Thursday 25 March 2021

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది.....!!

 



లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ....
అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి - అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో, వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి..
► భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.
~ శ్రీ హరి కుడా ఉండదు.
► శంఖద్వని వినిపించని చోటా.
► తులసిని పూజించని చోట.
► శంఖరుని అర్చించని చోట
► బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట.
~ లక్ష్మి దేవి నివసించదు.
► ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట.
► ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
► విష్ణువును ఆరాధించకుండ.
► ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
► హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న.
~ ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది.
► అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
► చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.
► నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని,
తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
► శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు . ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన ఐశ్వర్యం జారిపోతుంది.
సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది.
ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment