Tuesday 5 April 2022

2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర మీనరాశి రాశీ ఫలాలు




పూర్వాభాద్ర 4వ పాదము లేదా ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు లేదా రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.

శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మీనరాశి వారికి
ఆదాయం - 02, వ్యయం - 08, రాజ పూజ్యం - 01, అవమానం - 07

మీనరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన అత్యంత యోగ్యమైన జీవన మార్గం లభిస్తుంది. నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పండితుల సాంగత్యం వలన అనేక శాస్త్రాలపై అవగాహన ఏర్పడుతుంది. సినిరంగంలోని రచయితలకు ఈ సంవత్సరం అదృష్టం వరిస్తుంది. తలపెట్టిన భారీ కార్యక్రమాలు పూర్తీ చేయుటకు దేహధారుడ్యత సహకరిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్దులకు బంగారు భవిష్యత్ లభిస్తుంది. పోటీ పరీక్షలలో సులువుగా రాజ్యాంగ పదవులు పొందగలుగుతారు. సమాజంలో కుటుంబ గౌరవాన్ని పెంచుతారు. సంతాన ప్రయత్నాలు చేయువారికి ఆకర్షణీయమగు సంతానం ప్రాప్తిస్తుంది ఈ విధంగా శుభకృత్ నామ సంవత్సరంలో మీనరాశి వారికి గురువు అన్ని విధాల శుభ ఫలితాలు ప్రసాదిస్తారు.

మీనరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవతరంలో శని వలన 17-జనవరి-2023 వరకూ సులువైన ధన సంపాదన లభిస్తుంది. అతి చక్కటి ఆరోగ్య సౌఖ్యం అనుభవిస్తారు. ముఖ్యంగా వైద్య రంగంలోని వారికి ఈ కాలం అత్యంత కీర్తి గౌరవాలను, ధనాన్ని లభింప చేస్తుంది. జీవిత భాగస్వామి వలన ఆర్ధిక, శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది. మీ పేరుపై భూ సంపద ఏర్పరచుకుంటారు. 18-జనవరి-2023 నుంచి మీనరాశి వారికి ఏడున్నార సంవత్సరముల ఏలినాటి శని దశ ప్రారంభం అవుతుంది. (అనగా మొదటి పాదం) ఈ దశ ప్రారంభం నుంచి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. మీ నిర్ణయాల వలన మీరే ఆరోగ్య పరంగా, ఆర్ధిక పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ చేతిపై చెడు కార్యక్రమాలు జరిగి పాప ఖర్మ ఫలాన్ని ఏర్పరచుకుంటారు. ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది. వ్యక్తిగత జాతకంలో శని బలం లోపించిన వారికి కారాగారవాసం కూడా ఏర్పడు సూచనలు ఉన్నవి. ఏలినాటి శని దశ ప్రారంభం నుంచి మిక్కిలి జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర దూరప్రాంత ప్రయాణాలు చేయకూడదు. నిత్యం శని గ్రహ కవచం స్మరించుట వలన సమస్యలు కొంత వరకు తగ్గుతాయి.

మీనరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన మాంస సంబంధ వ్యాపారం చేయు వారికి, చేపల వ్యాపారం చేయు వారికి మిక్కిలి లాభములు ఏర్పడును. గృహ సంబంధ మార్పులు లేదా నూతన గృహ నిర్మాణ పనులు అనేక విఘ్నాలు ఎదుర్కొనును. నూతనంగా పెళ్ళి చేసుకున్నవారు వైవాహిక జీవనంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ధనం ఆర్జించి వెంటనే తిరిగి ఖర్చు పెట్టేస్తుంటారు. ఇతరులపై బల ప్రయోగం ద్వారా లేదా మీ పలుకుబడి ప్రయోగించి పనులు పూర్తీ చేసుకోవాలి అనే ఆలోచనా విధానం తీవ్రంగా నష్ట పరుస్తుంది.

మీనరాశి వార్కి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన శరీర సౌఖ్యం తగ్గుతుంది. గురువులను, స్నేహితులను, సొంత మనుష్యులను వ్యతిరేకిస్తారు. దేవ బ్రాహ్మణ నింద చేస్తారు. పరస్త్రీ కాంక్ష పూర్తిగా పాడుచేస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి గురువు మరియు ఏలినాటి శని దశ ప్రారంభం వరకు శనైచ్చరుడు మంచి ఫలితాలు ప్రసాదిస్తారు. ఏలినాటి శని , రాహువు మరియు కేతువు చెడు ఫలితాలు ప్రసాదించుట వలన ఈ సంవత్సరం సుఖ దుఖాలను మిశ్రమంగా పొందుతారు.

ఏప్రిల్ 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసం ఆశాజనకంగా ఉండును. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధ ఆదాయం, విదేశీ ప్రయాణాలకు అనువైన కాలం. వ్యక్తిగత జీవనంలో మాత్రం సమస్యలు ఎదురగును. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఆశించిన స్థాన చలనం పొందుతారు. నూతన బాద్యతలు లేదా పదవులు పొందుటకు సూచనలు ఉన్నవి. పనిచేయు ప్రదేశంలో శ్రమకు తగిన గుర్తింపు లభించును. నిర్మలమగు మీ దూరదృష్టి చక్కటి పేరు ప్రఖ్యాతలు కలిగినవారిగా చేస్తుంది. ఎదుటి వారి మనోభావాలు సులువుగా గ్రహించగలుగుతారు. నూతన వ్యక్తులను మిత్రులుగా చేసుకొనుటకు తీవ్రంగా అలోచించేదురు. ఈ మాసంలో 5.7,11,,27 తేదీలు అనుకూలమైనవి కావు.

మే 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వ్యాపార మరియు వృత్తి ఆధారిత జీవనదారులకు ఆశించిన లాభములు లభించును. ధనాదాయం బాగుండును. వంశ గౌరవం పెంచుతారు. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యక్తిగత జీవనంలో మాత్రం సమస్యలు కొనసాగును. ఉద్యోగంలో ఉత్సహపురిత వాతావరణం ఉంటుంది. గృహమార్పిడి ప్రయత్నాలు ఫలించును. ఆపదల నుండి తప్పించుకొందురు. మీ విరోదులపై విజయం కొరకు నీతినియమాలు ప్రక్కన పెట్టేస్తారు. విజయానందం కొరకు ఎంతటి వ్యయానికి ఐనా సిద్ధపడతారు. చివరి వారం ప్రారంభం నుండి భోగ భాగ్యములు అనుభవించెదరు.

జూన్ 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా అనుకూలమైన గ్రహ బాలలను కలిగి ఉన్నది. మీనరాశి వారికి ఈ మాసం సంతాన విషయాలలో చక్కటి పుత్ర సంతాన లాభములను, ఆర్ధిక స్థిరత్యాన్ని ఏర్పర్చును. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఆశించిన విజయాలు ఏర్పరచును. మొత్తం మీద ఈ మాసంలో సంతృప్తికరమైన జీవితం ఏర్పడును. కుటుంబ శ్రమ భారం తగ్గును. కుటుంబంలో సంతోషాలు, ఆనందకర సంఘటనలు. ఇతరులకు సలహాలు ఇవ్వగల స్థానంలో ఉంటారు. ఇతరుల సమస్యలను అతి సులువుగా పరిష్కరించగలుగుతారు. దైవ ప్రేరేపిత జ్ఞానం లభిస్తుంది. ఈ మాసంలో బహుకార్యములు సాధించగలుగుతారు. చక్కటి మనో బలమును ప్రదర్శిస్తారు.

జూలై 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసం కొద్దిపాటి సమస్యలు, పని ఒత్తిడులతో ప్రారంభం అగును. మీ ఊహా శక్తి ఈ మాసంలో అనుకూలంగా పనిచేయదు. వివాహ ప్రయత్నాలలో విఘ్నాలు ఎదురగును. సొంత మనుషుల వలన వివాహ సంబంధాలు విఫలం అగుట తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. కుటుంబ అనారోగ్య సమస్యలు అధిక వ్యయమును కలుగ చేస్తాయి. ద్వితీయ వారం చివరి వరకూ నూతన ప్రయత్నాలు సఫలం అగుట కష్టం. బంధు వర్గంతో విరోధాలు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి ధనాదాయం బాగుండును. జీవనంలో లాభకరమైన పరిస్థితులు ఎదురగును. తిరిగి మనోబలం పెరుగును. మిత్ర వర్గంతో సర్దుకుపోవుట మంచిది.

ఆగష్టు 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసం సంతాన ప్రయత్నాలకు అనుకూలమైనది. జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన కలిగి ఉంటారు. వైవాహిక సౌఖ్యం పొందుదురు. సోదరి వర్గం వారికి మీ సహాయం అవసరం అవుతుంది. వారి కొరకు ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్టితులు ఏర్పడతాయి. వ్యాపార, వృత్తి జీవనం చేయువారికి ఆదాయం సామాన్యం. తృతీయ వారంలో అనగా 16 నుండి 23 వ తేదీల మధ్య ప్రయాణాలు, తలపెట్టు నూతన ప్రయత్నాలు ఫలవంతం అగును. పనులు సకాలంలో పూర్తి అగును. ఆర్ధికంగా వృద్ధి చెందుతారు. చివరి వారంలో నూతన వాహన భాగ్యం లేదా విలాసకర దూర ప్రాంత విహారయాత్రలు ఏర్పడతాయి.

సెప్టెంబర్ 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును. ధనాదాయం కూడా కొద్దిగా తగ్గును. వ్యాపార రంగంనకు సామాన్య ఆదాయం లభించును. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి వలన కుటుంబ విషయాలలో సమయపాలన విఫలమగును. ద్వితీయ తృతీయ వారాలలో ధనాదాయం కొంచం బాగుండును. విద్యార్ధలకు విద్యా శౌర్యాది గుణములు , నాయకత్వ లక్షణాలు అలవడును. న్యాయవాద వృత్తిలోని వారికి ఈ మాసం బాగా కలసి వస్తుంది. మొత్తం మీద ఈ మాసంలో మనస్సు కొద్దిపాటి ఒడిదుడుకులకు గురి అవుతుంది.
అక్టోబర్ 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా సమస్యలు కొనసాగును. స్థిరాస్థి నష్టం లేదా తత్సంబంధ తగాదాలు, ప్రయత్నాలలో సమస్యలు, పట్టుదల లోపించుట, తోటి ఉద్యోగులతో వ్యతిరేకత వలన ఇబ్బందులు, ఆలోచనలు ముందుకు సాగపోవుట వంటి సమస్యలు ఎదురగును. అనవసరమైన విషయాల వలన అశాంతి కొనసాగును. 22వ తేదీ తదుపరి పరిస్థితులు కొంత అనుకులమగును. ధనాదాయం కొంచెం పెరుగును. ప్రయాణాలు ఫలిస్తాయి. ఈ మాసంలో 2,3,9,13,17,20 తేదీలు అంతగా కలసిరావు.

నవంబర్ 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మీనరాశి వారిపై రాహు ప్రభావం అధికంగా ఉంటుంది. సంతాన సంబంధ ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు. ధనాదాయం కొంచెం వృద్ధి చెందును. చేపట్టిన పనులు కష్టం మీద చివరి క్షణానికి పూర్తీ చేయగలుగుతారు. ఉద్యోగులకు ఈ మాసంలో తరచుగా సమస్యలు ఎదురగును. 14వ తేదీ తదుపరి ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగ మార్పిడికి లేదా పదోన్నతికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వతంత్రంగా అలోచించి జీవన విధానాన్ని మార్చుకుంటారు. రాజకీయంగా నూతన భావాలూ అలవడతాయి. హాస్య ప్రియత్వం కలిగిన వారి పట్ల ఆకర్షితులు ఆగుతారు. ఇతరులను శాసించుటను బాగా ఇష్టపడతారు. మీకు విధేయులు కాని వ్యక్తులను ఏమాత్రం ఆలోచించకుండా విడిచిపెడతారు.

డిసెంబర్ 2022 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసం అనుకూలమైన ఫలితాలు ఏర్పరచును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తీ అగును. ధనాదాయం బాగుంటుంది. ఋణములు అవసరం లేకుండా భారీ కార్యక్రమాలు పూర్తీ చేయగలుగుతారు. మిత్రవర్గం నుండి ఆశించిన సహకారం అందుతుంది. ఓటమిని సహించరు. పోలీస్ , ఆర్మీ వంటి రక్షణ శాఖ రంగాలలో ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉదార దృక్పథం ప్రదర్శిస్తారు. మొత్తం మీద ఈ మాసం చక్కటి మనోవంచా ఫలసిద్ధిని ఏర్పరుస్తుంది.

జనవరి 2023 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఏలినాటి శని దశ ప్రారంభం అగుట కలసిరాదు. అనవసర కలహాలు ఎదుర్కొంటారు. సంతాన ప్రయత్నాలు అంత సులువుగా ఫలించవు. తార్కికంగా ఆలోచించకుండా భ్రమలలో కాలం గడుపుతారు. వ్యాపార వృత్తి పనులు సామాన్యం. ఉద్యోగ జీవనంలో ఉద్యోగ నష్టం లేదా వ్యతిరేక మార్పు ఎదురగును. తృతీయ వారంలో పనులు ముందుకు సాగవు. నిరుత్సాహం అధికం అవుతుంది. ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. వృధా ఆశలు పెట్టుకొని అవి ఫలించక మనోవేదన చెందుతారు. ఈ మాసం నుండి ఆర్ధిక, వ్యక్తిగత జీవన పరంగా సదా అలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను.

ఫెబ్రవరి 2023 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా వ్యాపార వ్యవహారాలు మందకొడిగా నడచును. ధనాదాయం కొంత తగ్గుతుంది. సోదర వర్గం వారికి ఆరోగ్య పరంగా మంచిది కాదు. వివాహ ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. శత్రు విభేదాలు బాధించును. స్పెక్యులషన్ లాభించదు. అవసరాలకు తగిన ధనం సర్దుబాటు జరుగుట కష్టం. నూతన ఋణాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండుట మంచిది. కుటుంబ జీవనంలో మధ్యమ ఆనందాలు ఎదురగును. ఈ మాసంలో 19,20,23,24,27 తేదీలు అనుకూలమైనవి కావు.

మార్చ్ 2023 మీనరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా వ్యతిరేక వాతావరణం, ప్రతికూల ఫలితాలు కొనసాగును. ఆరోగ్య సమస్యల వలన శారీరక , ఆర్ధిక ఇబ్బందులు ఎదురగును. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. 10 నుండి 16 వ తేదీ మధ్య కాలంలో ప్రమాద సంఘటనకు సూచన ఉన్నది. తృతీయ వారంలో కొంత ధన లాభం మరియు పై అధికారుల సహకారం వలన వృద్ధి ఉన్నవి. చివరి వారం సామాన్య ఫలితాలు ఎదురగును.







.........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
https://chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
t.me/Sree_vidhatha_peetam
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join ch
chat.whatsapp.com/22dqSShtmrn1TRWfjZhM1y WhatsApp Group Invite Follow this link to join chat.whatsapp.com శ్రీ విధాత పీటం
youtu.be/lI0KjOiN7Qg
twitter.com/VidhathaAstrolo
http://vidhaathaastronumerology.blogspot.com/.../blog...
facebook.com/vidhathaastornumerology/?ref=bookmarks
instagram.com/sreevidhathapeetam
http://vidhaathaastronumerology.blogspot.in/.../blog-post...
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............








No comments:

Post a Comment