Tuesday 23 March 2021

గుర్రపు నాడ రింగు

 




contact 9666602371
శనిగ్రహా దోష నివారణకు గుర్రపు నాడ రింగును మగవారైతే కుడి , ఆడవారయితే ఎడమ చేతి మద్యవ్రేలుకి ధరించి శని గ్రహా వ్రేలుకి శ్రమ కలిగి కొంతమేరకు శనిగ్రహా భాదలనుండి విముక్తి పొందవచ్చు.

మనం చేసే పనికి తగ్గ ఫలితాన్ని ఇచ్చేది శని , శని సరైన స్థానాలలో లేనప్పుడు మనం చేసే పనికి తగ్గ ఫలితం రాదు. అలాంటప్పుడు విధి విధానంగా చేయించుకున్న గురపునాడా రింగ్ పెట్టుకోడం వలన ఫలితం ఉంటుంది.
ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు.12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.
జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏలినాటి శని అని వ్యవహరించడం జరుగుతోంది. 12 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు.జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలనం సూచనలు.

రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి. జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు.
రెండవ పర్యాయము (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి.
మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అలాగే జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే.
అర్ధాష్టమ శని:- జన్మరాశి నుంచి నాల్గవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, స్థిరాస్తి,వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. స్థానచలనం ,వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.
అష్టమ శని:- జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.
దశమ శని:- జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.
అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గోచారంలో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే గుర్రపు నాడ రింగును ధరించి కొంత ఉపశమనం పొందవచ్చు.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment