంధ , నేత్ర సంబంద సమస్యలు ఎదురగును. తృతీయ వారంలో మీ పై అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. వారి నుండి గౌరవ మర్యాదలు పొందేదురు. ఉద్యోగ లక్ష్యం సిద్ధిస్తుంది. చివరి వారం ప్రశాంతంగా గడుపుతారు.
ఆగష్టు 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసం అన్ని విధములా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. అన్ని వర్గముల వారికి ధనాదాయం బాగుండును. ద్వితీయ వారంలో మిక్కిలి సౌఖర్య వంతమైన జీవితం లభిస్తుంది. వృత్తి మరియు వ్యక్తిగత జీవన సంతోషాలు ఆశించిన విధంగా పొందగలుగుతారు. భవిష్యత్ పరిణామాలు ఊహించగలుగుతారు. క్రీడారంగం లోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి. తృతీయ వారంలో ఎదురగు నూతన పరిచయాలు ఉత్తమ దీర్ఘకాలిక మైత్రి సంబంధాలకు దారితీయును. సంతాన ప్రయత్నాలు అనుకూలించును. జీవన మార్గంలోని అవరోధాలు వాటంతట అవే తొలగిపోయే గ్రహ బలాలు ఈ మాసంలో ఉన్నవి.
సెప్టెంబర్ 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా ధన ఆదాయం బాగుండును. ప్రధమ వారంలో బంధు వర్గంతో కలయికలు, సంతాన సంబంధ విషయాలలో ఆనందం, లాభపూరిత వృత్తి వ్యాపార జీవనములు ఏర్పడును. ద్వితీయ వారంలో చిన్నపాటి మానసిక చికాకులు, పితృ సంబంధ విషయాలలో విచారత వంటి సమస్యలు బాధించును. చట్టపరమైన సమస్యలు కూడా ఎదురగు సూచనలు ఉన్నవి. తృతీయ వారంలో పనులలో ఆటంకములు తొలగును. ఉత్తర నక్షత్ర ప్రధమ పాద జాతకులు ఆర్ధిక విషయాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన సమస్యలు ఎదుర్కొంటారు. సూర్య దేవాలయ సందర్శన మంచి చేస్తుంది. ఈ మసంలో 16,17,18 తేదీలు అంత అనుకూలమైన రోజులు కావు. ఈ రోజులలో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయుట మంచిది.
అక్టోబర్ 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. ఆర్ధిక పరంగా, స్వ ఆరోగ్య విషయపరంగా, పెద్దలతో సంబంధ విషయ పరంగా సమస్యలు ఎదురగును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. ధనాదాయం కూడా సామాన్యం. వివాహ ప్రయత్నాలు విఫలం అగుటకు అధిక సూచనలు ఉన్నవి. ఉద్యోగ జీవనంలో శ్రమ అధికం అగును మరియు పని చేయు కార్యాలయంలో నిరాశాపూరిత వాతావరణం ఎదురగును. 17 వ తేదీ వరకు అంత అనుకూలత ఉండదు. చివరి వారం నుండి శుభయోగములు ఉన్నవి. ప్రయత్నపూర్వక కార్య సిద్ధి ఏర్పడుతుంది. మానసిక చికాకులు తగ్గుతాయి.
నవంబర్ 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా సామాన్య ఫలితాలను కలుగచేయును. శత్రువుల వలన పీడ , మిత్ర వర్గం వలన బలము రెండింటిని ఎదుర్కొందురు. గృహంలో అశాంతి కొనసాగును. ఈ మాసంలో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ జీవనంలోని వారికి అకారణంగా మాటపడుట లేదా నిందపడు సంఘటనలు ఎదురగును. స్త్రీలను ఉదర లేదా గర్భ సంబందిత సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా ద్వితీయ వారంలో ప్రయత్నాలు విఫలం అగును. జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక ఒత్తిడి ఎదుర్కొందురు. ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొందురు. చెడు సంఘటనలకు అవకాశములు వున్నవి. ఈ మాసంలో నిత్యం శ్రీ విష్ణు సహస్ర పారాయణ చేయుట మంచిది.
డిసెంబర్ 2022 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సమస్యలు తొలగును. దూర దేశ స్థాన చలన ప్రయత్నాలు లాభించును. వ్యక్తిగత జీవనంలో సంతోషములు తిరిగి ఏర్పడును. నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఈ మాసంలో ఆదాయం బాగుండును. వ్యాపారములు విజయవంతంగా కొనసాగుతాయి. ఆశించిన విధంగా నూతన అవకాశములు లభించును. కొద్దిపాటి వ్యతిరేక శకునాలు కనిపించినా రావలసిన లాభం వస్తుంది. అత్యవసర కాలంలో మనోనిబ్బరత కలిగి ఉండటం అలవడుతుంది. ఈ మాసంలో తృతీయ మరియు చతుర్ధ వారాలు సంతాన ప్రయత్నాలకు అనుకూలం. సుఖభోజన యోగం ఉన్నది. మీ ఆత్మవిశ్వాసమే మీ అదృష్టానికి కారణం అవుతుంది. శిల్ప కళాకారులకు అతి చక్కటి అవకాశములు లభిస్తాయి.
జనవరి 2023 సింహరాశి రాశిఫలాలు:
నూతన పనులు ప్రారంభించుటకు ఈ మాసం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగ వ్యవహారములందు మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. ఉద్యోగంలో ఆకస్మిక సమస్యలు ఎదుర్కొందురు. ఉన్నతాధికారుల వలన అవమానం లేదా సమస్యలు మానసికంగా బాధిస్తాయి. నిరుద్యోగులకు ఆశాభంగం ఎదురగును. కార్య సిద్ధి ఏర్పడుటకు దైవ బలంపై ఆధార పడవలసి వస్తుంది. ఈ మాసంలో ఆరోగ్యం కూడా అతి సామాన్యంగా ఉండును. విద్యార్ధులకు బుద్ధి బలం ఒక్కటే సరిపోదు. తార్కిక అవగాహన కూడా అవసరం. మిత్రులతో కలయిక కొంత ప్రశాంతతను ఏర్పరుస్తుంది. ఈ మాసంలో 2,5,6,10,12,21,27 తేదీలు అధిక చికాకులను ఏర్పరచును.
ఫెబ్రవరి 2023 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. ధన ఆదాయం కొంత పెరుగును. ఆకస్మిక ఆర్ధిక లాభాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో చిక్కులు తొలగుతాయి. ఆశిస్తున్న సహాయం సమయానికి అందుట వలన సమస్యల నుండి బయటపడతారు. భవిష్యత్ కుటుంబ అవసరాలు గుర్తుపెట్టుకోని ప్రవర్తిస్తారు. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు ఉత్తమమైన కాలం. గృహ నిర్మాణం లేదా గృహంలో నిర్మాణ సంబంధ మార్పిడి చేయువారికి అధిక వ్యయం వలన చికాకులు ఎదురగును. ఈ మాసంలో దుస్స్వప్నముల వలన బాధింపబడు సూచనలు కూడా ఉన్నవి. ఈ మాసం ప్రధమార్ధం మంచి ఫలితాలు ఏర్పరుస్తుంది. ద్వితియార్ధం ప్రతికూల ఫలితాలు ఏర్పరుస్తుంది.
మార్చ్ 2023 సింహరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వ్యాపార వ్యవహారములలో ఏర్పడిన స్తబ్ధత తొలగును. ఆదాయం గత మాసం కన్నా అధికంగా ఉండును. మాతృవర్గం వారి తోడ్పాటు లభించును. తలపెట్టిన వ్యవహారాలు విజయవంతమగును. నిత్య జీవితంలో ఎదురగుతున్న వ్యతిరేక పరిస్థితులు క్రమంగా తొలగును. తోటి ఉద్యోగుల ముందు మనసు విప్పి మాట్లాడుట వలన నష్టములు పొందుతారు. మాసాంతానికి ఉద్యోగ లక్ష్యాలు కష్టం మీద పుర్తి చేయగలుగుతారు. వంశ పెద్దల ఆశీస్సులు లబించును. ఈ మాసంలో 7 నుండి 15 వ తేదీ మధ్యకాలం ఉద్యోగ ప్రయత్నాలకు అనువైనది. రాజకీయనాయకులకు పదవీ లాభం ఏర్పడును. వివాహ ప్రయత్నములకు , వాహన లేదా భూ సంబంధ కొనుగోళ్లకు కూడా ఈ మాసం అనువైనది.
..........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
........

No comments:

Post a Comment