Wednesday 24 March 2021

అమలక ఏకాదశి వైశిష్ట్యం

 



*దాన ఫలాన్ని అక్షయం చేసే అమలక ఏకాదశి. ఆమలకము అంటే ఉసిరి అని అర్థం.*
*అమలక ఏకాదశికే ధాత్రీ ఏకాదశి , అమృత ఏకాదశి అనే నామాంతరాలున్నాయి, ‘ ఆమలక వృక్షే జనార్దనః ’అంటారు కనుక ఈ రోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులను పూజిస్తే అధిక ఫలితం ఉంటుంది. ఈ రోజు ఏ దానం చేసినా అది అక్షయమవుతుంది. కొన్ని సంప్రదాయాలవారు ఈ రోజున సంపదలనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో ఉంటుందని భావిస్తారు. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు , రాధ ఈ చెట్టు సమీపంలోనే నివసించారనేది ఒక కథ. కార్తీక మాసంలో ఉసిరికాయల ప్రస్తావన వస్తుంది. ఉసిరి కొమ్మతెచ్చి పూజ చేయడం , ఉసిరికాయ దీపాలు వత్తులు వెలిగించడం , ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వంటి పలు రకాల క్రియలు చేస్తారు , మళ్ళీ ఉసిరి ప్రస్తావన కనబడేది ఫాల్గున మాసంలో ఉసిరి ఎంతో ప్రశస్తమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇక చైత్ర మాసంలో కాసే ఉసిరి పండ్లకు ఒక ప్రత్యేకమైన ఔషధ గుణముంటుందని , వాటి కోసం ప్రత్యేకంగా వెతుకుతుంటామని ఒక వైద్య గ్రంథాన్ని ఉటంకిస్తూ ఒక ఆయుర్వేద వైద్యుడు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజునే హోళీ ఉత్సవాలకు ప్రారంభ దినంగా భావిస్తారు. ఆంధ్ర ప్రాంతం లోని గోదావరీ తీర వాసులు దీనిని కోరుకొండ ఏకాదశిగా వ్యవహరిస్తారు*.
*ఈ రోజు కోరుకొండలోని నరసింహ స్వామి ఆలయంలో విశేష పూజలు , తిరునాళ్ళు జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో జనం వస్తారు. అన్ని పండుగ దినాలకూ సంబంధించి ఉన్నట్టే ఈ పర్వానికి సంబంధించి కథలు ఉన్నాయి*.
*ఒకసారి చిత్ర కేతుడనే రాజు వేటకు వెళ్ళాడు , వేట మైకంలో దారి తప్పాడు. అతను ఒక ప్రాంతానికి వెళ్లగానే రక రకాల ఆయుధాలు ధరించిన రాక్షసులు అధిక సంఖ్యలో అతనిని చుట్టు ముట్టారు. వారితో యుద్ధంలో అతను గాయపడకపోయినా అలసిపోయి స్పృహ తప్పాడు. ఆ సమయంలో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో అతని శరీరం నుంచి వెలువడి రాక్షసులనందరినీ హతమార్చింది. కొంతసేపటికి స్పృహలోకొచ్చిన చిత్రకేతుడు తనపై దాడికి వచ్చిన వారందరూ పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆకాశవాణి అతనిని ఒక దివ్య శక్తి రక్షించిందని , దానికి కారణం అతను ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడమేనని పేర్కొంది. ఆ తర్వాత అతని రాజ్యంలో ఆ వ్రతం, దాని ఫలితం ప్రసిద్ధి పొందింది. ఎక్కువ మంది దానిని ఆచరించడంతో రాజ్యంలో శాంతి , సామరస్యాలు వెల్లివిరిసాయి*.
*దీనికి సంబంధించి వ్రత ఫలాన్ని చెప్పే మరో కథ:*
*బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠుడు చెప్పినట్లుగా ఉందని విజ్ఞులు చెబుతారు. దాని ప్రకారం విదిష రాజ్య ప్రభువైన చిత్రరథుడు విష్ణు భక్తుడు. అతని రాజ్య ప్రజలు కూడా విష్ణు భక్తులే. ఒక ఏడాది అతను , కొంత మంది భక్తులతో ఒక నదీ తీరంలో ఉన్న ఒక అమలక వృక్షం వద్ద విష్ణు పూజ చేశాడు. దీనిలో భాగంగా రాజు పరశురామావతార విష్ణువును కూడా పూజించాడు. వారందరూ ఉపవాసం ఉండి రాత్రంతా విష్ణు భజనలు పాడుకుంటూ జాగరణం చేశారు. ఆ సమయంలో ఎటువంటి వేట దొరక్క ఉపవాసం ఉన్న ఒక వేటగాడు కూడా వారితోబాటు రాత్రంతా జాగారం చేశాడు. ఆ కారణంగా అతను మరు జన్మలో రాజుగా జన్మించాడు. అతనికి వసురథుడని పేరు పెట్టారు. అతను కూడా వేట మైకంలో రాక్షసుల బారిన పడడం ఒక దివ్య శక్తి చేత* *రక్షించబడటం వంటివన్నీ జరిగాయని చెబుతారు. గత జన్మలో చేసిన అమలక ఏకాదశి ఫలితంగా అతనికి ఈ జన్మలోనూ రక్షణ లభించిందని చెబుతారు. ఏది ఏమైనా ఎటువంటి కోరిక లేకుండా పూర్తి భక్తితో ఈ రోజు విష్ణు పూజ చేస్తే పైన చెప్పిన విధంగా ఈ జన్మలోనూ , వచ్చే జన్మలోనూ విశేష ఫలితం ఉంటుందని చెప్పడం కథ ఉద్దేశం*.
*ఈ రోజు చేసిన దానం వాజపేయం , సోమయజ్ఞంలో చేసిన దానంతో సమానమని చెబుతారు. ఇక ఈ రోజున పూజించే అమలక వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నదనేది అందరికీ తెలిసిందే. దానికి ఎన్నో విశేష లక్షణాలు ఉన్నాయి. వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుతుందని , గొంతు నొప్పి , హృద్రోగాలు పిత్తాశయంలో రాళ్లు , అల్సర్లు , కామెర్లు , నొప్పులు , దురదలను , పేలను నివారిస్తుందని , జీవ క్రియలు వేగంగా జరిగేలా చేస్తుందని , రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని జీర్ణ క్రియకు ఉపయోగించే పీచు పదార్థం దీనిలో ఎక్కువని , మలబద్ధకాన్ని నివారిస్తుందని , రోగ నిరోధక శక్తిని పెంచుతుందని , కంటి చూపును* *మెరుగు పరుస్తుందని , రక్తాన్ని వృద్ధి చేస్తుందని , ఎముకలకు బలం చేకూరుస్తుందని , శరీరాన్ని చల్లబరుస్తుందని , కేన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని, లివర్‌ను కాపాడుతుందని , శరీరానికి కాంతిని ఇస్తుందని , జుట్టు నెరవడాన్ని అరికడుతుందని చెబుతారు. అంతేకాక తెల్ల ప్లేగు అనే క్షయ వ్యాధి రాకుండా ఇది కాపాడుతుందని కూడా* *ఆయుర్వేదం చెబుతోంది*
. *అంతేకాక ఈ పండులో షడ్రసాల్లో ఒక్కటి తప్ప అన్నీ ఉంటాయని చెబుతారు. లేని ఆ ఒక్క రసం ఉప్పు అని చెబుతారు.*
*అమలక ఏకాదశి రోజు నాడు చేయవలసిన ప్రత్యేక పూజ గురించి తెలుసుకుందాం.*
*ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చెట్టునకు పసుపు , కుంకుమ , గంధం, పూలతో అలంకరించి , దీపం , ధూపం , అరటి ఆకులో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత*
*చెంబులో కొన్ని నీళ్ళను పోసుకుని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపునీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టునకు సవ్య దిశగా ప్రదక్షిణలు చేస్తూ చుట్టునకు ఓ ఆకు వరస చొప్పున పదమూడు చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన దారాన్ని నిష్కల్మషమైన మనస్సుతో ముడి వేయాలి*.
*ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో స్మరించ వలసిన మంత్రం 😘
*ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి !*
*వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు !!*
*భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపునకు స్వామి వారు అత్యంత ఇష్టపడతాడు. ప్రతీ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శారీరక పుష్టి , శక్తి ఉన్నవారు నెలలో వచ్చు రెండు ఏకాదశులలో ఉపవాసం ఉంటూ ప్రతి నెల చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నారాయణుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు*.
*ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని కొంత మందికి కోరిక ఉంటుంది. కానీ శారీరక పుష్టి లేని వారు కొబ్బరి నీళ్ళు త్రాగుతూ కూడా ఉపవాసం చేయవచ్చును. భగవంతుడు తనపై భక్తి కావాలనే కోరుకుంటాడు , సాటి జీవులలో ప్రతి పనిలో తనను చూడగలిగితే చాలు అని స్వామి వారి ఉద్దేశం అది గ్రహించి వ్యవహారించగలిగితే చాలు*.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment