కెరీర్లో విజయవంతమవ్వాలనే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగిన కృషి కూడా చేస్తారు. అయితే కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కెరీర్ సరైన ట్రాక్ ప్రయాణించదు. మనకిష్టమైన రంగంలో అవిశ్రాంత ప్రయత్నాలు చేసిన, ఎంత శ్రమించినా విజయం సాధించడంలో ఆలస్యమవుతుంది. పదోన్నతులు రాకపోవడం, జీతం పెరగకపోవడం లాంటి ఇబ్బందుల వల్ల నిరాశ కలుగుతుంది. ఇంత మాత్రాన మీ ప్రయత్నాలు, ప్రదర్శనలో లోటు ఉందని అర్థం చేసుకోవాల్సిన పనిలేదు. కొన్నిసార్లు వాస్తు లోపాలు కూడా మీ కెరీర్ కు అవరోధాలుగా మారతాయి. ఈ రోజు మనం అలాంటి దోషాల గురించే చర్చించబోతున్నాం.
మీ కార్యాలయం ఇలా ఉండాలి..
మీరు ఏ రంగంలోనైనా ప్రొఫెషనల్ అయితే అంటే రచయిత, పరిశోధకులు, కళాకారులు అయితే మీ కార్యాలయం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కూర్చూనే సీటు వెనక గోడ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వ్యక్తుల ధైర్యం, సాహాసాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ప్రతిపనిలోనూ మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మీ సీటింగ్ ప్రదేశం.. ఆఫీసు ప్రధాన ద్వారం నుంచి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి.
ఇంట్లో ఆఫీసు వర్క్ చేస్తుంటే..
కోవిడ్-19 ప్రభావం వల్ల చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే ఇంటి నుంచి ఆఫీసు వర్క్ చేస్తుంటే పడకగదిలో పనిచేయకూడదని గుర్తించుకోండి. ప్రస్తుతం చాలా మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు కాబట్టి కూర్చునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పడకగది నుంచి పని చేయడం వల్ల మీరు పూర్తి చేయాలనుకున్న పని లేదా ప్రాజెక్టు పూర్తి చేయలేరు. బడలికగా ఉండి తగినంత కృషి చేయలేరు.
మీటింగ్ రూంలో ఇలాంటి టేబుల్ ఉండకూడదు.
మీరు ప్రొఫెషనల్ అయితే మీ సహోద్యోగులతో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీటింగ్ రూంలో పదునైన అంచులు కలిగిన టేబుల్ ఉండకూడదని గుర్తుంచుకోండి. కార్యాలయంలో టేబుల్ ను అండాకరంలో ఉండేలా చూసుకోండి. అలాగే మీరు మీటింగ్ రూం ప్రవేశ ద్వారానికి ముందుగా కూర్చోకూడదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీరనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
కూర్చీ ఈ విధంగా ఉండాలి..
కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు సాధారణ కూర్చీలో కూర్చవడం అంత మంచిది కాదు. వెనక భాగం ఎక్కువగా ఉండే కుర్చీపై కూర్చొవాలి. అంతేకాకుండా ప్రధాన ద్వారానికి వీపు పెట్టి కూర్చోకూడదు. లక్ష్మీ దేవి ప్రధాన ద్వారం నుంచే వస్తుందని నమ్ముతారు. ఫలితంగా పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ప్రధాన ద్వారాని ఎదురుగా కూర్చోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనరాశులు ప్రాప్తిస్తాయి.
ఈ విషయాన్ని గుర్తుంచుకోండి..
కార్యాలయంలో మీ కూర్చోనే ప్రదేశంలో మీ తలకి పైన ఎలాంటి స్లాబు బీమ్స్ లేకుండా ఉండాలి. అంటే మీరు కూర్చొనే ప్రదేశంలో పైన ఎలాంటి అవరోధాలు ఉండకూడదు. ఎందుకంటే ఇది కెరీర్ లో మీ పురోగతి అడ్డంకుటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధించాలంటే ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. ఇదే సమయంలో మీ డెస్క్ చతురస్రాకారంలో ఉండాలి. కావాలంటే దీర్ఘచతురస్రాకారంలో కూడా ఉంచవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో గుండ్రంగా మాత్రం ఉండకూడదు.
మీ డెస్క్ దీంతో తయారుచేసిందై ఉండాలి..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment