మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
వృషభం: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
కర్కాటకం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.
సింహం: కార్యజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహం.
కన్య: వ్యయప్రయాసలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
వృశ్చికం: పనుల్లో అనుకూలత. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
ధనుస్సు: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు , ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.
మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ది. సోదరులతో వివాదాలు పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహపరుస్తాయి.
కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యసమస్యలు. బంధువులు, మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ధనలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment