పాశ్ఛాత్య దేశాలలో భోజనానికి ముందు కృతజ్ఞతా పూర్వకంగా ప్రార్ధన చేసి భోజనం చేస్తారు.
భారతీయులు వండిన పదార్ధాలలో కొంచెం తీసి భగవంతునికి నివేదన చేసి తరువాత
ఆ ప్రసాదాన్ని మొత్తం వండిన దానిలో కలిపి ఇంట్లో అందరూ భుజిస్తారు.
భగవంతునికి ఈ నివేదన ఎందుకు? భగవంతుడు సర్వాంతర్యామి. సర్వమూ తానే అయినవాడు.
ఆ భగవంతునిలోనే మనమూ వున్నామని భావించాలి. మనకు జీవితంలో కలుగు శుభాశుభాలూ
లాభ నష్టాలు అన్ని ఆ భగవత్సంకల్పమే. నిర్ణయమే మనము నిమిత్ర మాత్రులమని హిందువు నమ్ముతారు.
ఈ నివేదన ఆంతర్యం, భగవాన్ నీదే నీకు సమర్పిస్తున్నాను. ఈ అశీస్సులతో మరల నీవిచ్చినది.
స్వీకరిస్తాను అను భావమున నివేదన చెయ్యాలి. ఇది భగవత్ ప్రసాదమై అంగీకరించిన తరువాత
దానికి ప్రత్యేకత ఉంటుంది. అది ప్రసాదమని, దాని శుభ్రతను, రుచిని, ఇతరములను శంకించము.
మరియూ మంచి చెడుల గురించి తర్కించము.
అది ప్రసాదమని భావించిన తరువాత ఇతరులకు పెట్టినా మనము తినినా తరువాత జీవితమున
కలుగు శుభములూ లాభములూ భగదనుగ్రహమని భావించు తత్వము అలవడును.
భోజనము చేయుటకు ముందు మన ముందున్న పదార్ధములపై నీళ్ళు చల్లి దానిని పవిత్రము
చేయవలెను. దాని నుండి ఐదు చిన్న పిడచలు తీసి ప్రక్కన పెట్టవలెను.ఎందుకు?
వివరించెదను. మనకు లభించినవి ,మనము అనుభవించుచున్నవీ అన్నివేరొకరి
నుండి సంప్రాప్తించినవి గాన వారి ఋణము తీర్చు కోవాలి.
1) దేవతా ఋణము: వారు అందించు రక్షణకు,మన మనుగడకు ధర్మమునకు.
2) పిత్రు ఋణము : ఈ జన్మ నిచ్చి సమాజములో ఒకని గా చేసి వారి సంసృతి
సాంప్రదాయాలకు ప్రతినిధులను చేసినందుకు.
3) ఋషిఋణము; మన మతమును కాపాడి పోషించి మరల మనకందిచిన భాగ్యమునకు,
4)మనుష్య ఋణము: సంఘములో మనకు చేదోడు గా నిలిచి,మనలను వారిలో కలుపుకొని
జీవనము చేయుచున్నందుకు.
5)భూత ఋణము: గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశము మొ: నవి మన మనుగడకు ప్రగతికి
సహకరించుచూ కావలసినవి అందించు చున్నందుకు.
మనతో పాటు ఈ అయిదుగురికీ భోజనము పెట్టి తరువాత మనము భుజించుట హిందువుల
ధర్మము. విధి. మరియూ ప్రాణ అపాన వ్యానా ఉదాన సమాన అను శరీరమున జరుగు
క్రియలను ప్రార్ధించుచూ భోజనమును ప్రసాదముగా భావించాలి.
నివేదన చేసిన పదార్ధము నకు అంత ప్రాధాన్యత మన సాంప్రదాయమున కలదు.
హిందూ ధర్మమున ,మతమున నమ్మకమున్నవారు అందరూ దీనిని ఆచరించి,
ప్రతీ గృహమున ఈ నివేదనాంతరము భోజనము చేయుట సర్వ శుభదాయకము మంగళ కరము.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment