Saturday, 13 February 2021

కుంభంలో సూర్యుడు ఆగమనం.. ప్రభుత్వ రంగంలో పనిచేసే ఓ రాశివారికి అనుకూలం

 



మకరంలో సూర్యుడు ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనం సంక్రాంతి పండగ జరుపుకుంటాం. తాజాగా సూర్యుడు మకర రాశిని విడిచి కుంభంలోకి ప్రవేశించనున్నాడు. ఫిబ్రవరి 12 అంటే శుక్రవారం రాత్రి 09.11 గంటలకు కుంభంలో ఆగమనం చెందనున్నాడు. ఈ రవాణాను ఫాల్గుణ సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ధార్మిక విశ్వాసాల ప్రకారం కుంభం సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు స్నానం చేసి సూర్యుడిని ఆరాధించని వ్యక్తి నరకానికి వెళ్తారని నమ్ముతారు. కుంభ సంక్రాంతి రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది. అంతేకాకుండా దేవుళ్లను సందర్శించే అవకాశముంటుంది.


  • కుంభ సంక్రాంతి 2021 ఫిబ్రవరి 12 శుక్రవారం జరగనుంది.
  • పుణ్యకాలం వచ్చేసి 12.36 నుంచి 06.09 గంటల వరకు ఉంటుంది.
  • కుంభంలో సూర్యుడు ఆగమనం సాయంత్రం 9 గంటల 11 నిమిషాలకు జరుగుతుంది
  • సూర్యుడు కుంభంలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఏ విధంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

​మేషం..

మేష రాశి వారికి సూర్యుడు రాక వల్ల శుభ ఫలితాలుంటాయి. ఈ సమయంలో మీ కళ, శైలి, నాణ్యత అభివృద్ధి చెందుతాయి. డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల సహాయంతో ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. భవిష్యత్తులో ప్రయోజనం అందుకుంటారు. పనిప్రదేశంలో మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సూర్యుడు రవాణా వల్ల మీకు శుభవార్తలు ఉంటాయి. అంతేకాకుండా సంబంధాలు బలపడతాయి. కుటుంబ సమస్యలు అంతమవుతాయి.

​వృషభం..

కుంభంలో సూర్యుుడ ఆగమనం వల్ల వృషభ రాశివారికి పనిప్రదేశంలో అపరిమత అధికారాలు పొందే అవకాశముంది. అంతేకాకుండా మీ ప్రభావం పెరుగుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు లభిస్తాయి. అలాగే పనిప్రదేశంలో ప్రజలను నడిపించే అవకాశముంటుంది. ఇది మాత్రమే కాదు. ఈ సమయంలో మీరు పదోన్నతులు సాధించే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ కాలంలో విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి.

​మిథునం..

కుంభంలో సూర్యుడు రవాణా వల్ల మిథున రాశి ప్రజలకు గౌరవం లభిస్తుంది. సమాజంలో మీ స్థానం మెరుగుపడుతుంది. సామాజిక స్థాయి పెరుగుతుంది. మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రభుత్వ రంగం నుంచి లాభాలు పొందుతారు. సామాజిక ఆందోళన ఉన్న పనిలో చురుకుగా పాల్గొంటారు. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. మీకు శుభంగా ఉంటుంది. తోబుట్టువుల గురించి ఆందోళన చెందుతారు. అంతేకాకుండా వారికి మంచి చేయడానికి ప్రయత్నిస్తారు.

​కర్కాటకం..

కర్కాటక రాశి వారికి సూర్యుడు ఆగమనం సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడి రవాణా వల్ల మీరు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఇదే సమయంలో పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశముంది. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అత్తమామల వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశముంది. అంతేకాకుండా మీరు నూతన పని ప్రారంభించే అవకాశముంది. చేపట్టిన పనులు, ప్రారంభించే వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

​సింహం..

కుంభ సంక్రాంతి వల్ల సింహ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీకు ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. మీ లక్ష్యాలపై శ్రద్ధ చుపూతారు. నూతన బాధ్యతలను నిర్వహిస్తారు. మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. వారి నుంచి మీకు ఎక్కువ కాలం మద్దతు పొందుతారు. మీకు శుభంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రయోజనం లభిస్తుంది. కార్యచరణ ప్రణాళికను స్నేహితులతో చర్చిస్తారు. వ్యాపార అభివృద్ధికి సోదరులు, సోదరీమణుల నుంచి చాలా మద్దతు పొందుతారు.

​కన్య..

కన్య రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలుంటాయి. అంతేకాకుండా శక్తిమంతమవుతారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు బలోపేతం అవుతాయి. పనిప్రదేశంలో సహకారం ఉంటుంది. చాలాకాలంగా కొనసాగుతున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ పని నుంచి ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు లభిస్తాయి. సూర్యుడు రవాణా వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

​తుల..

కుంభంలో సూర్యుడు ఆగమనం కుంభ రాశి ప్రజలకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీకు చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. ప్రభుత్వ పక్షం నుంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇది ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో కొంతమంది అకాల బదిలీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ బదిలీ వచ్చిన తర్వాత వారికి తగిన ఫలితాలు ఉంటాయి. ఇది వారిని సంతోషపరుస్తుంది. పనిప్రదేశంలో సంతృప్తికరంగా ఉంటుంది.

​వృశ్చికం..

ఈ రవాణా వృశ్చిక రాశి ప్రజల్లో ఉద్రిక్తతకు దారితీస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో ఒత్తిడి నెలకొంటుంది. కాబట్టి మీరు కుటుంబంపై శ్రద్ద పెట్టి వారికి అండగా ఉండాలి. మీరే గొప్పవారని నిరూపించడానికి ఎక్కువగా మాట్లాడతారు. ఇది మీ కుటుంబ వాతావారణాన్ని పాడుచేస్తుంది. అంతేకాకుండా ఈ విషయంలో తల్లితో గొడవపడే అవకాశముంది. కాబట్టి ఈ అంశంపై దృష్టి పెట్టాలి. పనిప్రదేశంలో మీ గౌరవం పెరుగుతుంది.

​ధనస్సు..

ధనస్సు రాశి ప్రజలకు ఈ సమయంలో శుభఫలితాలుంటాయి. మీపై కూడా లోతైనా ప్రభావాన్ని చూపుతారు. ఈ సమయంలో కోర్టు కేసుల్లో ఉపశమనం లభిస్తుంది. మీకు అనుకూలంగా ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ప్రభుత్వ సంస్థల నుంచి ప్రయోజనం లభిస్తుంది. వ్యాపారులకు నూతన ఒప్పందం నుంచి లాభాలు ఉంటాయి. మీ ప్రాంతంలో మీ ఉనికిని చాటుకుంటారు. కుటుంబ అవసరాలకు ఎల్లప్పుడు ముందుంటారు. ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు శుభఫలితాలు పొందే అవకాశముంటుంది.

​మకరం..

మీ రాశి నుంచి సూర్యుడు నిష్క్రమిస్తున్న కారణంగా మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో కెరీర్ పరంగా అదృష్టం కలిసి వస్తుంది. అధికారులు సహచరుల మీ పనిని ప్రశంసిస్తారు. పనిప్రదేశంలో ప్రయోజనం పొందుతారు. అలాగే ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. సమస్యలను సహనంతో పరిష్కరించుకుంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది.

​కుంభం..

కుంభ రాశి వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మీ రాశిలోనే సూర్యుడు ఆగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీకు సౌకర్యాలు పెరుగుతాయి. దానాలు చేస్తారు. డబ్బు పరంగా పెద్ద లాభం అందుకుంటారు. సామాజిక పని చేయడం వల్ల మీ ఖ్యాతి పెరుగుతుంది. పేదవారికి సహాయం చేయడానికి ప్రజలకు సహాయపడుతుంది. ప్రేమ జీవితంలో కొత్తదనం ఉంటుంది. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ సమయంలో సృజనాత్మక పనిచేయడానికి అవకాశం ఉంటుంది.

​మీనం..

కుంభంలో సూర్యుడు రవాణా సమయంలో మీన రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. అయితే ఈ సమయంలో మీకు విదేశీ సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ సందర్భంలో ఇప్పటికే చేసిన చాలా ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు వారు ఎలాంటి హాని చేయలేరు. అయినప్పటికీ మీరు మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు అర్థవంతంగా ఉంటాయి. కార్యాలయంలో మంచి పనితీరును కనబరుస్తారు.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment