Monday 4 April 2022

2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు




మృగశిర 3,4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధునరాశికి చెందును.
2022- 2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మిధున వారికి
ఆదాయం - 11 వ్యయం - 05 రాజ పూజ్యం - 02 అవమానం - 02

మిధున రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అతి చక్కటి ప్రోత్సహవంతమైన ఫలితాలు లభించును. విద్యార్ధులకు ఆశించిన విద్యారంగంలో ప్రవేశం ఏర్పడును. విద్వాంసులతో స్నేహ బాంధవ్యాలు లభించుట వలన అపార జ్ఞాన సంపదను ఆర్జించేదురు. గుత్తేదారులకు భారి ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. ఆభరణాల వ్యాపారం ముఖ్యంగా రత్న భుషనాదుల సంబంధ వ్యాపారం చేయు వారు ఈ సంవత్సరం మిక్కిలి లాభములను ఆర్జించేదురు. మిధునరాశి కి చెందిన స్త్రీలు మిక్కిలి పుర్వాచారం పాటించి ఇతరుల మెప్పు పొందేదురు. ఉద్యోగ జీవనం లోని వారికి మంచి హోదా కలిగిన నూతన ఉద్యోగ అవకాశములు లభించును. ప్రభుత్వ ఉద్యోగం కొరకు శ్రమిస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పక ప్రభుత్వ ఉద్యోగం లభించును. గురు గ్రహం మీ ఆకాంక్షలను నేరవేర్చును.
మిధునరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 17-జనవరి-2023 వరకూ అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. శారీరక బలహీనత బాదించును. వాహన ప్రమాదాల నుంచి తప్పించుకుందురు. కానీ ఆయుర్దాయానికి ప్రమాదం ఉండదు. కష్టం మీద పనులు పూర్తీ అగును. శ్వాశ సంబంధ అనారోగ్య చికాకులు, సంతాన సంబంధ ప్రయత్నాలు విఫలం అగుట, దురలవాట్ల వలన అగౌరవం, పూర్వపు కాలంలో లభించిన వారసత్వ సంపదలో కొంత వ్యయం అగుట, శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవుట వంటి సమస్యలు ఏర్పడును. 18-జనవరి-2023 నుంచి శని మంచి ఫలితాలను ప్రసాదించును. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ చేయుదురు. భాత్రు వర్గ సహకారం వలన జీవిత సమస్యల నుంచి బయట పడతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, విదేశీ విహార యాత్రల కొరకు చేయు ప్రయత్నాలు ఫలించును. గత కాలంలో పోగొట్టుకున్న జీవిత భాగస్వామి స్వర్ణ ఆభరణాలు తిరిగి ఏర్పరచుకొంటారు. మిధునరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
మిదునరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన అనుకూల ఫలితాలు, ఆశించిన జీవన అభివృద్ధి లభించును. రక్షక దళాలలో పనిచేయు వారికి అతి చక్కటి పదోన్నతి లభించును. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి తప్పక విదేశీ ఉద్యోగం లభించును. వ్యాపారస్తులు నైతిక నియమాలు విస్మరించి ధనార్జన చేయుదురు. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలకు రాహువు చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును. న్యాయస్థానాలలో శత్రువులపై తప్పక విజయం లభించును. స్త్రీలు చక్కటి కార్య దక్షత ప్రదర్శించి కుటుంబ సభ్యుల మెప్పును పొందుతారు. వ్యవసాయదారులు తమ పంటలలో చక్కటి దిగుబడిని సాధించ గలుగుతారు.




మిధునరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన సామాన్య ఫలితాలు ఏర్పడును. ఏ విదమైన తీవ్ర నష్టములు ఏర్పడవు. గణిత శాస్త్రం అభ్యసించు వారికి చక్కటి ఉద్యోగం లభించును. పితృ వర్గీయులతో అకారణంగా గొడవలు ఏర్పరచి మానసిక చికాకులు కలుగచేయును. సంవత్సర మాధ్యమంలో స్త్రీలకూ ఆరోగ్య సమస్యలు బాధించు సూచనలు ఉన్నవి. మొత్తం మీద కేతువు మిధునరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం అనుకూల ఫలితాలనే ఏర్పరచును.

ఏప్రిల్ 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిధునరాశి వారికి ధనాదాయం సామాన్యం. ధర్మ కార్యములకు , కుల సంబంధ కార్యక్రమాలకు ధనం వినియోగిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభములు ఉన్నవి. వ్యాపార రంగంలోని వారికి ముఖ్యంగా స్థిరాస్థి సంబంధ క్రయవిక్రయాలు, వ్యవసాయ సంబంధ వ్యాపారములు చేయువారికి చక్కటి లాభములు ఉన్నవి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు మాత్రం నష్టపరుచును. తృతీయ వారంలో పాత మిత్రులతో కలయిక వలన కాలం ఉత్సాహంగా గడచును. 21 వ తేదీ తదుపరి ఖర్చులు, శారీరక శ్రమ అధికం అగును. ఈ మాసంలో 24,25,26 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

మే 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ప్రతీ పని అనుకూలంగా జరుగును. నూతన వాహన కోరిక నెరవేరును. ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ జీర్ణశక్తి కి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్య బాధించు సూచన. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ భవిష్యత్ కు మంచి బాటను ఏర్పరుస్తాయి. సొంత గృహ లేదా భూ మూలక లాభములు. విద్యార్ధులకు ఆశించిన విజయములు. పై అధికారులు లేదా రాజకీయ రంగంలోని వారితో మైత్రీ వ్యవహారములకు ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో 5 నుండి 11 వ తేదీ మధ్యకాలం వివాహ సంబంధంగా చర్చలు జరుపుటకు అనుకూలమైన కాలం. 13,14,15,16 తేదీలు అంత అనుకూలమైన రోజులు కావు. ఈ రోజులలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను

జూన్ 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా ప్రోత్సాహపురిత వాతావరణమును ఏర్పరచును. కుటుంబ , మిత్ర వర్గ సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆశించిన విధంగా ధనలాభాలు ఏర్పడును. మీ అభిరుచికి తగిన విధంగా గృహంలో మార్పులు చేయుటకు ఈ మాసం అనువైనది. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. నూతన వస్తువులను సమకుర్చుకుంటారు. దూర ప్రాంతాలనుండి బంధువుల ఆగమనం ఉంది. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వైవాహిక జీవన సౌఖ్యాలు ఉన్నవి. ఈ మాసంలో 17,18,19 తేదీలు సంతాన ప్రయత్నములకు , నూతన వ్యక్తులను కలవడానికి, కొనదలచిన స్థల పరిశీలనకు అనువైనవి. చివరి వారమలో సంతానానికి ఆరోగ్య సమస్యల వలన ధనం వ్యయం అవుతుంది

జూలై 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసం అన్ని రకముల వ్యాపార వ్యవహారములకు, ఆర్ధిక క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉండును. ద్వితీయ వారంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నములు చేయువారికి నిర్మాణ విషయంగా ఆఖస్మిక ఆటంకములు ఎదురవును. ధనాదాయం మాత్రం బాగుండును. విధ్యార్ధులకు వారి ప్రయత్నములు ఫలించి ఆశించిన రంగంలో విద్యాప్రవేశం లభిస్తుంది. తృతీయ వారంలో ఆటంకములు ఎదురైనా పనులు పూర్తీ అవుతాయి. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక చికాకులు ఎదుర్కొంటారు. పెద్ద వయస్సు స్త్రీలను అనారోగ్య సమస్యలు వేధించు సూచన ఉన్నది. బాగా ఎదిగిన సంతానం ప్రవర్తన వలన కూడా మనసు ఆందోళన చెందును. ఈ మాసంలో 21 నుండి 24 వ తేదీల మధ్య ఋణములు కోసం చేయు ప్రయత్నాలు ఫలించును. కుల వృత్తి సంబంధ వ్యాపారములు చేయువారికి ఈమాసం కలసి వచ్చును.

ఆగష్టు 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆలోచనలు కార్యరూపం దాల్చును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. ఆశించిన ఉద్యోగం పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణములు చేయుట వలన ధన వ్యయం ఏర్పడుటకు అవకాశం కలదు. ద్వితీయ వారంలో శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్య బాధించును. ఉద్యోగ జీవులకు వారు పనిచేయు కార్యాలయాలలో తోటి ఉద్యోగులతో శత్రుత్వాలు, వివాదాల వలన చికాకులు ఉన్నవి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. మిత్రుల విషయంలో అతినమ్మకం వలన నష్టం ఎదురగును. సమయ పాలనలో విఫలమగుట వలన ఉన్నత అవకాశములను కోల్పోతారు. చివరి వారం నివాస సంబంధ స్థాన మార్పు, లేదా ఉద్యోగ మార్పుల కొరకు ప్రయత్నములు చేయుటకు అనుకూలమైనది. కుటుంబ జీవనంలో స్త్రీలకు శ్రమ అధికం అవుతుంది. వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించలేరు. జీవిత భాగస్వామితో మానసిక దూరం పెరుగుతుంది.

సెప్టెంబర్ 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా అంతగా అనుకూలమైన ఫలితాలను కలిగించదు. ఏ వ్యవహారం తలపెట్టినా పూర్తి కావడం కష్టం. ముఖ్యంగా సంతానం కొరకు చేయు ప్రయత్నములకు , ఆర్ధిక లావాదేవీలకు ఈ మాసం ప్రతికూలమైన కాలం. భూ సంబంధమైన లేదా గృహ సంభంధమైన నష్టం ఏర్పడుటకు సూచనలు కలవు. వ్యాపార రంగంలోని వారికి స్తబ్దత కొనసాగును. ఆశించిన ధనం సమయానికి అందదు. పితృ వర్గం వారికి ఈ మాసం ఆరోగ్య పరంగా అంత మంచిది కాదు. ఎదో ఒక విధంగా మానశిక దిగులు బాధించును. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో కోపతాపాలు తగ్గించుకోనిన మంచిది. ఈ మాసంలో ప్రతీ సోమవారము ఒక కేజీ బియ్యం జలదానం చేయుట మంచిది. ఈ మాసంలో 3,6,14,22 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

అక్టోబర్ 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రధమ వారంలో ఆఖస్మిక ధనలభాములు లభించును. శత్రుత్వ సంబంధ బాధలు తగ్గుతాయి. పట్టుదల విడిచిపెట్టి అందరిని కలుపుకొని పోవుట వలన వ్యవహార లాభములు ఏర్పడతాయి. వ్యక్తిగత జీవనంలో సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. ధనాదాయం గత మాసాల కన్నా పెరుగుతుంది. వ్యాపార రంగంలోని వారికి ధనార్జన పరంగా ఏర్పడుతున్న అనిచ్చితి తొలగుతుంది. 17 వ తేదీ నుండి 22 వ తేదీ వరకూ వివాహ ప్రయత్నములు చేయుటకు అనుకూల కాలం. సోదర వర్గం వారికి సంభందించిన శుభవార్తలు వింటారు. చివరి వారంలో సామాన్య ఫలితాలు ఎదురగును. ప్రయానములు వాయిదా పడుతాయి. ఈ మాసంలో 7,11,13, 28 తేదీలు అనుకూలమైనవి కావు.
నవంబర్ 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా అనుకూల ఫలితాలు ఏర్పరచును. జాతకంలో సర్ప దోషం కలిగివున్న వారు మాత్రం కొంత ప్రతికూలత ఎదుర్కొండురు. సర్ప దోష జాతకులకు వ్యవహారములు చివరి నిమిషం వరకూ ఆందోళన కలిగించును. వ్యాపారములు సామాన్యం గా కొనసాగును. ధనాదాయం సామాన్యం. యువకులకు నిర్లక్ష్య ప్రవర్తన వలన ఘర్షణలు ఎదురవుతాయి. ఉద్యోగ జీవులకు సామాన్య ఫలితాలు. చివరి వారంలో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యత లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంటారు. రక్త సంబందీకుల పట్ల అనురాగంతో ప్రవర్తించి ధర్మ బద్ధంగా వ్యవహరిస్తారు.

డిసెంబర్ 2022 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నములు ఫలించును. గృహంలో నూతన అలంకరణ వస్తువులను అమర్చుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నములలో ఏర్పడుతున్న ఆటంకములు తొలగును. న్యాయస్థానాలలో విజయం ఏర్పడును. అన్ని వర్గముల వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం లభిస్తుంది. ద్వితీయ మరియు తృతీయ వారములలో సంతాన పరమైన సంతోషాలు ఉన్నవి. 12 వ తేదీ నుండి 18 వ తేదీ మధ్య ఆరోగ్య సమస్య బాధిస్తుంది. 22, 23 తేదీలలో ఊహించని అవమానములు, వ్యసన సంబంధ సమస్యలు లేదా గౌరవ నష్టములు ఎదుర్కొందురు. మాసాంతంలో ముఖ్యమైన కుటుంబ విషయాలకు సమయం కేటాయించేదురు. జీవిత భాగస్వామి నుండి ఆర్ధికంగా సహాయ సహకారాలు లభిస్తాయి.
జనవరి 2023 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో అనారోగ్య సమస్యలు తగ్గును. ధనాదాయంలో వ్రుద్ధి కనపడును. ఉద్యోగ జీవనంలో మార్పుకు ఇది మంచి కాలం. వైవాహిక జీవనంలో సమస్యలు కుడా తగ్గును. మాతృ వర్గం తోడ్పాటు వలన కుటుంబ సమస్యలు తగ్గును. ప్రధమ వారం ఉద్యోగ, విదేశీ, వివాహ ప్రయత్నాలకు చక్కటి అనుకూల కాలం. కానీ 12 నుండి 15 వ తేదీల మధ్య నూతన ప్రారంభాలు లేదా నూతన భాద్యతలు స్వీకరించుట కలసి రాదు. అలాగే ఈ రోజులలో కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుట కష్టం. విద్యార్ధులకు శ్రద్ధ అవసరం. తృతీయ వారంలో వాహనమూలక ఖర్చులు ఉండును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. పోటీదారుల వలన సమస్యలు ఎదురైనా ఆదాయం తగ్గదు. వాయిదా పడుతూ వస్తున్న ప్రయానములు ఈ మాసంలో పూర్తి చేయుదురు.

ఫెబ్రవరి 2023 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశములలో వ్యాపారము ప్రారంభించు ప్రయత్నములు చేయువారికి లాభం ఏర్పడును. బంధు వర్గంతో కలయికలు మానసిక ఉల్లాసాన్ని కలుగచేస్తాయి. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వహించవలసి వస్తుంది. స్త్రీల పేరుపై స్తిరాస్థి లాభములు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయానములు ప్రారంభంలో ఆటంకములను ఎదుర్కొని చివరికి లాభకరంగా ముగియును. మాస మధ్యమంలో శిరస్సుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. 16 వ తేదీ తదుపరి నూతన వస్తువులు కొనుట మంచిది కాదు. నష్ట పొవడానికి అధిక సూచనలు ఉన్నవి. ఈ మాసంలో 20, 21, 26, 27 తేదీలు అనుకూలమైనవి కాదు. గర్భవతులు మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను.

మార్చ్ 2023 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వారసత్వ సంబంధ సంపద ఆశించువారికి తమ కోరిక నెరవేరుతుంది. దాయాదుల తగవులలో విజయం వరిస్తుంది. శత్రు ఓటమి మిక్కిలి మానసిక ఆనందాన్ని కలుగచేస్తుంది. ధనాదాయంలో పెరుగుదల ఉంది. నిరుద్యోగులకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. వ్యాపార వర్గం వారికి మిశ్రమ ఫలితాలు ఎదురగును. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు ఒక పట్టాన విజయవంతం అవ్వవు. అందిన అవకాశములు చివరి నిమిషంలో చేజారిపోతాయి. ద్వితీయ సంతాన ప్రయత్నాలు సఫలం అవుతాయి. క్రీడా సంబంధ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరుద్రా నక్షత్ర జాతకులకు మనోవాంచా ఫలసిద్ది ఉంది. మాసాంతంలో వ్యాపార రంగంలోని వారికి ఆశించిన అబివృద్ధి లభిస్తుంది.


...........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
youtu.be/lI0KjOiN7Qg
twitter.com/VidhathaAstrolo
http://vidhaathaastronumerology.blogspot.com/.../blog...
facebook.com/vidhathaastornumerology/?ref=bookmarks
instagram.com/sreevidhathapeetam
http://vidhaathaastronumerology.blogspot.in/.../blog-post...
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............









No comments:

Post a Comment