Friday, 19 February 2021

ఇంట్లో ఆర్థిక సమస్యలా.. అయితే ఈ వాస్తు నివారణలు పాటించండి




ఆదాయం ఎక్కువగా వస్తున్నా చేతిలో డబ్బులు ఉండటం లేదా? ఇంట్లో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయా? ఇంట్లో ప్రతికూలత ఎక్కువగా ఉందా? అయితే ఇంటి వాస్తు ఓ సారి సరిచూసుకోవాలి. వాస్తు దోషమున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులే కాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో విజయం సాధించలేరు. ఇంట్లో ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే ఇది మీ ఇంటి వాస్తు కూడా కారణం కావచ్చు. చాలాసార్లు మన ఇంట్లో ఎలాంటి తప్పు కనిపించదు. కానీ పదే పదే సమస్యలు ఎక్కువగా ఉంటే మాత్రం వాస్తు లోపాలను సరిచూసుకోవాలి.


ఇంటి ముఖ ద్వారం వద్ద ఇలా చేయండి.

ప్రతి రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యదేవుడికి నీటిని అర్పించాలి. అనంతరం ఇంట్లో పూజ చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజూ స్వస్తిక్ గుర్తు వేసి దానిపై అక్షతలు, నీటిని చల్లండి. ప్రతి రోజూ ఈ విధంగా చేయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. అంతేకాకుండా ఆమె అనుగ్రహం పొంది ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందలు దరిచేరవు. జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా అధిగమించగలుగుతారు.

​తులసి లేదా అరటి చెట్టు..

మీ ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో తెలుసుకోవాలంటే నిరంతరం సమస్యలు వస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇబ్బందులు పదే పదే వస్తున్నప్పుడు ఈ పరిహారాన్ని ప్రయత్నించవచ్చు. ఇంటి ప్రధాన ద్వారానికి కుడి వైపున తులసి చెట్టు, అరటి చెట్టును నాటాలి. ఈ చెట్టు పొడవుగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం ద్వారా జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా అధిగమించవచ్చు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలకు ముగించవచ్చు.

​మీరు ఇల్లు నిర్మించకపోతే..

ఇల్లు నిర్మించాలనుకున్నా లేదా ఫ్లాటు కొనుగోలు చేసుకోవాలనుకున్న సమయంలో ఇబ్బందులు ఎదురవుతుంటే ఓ సారి గమనించాలి. వాస్తుదోషమున్నప్పుడే ఈ లాంటి ఇబ్బందులు వస్తాయి. మీకు కూడా ఇలాంటి అవరోధాలు ఉంటే దానిమ్మ చెట్టు నాటి వదిలేయండి. ఈ విధంగా చేయడం ద్వారా త్వరలోనే ఇల్లు నిర్మించాలనే మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలిగించుకుంటారు.

​విరిగిన పాత్రలు, వస్తువులు..

విరిగిన వస్తువులను అలాగే ఇంట్లో ఉంచడమనేది చెడ్డ విషయం. ఇంట్లో విరిగిన పాత్రలు, మంచాలు, ఫర్నిచర్ ఉండటం వల్ల చాలా పేదరికం వస్తుంది. కాబట్టి పొరపాటున కూడా వీటిని ఇంట్లో ఉంచకండి. అలా చేయడం ద్వారా ప్రతికూల శక్తి ఇంట్లో ప్రసరిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే వెంటనే వాటిని బయటకు విసిరేయండి. ఫలితంగా ఇంట్లో సానుకూలత శక్తి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి.

​ఇంటి పైకప్పుపై ఈ విధంగా చేయండి

మీరు ఇంట్లో వాస్తు దోషం తొలిగించుకోవాలంటే ఇంటి పైకప్పుపై పెద్ద గుండ్రని అద్దం ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీరు చెడును వదిలించుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం అందులో కనిపించే విధంగా అద్దం ఉంచండి. వాస్తుశాస్త్రం ప్రకారం అద్దం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ సంపద కూడా పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక సమస్యలు సమసిపోతాయి.

​వంటగది వాస్తు..

ఇంట్లో వంటగది చాలా ముఖ్యమైన ప్రదేశం. వాస్తుప్రకారం వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గదిలో వాస్తుదోషమున్నట్లయితే కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వంటగదిలో పొయ్యిని ఆగ్నేయ దిశలో ఉంచేలా చూడండి. ఇలా చేయడం ద్వారా వంటగదికి సంబంధించి వాస్తు దోషాన్ని తొలగించవచ్చు. అంతేకాకుండా ప్రతికూల శక్తిని నివారించవచ్చు. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



 

No comments:

Post a Comment