Friday, 8 January 2021

వైద్య జ్యోతిషం

 



మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం . ఆ రుగ్మతలకు కూడా రాశులు , వాటి అధిపతులైన గ్రహాలూ కారణం అవుతాయి. రాసి తత్వాలు ,గ్రహకార కత్వాల ద్వారా రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం . ఏ శరెర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది . ముందుగా రాశులు - వాటికి వర్తించే శరీర భాగాలు ఈ దిగువన వివరిస్తున్నాం.
రాశులు - శరీర భాగాలు
మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు.
వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.
మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం .
కర్కాటకం- రొమ్ము ,జీర్ణాశయం.
సింహం - గుండె , వెన్నెముక
కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు
తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు.
వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం .
ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు.
మకరం - మోకాళ్ళు, కీళ్ళు.
కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం.
మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.
ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది.వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి . గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతల వివరాలు ఈ క్రింద పొందు పరచినాము.
గ్రహాలు - రుగ్మతలు
సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను.
చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.
బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు.
శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.
కుజుడు - నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.
గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.
శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.
ఇంద్ర- రక్త ప్రసార నాళాలు, మెదడులోని నరాలు, వెన్నెముక భాగాలకు సంబంధించిన అంతు చిక్కని వ్యాధులు, ఆకస్మిక ప్రమాదాలు.
వరుణ- మానసిక రుగ్మతలు, మూర్చ, మతి బ్రమణం, అంటూ వ్యాధులు, కలుషిత ఆహారాలు, తాంత్రిక వ్యాధులు, దృష్టి మాంద్యం.
యమ - వంశ పారంపర్య వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, ప్రమాదాలు ,
మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి గురవుతుందో లగ్న, సూర్య , చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు .లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో వున్నా గ్రహాలూ ,కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది .

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment