Friday, 15 December 2017

గోదా దేవి/ఆండాళ్ ఎవరు?





ఆండాళ్ జీవిత చరిత్ర

ఆండాళ్ జీవిత చరిత్ర దక్షిన భారత దేశం లో ప్రసిద్ది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం  శ్రీ ఆండాళ్ తమిలనాటి శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనం లో కలియుగ ఆది లో అనగా 93 సంవత్సరం లో అవతరించినది.
 
 విష్ణుచిత్తులు(పెరియాళ్వార్) వారి పెంపకం
 
ఎలాగైతె జనక మహారాజుకి సీతాదేవి  లభించినదో,  విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) శ్రీవిల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది.  తమిలంలో కోదై అనగా తులసి మాల అని అర్థం, కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవాడు, క్రమేపి ఆపేరే గోదా గామారింది. తండ్రిపెంపకం లో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తి తో పెరిగింది.
 
 విష్ణుచిత్తులవారు ప్రతి రోజు తులసి మాలను తయారుచేసి ఒకబుట్టలో ఉంచి, తిరిగి తన కర్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకొనివెళ్ళి వటపత్రశాయి మూర్తికి సమర్పించేవాడు. తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను దరించి తాను భగవంతున్ని వివాహము ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసేది. కొద్దిరోజులకు తండ్రిగార్కి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా, గోదా ఆ మాలను  దరించినదని గమనించి ఆమెను కోపించి, తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను  భగవంతునికి సమర్పించలేదు.  ఆశ్చర్యంగా ఆరోజు స్వప్నం లో స్వామి కనిపించి ఈరోజు తులసిమాలని ఎందుకు సమర్పించలేదని అడిగెను, తనకు భక్తులు తాకిన భహుమతులంటే ఇష్టం అని చెప్పెను. ఒక్కసారిగా విష్ణుచిత్తులవారు  గోదా ఒక కారణ జన్మురాలని గమనించి, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ అని పిలవటం మోదలుపెట్టాడు. ఆండాళ్  అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం. అప్పటినుండి ప్రతిరోజు ఆండాళ్ దరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు. 
 
 గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరునికై చింతించెను, కాని ఆమె కృష్ణున్ని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్పెను.  కాని తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని అది చాలదూరము, కాలము కూడా వేరు అని చెప్పెను. తాను కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్పెను. తండ్రిగారు వివిద దివ్యక్షేత్రాలలోని  ఆయా మూర్తుల కళ్యాణగుణగణాలను కీర్తించెను, తద్వారా గోదాదేవి శ్రీరంగం లో వేంచేసి ఉన్న రంగనాయకులని వరునిగా తలచెను. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై తాను "తిరుప్పావై" మరియు "నాచియార్ తిరుమొఱ్ఱి" అనే దివ్యప్రభందాలను పాడెను.
 
గోదా కళ్యాణం
  విష్ణుచిత్తులవారికి శ్రీరంగనాథులవారు మల్లీ స్వప్నంలో కనిపించి, నీ కుమర్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పెను, ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పెను. అదేవిదముగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీవిల్లిపుత్తుర్ నుండి గోదాదేవిని పల్లకీలో తెమ్మని చెప్పెను. తద్వార రాజు వల్లభ దేవుని తో పాటు అందరు కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి, ఆమె ఆ రంగనాథున్ని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది.


 సుఖినోభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371

No comments:

Post a Comment