మేషం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు.
వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొత్త సమస్యలు.. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు..
మిథునం: ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కర్కాటకం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.
సింహం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
కన్య: ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు చికాకులు.
తుల: దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. విద్యార్థుల యత్నాలు సఫలం.
వృశ్చికం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ.
ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు. దైవచింతన.
మకరం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు నిరాశ.
కుంభం: బంధువుల సాయంతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగయత్నాలు సానుకూలం.
మీనం: శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు అంచనాలు నిజం కాగలవు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment