Sunday, 5 March 2017

రాశిఫలం ( 5 - 11 మార్చి 2017 )



మేషం: 
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 

ఆప్తులు, సన్నిహితులకు శుభాకాంక్షలు, బహుమతులు అందజేస్తారు. దుబారా ఖర్చులు అధికం. శనివారం నాడు మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. పెద్దల గురించి అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. వ్యాపార వర్గాల వారికి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. భాగస్వామికుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలపై పొరుగువారి మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. యువత అత్యుత్సాహం అనర్ధాలకు దారితీసే ఆస్కారం ఉంది. ఒక స్థిరాస్తి కొనగోలు విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. యువత అత్యుత్సాహం అనర్ధాలకు దారితీసే ఆస్కారం ఉంది. ఒక స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. కళ, క్రీడా రంగాల వారికి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు , ప్రయాణాల్లో చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లు, బ్రోకర్లకు కొత్త అవకాశాలు కలిసివస్తాయి. ప్రింట్, ఎలక్ట్రానికి మీడియా రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. 

వృషభం: 
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఒప్పందాలు, సంప్రదింపులకు అనుకూలం. పెద్దల మాటను శిరసావహిస్తారు. మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. సానునయంతో నచ్చచెప్పటానికి యత్నించండి. ఆది, సోమవారాల్లో దుబారా ఖర్చులు అధికం. హోల్‌సేల్ వ్యాపారులు పెద్దమొత్తంలో స్టాక్ ఉంచుకోవటంలో జాగ్రత్త వహించాలి. ఉమ్మడి, ఆర్థిక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలిస్తుంది. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయాలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆత్మీయులు, సన్నిహితులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. స్త్రీలకు ఆరోగ్యభంగం, నీరసం అధికం. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంటుంది. విదేశీయానం, పుణ్యక్షేత్రసందర్శనల కోసం సన్నాహాలు సాగిస్తారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. 

మిథునం: 
మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం, అధికారులు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు. పరిచయాలు, కార్యకలాపాలు అధికమవుతాయి. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. మంగళ, బుధవారాల్లో బంధువుల నుంచి నిష్టూరాలు ఎదురవుతాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. మీ సంతానం పై చదువులు, ఉద్యోగ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులున్నా భారమనించవు. లీజు, ఏజెన్సీలు, రెంట్ అగ్రిమెంట్లకు అనుకూలం. పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వస్త్ర, ఫ్యాన్సీ, ఆల్కహాలు వ్యాపారులు ఊపందుకుంటాయి. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. మిమ్మలను పొగిడిన వారే చాటుగా విమర్శిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు నిరుత్సాహం అధికం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో ఇబ్బందులెదురవుతాయి. వ్యవసాయ రంగాల వారికి పంటల దిగుబడి ఏమంత సంతృప్తినీయజాలదు. 

కర్కాటకం: 
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆది, గురువారాల్లో ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏ విషయంలోను మనస్థిమితం ఉండదు. కష్ట సమయంలో ఆత్మీయులు తోడుగా నిలుస్తారు. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటానికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించినా ఆశించిన ఫలితం ఉండదు. స్త్రీలతో మితంగా సంభాషించండి. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఖర్చులు ఊహించినవి కావడంతో ఇబ్బందులుండవు. విద్యార్థుల అత్యుత్సాహం అనర్ధాలకు దారి తీస్తుంది. ఉద్యోగస్తుల పని, మాటతీరు అధికారులను ఆకట్టుకుంటాయి. సహోద్యోగులతో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పత్రికా సంస్థల్లోని వారికి అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రధాన కంపెనీల షేర్లు లాభాలదిశగా సాగుతాయి. 

 సింహం: 
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
బంధువులు, అయిన వారి రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. ఎల్ఐసి పాలసీ, బ్యాంకు డిపాజిట్‌లు, పంట తాలుకూ ఆదాయం చేతికందుతుంది. మంగళ, శనివారాల్లో చేపట్టిన పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ భార్య తరపు వారు మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం విషయంలో లౌక్యంగా మెలగాలి. దంపతుల మధ్య అపార్ధాలు, పట్టింపులు చోటు చేసుకుంటాయి. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. మిమ్మలన పొగిడే వారి పట్ల మెలకవ వహించండి. మొక్కుబడులు, దైవదర్శనాల్లో చికాకులు తప్పవు. ఉన్నతాధికారులకు ఆకస్మిక స్థానచలనం, కిందిస్థాయి సిబ్బందితో సమస్యలు తప్పవు. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారులు, ప్రజల నుంచి అభ్యతంరాలెదురవుతాయి. నిర్మాణ పనుల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. వైద్యరంగాల వారు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.
 
కన్య: 
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయుల నుంచి శుభాకాంక్షలు, బహుమతులు అందుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలిస్తాయి స్థిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. గురు, శుక్రవారాల్లో చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వస్త్రాలు, విలువైన వస్తువుల కొనుగోళ్లకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీల కళాత్మతకు, ప్రతిభకు మంచి గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. విద్యార్థులు మితిమీరిన ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విందులు, వినోదాలలో పలువురిని ఆకట్టుకుంటారు. ద్విచక్ర వాహన చోదకులకు మెలకువ అవసరం. వేడుకలు, విందుల్లో అందరినీ ఆకట్టుకుంటారు. దైవదర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి.
 
తుల: 
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
మీ వ్యవహార దక్షత, పట్టుదలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక వేడుకను నిర్వహించటానికి బంధుమిత్రులతో సంప్రదింపులు సాగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితుల కోసమే ధనం బాగా వ్యయం చేస్తారు. మీ అలవాట్లు, పద్దతులు అదుపులో ఉంచుకోవటం ఉత్తమం. ఏ పని చేయబుద్ధికాదు. శనివారం నాడు మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారి వ్యాపారులకు పురోభివృద్ధి. బేకరి, పండ్ల, పూల, చిరు వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నూతన పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలకు అనుకూలం. నిర్మాణ పనుల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమంత సంతృప్తి ఉండజాలదు. విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆస్తి పంపకాలు, భూ విక్రయాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యాజ్యాలు, ఫిర్యాదుల ఉపసంహరించుకుంటారు. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగస్తుల తీరు అసహనం కలిగిస్తుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం కూడదు.
 
వృశ్చికం: 
విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
అదనపు బాధ్యతలు, పనిఒత్తిడితో సతమతమవుతారు. ప్రతి వ్యవహారం మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఖర్చులు, రుణ చెల్లింపులకు కావలసిన ఆదాయం సర్దుబాటు కాగలదు. ఆత్మీయులు, సన్నిహితులకు శుభాకాంక్షలు అందజేశారు. మీ శ్రీమతి, సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. దైవదర్శనాలు, ప్రయాణాల్లో చికాకులెదుర్కుంటారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం అందిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. చిన్ననాటి మిత్రులు, పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. మీ ఓర్పు, అంకితభావం అధికారులను ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అవగాహన ముఖ్యం. సంగీత, సాహిత్య, కళా రంగాల వారికి ప్రోత్సాహకరం. వాహనం నిదానంగా నడపటం ఉత్తమం. వృత్తి వ్యాపారులకు ఆశాజనకం. విలువైన వస్తువుల కొనుగోలులో నాణ్యత పట్ల అవగాహన ముఖ్యం. కోర్టు వ్యవహారాలు, ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యాపారాల్లో గట్టిపోటీ ఎదురైనా నెట్టుకురాగలరు. మీ పథకాలు, ప్రణాళికలు కొనుగోలుదార్లను ఆకర్షిస్తాయి. వస్త్ర వ్యాపారులకు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. మీ పొదుపరితనం కుటుంబీకులు, సన్నిహితులు చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులు పూర్తి కాక నిరుత్సాహం చెందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. స్త్రీల పేరిట స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, ఇతర వ్యాపకాల వల్ల ఒత్తిడి, మందలింపులు తప్పవు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలు, నిర్ణయాలను ఖచ్చితంగా తెలియజేయండి. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ఉద్యోగస్తులు అధికారులు, సహోద్యోగులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. ప్రింటింగ్, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. చెక్కుల జారీ హామీలు, మధ్యవర్తిత్వాల్లో మెలకువ వహించండి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
మకరం: 
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
  విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఒక స్థిరాస్తి విక్రయించే విషయంలో పునరాలోచన మంచిది. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామితో సఖ్యత నెలకొంటుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఆది, సోమవారాల్లో పెద్దల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం. ఆదాయం స్వల్పం. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు రాతస మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. క్రీడా రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసివస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. 
 
కుంభం: 
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
నూతన యత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల నుంచి శుభాకాంక్షలు, కానుకలు అందుకుంటారు. సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. విందులు, వినోదాల్లో అపశృతులు దొర్లే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో అనుకున్న విధంగా సాగవు. మీ అభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేయడం శ్రేయస్కరం. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ప్రేమికులు అనాలోచితంగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. క్రయ విక్రయాలు సంతృప్తికరం. దైవ్య కార్యాల్లో నిమగ్నులవుతారు. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మీనం: 
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామికుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. గురు, శుక్రవారాల్లో ఆకస్మిక ఖర్చులతో ఇబ్బందులెదుర్కుంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో వ్యవహరించాల్సి ఉంటుంది. తలపెట్టిన పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. రావలసిన ధన వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. ఏజెంట్లకు, బ్రోకర్లకు అధిక శ్రమ-అల్ప ఆదాయం అన్నట్టుగా ఉంటుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తప్పవు. దైవ, సేవా కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. పారిశ్రామిక రంగాల వారికి అనుమతులు మంజూరవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 

No comments:

Post a Comment