మేషం: ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు అందర్నీ మెప్పిస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం: సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.
మిథునం: పనుల్లో అవాంతరాలు. మానసిక అశాంతి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. మిత్రులతో విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
కర్కాటకం: ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. నూతనంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
సింహం: ముఖ్యమైన పనులలో విజయం. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కొన్ని చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
తుల: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
ధనుస్సు: రుణయత్నాలు సాగిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం: బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ధనలాభం. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.
కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
మీనం: ఆత్మీయుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి పిలుపు. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment