Thursday, 23 March 2017

దుర్గమ్మ తల్లీ !



కంచి కామాక్షీ, కాశీ విశాలాక్షీ, బెజవాడ కనకదుర్గ, మధుర మీనాక్షి, శ్రీశైల భ్రమరాంబిక, సంతోషిమాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మూకాంబిక, ఈశ్వరి, వాగేశ్వరి, చండీ, చాముండి, వైదేహి, వైష్ణవి, రాజరాజేశ్వరి, లలిత, పార్వతి, బాలాత్రిపుర సుందరి, కామేశ్వరి, ..ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొలిచినా దీవెనలందించే అమ్మ దివ్యగాథల తల్లి దుర్గాదేవి.
ఆశ్రయించిన వారికి అభయమిచ్చే కళ్యాణ కారిణి కనకదుర్గ దైవాన్ని ఆశ్రయించిన వారిని ఆదైవమెలా వెన్నంటి ఉండికాపాడుతుoది.
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.

No comments:

Post a Comment