Tuesday 9 February 2021

ఫిబ్రవరిలో 6 గ్రహాల స్థానచలనం.. ఈ రాశుల వారికి సానుకూలం




రాశులను మార్చుకోనున్నాయి. రాశుల్లో గ్రహాల స్థానచలనం ముందుగా బుధుడుతో ప్రారంభం కానుంది. బుధుడు వచ్చే నెల 4న మార్చుకోనున్నాడు. అనంతరం ఫిబ్రవరి 9న శని.. మకరంలో ప్రవేశించనున్నాడు. 12న సూర్యుడు కుంభంలో రవాణా చెందనున్నాడు. రెండు రోజుల తర్వాత 14న గురుడు మకంరలో అడుగుపెట్టనున్నాడు. అనంతరం బుధుడు తిరోగమించి ఫిబ్రవరి 21న మకరంలో ప్రవేశించనున్నాడు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 22న అంగారకుడు వృషభంలో ఆగమనం చెందనున్నాడు. ఈ ఆరు గ్రహాల స్థానచలనం కారణంగా రాశిచక్రంపై ప్రభావం పడనుంది. కొన్ని రాశుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయనుండగా.. మరి కొన్ని రాశుల ప్రజలకు ప్రతికూల వార్తలు, ఫలితాలను అందించనుంది. ఈ నేపథ్యంలో ఆరు గ్రహాల మార్పు వల్ల ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం..

గ్రహాల మార్పు మేష రాశి వారికి సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో మీకు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా అసంపూర్ణమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పైఅధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అంతేకాకుుండా మీ సూచనలు చర్చించుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్తమ ఫలితాలను సాధించుకుంటారు. స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో నూతన వెలుగు వస్తుంది. 6 గ్రహాల మార్పు వల్ల మీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా విద్యారంగంలో విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు.

​మిథునం..

గ్రహాల మార్పు మీకు అనేక శుభ అవకాశాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో మీకు అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ పెట్టుబడులతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు పనిప్రదేశంలో ఉన్నత స్థానాలను పొందుతారు. అంతేకాకుండా ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశాలను కూడా పొందుతారు. నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యం పెరుగుతుంది. మీరు నూతన ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మీ సంబంధం బలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతల కోసం ముందుకు వస్తారు. శత్రువులను వదిలించుకుంటారు. పోటీ స్ఫూర్తి మీకు విజయాన్ని అందిస్తుంది.

​సింహం..

గ్రహాల మార్పు మీ సౌకర్యాన్ని పెంచుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేస్తుంది. అంతేకాకుండా అన్ని అడ్డంకులు తొలగించబడతాయి. ఆకస్మిక లాభం వచ్చే అవకాశముంది. తండ్రి మద్దతు మీకు ఓ వరమని రుజువు చేస్తుంది. జీవిత భాగస్వామి ఆదాయం పెరగడంతో మనస్సు సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు అంతమవుతాయి. కార్యాలయంలో మీ లక్ష్యాలను సాధించడానికి మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ మార్పు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో మంచి ఫలితాలకు దారితీస్తుంది.

​కన్య..

 గ్రహాల మార్పు మీ రాశిచక్రంపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీరు శక్తితో నిండి ఉంటారు. ఆశాజనకంగా కనిపిస్తారు. ప్రతిరంగంలోనూ ఈ శక్తి ప్రయోజనాన్ని పొందుతారు. అది వృత్తిపరమైన లేదా సామాజికమైంది కావచ్చు. మీరు జీవితంలో ప్రేమ, ఆనందం, శుభఫలితాలను పొందుతారు. నిజాయితీతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. తండ్రి నుంచి వారసత్వ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శుభ అవకాశం లభిస్తుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. రోగ నిరోధక శక్తి విస్తరిస్తుంది. మీకిష్టమైనవారితో మంచి సమయం గడుపుతారు.

​మకరం..

గ్రహాల రాశిచలనం వల్ల మీకు పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ సోదరుల, సోదరీమణులతో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. మీ స్వభావం, ప్రవర్తన మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీ మనస్సు మతపరమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. మీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొదుతారు. అంతేకాకుండా వృత్తిపరమైన లాభాలు పొందుతారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో మీ అనుభవాల జ్ఞానం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధించడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది.

​కుంభం..

గ్రహాల మార్పు మీపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో పనిప్రదేశంలో ప్రమోషన్ ఉంటుంది. ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశముంది. మీరు జీవితంలో చేసిన వాటిని మీరు అభినందిస్తారు. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అవరోధాలు అంతమవుతాయి. వివాహితులకు కొన్ని అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు చాలా అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కోసం నిరుద్యోగుల అన్వేషణ పూర్తవుతుంది. ఆకస్మిక లాభాలు పొందుతారు. భవిష్యత్తును బలోపేతం చేయడానికి మీ వ్యూహం ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తారు.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


 

No comments:

Post a Comment