Friday 15 December 2017

తిరుప్పావై





సాధారణంగా మనిషి ఎంత వీలైతే అంత తన పనిని తప్పించుకొని, సులువైన మార్గం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. తన సుఖానికి అడ్డు వచ్చిన దాన్ని అణిచివేసి తన ఆధిపత్యం చెలాయిస్తూ బ్రతుకుతాడు. మిగతా జీవరాశులు వాటి పని అవి చేసుకుంటూ వాటి మానాన అవి బ్రతుకుతాయి, లభించినవాటితో సంతృప్తిగా ఉంటాయి. మనిషికి ఉన్న దానితో తృప్తి లేదు, ప్రక్కవాన్ని చూసి సహించలేడు. ఇంకితాన్ని పూర్తిగా వదిలి మానవుడు దుష్ప్రవృత్తికిలోనవుతున్నాడు అనేది మనం గమనిస్తున్నాం. మానవ జన్మ విలక్షణమైనది. మనిషి తనకున్న జ్ఞానం ద్వారా కర్మను సవ్యంగా ఆచరిస్తూ బ్రతక గలడు. మనం ఎట్లా బ్రతకాలో, మన లక్ష్యం ఏమిటో తెలిస్తే జీవితాన్ని సవరించుకొని బ్రతకవచ్చు.
మరి ఆ జ్ఞానం లభించేది ఎలా ? మనకున్న ఇంద్రియాల ద్వారానో, ఊహతోనో నిర్ణయించి చెప్పలేం. మనం ఈనాడు అనుకొనే ఆధునిక విజ్ఞానం కేవలం కనిపించిన దాన్నే నమ్ముతుంది. కానీ ఇంత విశ్వాన్ని గుర్తించడానికి మన ఇంద్రియాలకున్న శక్తి సంకుచితం, మన ఊహ అల్పం. దీన్ని గుర్తించిన మన పూర్వులు కనిపించని లోపటి ప్రపంచం వైపు దృష్టి సాగిస్తూ ఎంతో కాలంగా సాగించిన తపస్సమాధి దశలో వారు ఒక శబ్దాన్ని గుర్తించారు. మన మనుగడకు కారణమైనది ఆ శబ్దం. మనం కోరిన ఫలాన్ని ఇవ్వగలదు కనుక దాన్ని వేదం అని అంటారు. అది మనల్ని శాసించగలదు కనుక శాస్త్రం అని అన్నారు. వేదం అనేది అలౌకికమైనది. సహజమైనది. ఎవరో తయారుచేసినది కాదు. అందుకే దాన్ని అపౌరుషేయము అని అంటారు. ఎదో ఒక ఫలానా భాషలో వ్రాసినవి కావు. బాషలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే, భాషలేవీ లేని నాడు ఉన్నది వేద శబ్దం. అసలు భాషలన్నీ ఏర్పడ్డవి వేద శబ్దంలోంచే అనేది భాషా ప్రావిణ్యం ఉన్న వారు చెప్పే మాట. ఏలాంటి స్వార్థంలేక కేవలం మన బాగు కోసం చెప్పే ఆప్తుల ద్వారా అందినది కనుక దానికి ఆప్తవాక్యం అని పేరు. దాన్ని కేవలం ఒకరి నుండి మరొకరు నేర్చేది ఉచ్చారణ-అనుచ్చారణ ద్వారానే కనుక దానికి శృతి అని పేరు. అట్లా ఎన్నో లక్షల సంవత్సరాల నుండి మన జాతి వేదాన్ని తన సంపదగా కాపాడుకుంటూ వస్తుంది.
వేదం అనేది ఈ జగత్తుకు కారణమైన పరమాత్మ గురించి చెబుతుంది, జీవ పరమాత్మల సంబంధం గురించి, మనం చేరాల్సిన లక్ష్యం గురించి చెబుతుంది, ఇలా మన ఊహకు అందని ఎన్నో విషయాలను తెలుపుతుంది. మొత్తానికి వేదం చెప్పదలుచుకున్నది ధర్మాన్ని, అంటే మన ఆచరణని, మనకున్న నియమాలని, కట్టుబాట్లని. ఒక రైతు తన పంటకు గట్లు వేసి ఒక క్రమ పద్దతిలో నీటిని ప్రసరింపజేస్తాడు. అట్లానే మనిషి యొక్క జ్ఞానం విశృంఖలంగా ప్రవర్తించకూడదు. అట్లా వేసిన గట్లే మన శాస్త్రాలు. మనిషి తన సుఖం కోసం ప్రకృతి నియమాలను విస్మరిస్తాడు కనుకనే మనిషికి శాస్త్రం అవసరమైంది.
అయితే వేదం నుండి నేరుగా విషయాలను గుర్తించడం అంత సులభం కాదు. మన బాగు కోసం భగవంతుడు ఉపదేశం చేసిన భగవద్గీత, ఏదో తనకు తోచి చెప్పినది కాదు. వేదంలో అక్కడక్కడా చెదిరి ఉన్న విషయాలను ఒక చోటకు చేర్చి పాటవలె పాడి వినిపించాడు. వేదాన్ని మరింత వివరంగా తెలుపడానికి బయలుదేరినవే స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు , ఆగమాలు మరియూ ప్రబంధాలు. ఇవన్ని జీవ నిర్మితాలు. అందుకే వాటిని స్వీకరించే ముందు వేదానికి అనుగుణంగా ఉన్న వాటిని చూసి స్వీకరించాలి. అట్లా వేద వాఙ్మయాలలోని విలువలను గుర్తించి బ్రతికితేనే అది ప్రామాణికమైన జీవనం అవుతుంది. మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది.
మనం ఏర్పర్చుకున్న కర్మ బంధం అనేది ఒక దీపానికి పట్టిన మసి వలే మన యొక్క అసలు స్థితిని గుర్తించవీలులేనట్టుగా అంటి ఉంది. మనకంటూ ఒక ఆనంద స్థితి ఉందని మరచిపోయాం. దాని వల్లే ఎన్నో క్లేషాలు పొందుతూ ఉన్నాం. భగవంతుడు మనల్ని తనంత ఆనంద స్థితికి చేర్చాలని అనుకుంటాడు. మనల్ని ఉద్ధరించడానికై భగవంతుడు ఎన్నోసార్లు అవతరించాడు. మనం ఉన్న ఈ కలియుగానికి భుజం భుజం రాసుకొనేంత చేరువలో ఉన్న ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు. రామావతారంలో మాదిరిగాకాక తను కేవలం మానవుడిని అనే హద్దు అనేది లేకుండా దేవుడిగానే వచ్చాడు శ్రీకృష్ణావతారంలో. ఎన్నో లీలలు ప్రదర్శించాడు, ఎన్నో ఉపదేశాలు చేసాడు. మనల్ని బాగు చేద్దాం అని కొండంత ఆశతో వచ్చాడు, కానీ మనం మనమే తప్ప మనలో మార్పు అనేది లేదు. ఎండకు ఎండం. వానకు తడవం. గాలికి చెదరం. అట్లాంటి మన ప్రవృత్తికి విసిగి ఉన్న పరమాత్మని మనల్ని ఒక చోటికి చేర్చింది అమ్మ గోదాదేవి. సమస్త వేదాల సారం అని పిలవబడే తిరుప్పావైని భగవంతుణ్ణి చేరే మెట్ల మాదిరిగా అందించింది. ముప్పైపాటల తిరుప్పావైని ధనుర్మాస వ్రతంగా మనకు అందించింది. ఆమె పాడిన పాటల్లో తను ఉన్నాడు. ఆమె పాటలకు శ్రీరంగనాథుడే చలించి గోదాదేవిని తనవద్దకు రప్పించుకొని వివాహమాడాడు. మనకోసం తనను తానే సమర్పించుకుంది అమ్మ గోదాదేవి. ఆమెను స్వీకరించాడు అంటే, ఆమె మాటలని ఒప్పుకున్నట్లే కదా! ఆమె పాడిన పాటల్ని మనం పాడగలిగితే చాలు.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment