Sunday, 5 February 2017

రాశిఫలం (6 - 13 ఫిబ్రవరి 2017)



మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఏ పని తలపెట్టినా మొదటికే వస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు, పోటీని దీటుగా ఎదుర్కుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆది, సోమ వారాల్లో ఎదుటివారికి మంచి చేసినా ఫలితం ఉండదు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. స్త్రీల ఆరోగ్యం ఏమంత సంతృప్తికరంగా ఉండదు. ఒక వేడుకకు సన్నాహాలు మొదలెడతారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన, చికాకులు అధికం. ఆహ్వానాలు, ముఖ్య సమాచారం అందుకుంటారు. లౌక్యంగానే మీ పనులు సానుకూలమవుతాయి. తొందరపాటు చర్యల వల్ల వ్యవహారం బెడిసి కొట్టే ఆస్కారం ఉంది. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు మరింత మెరుగుపడతాయి. దైవకార్యాలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది.  పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, అధికారుల వేధింపులు అధికం.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
అయిన వారు సహకరించకపోగా సూటిపోటి మాటలతో మనస్థాపం కలిగిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం ఉత్తమం. మీ సమస్యలు, ఇబ్బందులు నిదానంగా తొలగిపోగలవు. ప్రయత్నపూర్వకంగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ సంతానం చదువులు, ఉద్యోగ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మంగళ, బుధ వారాల్లో తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ ఆలోచనలు, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచాలి. హోల్‌సేల్ స్టారిస్టులకు పెద్దమొత్తంలో సరుకు నిల్వలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, గిఫ్ట్‌లు అందుతాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ముఖ్యం. మీతో సఖ్యత నటిస్తూనే కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఇతరుల సలహా విన్నప్పటికీ సొంతంగా నిర్ణయం తీసుకోవటం మేలు. ఆస్తి, స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి.దుబారా ఖర్చులు, చెల్లింపులు వల్ల ఇబ్బందులెదుర్కుంటారు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
 ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రాబోయే ఖర్చులకు ముందుగానే ధనం సర్దుబాటు చేసుకునేందుకు యత్నించండి. గురు, శుక్ర వారాల్లో దంపతులకు ఎడబాటు, చికాకులు తప్పవు. వ్యాపార వర్గాల వారు పెద్దమొత్తంలో చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి. పెద్దమొత్తంలో పెట్టుబడులు, స్టాక్ నిల్వలో మెలకువ వహించండి. మీ ప్రమేయం లేకున్నా కొన్ని విషయాలకు బాధ్యత వహించవలసి వస్తుంది. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. విద్యార్థులు ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మిమ్ములను వేధిస్తున్న సమస్యలు, ఇబ్బందులు క్రమంగా సమసిపోగలవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకలు, శుభకార్యాల్లో ఆత్మీయులు, ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో రాణిస్తారు. మీ సమర్థతకు తగిన అవకాశాలు లభిస్తాయి. ఆలస్యంగా అయినా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
 

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
 శనివారం నాడు ముఖ్యమైన విషయాల్లో స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కష్టసమయంలో ఆత్మీయుల ఓదార్పు, సహాయం లభిస్తాయి. మీ బాధ్యతలు, పనులు ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. వ్యాపారాల్లో శ్రమించిన కొలదీ లాభాలు గడిస్తారు. పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు ఆర్థిక, కుటుంబ పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులే లబ్ధి పొందుతారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా ఉండదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత, పర్యవేక్షణ ముఖ్యం. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం వేరొక పనికి వ్యయం చేయాల్సి వస్తుంది. మితిమీరిన ఆలోచనలు, ఏ వ్యవహారం కలిసిరాక ఆందోళన చెందుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మంగళ, బుధ వారాల్లో చేపట్టిన పనులు ఎంతకీ పూర్తి కాక విసుగు చెందుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలు పొరుగువారి నుంచి ఆహ్వానం, టీవీ ఛానెళ్ల నుంచి గిఫ్ట్‌లు అందుకుంటారు. వేళకాని వేళలో వచ్చిన బంధువుల వైఖరి చికాకు కలిగిస్తుంది. వృత్తిపరంగా ప్రజా సంబంధాలు బలపడతాయి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, సమస్యలు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆస్తి పంపకాల వ్యవహారంలో సోదరీసోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదోక్కుకుంటారు.వృత్తి ఉద్యోగాల్లో ఏమంత సంతృప్తి ఉండదు. మార్పు కోసం యత్నాలు సాగిస్తారు. ధనానికి ఇబ్బంది లేకున్నా తెలియని అసంతృప్తి మిమ్ములను వెన్నాడుతుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
 రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దమొత్తంలో సరుకు స్టాకు ఉంచుకునే విషయంలో జాగ్రత్త. ఆది, గురు వారాల్లో కొన్ని ఊహించని సంఘటనలు మసస్థిమితం లేకుండా చేస్తాయి. స్త్రీలకు ఆరోగ్యభంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం, ఆందోళనల అధికం. ఉద్యోగస్తులు కొత్తగా వచ్చిన అధికారులకు మరింత సన్నిహితులవుతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మీరు చూసుకోవటమే ఉత్తమం. ఇతరుల సహాయం అర్ధించి భంగపాటుకు గురవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం, ప్రతిఫలం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బంధువులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట  
 మంగళ, శని వారాల్లో కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలివేయటం మంచిది. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. స్త్రీలకు అయిన వారి గురించి అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు ఎంతకీ పూర్తి కాక విసుగు చెందుతారు. విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదుర్కుంటారు. వృత్తుల వారి పలుకుబడి, ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలున్నాయి.వేడుకలు, శుభాకార్యాలు, విందుల్లో పాల్గొంటారు. మీ మాటతీరు, పద్ధతులు ఎదుటివారిని బాగా ఆకట్టుకుంటాయి. ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. ఆదాయానికి మించిన ఖర్చులున్నా ఇబ్బందులుండవు. బాకీలు, ఇంటి అద్దెలు వసూలులో సౌమ్యంగా మెలగండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం  
ఆదాయ వ్యయాలు సరిసమానం. దుబారా ఖర్చులు తగ్గించుకోగల్గుతారు. వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు పనివారలు, సంతానంతో చికాకులు తప్పవు. హోల్‌సేల్ రిటైల్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. శుక్ర, శని వారాల్లో మీ అభిప్రాయాలు గోప్యంగా ఉంచి ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆస్తి పంపకాల సమస్య ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడులు నిరుత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మందలింపులు, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నంలో సంకోచం, నిరుత్సాహం కూడదు. ఉద్యోగస్తులకు నగదు బహుమతి, పదోన్నతి వంటి శుభవార్తలు అందుతాయి. అధికారుల అదేశాలను శిరసావహించటం క్షేమదాయకం. ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒక శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆత్మీయులు చదివించిన కానుకలు సంతృప్తిపరుస్తాయి. గృహంలో సందడి తగ్గుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ధనం మితంగా వ్యయం చేయాలి. ఆహార, ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం కూడదు. మీ శ్రీమతి సలహా పాటించటం క్షేమదాయకం. వృత్తి వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు, విస్తరణలకు లైసెన్సులు మంజూరు కాగలవు. ఆత్మీయులు, ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. లీజు, ఏజెన్సీల గడువు పొడిగింపునకు అనుకూలం. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమ అధికం. విద్యార్థుల్లో ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటాయి. ఉద్యోగస్తులు తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి నిరుత్సాహం కలిగిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం. మీ మాటకు గౌరవం, ఆమోదం లభిస్తాయి. క్లిష్టమైన సమస్యలను సైతం సామరస్యంగా పరిష్కరిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు  
దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. శకునాల ప్రభావం వల్ల కొన్ని అవకాశాలను వదులుకుంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో అతిగా వ్యవహరించి భంగపాటుకు గురవుతారు. వ్వాపారాల్లో ఆటుపోట్లు అధికమించి లాభాలు గడిస్తారు. పెద్ద మొత్తంలో స్టాక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, పదోన్నతి వంటి శుభఫలితాలున్నాయి. సంప్రదింపులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆస్తి, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం.ఈ వారం ధనప్రాప్తి, కార్యసిద్ధి, ప్రముఖులతో పరిచయాలుంటాయి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. గృహ మార్పుల వల్ల కలిసిరాగలదు. మీ సంతానం విద్య, ఉద్యోగ విషయాలపై శ్రద్ధ వహిస్తారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. విలువైన పత్రాలు, వస్తువులు జాగ్రత్త. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. మీ యత్నాలు, పథకాలు గుట్టుగా సాగించండి. కొన్ని పనులు అయిష్టంగానే పూర్తి చేస్తారు. స్త్రీల మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. విద్యార్థులు ప్రేమ విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని అందుకోవటం ఉత్తమం. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలించవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.మీ సమస్యలు, ఇబ్బందులకు చక్కని పరిష్కారం గోచరిస్తుంది. రావలసిన ఆదాయం అందటంతో రుణాలు తీర్చగల్గుతారు.
 
 

No comments:

Post a Comment