ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వ్యాపారులు, విద్య, శృంగారం మరియు జీవితంలోని ఇతర రంగాల గురించి న్యూమరాలజీ ఏమి చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
నెంబర్ 1
ఈ తేదీలో పుట్టిన వారికి 2021 సంవత్సరంలో సాధారణంగా ఉంటుంది. మీరు చాలా విషయాల్లో సానుకూలంగా ఉంటారు. ఉద్యోగులకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే దానికి తగ్గ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే కాలం గడిచేకొద్దీ మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు మంచిగా ఉంటుంది. మీరు అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఈ సంవత్సరం ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి. సంవత్సరం ప్రారంభంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది.
నెంబర్ 2
ఈ సంఖ్య గల వారి కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. మీలో కష్టపడి ఎవరైతే పనిచేస్తారో.. వారందరికీ మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు కోరుకున్న చోటుకు ట్రాన్స్ ఫర్ కావొచ్చు. మరోవైపు వివాహితులకు ఈ ఏడాదిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే మీ అవగాహనతో మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చుకుంటారు. మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోగలుగుతారు.
నెంబర్ 3
ఈ సంఖ్యలో పుట్టిన వారికి 2021 సంవత్సరం సాధారణంగా ఉంటుంది. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేనందున మీరు గందరగోళ స్థితిలో ఉంటారు. మతం మరియు ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. దీని వల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. మరోవైపు సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే దీనికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. ఉద్యోగులకు ఈ ఏడాది ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
నెంబర్ 4
2021 సంవత్సరంలో మీ ప్రేమ జీవితం గొప్పగా ఉంటుంది. మీరు కోరికలన్నీ చాలా వరకు ఈ ఏడాది నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ సంతోషంగా ఉంటారు. సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు మంచిగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. వ్యాపారులు కూడా లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఫలితాలన్నీ మెరుగవుతాయి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరి మద్దతు మీకు లభిస్తుంది.
నెంబర్ 5
ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు కుటుంబంతో తక్కువ సమయం గడుపుతారు. దీంతో వారు మీపై కోప్పడతారు. ఈ సంవత్సరం మీకు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితానికి ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం బలంగా మారుతుంది. సంవత్సరం చివర్లో మీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావచ్చు. ఆర్థిక పరంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు
నెంబర్ 6
ఈ సంఖ్య వచ్చిన వారికి 2021 ప్రారంభ సమయంలో కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు కుటుంబానికి మద్దతు లభిస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు కావాల్సిన ఉద్యోగం పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారులకు ఈ ఏడాది మంచిగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో కూడా గొప్పగా ఉంటుంది. ఈ ఏడాది మీ భాగస్వామితో కలిసి మీరు యాత్రకు కూడా వెళ్లొచ్చు. వివాహితులకు ఈ సంవత్సరం మంచిగా ఉంటుంది. విద్యార్థులు మాత్రం కొత్త ఏడాదిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదు. మీరు ఎంత కష్టపడితే.. అంత మంచి ఫలితాలను పొందుతారు.
నెంబర్ 7
ఈ సంఖ్య గల వారికి కొత్త ఏడాది 2021లో వివాహితులకు ప్రారంభంలో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. అయితే సమయం గడుస్తున్న కొద్దీ మీ సంబంధం సాధారణ స్థితికి వస్తుంది. వ్యాపారులు ఈ సంవత్సరం మంచి ప్రయోజనాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య పట్ల నిర్లక్ష్యంగా ఉండొచ్చు. అయితే ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమై.. కష్టపడుతూ ఉంటారో వారికి సంవత్సరం మధ్యలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
నెంబర్ 8
ఈ సంఖ్య వచ్చిన వారికి కొత్త ఏడాది 2021లో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రేమ వివాహం కోరుకునే వారు మీ కుటుంబంతో ఓపెన్ గా మాట్లాడాలి. అలా అయితే మీ సంబంధంలో ఆనందం వస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ అలవాట్లను మెరుగుపరచుకోవడం మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారులు, సహోద్యోగుల పూర్తి మద్దతును పొందుతారు. వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా పురోగతి లభించే అవకాశం ఉంది.
నెంబర్ 9
ఈ సంఖ్య గల ప్రజలకు ఈ సంవత్సరం 2021లో ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కానీ కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. మీ వైవాహిక జీవితంలో మరియు ప్రేమ జీవితంలో మీరు ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. అయితే మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభ సమయంలో ఉద్యోగులకు మంచిగా ఉంటుంది. వ్యాపారులకు శుభ ఫలితాలు వస్తాయి.
గమనిక :
11 నుండి 31వ తేదీలో పుట్టిన వారు తమ సంఖ్యలను మొత్తం కూడగా వచ్చే ఒక సంఖ్యను బట్టి మీ నెంబరు ఏదో తెలుసుకోగలరు. (ఉదాహరణకు 11 అంటే (1+1=2, 23 అంటే 2+3=5 అన్నమాట) ఇలా మీ నెంబరును బట్టి మీ భవిష్యత్తును తెలుసుకోగలరు. ఇదంతా సంఖ్యాశాస్త్రం ప్రకారమే
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment